సాక్షి, రాజస్థాన్ : రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును శుక్రవారం ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పన్నెండేళ్లు అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా పద్నాలుగేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, లేదా 20 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా చనిపోయే వరకు జైల్లోనే ఉంచేందుకు అవకాశం కల్పించారు. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ ఈ బిల్లును (క్రిమినల్ లా బిల్లు-2018) ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత ఇలా ప్రత్యేకంగా చట్టం చేసింది తాజగా రాజస్థానే. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment