న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గ్రామీ ణ ఉపాధి హామీ పథకం సవరించిన వేతనాలు రాష్ట్రాల ప్రభుత్వాలను సందిగ్ధంలో పడేశాయి. రాష్ట్రాలు నిర్ణయించిన కనీస వేతనాలతో పోలిస్తే కేంద్రం కొత్తగా ప్రకటించిన ఉపాధి వేతనాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయిం చిన కనీస వేతనాలు రూ.197. ఉపాధి హామీ పనుల వేతనాలు మాత్రం రూ.181. బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దక్షిణాది ప్రాంతాల్లో గణనీయంగా పెరగ్గా.. తూర్పు రాష్ట్రాల్లో తగ్గాయి. ఏపీలో రూ.180 నుంచి రూ.194 కు పెరగ్గా, కర్ణాటకలో రూ.204 నుంచి రూ.224కు పెరిగాయి.