Madhya Pradesh Rape Convict Released From Jail Commits Same Crime On Another Minor - Sakshi
Sakshi News home page

Madhya Pradesh Crime: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. 

Published Thu, Aug 17 2023 3:39 PM | Last Updated on Thu, Aug 17 2023 4:00 PM

Madhya Pradesh Rape Convict Released From Jail Commits Same Crime - Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్‌లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. 

బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. 

ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement