![CM Ashok Gehlot Says Congress Govt To Complete Full Term - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/2/ashok-Gehlot.jpg.webp?itok=nVplOvKW)
జైపూర్: రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందని రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వమే 5వ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా అని బికనీర్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండానే కూలదోసేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటి కంటే కాంగ్రెస్ మరింత పటిష్టమైనందున, బీజేపీ యత్నాలు సఫలం కాబోవన్నారు.
ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment