జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ మార్గరెట్ అల్వా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజె మరోసారి అధిరోహించారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ మంగళవారం వసుంధరా రాజేను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఎల్కె అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం
Published Fri, Dec 13 2013 1:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement