minor rape
-
ఉజ్జయిని కేసు: నిందితుడు తప్పించుకునే ప్రయత్నం
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని బాలిక రేప్ కేసులో నిందితుడు భరత్ సోనిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆధారాలు సేకరించేందుకు సంఘటన స్థలానికి నిందితుడిని తీసుకుని వెళ్లగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని అప్రమత్తమై పోలీసులు అతడిని పట్టుకున్నట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో బాలిక దుస్తులతోపాటు ఇతర ఆధారాలను సేకరించే క్రమంలో నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లగా అదే అదనుగా భావించి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని ఈ ప్రయత్నంలో అతడి సిమెంట్ రోడ్డుపై పడిపోవాడంతో మోకాళ్ళకు, కాళ్లకు గాయాలు కూడా అయ్యాయన్నారు. సర్జరీ తర్వాత ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు. ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాగానే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అక్కడి ఆటో డ్రైవర్లను విచారించి భరత్ సోనీని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పదిహేనేళ్ల బాలిక దుస్తులు లేకుండా రక్తం కార్చుకుంటూ దయనీయ స్థితిలో ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. కనిపించిన వారందరినీ సాయమడుగుతూ చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. #WATCH | Ujjain minor rape case: Ujjain SP Sachin Sharma says, "There is an accused in the rape case. There is another auto driver against whom a case will be registered for not informing the police about the incident. When we were taking (the accused) for recreation of the crime… pic.twitter.com/6x3AggXxqq — ANI (@ANI) September 28, 2023 ఇది కూడా చదవండి: బస్సులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి -
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
దారుణం.. తొమ్మిదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలలపాటు..
రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌లుగా గుర్తించారు. మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఏప్రిల్ 20న బాలిక మార్కెట్ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి... -
లైంగిక దాడి చేస్తే ఇక ఉరే
సాక్షి, రాజస్థాన్ : రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష విధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును శుక్రవారం ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం పన్నెండేళ్లు అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా పద్నాలుగేళ్లకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష, లేదా 20 సంవత్సరాల యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా చనిపోయే వరకు జైల్లోనే ఉంచేందుకు అవకాశం కల్పించారు. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ ఈ బిల్లును (క్రిమినల్ లా బిల్లు-2018) ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దేశంలో మధ్యప్రదేశ్ తర్వాత ఇలా ప్రత్యేకంగా చట్టం చేసింది తాజగా రాజస్థానే. మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. -
రేపిస్ట్‌ను కొట్టి చంపిన గ్రామస్తులు
అలీఘఢ్(యూపీ) : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘఢ్‌లో చోటుచేసుకుంది. చిన్నారిని రక్షించడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో.. గ్రామస్తులే నిందితున్ని పట్టుకొని చితకొట్టారు. తీవ్రగాయాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు... అలీఘఢ్‌లోని బన్నా దేవి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిని బిహార్‌లోని బదౌన్‌కు చెందిన అర్వింద్ అకా కిడ్నాప్ చేశాడు. బాలిక ఇంటి సమీపంలోనే అర్వింద్ పని చేసేవాడు. మంగళవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలిసిన వారిని విచారించగా, అర్వింద్ బాలికను తీసుకువెళ్తుండగా తాము చూశామని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు సమయానికి స్పందించలేదు. దీంతో గ్రామస్తులే జట్లుగా ఏర్పడి గాలించి అర్వింద్‌ను పట్టుకున్నారు. చిన్నారిని బికామ్పుర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు గ్రామస్తులకు అర్వింద్ తెలిపాడు. తన పేరు ఎక్కడ బయటపెడుతుందో అని బయపడి చిన్నారి గొంతునులిమి హత్య చేసినట్టు గ్రామస్తులకు చెప్పాడు. అనంతరం అర్వింద్ చెప్పిన స్థలంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడ చిన్నారి మృతదేహాన్ని చూసిన గ్రామస్తుల కోపం కట్టలు తెంచుకోవడంతో.. అర్వింద్‌పై మూకమ్మడిగా దాడి చేశారు. అదే సమయానికి పోలీసులు వచ్చి తీవ్రగాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్వింద్ మృతిచెందాడు. పోలీసులు విచారణ ప్రారంభించారు. -
రేప్ చేయడానికి వెయ్యి మైళ్లు ప్రయాణం..!
వార్విక్ షైర్: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. న్యూడ్ ఫొటోలను వెబ్ సైట్ లో పెడతాను, స్నేహితులకు ఇస్తానంటూ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... నిందితుడు మార్క్ గ్రీనల్(26) లివర్ పూల్ లో ఉండేవాడు. అతడికి ఫేస్ బుక్ ద్వారా నూనిటాన్ లో ఉండే స్కూలు విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ఆపై రెగ్యూలర్ గా చాటింగ్ చేసేవారు. తన మాయమాటలతో నమ్మించి టాప్ లెస్ ఫొటోలు, న్యూడ్ ఫోటోలను మెయిల్ ద్వారా సంపాదించాడు. బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఆయుధంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. తనతో సెక్స్ చేయాలని బాలికను చాటింగ్ లో అడిగితే అందుకు మైనర్ బాలిక నిరాకరించింది. బాలిక పంపిన న్యూడ్ ఫొటోలను ఓ వెబ్ సైట్ లో పోస్ట్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి బాలికకు పంపించాడు. దీంతో కంగారు పడిన బాలిక అతడు చెప్పిన పనికి ఒప్పుకుంది. నూనిటాన్ లోని బెర్ముడా పార్కు హోటల్ లో రూమ్ లో కలుస్తానని చెప్పాడు. లివర్ పూల్ ఉన్న గ్రీనల్ దాదాపు 1000 మైళ్లకు పైగా ప్రయాణించి నూనిటాన్ చేరుకున్నాడు. హోటల్ రూములో బాలికపై బలవంతంగా రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకేం తెలియందన్నట్లుగా తాను ఉంటున్న లివర్ పూల్ కు వెళ్లిపోయాడు. మైనర్ బాలికకు ఫేస్ బుక్ లో గ్రీనల్ పంపించిన సందేశాలను ఆమె తల్లి చూసింది. కూతుర్ని ఆ దుర్మార్గుడు బ్లాక్ మెయిల్ చేసి రేప్ చేశాడని తెలుసుకుని ఆవేశానికి లోనైంది. గ్రీనల్ పై ఫిర్యాదుచేయగా, పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా గ్రీనల్ తాను తప్పుచేసినట్లు ప్రాధేయపడ్డాడు. బెయిల్ పై తనను విడుదల చేయాలని ప్రార్థించగా అతడి పిటీషన్ ను కోర్టు కొట్టిపారేసింది. ఇంగ్లండ్ లోని వార్విక్ క్రౌన్ కోర్టులో కేసు విచారణను నెలాఖరుకు వాయిదా వేశారు.