![tention at khairathabad ganesh temple - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/22/259.jpg.webp?itok=IkKRH3ZM)
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గణేషుని మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలను అమలు చేస్తున్న కమిటీ సభ్యులు.. భక్తులను ఎవరనీ మండపంలోకి అనుమతించచోమని, రోడ్డుమీద నుంచి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే బయటి నుంచే రోప్‌ల వెలుపల భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదా కట్టొద్దంటూ నిరసన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment