ganesh celebrations
-
గణేశుడి సేవలో పెదనాన్నతో అగస్త్య: హార్దిక్ లేకుండానే (ఫొటోలు)
-
వినాయక చవితి విశిష్టత..!
-
గణపతి రూపంలో కాకుండా వేరే రూపాల్లో గణపతిని తయారు చేయవచ్చా..?
-
ప్రతి సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని పెట్టడం వెనుక కారణమేంటి?
-
వినాయక చవితికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేష్
-
పూర్వం నుంచి మట్టిని దైవంగా భావించే ఆచారం మనది
-
బెంగళూరు ఈద్గాలో గణేష్ ఉత్సవాలకు బ్రేక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు: బెంగళూరులోని ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్టు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. గణేష్ ఉత్సవాలకు బ్రేకులు వేసింది ధర్మాసనం. స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం.. ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదు. విచారణ సందర్భంగా వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే. తమ హక్కులు అణచివేతకు గురవుతున్నాయనే భావన మతపరమైన మైనారిటీలకు కలుగకుండా చూడాలని కోరారు. ఈ మైదానంలో 200 ఏళ్లుగా ఇతర మతాల కార్యక్రమాలు నిర్వహించటం లేదని, చట్ట ప్రకారం ఇది వక్ఫ్ బోర్డు ఆస్తిగా తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు.. ఇది ప్రభుత్వం పేరుతో ఉందని, చాలా ఏళ్లుగా పిల్లలు ఆడుకునే ఆట స్థలంగానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్ని అంతకు ముందు కర్ణాటక హైకోర్టు సైతం ఏకీభవించింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కర్ణాటక వక్ఫ్‌బోర్డు. తాజాగా స్టేటస్ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
-
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గణేషుని మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలను అమలు చేస్తున్న కమిటీ సభ్యులు.. భక్తులను ఎవరనీ మండపంలోకి అనుమతించచోమని, రోడ్డుమీద నుంచి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే బయటి నుంచే రోప్‌ల వెలుపల భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కమిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గణేష్‌కు అడ్డంగా పరదా కట్టొద్దంటూ నిరసన చేపట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
స్టార్ మా గణేష్ మహోత్సవం
-
కాణిపాకంలో వినాయక బ్రహ్మోత్సవాలు
-
40 ఏళ్లుగా 'ఆ' గ్రామంలో ఒకే గణేశుడు
సాక్షి, మేడ్చల్: గణేశ్ నవరాత్రులకు గల్లీకో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి హంగు ఆర్భాటం చేయడం... గ్రామం, పట్టణం అని తేడా లేకుండా ప్రతి చోటా జరిగే తంతు. ఇందుకు భిన్నంగా ఒకే గ్రామం... ఒకే వినాయకుడి సంప్రదాయానికి మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుతారిగూడ నిలిచింది. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగడం విశేషం. ఏటా వినాయక ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఒకే విగ్రహాన్ని నెలకొల్పి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 40 ఏళ్ల క్రితం గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి ఈ నిర్ణయం తీసుకోగా, నేటికీ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అట్టహాసంగా.. భక్తి పూర్వకంగా.... గ్రామంలో ఒకే వినాయకుడ్ని ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఉత్సవాల్లో ఐక్యంగా ఉండి అటు అట్టహాసంగా... ఇటు భక్తి పూర్వకంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా భారీ సెట్టింగ్‌లతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులూ భజనలు, ప్రత్యేక పూజలతో భగవంతుడ్ని ఆరాధిస్తున్నారు. నేటికీ అదే ఆనవాయితీ ఊరంతా ఐక్యంగా ఉండాలన్న ఆకాంక్షతో గ్రామంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల కిందట నిర్ణయించారు. గల్లీకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భక్తి కన్నా ఆధిపత్య పోరు ఎక్కువ అవుతుంది. ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం సందర్భంగా గొడవలు జరిగి ఐక్యత దెబ్బతింటుంది, మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే వినాయకుడి ప్రతిమ ఉంటే ఐక్యత పెరుగుతుంది. మేము తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికులు ఇప్పటికీ కట్టుబడటం సంతోషంగా ఉంది. – వెంకటేష్, గ్రామ హనుమాన్ యూత్ సభ్యుడు -
డీజేకు అనుమతి లేదు: సీపీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు 24 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సారి బందోబస్తులో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. జియో ట్యాగింగ్ ద్వారా అనుమసంధానిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదని.. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. -
మూడు కుటుంబాలకు షాక్
వేర్వేరు సంఘటనల్లో విద్యుత్‌షాక్‌తో ముగ్గురి దుర్మరణం వినాయక నిమజ్జనోత్సవంలో ఇద్దరు దేవుడికి దక్షిణ వేయబోతూ మరొకరు మూడు కుటుంబాల్లో నెలకొన్న విషాదం విజయనగరం రూరల్/శంగవరపుకోట: రోజూ మాదిరిగానే శుక్రవారం తెల్లారింది. కానీ ఆ మూడు కుటుంబాల్లో విషాదంతో ఉషోదయం పలికింది. విద్యుత్రూపంలో మత్యువు ముగ్గురిని కబళించింది. వారిపైనే ఆధారపడిన కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వినాయక నిమజ్జనానికి ఉత్సాహంగా తరలిన ఓ గుంపులో ఇద్దరు... రోజూ మాదిరిగా దైవదర్శనం చేసుకుని దక్షిణ వేయడానికి గ్రిల్స్‌లో చేతులు పెట్టిన మరొకరు షాక్‌తో కన్నుమూశారు. విజయనగరం మండలం గుంకలాం, శంగవరపుకోట పట్టణంలో చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మత్యువాతపడ్డారు. గుంకలాంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకోగా... శంగవరపుకోటలో ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి దేవుడికి దండం పెట్టుకుని దక్షిణ వేసేందుకు యత్నించగా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుంకలాం గ్రామంలో గురువారం రాత్రి వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో గ్రామ శివారున పెద్ద చెరువులో నిమజ్జనం పూర్తి చేసుకుని గ్రామంలోకి 15 మంది వరకు యువకులు ట్రాక్టర్‌పై వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌కు ఏర్పాటు చేసిన పొడవాటి కర్రలు విద్యుత్ వైర్లకు తగిలాయి. తడిసి ఉన్న ఆ కర్రల ద్వారా ట్రాక్టర్‌కు విద్యుత్ సరఫరా కాగా అందులో ఉన్న యువకులకు విద్యుత్‌షాక్ తగిలింది. చెప్పులతో ఉన్న యువకులు 15 మంది వరకు ట్రాక్టర్ పైనుంచి కిందికి దూకేశారు. చెప్పులు లేకపోవడం, అప్పటికే తడిసి ఉండటంతో గ్రామానికి చెందిన సిరిపురపు శంకరరావు(22), సువ్వాడ శ్రీను విద్యుత్‌షాక్ గురయ్యారు. వెంటనే తేరుకున్న గ్రామస్తులు వారిని కిందికి దించి, కొన ఊపిరి ఉన్నట్టు భావించి 108కు సమాచారం అందించారు. జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉండటం, ద్వారపూడి వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్డడంతో 108 వాహనం ఆలస్యమైంది. ఆలస్యం చేయకుండా వారు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా ద్వారపూడి వద్ద 108 వాహనం ఎదురైంది. అందులోని సిబ్బంది పరిశీలించి ఇద్దరూ మరణించినట్టు నిర్ధారించడంతో వారిని వెనక్కి తీసుకువెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి మతదేహాలను కేంద్రాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శంకర్రావు మతదేహాన్ని తల్లిదండ్రులకు, శ్రీను మతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. గ్రామంలో విషాద ఛాయలు సంబరాలు చేసుకున్న ఆ గ్రామంలో ఇద్దరు యువకులు మతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. మతిచెందిన సిరిపురపు శంకరరావు మండల పరిషత్ కార్యాలయంలో తాత్కాలికంగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన తండ్రి రమణ తాపీ పని చేస్తుండగా, తల్లి రామయ్యమ్మ కూలిపని చేస్తోంది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉండి అందివచ్చిన కొడుకు అకారణంగా మత్యువాత పడటంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తల్లిదండ్రులను చూడకుండానే అనంతలోకాలకు... మరో మతుడు సువ్వాడ శ్రీను గంట్యాడ మండలం లక్కిడాం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు పేదరికంతో ఇల్లు గడవక చెన్నైలో కూలిపనికి వలస వెళ్లారు. మతుడు శ్రీను, చెల్లెలు రోహిణితో కలిసి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. శ్రీను మరణవార్త తెలుసుకుని తల్లిదండ్రులు చెన్నైలో శుక్రవారం బయలుదేరారని, తల్లిదండ్రులను చూడకుండానే కొడుకు మతి చెందడంతో గ్రామస్థులు, బంధువులు రోదిస్తున్నారు. అమ్మవారి హుండీలో దక్షిణ వేద్దామని... శంగవరపుకోట పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద విద్యుదాఘాతంతో ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి విద్యుదాఘాతంతో మతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్సై కె.రవికుమార్, ప్రత్యక్ష సాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వ్యాపారి తూతిక త్రినాథరావు(61) సంతల్లో కిరాణా సరకులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం వేకువ జామున ధర్మవరం నుంచి వ్యాన్‌లో అరకు సంతకు బయలుదేరి వెళ్తూ ఎస్.కోట దేవి గుడి వద్ద హుండీలో చిల్లర వేసేందుకు ఆగాడు. ఆ సమయంలో ఆలయానికి తలుపులు వేసి ఉండడంతో లోపలున్న హుండీలో చిల్లర వేసేందుకు ఇనుప గ్రిల్స్ లోపలికి చెయ్యిపెడుతూనే గిలగిలా కొట్టుకోవడంతో పక్కనే ఉన్నవారు వెంటనే కర్రతో పక్కకునెట్టారు. కొన ఊపిరితో ఉన్న త్రినాథరావును ఎస్.కోటలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మతి చెందాడు. దసరా ఉత్సవాల సందర్భంగా కొంతమంది ఆలయాన్ని విద్యుత్ దీపాలంతో అలంకరిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగి ఇనుప గ్రిల్స్‌పై పడడం వల్ల త్రినాథరావు విద్యుదాఘాతంతో మతి చెందాడని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే అంతకుముందే కొందరు ఇదేవిధంగా హుండీలో డబ్బులు వేశారని, వారికి ఏమీ కాలేదని, త్రినాథరావు గుండెపోటుతో మతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మతుడికి భార్య హైమావతి, కుమార్తె సత్యతులసి, కుమారుడు సతీష్ ఉన్నారు. ప్రమాదం జరగడంతో ధర్మవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విద్యుదాఘాతంతోనే వ్యాపారి మతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె. రవికుమార్ తెలిపారు. మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. -
వినాయక ఊరేగింపులో కపూర్ ఫ్యామిలీ
-
నిమజ్జనానికి వెళ్లి..విగతజీవిగా మారి..
హత్యకు గురైన యువకుడు భట్టుపల్లి శివారు కోట చెరువు మత్తడి వద్ద ఘటన మడికొండ : గణపతి నిమజ్జనానికి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరిన యువకుడు.. దారుణ హత్యకు గురైన ఘటన నగర పరిధిలోని 33వ డివిజన్ భట్టుపల్లి శివారు కోటచెరువు మత్తడి వద్ద జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..దర్గా కాజీపేటకు చెందిన పులిగిల్ల చందు (20) నగరంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కాలేజీకి వెళ్లి వచ్చి రాత్రి దర్గా కాజీపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలకు చందు తల్లి నిర్మల, అక్క శ్వేత వినాయక మండపం వద్దకు వెళ్లి ఇంటికి రమ్మని పలువగా నిమజ్జనం తర్వాత వస్తానన్నాడు. రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తండ్రి యాదగిరి చందుకు పోన్ చేయగా సెల్ పని చేయలేదు. గురువారం ఉదయం భట్టుపల్లి గ్రామస్తులు కోటచెరువు వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు మడికొండ ఎస్సై విజ్ఞాన్‌రావుకు సమచారం అందించారు. ఎస్సై సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి ప్యాంట్ జేబులో ఉన్న సెల్ పోన్ ఆధారంగా దర్గా కాజీపేటకు చెందిన చందుగా గుర్తించి తండ్రి ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరికి సమచారం అందించారు. ఘటనా స్థలాన్ని కాజీపేట ఏసీపీ జనార్దన్, సీఐ ఎల్.రమేశ్‌బాబు పరిశీలించారు. మృత దేహంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం బృందం అధారాలు సేకరించింది. కాగా చందుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ఎవరితోనూ శత్రుత్వం లేదని బంధువులు పేర్కొన్నారు. తంల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజ్ఞాన్‌రావు తెలిపారు. -
ఉండ్రాళ్లయ్యా.. వెళ్లి రావయ్యా
పార్వతీపురం: పట్టణంలో బుధ, గురువారాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. నవరాత్రులు ముగియడంతో జగన్నాథపురం, మున్సిపల్ కూరగాయల మార్కెట్, మెయిన్ రోడ్డు, కొత్తవలస, రాయగడ రోడ్డు తదితర ప్రాంతాల ఉత్సవ కమిటీలు విగ్రహాలను డప్పు వాయిద్యాలు, డీజే మ్యూజిక్‌లు, పులి వేషాలు, తప్పిటగుళ్లు, బళ్ల వేషాల మధ్య నిమజ్జనాలు నిర్వహించారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా కుర్రకారు హుషారుగా నర్తిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కంగటి వీధిలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో, జగన్నాథపురం, మెయిన్ రోడ్డు, బెలగాం తదితర ప్రాంతాల్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదానం నిర్వహించాయి. కార్యక్రమంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యిండుపూరు గోపి మాట్లాడారు. -
ముంబైలో గణేష్‌కి శిల్ప ప్రత్యేక పూజలు
-
స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ గణేష్
-
ప్రజాజీవనానికి భంగం కలిగించొద్దు
చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు నిషేధం ఏఎస్పీ బి.శరత్‌బాబు నెల్లూరు(క్రైమ్) : వినాయక చవితి ఉత్సవాలను ప్రజాజీవనానికి భంగం కలిగించకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఏఎస్పీ బి.శరత్‌బాబు సూచించారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఆదివారం నగరంలోని వినాయక ఉత్సవ కమిటీసభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. విగ్రహాలు ట్రాఫిక్‌కు ఇబ్బందిలేకండా ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. విగ్రహాలకు సంబంధించిన ఎత్తు, నిమర్జనం తేదీ, నిమర్జనం రూటు, ఉత్సవ కమిటీల పేర్లు పోలీసులకు ఇవ్వాలన్నారు. వినాయక మండపాల వద్ద కనీసం ఇద్దరు వలంటీర్లును ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గMýంండా చూడాలన్నారు. ఆకతాయిల వేధింపులు, గొలుసు దొంగతనాలు జరగకుండా ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయబద్ధమైన నృత్యాలు, మ్యూజికల్ నైట్‌ను నిర్వహించుకోవచ్చని, అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలన్నారు. ఉత్సవ నిమర్జనం రోజు ఉరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చొద్దని, మద్యం సేవించరాదని సూచించారు. మహిళలను, యువతులు, చిన్నారులను నిమర్జనం జరిగే ప్రదేశానికి తీసుకురాకూడదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని ప్రధాన మండపాల వద్ద పోలీసుశాఖ తరుపున నోడల్ ఆఫీసర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీ జి.వెంటకరాముడు మాట్లాడుతూ విగ్రహాలు, మండపాల వద్ద విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ ఎన్.కోటారెడ్డి, రెండు, మూడు, నాలుగు, ఐదోనగర ఇన్స్పెక్టర్లు వి.సుధాకర్‌రెడ్డి, జి.రామారావు, సీహెచ్ సీతారామయ్య, జి.మంగారావు, ఎస్సైలు గిరిబాబు, అలీసాహెబ్, రఘునాథ్ పాల్గొన్నారు. -
భక్తి తప్ప మిగతా అన్నీ...
విశ్లేషణ నేటి గణపతి ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లింతలు కేరింతలు ఎక్కువ. ఇవి తిలక్ భావనను పూర్తిగా భ్రష్టుపట్టించినవి. మతం పేరిట రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగపడతాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రజలను సమీకరించడం కోసం సార్వజనిక గణేశ ఉత్స వాలు నిర్వహించి బహిరంగ ప్రార్థనలు, ఉత్సవాలను జర పడం ప్రారంభించినప్పుడు బ్రిటి ష్వారు దానిపై నిషేధం విధించ లేదు. మొదటిసారి ఆయన రెండు అడుగుల ఎత్తున్న చిన్న విగ్ర హంతో వించుర్కర్ వాడలోని ఒక ఇంటి ఆవరణలోనే వాటిని నిర్వహించారు. తరువాత వాటిని ఆయన తనుండే కేసరివాడకు మార్చారు. అక్కడ ఆ ఉత్సవాలు నేటికీ కొన సాగుతున్నాయి. తిలక్ ప్రారంభించిన తర్వాత రెండేళ్లకు ముంబైలోని కేశవ్జీనాయక్ చాల్లో మొదటిసారిగా బహిరంగ సార్వత్రిక గణేశ ఉత్సవాలను నిర్వహించారు. అయితే అది కూడా రోడ్డు పక్కనో లేదా రోడ్లులోని ఒక భాగాన్ని మొత్తంగా మూసేసో నిర్వహించలేదు (రోడ్లను మూసేసి ఈ ఉత్సవా లను నిర్వహించడం మహారాష్ట్రకే పరిమితం కాదు). ఆ విగ్రహం కూడా కేసరివాడలో వలే చిన్నదే. గత మూడు దశా బ్దాలలో ఈ బహిరంగ ఉత్సవాల నిర్వహణ చాలా ప్రాంతా లకు... అక్షరాలా పాటలు, డాన్సులతో సహా విస్తరించింది. ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా మూడు వారాలుంది. విగ్రహాలు, పందిళ్లకు సన్నాహాలు, పందిళ్లు వేయడానికి అనుమతులు లేదా పౌర పాలనా సంస్థల నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండానే జరుపుకోడానికి సంబంధించిన ఆదేశాల గురించే అంతా మాట్లాడుకుంటు న్నారు. నియంత్రితమైన ఈ అరాచకానికి సంబంధించిన ఆదేశాల ఉల్లంఘనలకు గత ఏడాది జరిమానాలు విధించారు. పౌర పరిపాలనా సంస్థలు నిస్సహాయమైన రోడ్లను లక్ష్యం చేసుకున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పట్టణాలు, నగరాల లోని రోడ్లు సిగ్గుపడాల్సినవిగానే ఉన్నాయి. వ్యోమగాములు వీటినిచూస్తే పెద్ద చంద్ర బిలాలని అనుకోవచ్చున నే వాడుకలో ఉన్న నానుడి అర్థం చేసుకోదగినదే. పట్టణ ప్రాంతాల్లోని సందులు గొందుల్లోని గోతుల వల్ల తెచ్చేట ప్పుడు, నిమజ్జనానికి తరలించేటప్పుడు విగ్రహాలకు ఏ హాని జరుగుతుందోనని ఉత్సవ నిర్వాహకులకు భయం. రోడ్లను సక్రమంగా సరిదిద్దమని ఉత్సవ నిర్వాహకుల సమాఖ్య పౌర పరిపాలనా సంస్థలకు హెచ్చరికను జారీ చేసింది. అలాగేనని అవి వాగ్దానం చేయనూ చేశాయి, తమకు చేతనైనంత బాగా రోడ్ల మీద గోతులను పూడ్చడమూ చేశాయి. అనివార్యంగా వచ్చే వానలే ఆ పనులను ఎంత అధ్వానంగా చేశారో వివరించాయి. రోడ్లలా ఎందుకు అధ్వానంగా మారాయనేదానికి ఎవరివద్దా సమాధానం లేదు. ఆ పనుల ద్వారా దండిగా డబ్బు చేసుకున్న కాంట్రా క్టర్లూ, పౌర పరిపాలనా సంస్థలలో వారితో కుమ్మక్కయిన వారూ లోలోపలే నవ్వుకుంటూ ఉంటారు. రోడ్ల దుస్థితిపై వెల్లువెత్తే ఆగ్రహం గురించి పౌర పరిపాలనా సంస్థలు కోర్టు ఆదేశాలు వెలువడక ముందే దిద్దుబాటు కృషి చేయాల్సింది. మత స్వేచ్ఛ అంటే సరైన రోడ్లు, పందిళ్లు దురాక్రమణలోని ఫుట్‌పాత్‌ల వంటి మౌలిక సదుపాయాలను పౌరులకు నిరాకరించడం కాదని బొంబాయి హెకోర్టు ఉత్తర్వులను జారీ చేయడంతో ఈసారి పౌర పరిపాలనా సంస్థలు ఆ పనిని చేపట్టాల్సి వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే, పౌరులకు ఇబ్బంది కలిగించే గణపతి, ఉట్లు కొట్టడం(గోకులాష్టమి), దేవీనవరాత్రి వంటి బహిరంగ మత కార్యక్రమాలను రోడ్ల మీద జరపకుండా ఉండాలని, ఇలాంటివి తగ్గేలా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ముస్లింలను ప్రార్థనకు ఆహ్వానించే ఆజాన్‌ను లౌడ్ స్పీకర్ల ద్వారానే జరపాలనే మత నిబంధన ఏదీ లేదని కూడా అది చెప్పింది. ఇవి కేవలం ముఖ్యమైనవి మాత్రమే కాదు, మైలురాళ్ల వంటి న్యాయ ప్రకటనలు. అయితే రాజ కీయవేత్తలు అప్పుడే కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గుస గుసలాడటం మొదలెట్టారు. గణపతిని వారు తిరిగి ప్రాంగణాలలోకి తరలించ డానికి సిద్ధంగా లేరు. ఈ ఉత్సవాల్లో మతం తక్కువ తుళ్లిం తలు, కేరింతలు ఎక్కువ కావడం మాత్రమే ఇందుకు కార ణం కాదు. నాకు తెలిసి నామ మాత్రపు పూజ తదుపరి మహిళల క్యాట్‌వాక్ (ఫ్యాషన్ షో)ను నిర్వహించే పందిరి కనీసం ఒకటుంది! మించి గణపతి పందిళ్లు భారీ రాజ కీయ వేదిక కావడమే వారిగుసగుసలకు కారణం. రాజకీయవే త్తలు వాటికి నిధులను సమకూర్చాలి లేకపోతే చోటామోటా నేతలు తమకున్న తక్కువ పలుకుబడితో చందాలను సేక రిస్తారు. ఇది ఇకెంత మాత్రమూ లోకమాన్య గంగాధర్ తిలక్ భావనీకరించిన, సృష్టించిన వేదిక కాదు. పూర్తిగా దాన్ని భ్రష్టుపట్టించినది. ఆయన రోజులోన్లి వాడల లోపలుండే ఈ పందిళ్లలో బహిరంగంగా విద్యగరపడం సైతం ఉండేది. నేడు అంత పెద్ద ఆవరణలు అందుబాటులో లేవు. రోడ్ల దురాక్రమణలను అరికట్టే ప్రత్యామ్నాయంగా మైదానాలు, హాళ్లు ఉపయోగ పడతాయి. అయితే కాస్త లెక్కలోకి వచ్చే నేతలెవరూ లేదా కావా లని కోరుకునే వారెవరూ, రాజకీయపరమైన ఆశలున్న వారె వరూ, చివరకు స్థానిక స్థాయి చోటా నేతలు సైతం ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది తాము తప్పక చేసి తీరాలని వారు భావిస్తారు. గోకులాష్టమికి ఉట్లుకొట్టడమైనా, దేవీ నవరాత్రులకు నిర్వహించే గర్బా నృత్యగాన వేడుకలైనా అంతే. రివాజుగా సాగే ఈ వ్యవహారంలో ఏదైనా లోపించిం దంటే అది ఒక్క భక్తే. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
ఉండ్రాళ్లయ్యా.. వీడ్కోలయ్యా..
సాక్షి, హైదరాబాద్: ముంబై తర్వాత అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలు జరిగే హైదరాబాద్‌లో వినాయకుడి శోభాయాత్ర ఆదివారం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు గణపతి విగ్రహాల వెంట తరలి రావడంతో మహానగర రహదారులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ‘గణపతి బప్పా మోరియా...ఆదా లడ్డూ ఖాలియా’ నినాదాలతో భక్తిమయ వాతావరణం నెలకొంది. హుస్సేన్‌సాగర్, సఫిల్‌గూడ, సరూర్‌నగర్ చెరువులతో పాటు 9 పెద్ద, 30 చిన్న చెరువుల్లో గణేశ్ నిమజ్జనం పోలీసుల పర్యవేక్షణలో భక్తుల సహకారంతో సాఫీగా సాగుతోంది. ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గంతో పాటు ఇతర మార్గాల నుంచి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కు గణపతులతో వేలాది వాహనాలు తరలివచ్చాయి. వేలాది గణపయ్యల రాకతో హుస్సేన్ సాగర్ తీరం పులకించి పోయింది. ‘జై జై గణేశా.. బై బై గణేశా’ అంటూ పిల్లలు, యువతులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వేలాది సంఖ్యలో విగ్రహాలు ఉండటంతో నిమజ్జనం కార్యక్రమం సోమవారం సాయంత్రం వరకూ కొనసాగొచ్చని పేర్కొన్నారు. భద్రత కట్టుదిట్టం.. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 30 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గంతో పాటు ఇతర మార్గాల్లో సీసీటీవీ కెమెరాలతో అనుక్షణం నిఘా పెట్టారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. నేతల సందడి.. శోభాయాత్రలో వివిధ పార్టీల నాయకులు సందడి చేశారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేశ్ ఊరేగింపులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ పాల్గొన్నారు. దేశం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోందని, స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు దేశమంతా జరుపుకోవడం సంతోషంగా ఉందని వెంకయ్య పేర్కొన్నారు. ఆలస్యంగా మొదలైన యాత్ర.. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యం గా కనిపించాయి. ఆ తర్వాతే విగ్రహాల ఊరేగింపు సందడి కనిపించింది. ఎప్పుడూ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే బాలాపూర్ గణపతి యాత్ర ఈసారి ఆలస్యం గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్షగణపతిని సోమవారం సాయంత్రంలోగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం అర్ధరాత్రి వరకు భక్తులకు అనుమతిచ్చారు. ఖైరతాబాద్ గణేశుని చేతిలోని లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న భక్తులకు పంచిపెట్టనున్నారు. కూకట్పల్లి లడ్డూకు రూ.15 లక్షలు హైదరాబాద్ కూకట్పల్లి అడ్డగుట్ట లడ్డూకు ఈసారి అత్యధికంగా రూ.15 లక్షలు పలికింది. ఏటా అత్యధిక ధర పలికే బాలాపూర్ లడ్డూను వెనక్కి నెట్టి మొదటి స్థానం లో నిలవడం విశేషం. కూకట్పల్లి లడ్డూను వ్యాపారవేత్త నల్లమిల్లి జనార్దన్‌రెడి దక్కిం చుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో వెంగళరావునగర్ కాలనీలోని మధురానగర్‌లోని గణేశ్ లడ్డూ రూ.10.4లక్షలు పలికింది. సాయిసుఫల కన్స్ట్రక్షన్స్, సాయితేజ కన్ స్ట్రక్షన్స్ అధినేతలు భాస్కర్‌రావు, శ్రీనివాసరావు దక్కిం చుకున్నారు. బాలాపూర్ లడ్డూను ఈసారి రూ.10.32 లక్షలకు స్థానికుడు కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. -
గణేష్ ఉత్సవాలను నిర్లక్ష్యం చేస్తున్న సీఎం
-
ఉత్సవాలకు కంట్రోల్‌రూం
హైదరాబాద్(యాకుత్‌పురా): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూంను సర్ధార్ మహాల్ జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో, పోలీసు విభాగాలతో జాయింట్ చేసినట్టు చెప్పారు. రౌండ్ ది క్లాక్‌లో కొనసాగే ఈ కంట్రోల్ రూమ్‌లో అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తినా కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందిస్తారన్నారు. సమస్యలపై 040-24500254లో సంప్రదించాలన్నారు. -
సోషల్ వెబ్సైట్లపై కన్నేసి ఉంచండి: నరసింహన్
* సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయండి * యువతకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి * పోలీసు అధికారులకు స్పష్టం చేసిన గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: ఆసియాతో పాటు భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు అల్‌కాయిదా నేత అల్ జవహరి ప్రకటనతో కూడిన వీడియో విడుదల కావడం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరేందుకు వెళ్తూ హైదరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు కోల్‌కతాలో పట్టుపడటం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత అప్రమత్తంగా ఉంటూ అన్ని ముందు జాగ్రత్త చర్యల్నీ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ సలహాదారులు ఏకే మహంతి, శర్మలతో పాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, రెండు రాష్ట్రాల నిఘా విభాగం అధిపతులు, హైదరాబాద్-సైబరాబాద్ కమిషనర్లతో పాటు కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్త డెరైక్టర్ పాల్గొన్నారు. తాజా పరిణామాలతో పాటు రాజధానిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలపై నిఘా వేసి ఉంచేందుకు నిఘా విభాగంలో ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో యువతతో పాటు వారి తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కోణంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, నిఘా విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమరుపాటుకు తావిచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అల్‌కాయిదా, ఐఎస్ఐఎస్ల కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకునే ముందు జాగ్రత్త చర్యల్ని రెండు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు నరసింహన్‌కు వివరించారు. -
తిరుపతిలో ముత్యాల వినాయకుడు
-
బీజేపీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు
-
స్పెషల్ డైవ్ - జై..జై..గణేశా...
-
వినాయకచవితి వేడుకల్లో అపశృతి
-
జై... జై...గణేశా...
-
తొలిపూజ చేసిన గవర్నర్ దంపతులు
-
ఖైరతాబాద్‌లో కొలువైన భారీ లంభోదరుడు
-
గణేష్ మహోత్సవం ఎఫెక్ట్
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముంబై-గోవా జాతీయ రహదారిపై భారీ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజలు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుని తిరిగి ముంబైకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణ శాఖ తెలిపింది. గణేష్ ఉత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై భారీ ట్రక్కులు, ట్రెయిలర్లు, కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు తదితర భారీ వాహనాలను నిషేధించనున్నారు. మళ్లీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీన్ని బట్టి ఈ రహదారిపై ప్రయాణికుల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే పాలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు తరలించే భారీ వాహనాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. ముంబై-గోవా రహదారిపై సాధారణ రోజుల్లోనే విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది. గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే రెగ్యూలర్ సర్వీస్‌లతో పాటు ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల బుకింగులు ఫుల్ అయ్యాయి. ఇక జీపు, కార్లు, టాటా సుమోలు, క్వాలిస్, బస్సు లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం మిగిలిపోయింది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముంబై-గోవా రహదారిపై ప్రయాణికులను చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఏటా ఉత్సవాలకు ముందు, ముగిసిన తరువాత కొన్ని నిర్ధేశించిన రోజుల్లో భారీ వాహనాలకు నిషేధం విధిస్తారు. గతంలో ఉత్సవాల సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. రోడ్డు ప్రమాదాలవల్ల రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో మిగతా వారు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గత పదేళ్ల నుంచి ఉత్సవాల సమయంలో ఆర్టీఓ అధికారులు ఈ రహదారిపై భారీ వాహనాలను నిషేధిస్తూ వస్తున్నారు. -
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ రైలు
సాక్షి, ముంబై: కొంకణ్ ప్రయాణికులకు గణేష్ ఉత్సవాల సమయంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు నడపాలా... వద్దా... అనే దానిపై కొద్ది రోజులుగా సెంట్రల్ రైల్వే, చీఫ్ సేఫ్టీ కమిషనర్ల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో గణేశ్ ఉత్సవాల సమయంలో స్పెషల్ ట్రెయిన్‌గా నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతినిచ్చారు. వారానికి మూడు సార్లు మాత్రమే ఈ రైలు నడపనున్నారు. ఈ రైలు లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి బయలుదేరి కొంకణ్ రీజియన్‌లోని కర్మాళి వరకు పరుగులు తీయనుంది. ప్రతీ బోగీలో 120 మంది వరకు కూర్చోవచ్చు. ఇందులో బెర్తులు ఉండవు. ఉదయం ఐదు గంటలకు కుర్లా టెర్మినస్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు కర్మాళి చేరుకుంటుంది. ఇదిలాఉండగా, ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును కొంకణ్ రైల్వే మార్గంపై నడిపే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ ఏసీ రైలు భోపాల్-నవీ ఢిల్లీల మధ్య నడుస్తోంది. అందులోని 10 బోగీలను సెంట్రల్ రైల్వే తీసుకుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసి కొంకణ్ రైల్వే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మార్గం అత్యధిక శాతం కొండ ప్రాంతం మీదుగా ఉంది. అనేక సొరంగాలు, ఎత్తై వంతెనలు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఇది సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ జారీచేసే సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా, గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. అందుకు రైల్వే శాఖ అదనంగా రైళ్లు నడుపుతుంది. ఎమ్మెస్సార్టీసీ కూడా తమవంతుగా అదనపు బస్సులు నడుపుతుంది. అయినప్పటికీ అవి ఎటూ సరిపోవు. ఉత్సవాల సమయంలో రెగ్యూలర్‌గా నడిచే రైళ్లతోపాటు స్పెషల్ ట్రెయిన్లకు కూడా రిజర్వేషన్ బుకింగ్ రెండు నెలల ముందే పూర్తయిపోయాయి. దీన్నిబట్టి ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్సవాల సమయంలో నడిపే ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు మంచి స్పందన లభిస్తుందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘గణనాథుడి’కి గాలం
సాక్షి, ముంబై: ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిధుల కోసం సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విరాళాల కోసం తమ మండళ్ల పరిధిలో ఉన్న ఇళ్లు, షాపుల చుట్టూ తిరగనవసరం అంతకంటే లేదు. శాసనసభ ఎన్నికల పుణ్యమా... అని ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక మంది ప్రజా ప్రతినిధులు విరాళాలు అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో మండళ్లకు ఈ ఏడాది నిథుల కొరత ఉండదని స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఉత్సవాలు ఇదొక్కటే. అన్ని రోజుల పాటు నిర్వహణ అనేది ఆషామాషీ వ్యవహారంకాదు. ముంబై లాంటి మహానగరంలో వందలాది సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. వేదిక, అలంకరణ, విగ్రహ ఏర్పాటు వంటి పనుల్లో తామే ముందుండాలని పోటీ పడతారు. అందుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తారు. కొన్ని మండళ్లయితే రూ. కోట్లలో ఖర్చు చేస్తాయి. ఈ మండళ్లు తమ పరిధిలోని ఇళ్లు, వ్యాపారులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తాయి. అదేవిధంగా రాజకీయ పార్టీల బ్యానర్లు, వివిధ సంస్థల ప్రకటనల బోర్డుల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. కాని ఈ విరాళాలు కూడా ఎటూ సరిపోవు. దీంతో ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమోనని మండళి పదాధికారులు గాలిస్తారు. కాగా ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గణేష్ మండళ్ల ప్రవేశ ద్వారాలు, బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటుపై కొన్ని ఆంక్షలు విధించడంతో వాటి ఆదాయానికి కొంత గండిపడింది. కాని ఈసారి సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 29న వినాయక చవితి ఉండడంతో మండ ళ్లకు కలిసివస్తోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రజా ప్రతినిధులు స్థానిక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లను ఆశ్రయిస్తున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిథులు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి భారీ అలంకరణ, ఎత్తై విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రఖ్యాతిగాంచిన లాల్బాగ్, కరీరోడ్ ప్రాంతంలో మండళ్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడి సార్వజనిక గణేశ్ మండళ్ల పదాధికారులతో కొందరు రాజకీయ నాయకులు భేటీ అయ్యారు. కొందరు ఉత్సవాల పూర్తి ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించగా మరికొందరు అలంకరణ, లడ్డూ ప్రసాదం, విద్యుత్ దీపాల ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు. మరికొందరు గణేశ్ ఉత్సవాలతోపాటు ఈ సంవత్సరం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు ఓ మండలి పదాధికారి చెప్పారు. ఇదే పరిస్థితి గిర్గావ్, దాదర్, విలేపార్లే, అంధేరీ, భాండూప్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఉంది. అయితే విరాళాలు అందజేసినట్లు ఎక్కడ తమ పార్టీ పేరుగాని, ప్రజాప్రతినిధి పేరుగాని బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ ఏడాది శాసన సభ ఎన్నికల కారణంగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లకు భారీగా విరాళాలు రావడం ఖాయమని స్పష్టమైంది. -
ఆర్టీసీకి ‘చవితి’ ఆదాయం రూ. 6.5 కోట్లు
సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెమ్మార్టీసీ)పై వినాయకుడు చల్లని చూపు చూసినట్లు తెలుస్తోంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా అదనంగా నడిపిన బస్సుల వల్ల ఆర్టీసీకి ఏకంగా రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఏటా గణేశ్ ఉత్సవాల సమయంలో ముంబై, ఠాణే నుంచి లక్షలాది మంది కొంకణ్ వాసులు తమ స్వగ్రామాలకు తరలివెళతారు. పెరిగిన రద్దీని దష్టిలో ఉంచుకుని దాదాపు 12 రోజులపాటు కొంకణ్ రైల్వే విభాగం 60 ప్రత్యేక రైళ్లు నడపగా, ఆర్టీసీ అదనంగా రెండు వేల బస్సులు నడిపింది. అయినప్పటికీ ఇవి ఎటూ చాలలేదు. దీంతో ఠాణే, ముంబైలో ఉంటున్న కొంకణ్ వాసులు స్వగ్రామాలకు వెళ్లాలంటే ఉత్సవాల సమయంలో ప్రైవేటు బస్సులు, సుమోలు, కార్లు తదితర వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. ప్రయాణికుల అవసరాల బట్టి ప్రై వేటు వాహన యజమానులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడంతో కొందరు నిలబడైనా సరే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం మంచిదనుకున్నారు. దీంతో ఆర్టీసీ ఖజానాలోకి రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చి చేరింది. ముంబై, ఠాణే నుంచి బయలుదేరిన బస్సుల ద్వారా రూ.నాలుగు కోట్లు, తిరుగు ప్రయాణంలో రూ. రెండున్నర కోట్లు వచ్చాయని ఆర్టీసీ రీజినల్ మేనేజరు రాహుల్ తోరో చెప్పారు.