భక్తి తప్ప మిగతా అన్నీ...
విశ్లేషణ
నేటి గణపతి ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లింతలు కేరింతలు ఎక్కువ. ఇవి తిలక్ భావనను పూర్తిగా భ్రష్టుపట్టించినవి. మతం పేరిట రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగపడతాయి.
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రజలను సమీకరించడం కోసం సార్వజనిక గణేశ ఉత్స వాలు నిర్వహించి బహిరంగ ప్రార్థనలు, ఉత్సవాలను జర పడం ప్రారంభించినప్పుడు బ్రిటి ష్‌వారు దానిపై నిషేధం విధించ లేదు. మొదటిసారి ఆయన రెండు అడుగుల ఎత్తున్న చిన్న విగ్ర హంతో వించుర్కర్ వాడలోని ఒక ఇంటి ఆవరణలోనే వాటిని నిర్వహించారు. తరువాత వాటిని ఆయన తనుండే కేసరివాడకు మార్చారు. అక్కడ ఆ ఉత్సవాలు నేటికీ కొన సాగుతున్నాయి.
తిలక్ ప్రారంభించిన తర్వాత రెండేళ్లకు ముంబైలోని కేశవ్‌జీనాయక్ చాల్‌లో మొదటిసారిగా బహిరంగ సార్వత్రిక గణేశ ఉత్సవాలను నిర్వహించారు. అయితే అది కూడా రోడ్డు పక్కనో లేదా రోడ్లులోని ఒక భాగాన్ని మొత్తంగా మూసేసో నిర్వహించలేదు (రోడ్లను మూసేసి ఈ ఉత్సవా లను నిర్వహించడం మహారాష్ట్రకే పరిమితం కాదు). ఆ విగ్రహం కూడా కేసరివాడలో వలే చిన్నదే. గత మూడు దశా బ్దాలలో ఈ బహిరంగ ఉత్సవాల నిర్వహణ చాలా ప్రాంతా లకు... అక్షరాలా పాటలు, డాన్సులతో సహా విస్తరించింది.
ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా మూడు వారాలుంది. విగ్రహాలు, పందిళ్లకు సన్నాహాలు, పందిళ్లు వేయడానికి అనుమతులు లేదా పౌర పాలనా సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండానే జరుపుకోడానికి సంబంధించిన ఆదేశాల గురించే అంతా మాట్లాడుకుంటు న్నారు. నియంత్రితమైన ఈ అరాచకానికి సంబంధించిన ఆదేశాల ఉల్లంఘనలకు గత ఏడాది జరిమానాలు విధించారు. పౌర పరిపాలనా సంస్థలు నిస్సహాయమైన రోడ్లను లక్ష్యం చేసుకున్నాయి.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పట్టణాలు, నగరాల లోని రోడ్లు సిగ్గుపడాల్సినవిగానే ఉన్నాయి. వ్యోమగాములు వీటినిచూస్తే పెద్ద చంద్ర బిలాలని అనుకోవచ్చున నే వాడుకలో ఉన్న నానుడి అర్థం చేసుకోదగినదే. పట్టణ ప్రాంతాల్లోని సందులు గొందుల్లోని గోతుల వల్ల తెచ్చేట ప్పుడు, నిమజ్జనానికి తరలించేటప్పుడు విగ్రహాలకు ఏ హాని జరుగుతుందోనని ఉత్సవ నిర్వాహకులకు భయం.
రోడ్లను సక్రమంగా సరిదిద్దమని ఉత్సవ నిర్వాహకుల సమాఖ్య పౌర పరిపాలనా సంస్థలకు హెచ్చరికను జారీ చేసింది. అలాగేనని అవి వాగ్దానం చేయనూ చేశాయి, తమకు చేతనైనంత బాగా రోడ్ల మీద గోతులను పూడ్చడమూ చేశాయి. అనివార్యంగా వచ్చే వానలే ఆ పనులను ఎంత అధ్వానంగా చేశారో వివరించాయి. రోడ్లలా ఎందుకు అధ్వానంగా మారాయనేదానికి ఎవరివద్దా సమాధానం లేదు. ఆ పనుల ద్వారా దండిగా డబ్బు చేసుకున్న కాంట్రా క్టర్లూ, పౌర పరిపాలనా సంస్థలలో వారితో కుమ్మక్కయిన వారూ లోలోపలే నవ్వుకుంటూ ఉంటారు.
రోడ్ల దుస్థితిపై వెల్లువెత్తే ఆగ్రహం గురించి పౌర పరిపాలనా సంస్థలు కోర్టు ఆదేశాలు వెలువడక ముందే దిద్దుబాటు కృషి చేయాల్సింది. మత స్వేచ్ఛ అంటే సరైన రోడ్లు, పందిళ్లు దురాక్రమణలోని ఫుట్‌పాత్‌ల వంటి మౌలిక సదుపాయాలను పౌరులకు నిరాకరించడం కాదని బొంబాయి హెకోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో ఈసారి పౌర పరిపాలనా సంస్థలు ఆ పనిని చేపట్టాల్సి వచ్చింది.
క్లుప్తంగా చెప్పాలంటే, పౌరులకు ఇబ్బంది కలిగించే గణపతి, ఉట్లు కొట్టడం(గోకులాష్టమి), దేవీనవరాత్రి వంటి బహిరంగ మత కార్యక్రమాలను రోడ్ల మీద జరపకుండా ఉండాలని, ఇలాంటివి తగ్గేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలను ప్రార్థనకు ఆహ్వానించే ఆజాన్‌ను లౌడ్ స్పీకర్ల ద్వారానే జరపాలనే మత నిబంధన ఏదీ లేదని కూడా అది చెప్పింది. ఇవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే కాదు, మైలురాళ్ల వంటి న్యాయ ప్రకటనలు. అయితే రాజ కీయవేత్తలు అప్పుడే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గుస గుసలాడటం మొదలెట్టారు.
గణపతిని వారు తిరిగి ప్రాంగణాలలోకి తరలించ డానికి సిద్ధంగా లేరు. ఈ ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లిం తలు, కేరింతలు ఎక్కువ కావడం మాత్రమే ఇందుకు కార ణం కాదు. నాకు తెలిసి నామ మాత్రపు పూజ తదుపరి మహిళల క్యాట్‌వాక్ (ఫ్యాషన్ షో)ను నిర్వహించే పందిరి కనీసం ఒకటుంది! మించి గణపతి పందిళ్లు భారీ రాజ కీయ వేదిక కావడమే వారిగుసగుసలకు కారణం. రాజకీయవే త్తలు వాటికి నిధులను సమకూర్చాలి లేకపోతే చోటామోటా నేతలు తమకున్న తక్కువ పలుకుబడితో చందాలను సేక రిస్తారు.
ఇది ఇకెంత మాత్రమూ లోకమాన్య గంగాధర్ తిలక్ భావనీకరించిన, సృష్టించిన వేదిక కాదు. పూర్తిగా దాన్ని భ్రష్టుపట్టించినది. ఆయన రోజులోన్లి వాడల లోపలుండే ఈ పందిళ్లలో బహిరంగంగా విద్యగరపడం సైతం ఉండేది. నేడు అంత పెద్ద ఆవరణలు అందుబాటులో లేవు. రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగ పడతాయి.
అయితే కాస్త లెక్కలోకి వచ్చే నేతలెవరూ లేదా కావా లని కోరుకునే వారెవరూ, రాజకీయపరమైన ఆశలున్న వారె వరూ, చివరకు స్థానిక స్థాయి చోటా నేతలు సైతం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది తాము తప్పక చేసి తీరాలని వారు భావిస్తారు. గోకులాష్టమికి ఉట్లుకొట్టడమైనా, దేవీ నవరాత్రులకు నిర్వహించే గర్బా నృత్యగాన వేడుకలైనా అంతే. రివాజుగా సాగే ఈ వ్యవహారంలో ఏదైనా లోపించిం దంటే అది ఒక్క భక్తే.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపుర్కార్
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com