Rajasthan CM
-
వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది. -
సీఎంకు టెన్షన్.. అసలు ఆ రెడ్ డైరీలో ఏముంది?
రెడ్ డైరీలో రాజస్థాన్ సీఎం అక్రమాల చిట్టా.. రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న బహిష్కృత మంత్రి -
కాంగ్రెస్ సభలో ఎద్దు బీభత్సం.. బీజేపీ కుట్రేనటా!
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. ఎటు వెళ్లాలో తెలియక అటూఇటు పరుగులు పెట్టడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతంలో మంగళవారం జరిగింది. వేదికపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతున్న క్రమంలో ఓ నల్లటి కొమ్ములు తిరిగిన ఎద్దు ఆ సభలోకి ప్రవేశించింది. దీంతో పలువురు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఎద్దు బెదిరిపోకుండా అంతా నిశబ్దంగా ఉండాలని సీఎం అశోక్ గెహ్లట్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీజేపీ సభ్యులు కావాలనే ఎద్దులు లేదా ఆవులను వదులుతున్నారని ఆరోపించారు. సభను చెదరగొట్టేందుకు ఎద్దును బీజేపీనే పంపించిందన్నారు. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ సమావేశాలను భంగపరచాలనే దురుద్దేశంతో తరుచుగా ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉండనుంది. మంగళవారంతో తొలివిడత 89 స్థానాల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. गुजरात मे @ashokgehlot51 की सभा में घुसा सांड!! सीएम बोले.... मैं बचपन से देखता आ रहा हूं, ये भाजपा भेजती है मेरी सभा में सांडों को. pic.twitter.com/RkB8oSmowx — Sharad (@DrSharadPurohit) November 28, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
సాక్షి కార్టూన్ 04-11-2022
సాక్షి కార్టూన్ 04-11-2022 -
‘ప్యాలెస్ ఆన్ వీల్స్’.. రాజ భోగాల ప్రయాణం.. రెండేళ్ల తర్వాత కూత..!
ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి. ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. -
‘ఐదేళ్లూ అధికారంలో మేమే ఉంటాం’
జైపూర్: రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి కాలం ఉంటుందని రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వమే 5వ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందా అని బికనీర్‌లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోకుండానే కూలదోసేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పటి కంటే కాంగ్రెస్ మరింత పటిష్టమైనందున, బీజేపీ యత్నాలు సఫలం కాబోవన్నారు. ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
సీఎం గహ్లోత్‌కు పదవి గండం తప్పినట్టే.. కానీ!
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో సీఎం అశోక్ గహ్లోత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం పదవి నుంచి తప్పిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం రాజస్థాన్‌లో జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. తనను సీఎంగా కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సోనియా గాంధీనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే తాజాగా పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు రాజస్థాన్ సీఎంగా అశోక్ గహ్లోత్‌నే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎంగా మరోసారి సచిన్ పైలట్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. 2020లో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేయడానికి ముందు వరకు పైలటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను తప్పించారు. ఇప్పుడు మరోసారి ఆయనకే అవకాశం ఇవ్వనున్నారు. అయితే గహ్లోత్‌కు, సచిన్ పైలట్‌కు అసలు పడదు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలకు కూడా ఇదే కారణం. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను కొత్త సీఎంగా నియమిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గం గత ఆదివారం పెద్ద రచ్చే చేసింది. 82 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టి వేరుగా భేటీ అయ్యారు. అనంతరం పైలట్‌ను సీఎం చేస్తే రాజీనామా చేస్తామని బెదిరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని షాక్‌కు గురిచేశాయి. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీనియర్ నేత, దళితనాయకుడు మల్లికార్జున ఖర్గేను బరిలోకి దింపింది అధిష్ఠానం. ఈ పదవి కోసం సీనియర్ నేత, కేరళ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ కాంగ్రెస్ నేత ఆర్ఎన్ త్రిపాఠి కూడా పోటీ పడుతున్నారు. అయితే పోటీ ప్రధానంగా ఖర్గే, థరూర్ మధ్యే ఉండనుంది. గాంధీల వీరవిధేయుడైన ఖర్గేకే విజయావకాశాలు ఎక్కువ అని అంతా భావిస్తున్నారు. చదవండి: ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయాల్లోకి.. శశి థరూర్ ప్రస్థానమిదే.. -
రాజస్థాన్ సీఎం రేసులో అతడు
ఢిల్లీ: అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉండడంతో.. రాజస్థాన్ ముఖ్యమంత్రి మార్పు తప్పబోదనే సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో.. మరో రెండు రోజుల్లో సోనియా గాంధీ సీఎం మార్పుపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో.. రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రేసులో సచిన్ పైలట్(45) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అశోక్ గెహ్లాట్ గనుక కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపడితే సచిన్ పైలట్‌కే బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం తొలుత భావించింది. ఈలోపు రెబల్ పరిణామాలు మొత్తం సీన్‌ను మార్చేశాయి. అయినప్పటికీ.. సచిన్ పైలట్ వైపు హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ భేటీ అనంతరం.. సచిన్ పైలట్ కూడా 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సచిన్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైందనే ప్రచారం ఊపందుకుంది. #WATCH | Delhi | Rajasthan Congress MLA Sachin Pilot arrives at 10 Janpath, the residence of the party's interim chief Sonia Gandhi. pic.twitter.com/uuleNwThn8 — ANI (@ANI) September 29, 2022 -
సీఎం పదవి నుంచి గెహ్లాట్‌కు ఉద్వాసన!
రాజస్థాన్ అధికార రాజకీయంలో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతోందా?. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటును కాంగ్రెస్ అధిష్టానం బాగా సీరియస్‌గా తీసుకుందా?.. అడ్డుకోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నం చేయనుందా?. కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో.. అవుననే చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించి.. ఉత్కంఠకు తెర దించారు 71 ఏళ్ల అశోక్ గెహ్లాట్. రాజస్థాన్‌లో తాజాగా జరిగిన పరిణమాలు తనను ఎంతో బాధించాయని, అధిష్టానానికి క్షమాపణలు చెప్పానని మీడియాకు వెల్లడిస్తూనే.. అధ్యక్ష రేసులో లేనంటూ పేర్కొన్నారు. అయితే.. క్షమాపణలు తెలిపినా.. ఆయన వివరణతో అధిష్టానం సంతృప్తి చెందలేదని సమాచారం. తిరుగుబాటులో గ్లెహ్లాట్ ప్రమేయం లేదని రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్చిట్’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కల చెదిరింది! రెంటికీ చెడిన రేవడి చందాన తయారయ్యింది ఇప్పుడు అశోక్ గెహ్లాట్ పరిస్థితి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఈయన.. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నిలవాలని భావించారు. అందుకు అధిష్టానం కూడా మద్దతు ఇవ్వాలనుకుంది. అయితే ఒకేసారి జోడు పదవుల్లో కొనసాగాలని ఆయన ఆశపడ్డారు. కానీ, ఉదయపూర్ కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో ‘ఒకే వ్యక్తి-ఒకే పదవి’ తీర్మానానికి ఆమోదం తెలిపింది. అలాంటప్పుడు గెహ్లాట్ రెండు పదవుల్లో కొనసాగడం కుదరదని ముందుగానే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో.. తన అనుచరుడిని రాజస్థాన్ సీఎంగా ఎన్నుకుని.. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని, కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని భావించారు గెహ్లాట్. దీంతో ఆయనకు ఆప్తుడైన స్పీకర్ సీపీ జోషికి ఆ బంపరాఫర్ దక్కుతుందని అంతా భావించారు. అయితే గెహ్లాట్‌కు అధిష్టానం ఆ అవకాశం ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను రేసులో ముందు నిల్చొబెట్టడంతో.. గెహ్లాట్ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం ఎన్నిక కోసం అజయ్ మాకెన్ అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సైతం డుమ్మా కొట్టి.. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు వేరుగా భేటీ కావడం, అందులో పీసీసీ చీఫ్ కూడా ఉండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. పైలట్ తిరుగుబాటు మర్చిపోయారా? సచిన్ పైలట్ 2020 సంవత్సరంలో తిరుగుబాటు ప్రయత్నం చేశారు. అయితే.. అది విఫలమైంది. అలాంటప్పుడు.. పైలట్‌ను ఇప్పుడు సీఎంగా ఎలా చేస్తారని గెహ్లాట్ వర్గం అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించింది తిరుగుబాటు వర్గం. అంతేకాదు.. ఆ సమయంలో పార్టీ అధికారం కోల్పోకుండా నిలిపిన వ్యక్తుల్లో ఒకరిని సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయడం, ఆపై స్పీకర్‌కు మూకుమ్మడి రాజీనామాల సమర్పణతో.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కల్లోలం మరో మలుపు తిరిగింది. ఆ మాత్రం చేయలేరా? పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ముందుగా గెహ్లాట్‌కు ఫోన్ చేసి తిరుగుబాటు పరిణామాలపై ఆరా తీశారు. అయితే, ఆ సమయంలో గెహ్లాట్ ఇచ్చిన సమాధానం అగ్నికి ఆజ్యం పోసింది. అప్పటికే అధిష్ఠానం ఆయన మీద గుర్రుగా ఉండగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారాయన. ‘‘ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని, తానేమీ చేయలేన’’ని ఆయన చేతులెత్తేయడంతో .. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. పని చేసిన సీనియర్ల ఒత్తిడి! క్షమాపణ చెప్పినా అధ్యక్ష ఎన్నికకు ఆయన్ని దూరం చేయడంతో.. గెహ్లాట్ వైఖరి పట్ల అధిష్టానం ఏమేర ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘పార్టీ అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’’ అంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గెహ్లాట్. సోనియా నిర్ణయం వెనుక సీనియర్ల ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది. తిరుగుబాటు అనంతరం.. అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని కొందరు సభ్యులు. ఆయన్ని తప్పించి..ఆ స్థానే విధేయంగా ఉండే వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరారు వాళ్లు. ‘‘ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదని సోనియాకు సూచించారు వాళ్లు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు ఆరోపణలు గుప్పించారు కూడా. ఈ నేపథ్యంలో.. సీనియర్ల అభిప్రాయాలను సైతం సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నా.. ముఖ్యమంత్రిగా గెహ్లాట్ కొనసాగింపు కష్టమే అనే సంకేతాలు పంపింది కాంగ్రెస్ అధిష్టానం. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. గెహ్లాట్‌ను మార్చేసి ఆ స్థానంలో మరొకరిని సీఎంగా నియమిస్తారా? లేదా? అనేది త్వరలోనే సోనియాగాంధీ తీసుకునే స్పష్టమైన నిర్ణయం ద్వారా వెల్లడి కానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
ఢిల్లీకి అశోక్ గహ్లోత్.. సోనియాతో కీలక భేటీ..
సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న తరుణంలో సీఎం అశోక్ గహ్లోత్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో సీఎం పదవిని వదులుకుని గహ్లోత్ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. మొన్నటివరకు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గహ్లోతే ముందు వరుసలో ఉన్నారు. గాంధీ కుటుంబం మద్దతు ఉన్నందున కచ్చితంగా ఆయనే గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ రాజస్థాన్‌లో ఆయన వర్గం ఎమ్మెల్యేలు చేసిన రచ్చతో ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వంపైనే ఆయోమయం నెలకొంది. సచిన్ పైలట్‌ను సీఎం చేయడాని వీల్లేదని 92 మంది గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని బెదిరించడం పార్టీ హైకమాండ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. ఈ విషయంపై సోనియా గాంధీ కూడా కన్నెర్రజేసినట్లు తెలుస్తోంది. అయితే గహ్లోత్ మాత్రం ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అధిష్ఠానంకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల హైడ్రామా జరిగిన రోజు తాను సరిహద్దు ప్రాంతంలో పర్యటనలో ఉన్నానని, అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా లేదని చెప్పినట్లు సమాచారం. కానీ అదిష్ఠానం గహ్లోత్ వివరణ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్‌లో అలజడికి గహ్లోత్ కారణం కాదని, ఆయన వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలే ఇదంతా చేసినట్లు అధిష్ఠానికి అందిన నివేదికలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో సోనియాతో గహ్లోత్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంగా, పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతాని గహ్లోత్ గతంలోనే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ అందుకు ఒప్పుకుంటుందా? లేక అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకొని ఆయన సీఎంగానే కొనసాగుతారా? లేక ఆ పదవిని వదులుకుని పోటీ చేస్తారా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కొన్ని గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ఐపై నిషేధం -
సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్
కొచ్చి/జబల్పూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన తర్వాత రాజస్తాన్ సీఎం ఎవరన్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అజయ్ మాకెన్ నిర్ణయిస్తారన్నారు. పార్టీలో ఇటీవల తెరపైకి వచ్చిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అంశంపై చర్చ అనవసరమన్నారు. గెహ్లాట్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీలో మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని రాహుల్ గాంధీ తనతో చెప్పారన్నారు. నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయాలన్నది రాజస్తాన్ వెళ్లాక నిర్ణయించుకుంటానన్నారు. ఎన్నికలో పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశమని, నూతన ప్రారంభానికి శ్రీకారం చుడతామని వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత కలిసి నడవాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అధ్యక్ష పోస్టుకి పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, గెహ్లాట్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా అధ్యక్ష పదవిని కోరుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఫలితాల తర్వాత అందరూ కలిసి నడవాల్సిందే. బ్లాక్, గ్రామం, జిల్లా స్థాయిల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఐక్యమత్యంగా పనిచేయాలి. కాంగ్రెస్‌ను బలమైన ప్రతిపక్షంగా మార్చుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం తప్పనిసరిగా అవసరమని గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడబోనని రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: అతి త్వరలో సీఎంగా సచిన్ పైలట్.. హింట్ ఇచ్చిన మంత్రి -
సచిన్ పైలటే సీఎం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
జైపూర్: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అతి త్వరలో ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా. ఎమ్మెల్యేలందరి మద్దతు ఆయనకు ఉందని స్పష్టం చేశారు. సీఎం అశోక్ గహ్లోత్‌కు మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా సచిన్ పైలట్ వైపే ఉంటారని పేర్కొన్నారు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే పైలట్ సీఎం అవుతారని, అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు. 2018లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. ఆ తర్వాత వీరంతా తమ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజేంద్రకు మంత్రి పదవి దక్కింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు మద్దతుగానే ఉంటారని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అక్టోబర్ 17న జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గహ్లోత్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే తాను అధ్యక్షుడినైనా సీఎంగా కొనసాగుతానని గహ్లోత్ అన్నారు. రెండు బాధ్యతలూ చేపట్టగలనని పేర్కొన్నారు. కానీ రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం ఒక్కరికి ఒకే పదవి అని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను గుర్తు చేశారు. దీంతో గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, యువ నేత సచిన్ పైలట్ రాజస్థాన్ సీఎం కావడం ఖాయం. ఆయన రాహుల్‌కు సన్నిహితుడు కావడమే గాక, రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో మంచి ఆదరణ ఉంది. చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా -
అందరూ కోరితే అధ్యక్ష పదవికి రెడీ...!
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘అధినేత్రి సోనియాగాంధీ కుటుంబంతో పాటు కాంగ్రెస్‌లో చాలామంది నేతలకు నాపై ఎంతో నమ్మకముంది. వారంతా కోరితే అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సీఎంగా కొనసాగమన్నా, అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయమన్నా తోసిపుచ్చలేనన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో సోనియాతో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికపై చాలాసేపు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ‘‘50 ఏళ్లుగా పార్టీ నాకెన్నో పదవులిచ్చింది. నాకు పదవులు ముఖ్యం కాదు. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా’’ అని చెప్పారు. అయితే, ‘‘ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా నాకప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నా. ఇకముందు కూడా నెరవేరుస్తూనే ఉంటా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. తద్వారా అధ్యక్షునిగా ఎన్నికైనా సీఎంగా కొనసాగుతానంటూ సంకేతమిచ్చారు. జోడు పదవులు కాంగ్రెస్ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధం కాదా అని ప్రశ్నించగా, ‘‘ఆ నిబంధన నామినేటెడ్ పదవులకే వర్తిస్తుంది. అధ్యక్ష పదవికి బహిరంగ ఎన్నిక జరుగుతుంది గనుక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల్లో ఎవరైనా పోటీ పడవచ్చు’’ అని బదులిచ్చారు. ‘‘నేనెక్కడుండాలో కాలమే నిర్ణయిస్తుంది. పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం. పార్టీకి ఉపయోగపడే చోటే ఉండాలన్నది నా అభిమతం’’ అన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా బరిలో దిగుతుండటాన్ని ప్రస్తావించగా అలాంటి పోటీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి చాలా మంచిదన్నారు. పోటీకి రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చివరగా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇందుకోసం ఆయన గురువారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు గెహ్లాట్ అభిప్రాయంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ విభేదించారు. ‘‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవుల్లో కొనసాగేందుకు వీల్లేదు. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు. తాను కూడా బరిలో దిగే అవకాశముందని దిగ్విజయ్ అన్నారు! ‘‘ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయొద్దా?’’ అని జాతీయ మీడియాతో ప్రశ్నించారు. రాహులే సారథి కావాలి: పైలట్ మరోవైపు, రాహులే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాజస్తాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ కోరారు. సగటు కాంగ్రెస్ కార్యకర్తలంతా అదే కోరుతున్నారన్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థి గెహ్లాట్ గనక పార్టీ అధ్యక్షుడైతే రాజస్తాన్ సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు బదులిచ్చేందుకు నిరాకరించారు. రాహుల్‌ను ఒప్పించేందుకు పార్టీ నేతలందరం ప్రయత్నిస్తున్నామని సల్మాన్ ఖుర్షీద్ కూడా అన్నారు. మిస్త్రీతో థరూర్ భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీని శశి థరూర్ కలిశారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. థరూర్‌కు అన్ని విషయాలూ వివరించినట్టు అనంతరం మిస్త్రీ చెప్పారు. 24న నామినేషన్ పత్రం తీసుకుంటానని చెప్పారన్నారు. ఇదీ చదవండి: ఇద్దరే పోటీ చేయాలా? అధ్యక్ష రేసులో నేనూ ఉన్నా.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు -
అధ్యక్ష పోటీకి గెహ్లాట్ విముఖత?
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (71) బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఆయనకు పోటీగా తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా తెరపైకి వచ్చారు. తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులతో గెహ్లాట్ సోమవారం నామినేషన్ వేయాలన్న నిర్ణయం కూడా అంతర్గతంగా జరిగిపోయింది. అయితే పోటీకి గెహ్లాట్ విముఖంగా ఉన్నారని హస్తిన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై ఢిల్లీ వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు చిరకాల ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను అధిష్టానం ముఖ్యమంత్రిని చేసే అవకాశముంది. ఇది గెహ్లాట్‌కు సుతరామూ ఇష్టం లేదు. రాష్ట్రంపై పట్టు వదులుకోవడానికి ఆయన అస్సలు సుముఖంగా లేరట. రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సచిన్ పైలట్ కేరళలో ఉన్నారు. ఈ సమయంలో గెహ్లాట్ ఉన్నట్టుండి మంగళవారం రాత్రి పదింటికి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సమావేశపరిచారు. పైలట్ గైర్హాజరీలో ఎమ్మెల్యేలపై తన పట్టును ప్రదర్శించుకోవడమే ఈ భేటీ లక్ష్యమని భావిస్తున్నారు. మధ్యేమార్గంగా సీఎంగా కొనసాగుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పని చేస్తానంటూ అధిష్టానానికి ఆయన ప్రతిపాదించారట. కుదరని పక్షంలో కనీసం పైలట్‌కు బదులు తన విశ్వాసపాత్రున్ని సీఎం చేయాలని కోరుతున్నారట. ఇది అధిష్టానానికి కొత్త తలనొప్పిగా పరిణమించిందని సమాచారం. గట్టి నాయకుడైన పైలట్ సీఎంగా చాన్స్ దక్కనందుకు రెండేళ్ల క్రితమే పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాంతో సోనియా, రాహుల్ రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అది రాష్ట్ర పార్టీలో సంక్షోభానికి దారి తీయవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల ఆందోళన. రాహులే అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాజస్తాన్ పీసీసీతో తీర్మానం కూడా చేయించారు. దాంతో రాజస్తాన్ బాటలోనే పలు రాష్ట్రాల పీసీసీలు రాహుల్ సారథ్యాన్ని కోరుతూ తీర్మానాల బాట పట్టాయి. బుధవారం గెహ్లాట్ ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లి రాహుల్ యాత్రలో పాల్గొనే అవకాశముంది. ఈ సందర్భంగా కూడా పోటీకి రాహుల్‌ను ఒప్పించేందుకు మరోసారి ప్రయతి్నస్తారని చెబుతున్నారు. 22 ఏళ్ల తర్వాత పోటీ! గెహ్లాట్‌తో పాటు థరూర్ కూడా బరిలో దిగితే పోటీ అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా 22 ఏళ్ల క్రితం ఎన్నిక జరిగింది. 2000 నవంబర్‌లో జరిగిన ఆ ఎన్నికలో జితేంద్ర ప్రసాదపై సోనియా నెగ్గారు. 1997లో శరద్ పవార్‌ను సీతారాం కేసరి ఓడించారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రికార్డు సోనియాదే. 1998 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా ఇప్పటిదాకా పార్టీ పగ్గాలు ఆమె చేతిలోనే ఉన్నాయి. 2017 నుంచి 2019 దాకా రాహుల్ గాంధీ అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి ఎన్నికకు సోనియా దూరంగా ఉండటం తెలిసిందే. సారథ్యానికి విముఖంగా ఉన్న రాహుల్ చివరి క్షణాల్లో మనసు మార్చుకుంటే తప్ప ఈసారి గాందీయేతర నేతే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం! -
బీజేపీపై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది. అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారు' అని గహ్లోత్ అన్నారు. హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గహ్లోత్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తే అని పోలీసులకు చెప్పి అతనికి సాయం చేయాలని చూసిందని పేర్కొన్నారు. వీటిపై కమలం పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ.. బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, జూన్ 28న జరిగిన ఉదయ్‌పూర్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరునాడే కేసు దర్యాప్తును ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చదవండి: Goa: గోవాలో కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీతో టచ్‌లో 11 మంది ఎమ్మెల్యేలు! -
రాయని డైరీ: అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్ సీఎం)
‘‘గురూ.. నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిసొస్తే బాగుంటుందా..!’’ అని భూపేష్ బఘేల్ ఉదయాన్నే ఫోన్ చేశాడు. బఘేల్ నన్నెప్పుడూ ‘గురూ’ అన్నది లేదు. ఇప్పుడు అంటున్నాడు! గురూ అనే అవసరం లేకున్నా ఎవరైనా ఇంకొకర్ని ‘గురూ’ అన్నారంటే ఆ ఇంకొకరితో తమని ఈక్వల్ చేసుకుంటున్నారని. లేదంటే, ఆ ఇంకొకరిని తమకు ఈక్వల్ చేస్తున్నారని. ‘‘నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను. బఘేల్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ‘‘అశోక్‌జీ.. నేను మిమ్మల్ని ‘గురూ’ అన్నందుకు మీరు చిన్నబుచ్చుకున్నట్లున్నారు. నేను కూడా మీలా ఒక రాష్ట్రానికి సీఎంని కనుక మీతో సమస్థాయినో, సమస్థానాన్నో ఆశించి మిమ్మల్ని ‘గురూ’ అనలేదు. ఇద్దరం కాంగ్రెస్ సీఎంలమే కనుక మిమ్మల్ని ‘గురూ’ అని చొరవగా అనగలిగాను’’ అన్నాడు. ‘‘మనిద్దరం కాంగ్రెస్ సీఎంలమే అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను నవ్వుతూ. కొంచెం తేలిక పడినట్లున్నాడు. ‘‘అందుకే మిమ్మల్ని గురూ అన్నాను అశోక్‌జీ. నేను కూడా మీలా బాగున్న ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండాలని ఆశ పడుతున్నాను..’’ అన్నాడు బఘేల్. ఆ మాటతో అతడిలో నాకు గురుస్వరూపం గోచరించింది! అలాగని అతడిని నేను గురూ అంటే అతడింకేదో స్వరూపాన్ని నాకు చూపించవచ్చు. కాంగ్రెస్‌లో స్వరూపాలను ఊహించలేం. సాక్షాత్కారం జరిగినప్పుడు చూసి ఆశ్చర్యపోవడమే. అందుకే, ‘‘చెప్పు బఘేల్’’ అని మాత్రం అన్నాను. ‘‘చెప్పడానికి కాదు అశోక్‌జీ, నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిస్తే బాగుంటుందా అని అడగడానికి ఫోన్ చేశాను’’ అన్నాడు. కాంగ్రెస్‌కు ఉన్నదే ముగ్గురు సీఎంలు. రాజస్తాన్‌లో నేను, ఛత్తీస్‌గఢ్‌లో బఘేల్, పంజాబ్‌లో కొత్తగా వచ్చిన చరణ్‌జిత్ చన్నీ. కొత్తగా వచ్చాడు కాబట్టి చన్నీ కర్టెసీగా వెళ్లి మోదీజీని కలిసుంటాడు. చన్నీకైతే సాకుగా రైతు చట్టాల రద్దు డిమాండ్లు ఉన్నాయి. మరి బఘేల్‌కి ఏమున్నాయి? ‘‘ఇష్యూ ఏంటి బఘేల్..’’ అన్నాను. ‘‘ఇష్యూ కాకూడదనే అశోక్‌జీ’’ అన్నాడు! బఘేల్ మళ్లీ నాకు గురుస్వరూపాన్ని అనుగ్రహించాడు. ‘‘అశోక్‌జీ! కాంగ్రెస్‌లో సీఎం అనే ప్రతి రూపానికీ ఎప్పుడూ ఒక ప్రతిరూపం ఉంటుంది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కి నవజోత్ సింగ్ సిద్ధూ, రాజస్తాన్‌లో అశోక్ గెహ్లోత్ అనే మీకు సచిన్ పైలట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ అనే నాకు టి.ఎస్. సింగ్ దేవ్ ఆ ప్రతిరూపాలు’’ అన్నాడు బఘేల్. బఘేల్ గురుస్వరూపం క్రమంగా ఎత్తుకు పెరుగుతోంది. ‘‘నేనైతే అమరీందర్ సింగ్‌ని కావాలనుకోవడం లేదు అశోక్‌జీ! అమరీందర్ కూడా ముందు నుంచే మోదీజీని కలుస్తూ ఉంటే ఇప్పుడు అమరీందర్ అయి ఉండేవారు కాదు. మొన్న చన్నీ కూడా అమరీందర్ కాకుండా ఉండేందుకే కదా మోదీజీని కలిశారు. మీకైతే మోదీజీని కలిసే అవసరమే రాలేదు. ఆయనే మిమ్మల్ని కలుపుకొన్నారు. ‘అడిగే సీఎంలు ఉంటే పెట్టే పీఎంలు ఉంటారు’ అని ఆయన మిమ్మల్ని పొగిడారు కాబట్టి మీరూ అమరీందర్ అయ్యే ప్రమాదం లేదు..’’ అంటున్నాడు బఘేల్! ‘‘మోదీజీకి టచ్‌లో ఉంటే కాంగ్రెస్ మనల్ని టచ్ చెయ్యదు అనుకోవడంలో లాజిక్ కనిపించడం లేదు బఘేల్..’’ అన్నాను. ‘‘నిజమే అశోక్‌జీ! లాజిక్ లేదు. లాజిక్‌తో అసలు మన పార్టీకి ఏం పనుంది కనుక?! రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకుండానే, అధ్యక్షుడిగా నిర్ణయాలన్నీ తీసుకోవడంలో మాత్రం లాజిక్ ఉందా?..’’ అన్నాడు అశోక్!! మళ్లొకసారి గురు సాక్షాత్కారం!! గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురు బఘేల్!! -మాధవ్ శింగరాజు -
ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం దిగ్ర్భాంతి
ఉదయ్‌పూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది. పార్టీకి చెందిన వల్లభ్‌నగర్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తవట్ (48) బుధవారం ఉదయం కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన మృతిచెందారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి గజేంద్రసింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. అతడి మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్, కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న గజేంద్రసింగ్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో నెల నుంచి చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యంతో గజేంద్రసింగ్ మృతిచెందాడు. గజేంద్రసింగ్ వల్లభ్‌నగర్ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు గులాబ్ సింగ్ కుమారుడే గజేంద్రసింగ్. ఈయన మేవార్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ వెంట ఉన్నారు. అతడి మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంతాపం వ్యక్తం చేశారు. అతడి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పారు. సచిన్ పైలెట్ కూడా గజేంద్రసింగ్ మృతికి సంతాపం తెలిపారు. -
రాజస్తాన్ సంక్షోభం : గహ్లోత్‌కు ఊరట
జైపూర్: రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు స్వల్ప ఊరట. రాజస్తాన్‌లో బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ–కాంగ్రెస్ విలీనం కేసు మళ్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ముందుకే రానుంది. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా పరిగణించడంపై స్టే విధించేందుకు ఏకసభ్య ధర్మాసనం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. బీఎస్పీ తరఫున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్, బీఎస్పీ జాతీయ కార్యదర్శి సతీశ్ మిశ్రా వేసిన పిటిషన్లను జస్టిస్ మహేంద్రకుమార్ గోయెల్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం జూలై 30వ తేదీన విచారించింది. ఈ మేరకు స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం..ఆగస్టు 11వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సభ్యులుగా సభలో చలామణి కావడంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ ఆదేశాలపై బీజేపీ, బీఎస్పీ నేతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై డివిజన్ బెంచ్.. స్పీకర్‌కు బుధవారం నోటీసులు జారీ చేయగా ఎలాంటి సమాధానమూ రాలేదు. ఈ విషయమై స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. బీజేపీ, బీఎస్పీ నేతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడం చెల్లదన్నారు. ఎమ్మెల్యేల నోటీసులు అందుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం పోస్టాఫీసు కాదని సిబల్ పేర్కొన్నారు. ఆ నోటీసులను జైసల్మీర్ జిల్లా జడ్జి ద్వారా జారీ చేయాలని, జైసల్మీర్, బార్మెర్ జిల్లాల రెండు పత్రికల్లో ప్రచురించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
31 నుంచి అసెంబ్లీ పెట్టండి
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు తాజా ప్రతిపాదనను పంపించారు. ఆ లేఖ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు శనివారం రాత్రే చేరిందని రాజ్ భవన్ వర్గాలు ఆదివారం తెలిపాయి. కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. మొదలైన అంశాలను తాజా ప్రతిపాదనలో చేర్చారు. అయితే, గహ్లోత్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఆ ప్రతిపాదిత ఎజెండాలో ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదన పంపాలని కోరారు. మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ తాజా ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. గవర్నర్‌పై కేంద్రం ఒత్తిడి కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో కేబినెట్ సిఫారసుల ప్రకారం గవర్నర్ నడుచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ సీపీ జోషి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ విమర్శించారు. కరోనా వ్యాప్తిపై గవర్నర్ ఆందోళన రాజస్తాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని కల్రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగిందన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో గవర్నర్ కరోనాపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్, డీజీపీ భూపేంద్ర యాదవ్ ఆదివారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి రాజ్‌భవన్ భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు. రాజ్భవన్ల ముందు కాంగ్రెస్ నిరసనలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు గవర్నర్లు అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దేశంలోని అన్ని రాజ్ భవన్ల ఎదుట సోమవారం ఉదయం నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముందు ‘సేవ్ డెమొక్రసీ – సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జెవాలా తెలిపారు. అయితే, ఆ కార్యక్రమాన్ని రాజస్తాన్‌లో మాత్రం నిర్వహించబోవడం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్‌లో, ఇప్పుడు రాజస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు బీజేపీ ఖూనీ చేసిందని సూర్జెవాలా విమర్శించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తోందని ఆరోపిస్తూ ‘స్పీక్ అప్ ఫర్ డెమొక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారాన్ని కాంగ్రెస్ ఆదివారం ప్రారంభించింది. కాంగ్రెస్ విమర్శలపై.. ‘900 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట’ అంటూ బీజేపీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు సతిష్ పూనియా స్పందించారు. మరోవైపు, సచిన్ పైలట్ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
రాజస్తాన్‌లో కూలిన పందిరి
బెర్మర్/జైపూర్: రాజస్తాన్‌లోని బెర్మర్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్ మహరాజ్ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్ షాక్ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై జోధ్‌పూర్ డివిజినల్ కమిషనర్ బీఎల్ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
వసుంధరే రాజస్తాన్ సీఎం అభ్యర్థి
జైపూర్: రాబోయే రాజస్తాన్ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధరా రాజేనే తమ సీఎం అభ్యర్థి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. భారీ మెజారిటీతో గెలిచి ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పారు. జైపూర్‌లో శనివారం ముగిసిన రెండురోజుల రాష్ట్ర బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. పేదల అభ్యున్నతి కోసం గత నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని గడువులోగా(2022 నాటికి) చేరుకుంటామని షా విశ్వాసం వ్యక్తం చేశారు. చివరిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని వసుంధరా రాజే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లనూ కైవసం చేసుకుంటామని చెప్పారు. జైపూర్‌లో శనివారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కుమారుడి వివాహానికి షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ హాజరయ్యారు. -
హస్తనలో రాజే, మోదీతో భేటీ అయ్యే అవకాశం
న్యూఢిల్లీ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ఆమె సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంలో భాగంగా వసుంధర రాజే ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వసుంధర రాజేకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలోని ప్రజాకర్షక నేతలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని..రాజేకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు నిలిచారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలుత ప్రధాని మోదీతోనూ, అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ భేటీ అయ్యాక సీఎం పదవికి వసుంధర రాజే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరితో వసుంధర రాజే భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. -
రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం
-
రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం
జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజె మరోసారి అధిరోహించారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ మంగళవారం వసుంధరా రాజేను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఎల్‌కె అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. -
నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
-
రాజస్థాన్ సిఎం కోసం అతిపె..ద్ద రాఖీ