జైపూర్: గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్‌ను ‘ఉగ్రవాదానికి మూలపురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయితే, 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్‌లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment