balagangadhar tilak
-
కంఠెవరం బాంబు కేసు: రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య
1905లో బెంగాల్ విభజన సందర్భంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ దేశవ్యాప్తంగా పర్యటించి బ్రిటిష్‌వారి చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాజకీయ స్పృహను కలిగించారు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేసినా ఆ విప్లవ జ్వాల దేశమంతా పాకింది. సర్కారు జిల్లాల నుంచి ఎందరో స్వాతంత్య్ర పోరాటం దిశగా ఆలోచన ఆరంభించారు. అందులో తెనాలి ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ జాతీయోద్యమం ఊపందుకోకముందే గ్రామీణుల్లో రగులుతున్న విప్లవాగ్నిని సూచించే కొన్ని సంఘటనలు జరిగాయి. 1909లో సంచలనం కలిగించిన కఠెవరం బాంబు కేసు అందులో ఒకటి. విజృంభణకు ప్రేరణ ఉత్తర భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద ఉద్యమం విజృంభించిన రోజులవి. కొన్ని దేశాల్లో ప్రభుత్వ నేతలు, రాజకీయ నాయకుల హత్యలు సర్వసాధారణమయ్యాయి. రష్యా, ఇటలీ చక్రవర్తుల్ని హతమార్చారు. ఆస్ట్రియా మహారాణి దారుణహత్యకు గురైంది. అలాగే స్పెయిన్ ప్రధాని, ఫిన్లాండ్ గవర్నర్ జనరల్ కూడా హంతకుల చేతుల్లో బలయ్యారు. ఉత్తరాదిన ఉగ్రవాదం విజృంభణకు ఇదే ప్రేరణ. స్థానిక యువకులు అప్పట్లో తెనాలికి సమీపంలోని కంచర్లపాలెం, కఠెవరం గ్రామాలకు చెందిన సాహస యువకులు చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య తమ మిత్రులను కొందరిని కలుపుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఉగ్రవాదుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నాయకులు అత్యంత రహస్యంగా కొందరు అనుచరులను ఇక్కడకు పంపి ఈ ముగ్గురికి బాంబుల తయారీలో శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తయ్యాక చెన్నై– న్యూఢిల్లీ రైలు మార్గాన్ని కఠెవరం వద్ద పేల్చివేసేందుకు వీరు పథకం పన్నారు. కొబ్బరికాయ (టెంకాయ)లో పేలుడు పదార్థాలు కూర్చి 1909 ఏప్రిల్ 2న బాంబుల్ని సిద్ధం చేశారు. చెన్నైకు వెళుతున్న వైస్రాయ్ రైలును పేల్చివేయాలని, రైలు మార్గం ధ్వంసం చేయాలని నిర్ణయించారు. దీనికి ముందుగా బాంబులు పనిచేస్తున్నాయో? లేదో? పరీక్షించాలని భావించారు. ఏప్రిల్ 3న కఠెవరం–కంచర్లపాలెం మధ్యగల కట్టపై ఒక కొబ్బరికాయ బాంబును వుంచి వెళ్లారు. అనూహ్యంగా అక్కడ వున్న కొబ్బరికాయ(బాంబు) ను చెన్ను అనే పశువుల కాపరి చూశాడు. దానిని పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో బాంబుపేలింది. చెన్ను ఖండఖండాలు 70గజాల దూరంలో పడ్డాయి. ద్వీపాంతరవాస జీవిత ఖైదు తీవ్ర సంచలనం కలిగించిన ఈ కేసును బ్రిటిష్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి లక్కరాజు బసవయ్య, గోళ్లమూడి బ్రహ్మయ్య, చుక్కపల్లి రామయ్యలను కుట్రదార్లుగా నిర్ధారించింది. ఏప్రిల్ 6న ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టులో నిందితులు బసవయ్య, బ్రహ్మయ్య తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, పి.వి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మీ నరసింహం కేసు వాదించారు. చుక్కపల్లి రామయ్య న్యాయవాదిని తిరస్కరించారు. న్యాయస్థానం రామయ్యకు ద్వీపాంతరవాస జీవితఖైదు విధించింది. బసవయ్య, బ్రహ్మయ్యలకు పదేళ్ల వంతున శిక్ష విధించారు. ఈ ముగ్గురినీ అండమాన్ జైలులో వుంచారు. వీరు అక్కడే జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి (చదవండి: సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్) -
బెంగాల్ ధ్యానం గంగలో స్నానం
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905 ఆగస్ట్ 7న కలకత్తా టౌన్ హాలులో పెద్ద సభ జరిగింది. 20,000 మంది హాజరయ్యారు. ఈ సభలోనే ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వచ్చే మాంచెస్టర్ గుడ్డను, లివర్‌పూల్ నుంచి వచ్చే ఉప్పును బహిష్కరించాలని తీర్మానించారు. వందేమాతర గీతం ఉద్యమ నినాదమైంది (తన ‘ఆనందమఠం’ నవల కోసం 1870లో బంకించంద్ర చటర్జీ రాసుకున్న ఈ గీతానికి 1896లో రవీంద్రనాథ్ టాగూర్ బాణీ కట్టి కాంగ్రెస్ సభలలో ఆలపించడంతో ప్రాచుర్యం వచ్చింది). విభజన వ్యతిరేకోద్యమానికి చోదకశక్తిగా అవతరించింది. ఉద్యమం దేశవ్యాప్తమైంది. పూనా, బొంబాయి ప్రాంతాలలో బాలగంగాధర తిలక్, పంజాబ్‌లో అయిత్ సంతోష్, లాలా లజపతిరాయ్, ఢిల్లీలో సయద్ హైదర్ రజా, మద్రాసులో వలియప్పన్ ఉల్గనాథన్ చిదంబరం పిళై్ల స్వదేశీ ఉద్యమానికి మార్గదర్శకులయ్యారు. అక్టోబర్ 16, 1905 న విభజన అమలులోకి వచ్చింది. ముందే నిర్ణయించినట్టు ఆ రోజు బెంగాలీలు, జాతీయవాదులు గంగలో స్నానం చేసి, విభజనకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. హర్తాళ్ నిర్వహించారు. ఆ నిరసన నుంచి వచ్చిన ‘స్వదేశీ’ మొత్తంగా భారతీయ సామాజిక, గృహ జీవిత చిత్రాలనే మార్చివేసింది అన్నారు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆ సంవత్సరం రక్షాబంధ ఉత్సవాన్ని కూడా విభజనకు వ్యతిరేకోద్యమంలో ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని చెబుతూ నిర్వహించారు. ఎదురుపడితే వందేమాతరం అనే పదమే పలకరింపు అయింది. మన దేశం.. మన విద్య తొలి స్వదేశీ ఉద్యమంగా పిలిచే బెంగాలీ ఉద్యమంలో విద్యలో కూడా జాతీయతను ప్రవేశపెట్టే కృషి జరిగింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో ఒకటి బెంగాల్ నేషనల్ కాలేజీ. దీనికి అరవింద్ ఘోష్ ప్రిన్సిపాల్. 1906 ఆగస్ట్‌లో జాతీయ విద్యా సమితి ఏర్పడింది. స్వదేశీ పరిశ్రమల స్థాపనకు ఆ స్ఫూర్తి ఎంతో తోడ్పాటునిచ్చింది. చాలాచోట్ల బెంగాల్‌లలో జౌళి మిల్లులు వెలిశాయి. సబ్బులు, అగ్గిపెట్టెల తయారీ, బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటు వంటివి కూడా జరిగాయి. బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్‌ను అప్పుడే ప్రఫుల్ల చంద్ర రే ఆరంభించారు. విభజనను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘అమర్ సోనార్ బంగ్లా’ గీతం సాంస్కృతిక రంగంలో స్వదేశీ పతాకగా ఎగిరింది. మొదటసారి రాజకీయ ఉద్యమంలో మహిళలు పాల్గొన్నారు. బెంగాల్‌కు ఆంధ్రా.. ఆంధ్రాకు చంద్ర ఆంధ్ర ప్రజలు బెంగాల్ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. 1906 నాటి కలకత్తా వార్షిక సమావేశాలకు అయ్యదేవర కాళేశ్వరరావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పి. ఆనందాచార్యులు, మునగాల రాజా, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. అలా 1906 నాటి స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి ఆంధ్ర ప్రాంతంలో బలపడింది. ఇందులో ముట్నూరి కృష్ణారావు కృషి ఉంది. ఒక ప్రముఖ నేత ఈ ప్రాంతంలో పర్యటించాలని ఆయన కోరి బిపిన్ చంద్ర పాల్‌ను తీసుకువచ్చారు. విజయనగరం, విశాఖపట్నం పర్యటన తరువాత పాల్ ఏప్రిల్ 17న కాకినాడ వచ్చారు. ఏప్రిల్ 19, 20, 23 తేదీలలో రాజమండ్రిలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాలనే చిలకమర్తి లక్ష్మీనరసింహం తెనిగించారు. ‘భరతఖండంబు చక్కని పాడియావు’ అన్న పద్యం ఆ సమయంలోనే ఆయన నోటి నుంచి వచ్చింది. బెజవాడ, మచిలీపట్నాలలో కూడా పర్యటించి మే 1కి పాల్ మద్రాస్ చేరారు. పర్యటన తరువాత రాజమండ్రి, కాకినాడలలో చరిత్ర మరువలేని ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కోటప్పలో కాల్పులు.. తెనాలిలో పేలుడు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఫిబ్రవరి 18, 1909 న ఆంధ్రాలో కోటప్పకొండ దుర్ఘటన జరిగింది. ఆనాటి శివరాత్రి ఉత్సవాలకు జనం విపరీతంగా రావడంతో పోలీసులకూ, భక్తులకూ మధ్య ఘర్షణ జరిగింది. కాల్పులు జరిగి ఐదారుగురు మరణించారు. చిన్నపరెడ్డి అనే రైతు ఎద్దులు బెదిరాయి. వాటిని కూడా పోలీసులు కాల్చేశారు. చిన్నపరెడ్డి ఘర్షణకు దిగి పోలీసులను గెంటేశాడు. దీనితో అతడిని అరెస్టు చేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాటాకుల పోలీసు ఠాణాలో బంధించారు. దాని మీద ప్రజలు దాడి చేశారు. విచారణ తరువాత చిన్నపరెడ్డిని ఉరి తీశారు. ఏప్రిల్ 6, 1909 న తెనాలి బాంబు ఘటన జరిగింది. హౌరా ఎక్స్‌ప్రెస్‌ను కూల్చే ఉద్దేశంతో చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య కంచరపాలెం స్టేషన్లో బాంబు పెట్టారు. కానీ దురదృష్టవశాత్తూ చెన్నుగాడు అనే గిరిజనుడు ఆ పేలుడుతో చనిపోయాడు. ఇవన్నీ క్రమంగా పెరుగుతున్న ఉగ్ర జాతీయవాద చిహ్నాలే. తిలక్ విడుదల.. బ్రిటిష్ దడదడ 1907 సూరత్ సమావేశాలలో కాంగ్రెస్ మొదటిసారి చీలింది. ఇదే అదనుగా బ్రిటిష్ పాలకులు తిలక్‌ను మాండలే జైలుకు పంపారు. అరవిందో ఘోష్ ఆధ్యాత్మిక చింతనకు మరలాడు. బిపి¯Œ పాల్ రాజకీయాలకు దూరమైనాడు. ఉద్యమం చల్లారింది. 1910 ఆఖరులో హార్డింజ్ వైస్రాయ్గా వచ్చాడు. బెంగాల్ విభజనను రద్దు చేశాడు. చక్రవర్తి ఐదో జార్జి తన పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన దర్బారుకు వచ్చి డిసెంబర్ 12, 1911న విభజన రద్దును అధికారికంగా ప్రకటించాడు. ఫలితంగా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి వచ్చింది. తిలక్‌ను మాండలే జైలుకు పంపించిన తరువాత స్వాతంత్య్రోద్యమంలో ఒక శూన్యం ఏర్పడింది. 1914 వరకు ఈ అనిశ్చిత స్థితి కొనసాగింది. ఆపై మొదటి ప్రపంచ యుద్ధానికి భారత సైన్యాన్ని పంపాలా వద్దా అనే అంశం మీద భారత నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తిలక్ జైలు నుంచి విడుదలైన తరువాత జరిగిన పరిణామాలు మళ్లీ కదలికను తెచ్చాయి. – గోపరాజు నారాయణరావు (చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా) -
తిలక్ ఉగ్రవాద పితామహుడట..
సాక్షి, అజ్మీర్ : రాజస్థాన్ పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సరికొత్త భాష్యం చెబుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, లోకమాన్య తిలక్‌గా పేరొందిన బాల గంగాధర్ తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పాఠ్యపుస్తకాల్లో అభివర్ణించడం పెనుదుమారం రేపింది. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం రిఫరెన్స్ బుక్ 22వ చాప్టర్లో 18, 19వ శతాబ్ధాల్లో జాతీయ ఉద్యమం పేరిట ఓ ఉప అంశంగా తిలక్‌ను ప్రస్తావించారు. పుస్తకంలోని 267వ పేజీలో ‘ తిలక్ జాతీయ ఉద్యమానికి దిక్సూచీగా నిలిచినందున ఆయనను ఉగ్రవాద పితామహుడిగా’ పిలుస్తారని పొందుపరిచారు. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఆర్బీఎస్ఈ) అనుబంధం ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కు పుస్తకాలు సరఫరా చేసే మధురకు చెందిన ప్రింటర్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఈ చాప్టర్ అంతా తప్పులతడకగా ఉండటంతో వివాదాస్పదమైంది. తిలక్‌ను ఉగ్రవాద పితామహుడుగా పేర్కొనడం గర్హనీయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ కైలాష్ శర్మ అన్నారు. పాఠ్య పుస్తక సారాంశాల్లో మార్పులు చేసే ముందు చరిత్రకారులను సంప్రదించాలని సూచించారు. స్వాతంత్య సమరయోధుడు తిలక్‌ను ఉగ్రవాద పితామహుడిగా పేర్కొనడం పట్ల కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని సవరించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని రాజస్ధాన్ సీఎంను ఆయన డిమాండ్ చేశారు. -
బాలగంగాధర్ తిలక్.. ‘ఫాదర్ ఆఫ్ టెర్రరిజం’!
జైపూర్: గణపతి, ఛత్రపతి ఉత్సవాలతో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన బాలగంగాధర్ తిలక్‌ను ‘ఉగ్రవాదానికి మూలపురుషుడు’గా పేర్కొనటం వివాదమైంది. రాజస్తాన్ ప్రభుత్వం హిందీలో ప్రచురించే పాఠ్యపుస్తకాలను మథురలోని ఓ సంస్థ ఇంగ్లిష్‌లోకి అనువదించి ప్రచురిస్తుంది. వీటిని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో బోధిస్తున్నారు. అయితే, 8వ తరగతి పాఠ్య పుస్తకం 22వ చాప్టర్లోని 18,19వ శతాబ్దాల్లో జాతీయోద్యమ ఘటనలు అనే పాఠ్యాంశంలో ‘తిలక్ జాతీయోద్యమానికి ఒక బాటను చూపారు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అంటారు’ అని ఉంది. -
దేశ భక్తిభావం
-
భక్తి తప్ప మిగతా అన్నీ...
విశ్లేషణ నేటి గణపతి ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లింతలు కేరింతలు ఎక్కువ. ఇవి తిలక్ భావనను పూర్తిగా భ్రష్టుపట్టించినవి. మతం పేరిట రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగపడతాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రజలను సమీకరించడం కోసం సార్వజనిక గణేశ ఉత్స వాలు నిర్వహించి బహిరంగ ప్రార్థనలు, ఉత్సవాలను జర పడం ప్రారంభించినప్పుడు బ్రిటి ష్వారు దానిపై నిషేధం విధించ లేదు. మొదటిసారి ఆయన రెండు అడుగుల ఎత్తున్న చిన్న విగ్ర హంతో వించుర్కర్ వాడలోని ఒక ఇంటి ఆవరణలోనే వాటిని నిర్వహించారు. తరువాత వాటిని ఆయన తనుండే కేసరివాడకు మార్చారు. అక్కడ ఆ ఉత్సవాలు నేటికీ కొన సాగుతున్నాయి. తిలక్ ప్రారంభించిన తర్వాత రెండేళ్లకు ముంబైలోని కేశవ్జీనాయక్ చాల్లో మొదటిసారిగా బహిరంగ సార్వత్రిక గణేశ ఉత్సవాలను నిర్వహించారు. అయితే అది కూడా రోడ్డు పక్కనో లేదా రోడ్లులోని ఒక భాగాన్ని మొత్తంగా మూసేసో నిర్వహించలేదు (రోడ్లను మూసేసి ఈ ఉత్సవా లను నిర్వహించడం మహారాష్ట్రకే పరిమితం కాదు). ఆ విగ్రహం కూడా కేసరివాడలో వలే చిన్నదే. గత మూడు దశా బ్దాలలో ఈ బహిరంగ ఉత్సవాల నిర్వహణ చాలా ప్రాంతా లకు... అక్షరాలా పాటలు, డాన్సులతో సహా విస్తరించింది. ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా మూడు వారాలుంది. విగ్రహాలు, పందిళ్లకు సన్నాహాలు, పందిళ్లు వేయడానికి అనుమతులు లేదా పౌర పాలనా సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండానే జరుపుకోడానికి సంబంధించిన ఆదేశాల గురించే అంతా మాట్లాడుకుంటు న్నారు. నియంత్రితమైన ఈ అరాచకానికి సంబంధించిన ఆదేశాల ఉల్లంఘనలకు గత ఏడాది జరిమానాలు విధించారు. పౌర పరిపాలనా సంస్థలు నిస్సహాయమైన రోడ్లను లక్ష్యం చేసుకున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పట్టణాలు, నగరాల లోని రోడ్లు సిగ్గుపడాల్సినవిగానే ఉన్నాయి. వ్యోమగాములు వీటినిచూస్తే పెద్ద చంద్ర బిలాలని అనుకోవచ్చున నే వాడుకలో ఉన్న నానుడి అర్థం చేసుకోదగినదే. పట్టణ ప్రాంతాల్లోని సందులు గొందుల్లోని గోతుల వల్ల తెచ్చేట ప్పుడు, నిమజ్జనానికి తరలించేటప్పుడు విగ్రహాలకు ఏ హాని జరుగుతుందోనని ఉత్సవ నిర్వాహకులకు భయం. రోడ్లను సక్రమంగా సరిదిద్దమని ఉత్సవ నిర్వాహకుల సమాఖ్య పౌర పరిపాలనా సంస్థలకు హెచ్చరికను జారీ చేసింది. అలాగేనని అవి వాగ్దానం చేయనూ చేశాయి, తమకు చేతనైనంత బాగా రోడ్ల మీద గోతులను పూడ్చడమూ చేశాయి. అనివార్యంగా వచ్చే వానలే ఆ పనులను ఎంత అధ్వానంగా చేశారో వివరించాయి. రోడ్లలా ఎందుకు అధ్వానంగా మారాయనేదానికి ఎవరివద్దా సమాధానం లేదు. ఆ పనుల ద్వారా దండిగా డబ్బు చేసుకున్న కాంట్రా క్టర్లూ, పౌర పరిపాలనా సంస్థలలో వారితో కుమ్మక్కయిన వారూ లోలోపలే నవ్వుకుంటూ ఉంటారు. రోడ్ల దుస్థితిపై వెల్లువెత్తే ఆగ్రహం గురించి పౌర పరిపాలనా సంస్థలు కోర్టు ఆదేశాలు వెలువడక ముందే దిద్దుబాటు కృషి చేయాల్సింది. మత స్వేచ్ఛ అంటే సరైన రోడ్లు, పందిళ్లు దురాక్రమణలోని ఫుట్‌పాత్‌ల వంటి మౌలిక సదుపాయాలను పౌరులకు నిరాకరించడం కాదని బొంబాయి హెకోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో ఈసారి పౌర పరిపాలనా సంస్థలు ఆ పనిని చేపట్టాల్సి వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే, పౌరులకు ఇబ్బంది కలిగించే గణపతి, ఉట్లు కొట్టడం(గోకులాష్టమి), దేవీనవరాత్రి వంటి బహిరంగ మత కార్యక్రమాలను రోడ్ల మీద జరపకుండా ఉండాలని, ఇలాంటివి తగ్గేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలను ప్రార్థనకు ఆహ్వానించే ఆజాన్‌ను లౌడ్ స్పీకర్ల ద్వారానే జరపాలనే మత నిబంధన ఏదీ లేదని కూడా అది చెప్పింది. ఇవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే కాదు, మైలురాళ్ల వంటి న్యాయ ప్రకటనలు. అయితే రాజ కీయవేత్తలు అప్పుడే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గుస గుసలాడటం మొదలెట్టారు. గణపతిని వారు తిరిగి ప్రాంగణాలలోకి తరలించ డానికి సిద్ధంగా లేరు. ఈ ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లిం తలు, కేరింతలు ఎక్కువ కావడం మాత్రమే ఇందుకు కార ణం కాదు. నాకు తెలిసి నామ మాత్రపు పూజ తదుపరి మహిళల క్యాట్‌వాక్ (ఫ్యాషన్ షో)ను నిర్వహించే పందిరి కనీసం ఒకటుంది! మించి గణపతి పందిళ్లు భారీ రాజ కీయ వేదిక కావడమే వారిగుసగుసలకు కారణం. రాజకీయవే త్తలు వాటికి నిధులను సమకూర్చాలి లేకపోతే చోటామోటా నేతలు తమకున్న తక్కువ పలుకుబడితో చందాలను సేక రిస్తారు. ఇది ఇకెంత మాత్రమూ లోకమాన్య గంగాధర్ తిలక్ భావనీకరించిన, సృష్టించిన వేదిక కాదు. పూర్తిగా దాన్ని భ్రష్టుపట్టించినది. ఆయన రోజులోన్లి వాడల లోపలుండే ఈ పందిళ్లలో బహిరంగంగా విద్యగరపడం సైతం ఉండేది. నేడు అంత పెద్ద ఆవరణలు అందుబాటులో లేవు. రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగ పడతాయి. అయితే కాస్త లెక్కలోకి వచ్చే నేతలెవరూ లేదా కావా లని కోరుకునే వారెవరూ, రాజకీయపరమైన ఆశలున్న వారె వరూ, చివరకు స్థానిక స్థాయి చోటా నేతలు సైతం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది తాము తప్పక చేసి తీరాలని వారు భావిస్తారు. గోకులాష్టమికి ఉట్లుకొట్టడమైనా, దేవీ నవరాత్రులకు నిర్వహించే గర్బా నృత్యగాన వేడుకలైనా అంతే. రివాజుగా సాగే ఈ వ్యవహారంలో ఏదైనా లోపించిం దంటే అది ఒక్క భక్తే. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com