
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కుమారుడు ముంబైకి వచ్చేశాడు

తన పెదనాన్న, క్రికెటర్ కృనాల్ పాండ్యా ఇంట్లో గణనాథుని సేవలో తరించాడు

ఇందుకు సంబంధించిన వీడియోను కృనాల్ భార్య పాంఖురి శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది

తమ కుమారులు కవిర్, వాయుతో పాటు అగస్త్యను కూడా పూజలో భాగం చేశారు

అయితే, ఈ వీడియోలో అగస్త్య తండ్రి హార్దిక్ పాండ్యా మాత్రం మిస్సయ్యాడు

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా కొన్నాళ్ల పాటు విహారయాత్ర చేశాడు

సెలవులు ముగించుకుని ఇటీవలే మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు

ఇందుకోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు

హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌ల కుమారుడే అగస్త్య

ఇటీవలే తాము విడాకులు తీసుకుంటున్నట్లు హార్దిక్- నటాషా ప్రకటించారు

ఈ క్రమంలో అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది

అయితే, కొన్ని రోజులు క్రితం మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిన నటాషా.. అగస్త్యను హార్దిక్ పాండ్యా ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది.

ఇక హార్దిక్ పాండ్యా వచ్చే నెల బంగ్లాదేశ్‌తో మొదలుకానున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.









