హైదరాబాద్(యాకుత్‌పురా): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూంను సర్ధార్ మహాల్ జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో, పోలీసు విభాగాలతో జాయింట్ చేసినట్టు చెప్పారు.
రౌండ్ ది క్లాక్‌లో కొనసాగే ఈ కంట్రోల్ రూమ్‌లో అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తినా కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందిస్తారన్నారు. సమస్యలపై 040-24500254లో సంప్రదించాలన్నారు.
ఉత్సవాలకు కంట్రోల్‌రూం
Published Wed, Sep 16 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement