గణపతి ఊరేగింపు
పార్వతీపురం: పట్టణంలో బుధ, గురువారాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. నవరాత్రులు ముగియడంతో జగన్నాథపురం, మున్సిపల్ కూరగాయల మార్కెట్, మెయిన్ రోడ్డు, కొత్తవలస, రాయగడ రోడ్డు తదితర ప్రాంతాల ఉత్సవ కమిటీలు విగ్రహాలను డప్పు వాయిద్యాలు, డీజే మ్యూజిక్‌లు, పులి వేషాలు, తప్పిటగుళ్లు, బళ్ల వేషాల మధ్య నిమజ్జనాలు నిర్వహించారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా కుర్రకారు హుషారుగా నర్తిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కంగటి వీధిలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో, జగన్నాథపురం, మెయిన్ రోడ్డు, బెలగాం తదితర ప్రాంతాల్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదానం నిర్వహించాయి. కార్యక్రమంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యిండుపూరు గోపి మాట్లాడారు.