రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌తో బీజేపీ దూసుకుపోతోంది. ఝల్రాపతన్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 25వ రౌండ్ కౌంటింగ్ 53,193 ఓట్లతో ఆధిక్ష్యంలో కొనసాగుతున్నారు. ఎలాగైన కాంగ్రెస్‌ని మట్టికరిపించి పాగా వేయాలనుకున్న బీజేపీ చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వసుంధర రాజే పోటీ చేసిన నియోజక వర్గం నుంచే రామ్‌లాల్ చౌహాన్ సవాల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. ఇక వంసుధ రాజే 2003 నుంచి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును గెలుస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న వసుంధర రాజే మళ్లీ సీఎం కావావలని ఆ కుర్చీని ఆశిస్తున్నారు.
రాజస్థాన్‌లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పిండ్వారా అబూ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సమరం 13,094 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లీలారామ్ గ్రాసియా కంటే ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి గోవింద్ ప్రసాద్ కూడా 24,865 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి కైలాష్ చంద్ మనోహర్ థానా కంటే ఆధిక్యంలో ఉన్నారు. అలాగే విద్యాధర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై బీజేపీ నాయకురాలు దియా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. ఇక దియా కుమారి 17వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 56,025 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,30,231 ఓట్లను సాధించారు. బీజేపీ ఎంపీ, ఝోత్వారా అభ్యర్థి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు. పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత రాథోడ్ 36723 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 123312 ఓట్లను సాధించారు.
మధ్యాహ్నాం వరకు సాగిన కౌంటింగ్‌లో..
బీజేపీ కాంగ్రెస్ ఇతరులు
114 71 15
ఇక వసుంధర రాజే రెండు పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఆమె సీఎం అవతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మహంత్ బాలక్‌నాథ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాజస్థాన్‌లో నవంబర్ 25న 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మెజారిటీ మార్కు 100 కాగా, ఆ మార్కుని బీజేపీ క్రాస్ చేసి ముందంజలో ఉండటం విశేషం.
(చదవండి: ఏళ్లుగా సాగుతున్న 'పరంపర" సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్! సీఎం ఎవరంటే..?)
Comments
Please login to add a commentAdd a comment