rajasthan assembly election
-
ఆధిక్యంలో ఉన్న వసుంధర రాజే..ముచ్చటగా మూడోసారి ఆమెనా..?
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌తో బీజేపీ దూసుకుపోతోంది. ఝల్రాపతన్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 25వ రౌండ్ కౌంటింగ్ 53,193 ఓట్లతో ఆధిక్ష్యంలో కొనసాగుతున్నారు. ఎలాగైన కాంగ్రెస్‌ని మట్టికరిపించి పాగా వేయాలనుకున్న బీజేపీ చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక వసుంధర రాజే పోటీ చేసిన నియోజక వర్గం నుంచే రామ్‌లాల్ చౌహాన్ సవాల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం. ఇక వంసుధ రాజే 2003 నుంచి ఝలావర్ జిల్లాలోని ఝల్రాపతన్ అసెంబ్లీ సీటును గెలుస్తూ ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న వసుంధర రాజే మళ్లీ సీఎం కావావలని ఆ కుర్చీని ఆశిస్తున్నారు. రాజస్థాన్‌లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పిండ్వారా అబూ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సమరం 13,094 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి లీలారామ్ గ్రాసియా కంటే ముందంజలో ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి గోవింద్ ప్రసాద్ కూడా 24,865 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి కైలాష్ చంద్ మనోహర్ థానా కంటే ఆధిక్యంలో ఉన్నారు. అలాగే విద్యాధర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై బీజేపీ నాయకురాలు దియా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. ఇక దియా కుమారి 17వ రౌండ్ కౌంటింగ్ తర్వాత 56,025 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 1,30,231 ఓట్లను సాధించారు. బీజేపీ ఎంపీ, ఝోత్వారా అభ్యర్థి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆధిక్యంలో ఉన్నారు. పదిహేనవ రౌండ్ కౌంటింగ్ తర్వాత రాథోడ్ 36723 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఇప్పటివరకు మొత్తం 123312 ఓట్లను సాధించారు. మధ్యాహ్నాం వరకు సాగిన కౌంటింగ్‌లో.. బీజేపీ కాంగ్రెస్ ఇతరులు 114 71 15 ఇక వసుంధర రాజే రెండు పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ముచ్చటగా మూడోసారి ఆమె సీఎం అవతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐతే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన మహంత్ బాలక్‌నాథ్ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, రాజస్థాన్‌లో నవంబర్ 25న 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మెజారిటీ మార్కు 100 కాగా, ఆ మార్కుని బీజేపీ క్రాస్ చేసి ముందంజలో ఉండటం విశేషం. (చదవండి: ఏళ్లుగా సాగుతున్న 'పరంపర" సంప్రదాయానికే కట్టుబడిన రాజస్థాన్! సీఎం ఎవరంటే..?) -
ఒకే ఎత్తుగడతో కాంగ్రెస్-బీజేపీ!
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వ్యూహాలు, ఓటర్లను ఆకర్షించేలా అగ్రనేతలతో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ‘తగ్గేదేలే’ అన్నట్టుగా సరికొత్త ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు. కుల ప్రాతిపదికన ఓట్లు పొందే వ్యూహంతో ఇరు పార్టీలో బరిలోకి దిగుతున్నాయి. జాట్ల ఆధిక్యం గల హనుమాన్‌గఢ్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల సర్వే చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేగాక పార్టీ మేనిఫెస్టోలో కూడా కుల గణనకే పెద్ద పీఠ వేస్తూ పలు హామీలను అందించింది. ఇదిలా ఉండగా, చిత్తోర్‌గఢ్‌లో ఓ పండ్ల విక్రేత తాను ఓబీసీనని, ఎప్పుడూ బీజేపీకి ఓటు వేస్తానని చెప్పాడు. అయితే తమకు గెహ్లోత్ ప్రభుత్వం సమస్తమూ ఇచ్చిందన్నారు. తాను ఉచిత విద్యుత్ నుంచి పిల్లలకు మధ్యాహ్న భోజనం, తల్లికి వృద్ధాప్య పింఛన్ తదితర అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వంలో పోందానని చెప్పాడు. అయితే అక్కడ చాలమంది ప్రజలు బీజేపీకి ఓటేస్తానని చెప్పడం విశేషం. ఇక రాజస్థాన్‌కి ఉత్తరంగా ముఖ్యంగా జాట్లు అధిక్యంగా ఉన్న జైపూర్‌లో బీజేపీ పట్ల విముఖత ఎక్కువుగా ఉంది. ఎందువల్ల?.. అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జాట్‌కి చెందిన సతీష్ పునియాను తొలగించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదీగాక ఇక్కడ భారత రెజ్లర్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై దిగ్గజ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆయన ఇంకా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగటమే అక్కడ ప్రజలకు మింగుడుపడని అంశమే గాక బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణం కూడా. కులాల పరంగా ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న రాజస్తాన్‌లో ఓబీసీ ఓటర్లే ఇరు పార్టీల ప్రధాన ఓటు బ్యాంక్ అని చెప్పాలి. దీంతో ఆ దిశగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాచికలు కదుపుతూ తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహించడమే గాక, హామీలు ఇచ్చాయి. అదీగాక రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందిన వారే. ఐతే బీజేపీ రాజస్తాన్‌లో 25 పార్లమెంటరీ స్థానాలను కలిగి ఉంది. అందులో ఉన్న 11 మంది ఎంపీలు ఓబీసీలే కావడం విశేషం. 2011 జనాభా లెక్కల ప్రకారం..షెడ్యూల్డ్ కులాలు 17.8%, షెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా, ఓబీసీ ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా కచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ సుమారు 30 నుంచి 40% దాక ఉంటారనే అంచనా. ఇక్కడ జాట్లే ఆధిపత్య ఓబీసీలు. అదీగాక రాజస్థాన్‌లో పార్టీ టిక్కెట్ల విషయంలో ఓబీసీలు రాజకీయంగా పలు వేధింపులకు గురవ్వుతున్నారు కూడా. కాబట్టి వీటన్నింటిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే.. ఓబీసీలకు కాంగ్రెస్ 72, బీజేపీ 70 టిక్కెట్లు కేటాయించింది. కాగా, ఈ ఎన్నికల్లో ఆ ఇరు పార్టీల్లో ఎవరి ఎత్తుగడ, హామీలు హిట్ అవుతుందనేది ఓటర్లే నిర్ణయించాల్సి ఉంది. (చదవండి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వరాల జల్లు!) -
రాజస్థాన్‌లో ముగిసిన ప్రచారం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదుగంటలతో తెరపడింది. డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 200 స్థానాలకుగానూ 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో చురు అసెంబ్లీ స్థానం ఎన్నిక డిసెంబర్ 13కు వాయిదా పడింది. మొత్తం 2,087 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 4.08 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇందుకోసం 47,200 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కేంద్రీకృతమైంది. ఈ రెండు పార్టీలు అన్ని నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీఎస్పీ(195), సీపీఎం(38), సీపీఐ(23), ఎన్సీపీ(16)లతోపాటు స్వతంత్రులు 758 మంది కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మన్మోహన్ సైతం జైపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్ తదితరులు ప్రచారం చేశారు. -
భారం మోడీపైనే...
రాజస్థాన్ నుంచి పోలంపెల్లి ఆంజనేయులు (‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) సునాయాసంగా గెలుపు దక్కించుకోగలమనుకున్న బీజేపీకి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారాయి. కాషాయ దళంలో ఒకవైపు రెబెల్స్ గుబులు పుట్టిస్తుండగా, మరోవైపు సీఎం గెహ్లాట్ ‘సంక్షేమ’ మంత్రంతో ఓటర్లను ఆకట్టుకుంటుండటం అలజడి రేకెత్తిస్తోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ, బీఎస్పీలు రాష్ట్రంలో సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కే సూచనలు కనిపించగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పరిస్థితులు కొంతవరకు తారుమారయ్యాయి. ఈ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలిస్తాయేమోనని ఆందోళన చెందుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ ఎన్నికల్లో పూర్తిగా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపైనే ఆధారపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా పార్టీ రాష్ట్ర నేతలు తెరవెనక్కు వెళ్లి, మోడీని రంగంలోకి దించుతున్నారు. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో మంగళవారం మోడీ సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ప్రసంగించిన పలు బహిరంగ సభల్లో పార్టీ రాష్ట్ర నేతల్లో ముఖ్యులెవరూ కనిపించకపోగా, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సైతం మాట్లాడే అవకాశం లభించకపోవడం గమనార్హం. ఈ సభలన్నీ సర్వం మోడీమయంగా సాగాయి. ఈ నెలాఖరులో మరో మూడురోజులు మోడీ ద్వారా ప్రచారం చేయిం చేందుకు బీజేపీ నేతలు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. రెండు రోజు ల కిందట విడుదల చేసిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆయన సంక్షేమానికే పెద్దపీట వేశారు. ఒకవైపు గెహ్లాట్ మేనిఫెస్టో ఆకర్షణీయంగానే ఉన్నా, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలు తమకు అనుకూలించగలవని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ, అందుకోసం అన్ని అవకాశాలనూ వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది.