jail term
-
హిందూజ గ్రూప్ ఫ్యామిలీకి జైలు శిక్ష.. అంతా ఉత్తదే!
హిందూజా కుటుంబానికి ఎటువంటి జైలు శిక్ష పడలేదని వారికి సంబంధించిన అధికార ప్రతినిధి తెలిపారు. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్, కోడలు నమ్రత తమ జెనీవా నివాసంలో పనిచేసే భారతీయ వలసదారు సిబ్బందిని వేధించారంటూ స్విస్ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులను జైల్లో పెట్టలేదని, వారిపై మానవ అక్రమ రవాణా అభియోగాలను కోర్టు కొట్టివేసినట్లు హిందూజా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విస్ పౌరులైన హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కమల్, ప్రకాశ్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలకు ఎలాంటి జైలుశిక్ష, నిర్బంధం విధించలేదు’ అని పేర్కొన్నారు.మిగిలిన అభియోగాల్లో దిగువ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో తాము అపీల్ చేసినట్లు హిందూజా ప్రతినిధి తెలిపారు. "స్విస్ చట్టాల ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చేంత వరకు నిర్దోషిత్వ భావన చాలా ముఖ్యమైనది కాబట్టి దిగువ కోర్టు తీర్పు పనిచేయదు" అని వివరించారు. తమకు అర్థం కాని స్టేట్ మెంట్లపై సంతకాలు చేయించారని బాధిత సిబ్బంది కోర్టులో ప్రకటించారని, హిందుజా కుటుంబం తమను గౌరవంగా, హుందాగా, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారంతా సాక్ష్యం చెప్పారని వివరించారు. స్విస్ న్యాయ ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు. -
హిందూజా కుటుంబానికి జైలు శిక్ష
సిబ్బందని వేధింపులకు గురి చేసిన కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు స్విస్ కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజాలకు చెరో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు, వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ జెనీవాలోని ప్రిసైడింగ్ జడ్జి తీర్పు చెప్పారు.బ్రిటన్‌లో రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న హిందూజా కుటుంబం జెనీవాలోని తమ నివాసంలో పనిచేయించుకునేందుకు స్వదేశమైన భారత్ నుంచి పనివాళ్లను రప్పించుకుని వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వచ్చిన వీరికి హిందుజా కుటుంబం చాలా తక్కువ జీతం చెల్లించారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ప్రాసిక్యూటర్లు వాదించారు.ఈ ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. 78, 75 ఏళ్ల వయసున్న ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా అనారోగ్య కారణాల రీత్యా విచారణ ప్రారంభమైనప్పటి గైర్హాజరయ్యారు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపినప్పటికీ ఇతర అభియోగాలపై దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్షలు విధించింది. -
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్, పదేళ్ల జైలు, భారీ జరిమానా
Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ టర్న్డ్ పొలిటీషియన్,మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్ తగిలింది. ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. 2009 గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు, సోనూ యాదవ్‌ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్ తెలిపారు. 2009లో కపిల్ దేవ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్‌లోని కరంద పోలీస్ స్టేషన్లో ముఖ్తార్‌పై గ్యాంగ్‌స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. #WATCH | Ghazipur additional district government counsel (criminal) Neeraj Srivastava says, "A case was registered against Mukhtar Ansari and his aide Sonu Yadav in 2010. In connection with that case, both the accused were pronounced guilty yesterday and today arguments on the… https://t.co/hVsOHFXn9a pic.twitter.com/fK2QZq71Ii — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 27, 2023 -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాట్నాకు చెందిన ఓ దుర్మార్గుడు రాకేష్ వర్మ(35) చేసిన నేరమే మళ్ళీ చేసి తానొక మానవ మృగాన్నని నిరూపించుకుని కటకటాల పాలయ్యాడు. గతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను స్థానికంగా ఒక ఆసుపత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర సింగ్ చోహాన్ తెలిపిన వివరాల ప్రకారం సాట్నా జిల్లాలోని కృష్ణా నగర్లో నివాసముండే రాకేష్ వర్మ పన్నెండేళ్ల క్రితం నాలుగున్నరేళ్ల వయసున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ నేరానికి అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఏడు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన రాకేష్ వర్మ ఏడాదిన్నర క్రితమే జైల్లో సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జగత్ దేవ్ తాలిబ్ ప్రాంతం నుండి ఓ మైనర్ బాలికను లాలిస్తున్నట్లు నటించి అపహరించుకుపోయాడు. మాకు విషయం తెలిసిన తర్వాత గాలింపు చేపట్టగా బాలిక రేప్ కు గురైందని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రాధమిక చికిత్స అనంతరం మైనర్ బాలికను రేవాకు తరలించగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. ఇది కూడా చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం.. -
నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులో నిందితులను యాంత్రికంగా, అనవసరంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని హైకోర్టులకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించింది. వైవాహిక వివాదానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అష్పాక్ అలామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. -
Ales Bialiatski: చెరసాలలో శాంతి కపోతం
అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు ఊహించినట్లే జరిగింది. దేశంలో కల్లోలానికి కారకుడంటూ మానవ హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అలెస్ బియాలియాట్ స్కీ(60)కు పదేళ్ల జైలు శిక్ష విధించింది బెలారస్ న్యాయస్థానం. 2020లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు అలెస్.. ఆర్థిక సహకారం అందించాడని, తద్వారా ఇతర నేరాలకూ కారకుడయ్యాని ప్రభుత్వం మోపిన అభియోగాలను ధృవీకరించింది కోర్టు. అంతేకాదు ఆ సమయంలో అరెస్టయిన వాళ్లకు న్యాయపరమైన సాయం కూడా అందించాడని నిర్ధారించుకుని.. శుక్రవారం ఆయనకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. ► బియాలియాట్ స్కీ.. వియాస్నా మానవ హక్కుల సంఘం సహ వ్యవస్థాపకుడు. శాంతియుత పోరాటాలు నిర్వహిస్తుంది ఈ సంస్థ. 2020లో అలెగ్జాండర్ లుకాషెంకో తిరిగి బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నిరసనలకు బియాలియాట్ స్కీ.. ఆయన నిర్వహిస్తున్న ఫౌండేషన్ సూత్రధారి అని, నిరసనకారులకు అన్నివిధాలుగా సహకరించారనేది వెల్లువెత్తిన ఆరోపణలు. దీంతో 2021లో ఆయన్ని, వియాస్నా గ్రూప్‌కు చెందిన మరో ఇద్దరు సహవ్యవస్థాపకులనూ బెలారస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ► ఇదిలా ఉండగానే.. 2021 అక్టోబర్‌లో బియాలియాట్ స్కీకి నోబెల్ శాంతి ప్రైజ్(రష్యా మానవ హక్కుల సంస్థతో పాటు ఉక్రెయిన్‌కు చెందిన సంస్థకు సైతం) వరించింది. ► అలెస్ బియాలియాట్ స్కీ.. మానవ హక్కుల ఉద్యమకారుడే కాదు.. సాహిత్యకారుడు కూడా. స్కూల్ టీచర్‌గా, మ్యూజియం డైరెక్టర్‌గానూ ఆయన పని చేశాడు. 1980 నుంచి బెలారస్లో జరుగుతున్న పలు ఉద్యమాల్లో ఆయన భాగం అవుతూ వస్తున్నారు. ► సోవియట్ యూనియన్ నుంచి బెలారస్ స్వాతంత్రం కోసం ఉద్యమించిన ప్రముఖుల్లో ఈయన కూడా ఉన్నారు. ► 1990లో బెలారస్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 1994లో జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడిగా ఎన్నియ్యాడు. అయితే.. అక్కడ పారదర్శకంగా జరిగిన ఎన్నిక అదొక్కటేనని చెప్తుంటారు మేధావులు. ఆపై దొడ్డిదారిలో ఎన్నికవుతూ.. ఇప్పటికీ ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► లుకాషెంకో.. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు. రష్యా అండతోనే బెలారస్.. పాశ్చాత్య దేశాలపైకి కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉక్రెయిన్ విషయంలోనూ రష్యాకు మద్దతు ఇస్తోంది. ఈ క్రమంలో తమ దేశంలో రష్యా బలగాలకు ఆశ్రయం కల్పిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ► 2020 అలర్లకు సంబంధించి రాజకీయ ఖైదీలకు.. బియాలియాట్ స్కీ బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే.. జైల్లో వాళ్లు ఎదుర్కొన్న వేధింపులను ఒక డాక్యుమెంటరీ ద్వారా బయటి సమాజానికి తెలియజేశారు. ఆ కోపంలోనే బెలారస్ సర్కార్ ఆయనపై పగ పెంచుకుని.. ఇబ్బందిపెడుతోందన్నది అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వాదన. ► బియాలియాట్ స్కీ జైలుకు వెళ్లడం ఇదేం కొత్త కాదు. 2011 నుంచి మూడేళ్లపాటు ఆయన జైలు శిక్ష అనుభవించారు. వియాస్నా గ్రూప్ ఫండింగ్‌కు సంబంధించి పన్నుల ఎగవేత నేరంపై అప్పుడు ఆయన శిక్ష అనుభవించారు. అయితే.. ఆ సమయంలోనూ ఆయన నేరారోపణలను ఖండించారు. ► ఇక 2021లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకుగానూ మరోసారి అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి చెరసాలలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్ట్‌ను మానవ హక్కుల సంఘాలు, బెలారస్ ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బియాలియాట్ అరెస్ట్‌ను ప్రభుత్వ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. మొత్తం 23 మానవ హక్కుల సంఘాలు ఆయనకు సంఘీభావంగా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ► తొలుత 12 ఏళ్ల శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు. అయితే.. కోర్టు మాత్రం పదేళ్ల శిక్ష విధించింది. ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరికి.. ఒకరికి ఏడు, మరొకరికి 9 ఏళ్ల శిక్షలు ఖరారు చేసింది. అఆగే ముగ్గురికి లక్ష నుంచి 3 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. ► బియాలియాట్ స్కీ జైలు శిక్ష తీర్పుపై బయటి దేశాల నుంచే కాదు బెలారస్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వాదప్రతివాదాలు సహేతుకంగా జరగలేదని విమర్శించారు బెలారస్ ప్రతిపక్ష నేత, బహిష్కృత నేత స్వియాట్లానా. మరోవైపు ఆయన అరెస్ట్‌కు ఖండిస్తూ.. సంఘీభావంగా పలు చోట్ల శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. -
కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సీరియస్
-
తెలంగాణ: నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఒకటి ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు జైలు శిక్ష విధించింది హైకోర్టు. అంతేకాదు నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ పోలీసు అధికారుల మీద గతంలో భార్యభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం నిబంధనల మేరకు సీఆర్ పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం మోపబడింది. అయితే.. అప్పీలు వెళ్లేందుకు నాలుగు వారాల జైలు శిక్ష అమలును.. ఆరు వారాల పాటు నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు. -
‘అత్యాచారం జరిగింది 11 నిమిషాలే.. అందుకే శిక్ష తగ్గిస్తున్నాం’
స్విట్జర్లాండ్/బెర్న్: అత్యాచారం.. ఓ బాలిక, యువతి, మహిళ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇలాంటి దారుణ నేరాల్లో న్యాయం జరగడం అటుంచి.. సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని చిత్రవధ చేస్తుంది. వారి పట్ల ఏమాత్రం జాలి, సానుభూతి చూపరు. పైగా నేరం చేసినవాడిని వదిలేసి.. బాధితురాలి ప్రవర్తననే తప్పు పడతారు. వీటన్నింటిని తట్టుకుని కోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. ఇక చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకున్నట్లు. సరిగా ఇలానే ప్రశ్నిస్తున్నారు స్విట్జర్లాండ్ వాసులు. అత్యాచారం వంటి దారుణమైన నేరానికి సంబంధించి మీరు ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. ఆ వివరాలు.. ఓ అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ తీర్పు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దుమ్మెత్తి పోస్తున్నారు. కేసేంటంటే.. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్ని జువైనల్ హోంకి తరలించింది. వివాదాస్పద నిర్ణయం.. తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. ఇక శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసింది.. పైగా అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయి’’ అన్నారు జస్టిస్ హెంజ్. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా నిరసన తెలపుతున్నారు జనాలు. ఈ సదర్భంగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్‌క్లబ్‌కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "Rape ONLY lasted for 11 minutes” 11 minutes of rape feels like 16hrs and the effects/trauma last for generations. https://t.co/DRKgjTTqfA — daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021 -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్‌డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
లాలూ పెరోల్‌పై నేడు నిర్ణయం?
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న పెరోల్ విజ్ఞప్తిపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో జరిగే తన పెద్ద కొడుకు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు అనుమతివ్వాలని లాలూ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తి ఇంకా పరిశీలన దశలోనే ఉందని, గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని జార్ఖండ్ ఐజీ(జైళ్లు) హర్ష మంగ్లా చెప్పారు. -
నరరూప రాక్షసుడికి ఇదే సరైన శిక్ష
వాషింగ్టన్ : సంచలనం సృష్టించిన పెన్సల్వేనియా హైస్కూల్ నరమేధంలో దోషికి ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. అలెక్స్ హ్రిబల్కు 60 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కిరాతకంగా 21మంది తోటి విద్యార్థులను బలి తీసుకున్న హిబ్రల్(20)కు సంఘంలో తిరిగే హక్కు ఎంత మాత్రం లేదని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పెన్సల్వేనియా కోర్టు హల్ విద్యార్థుల తల్లిదండ్రుల చప్పట్లతో మారుమ్రోగిపోయింది. హ్రిబల్ మానసిక స్థితి సరిగ్గా లేదని.. అతనికి జైలు శిక్ష విధిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని అతని తరపు న్యాయవాది వాదించాడు. ఆ వాదనతో ఏకీభవించని జడ్జి ‘ఇలాంటి నరరూప రాక్షసుడితో సమాజానికి ఎప్పటికైనా ప్రమాదమే. తల్లిదండ్రులను కూడా చంపేందుకు యత్నించాడు. అతని మానసిక స్థితి ఆధారంగానే మరణ శిక్ష విధించటం లేదు. అతనికి ఇదే సరైన శిక్ష’ అని వ్యాఖ్యానించారు. కావాలంటే శిక్ష అనుభవించే ముందు హిబ్రల్‌కు మానసిక వైద్యం అందించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. అయితే హిబ్రల్ మాత్రం శిక్షను అనుభవించేందుకు నేరుగా జైలుకు వెళ్లాడు. ఇక బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత హిబ్రల్ తల్లిదండ్రులకు లేదన్న న్యాయవాది వాదనతో జడ్జి ఏకీభవించారు. 2004 ఏప్రిల్ 9న ముర్రేస్విల్లెలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో తాను చదివే స్కూల్లోనే కత్తులతో వీరంగం వేసిన అలెక్స్ హ్రిబల్ తోటి విద్యార్థులపై దాడి చేశాడు. రెండు వంట గది కత్తులతో 21 మంది విద్యార్థులను, ఒక వ్యక్తిని విచక్షణరహితంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన మరికొందరిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ క్రమంలో తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన హిబ్రల్.. తాను మరింత మందిని చంపాల్సి ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వ్యాఖ్యల ఆధారంగానే కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. -
గతంలో ‘న్యాయ’ వివాదాలు..!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. పలువురు న్యాయమూర్తులు అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కోగా, ఓ మాజీ జడ్జీ కోర్టు ధిక్కార నేరం కింద ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు. ► 1993లో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామిపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ► 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు రాజ్యసభ గుర్తించింది. ఆయన్ను తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందే సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ► కొలీజియంతో పాటు సుప్రీం, హైకోర్టు జడ్జీలపై పరువు నష్టం వ్యాఖ్యలు చేసినందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు 2016లో ఆరు నెలల జైలుశిక్ష పడింది. దీంతో జైలుశిక్ష ఎదుర్కొన్న తొలిజడ్జీగా కర్ణన్ నిలిచారు. ► 2010లో వ్యక్తిగత ఆస్తుల్ని వెల్లడించడానికి సుప్రీం, హైకోర్టుల్లోని న్యాయమూర్తులు జంకుతున్న సమయంలో కర్ణాటక హైకోర్టు జడ్జీ జస్టిస్ శైలేంద్ర కుమార్ అప్పటి సీజేఐ జస్టిస్ బాలకృష్ణన్‌ను విమర్శించారు. ► 2012లో కర్ణాటక హైకోర్టు సిట్టింగ్ జడ్జీ జ్ఞాన్ సుధా మిశ్రా ప్రకటించిన ఆస్తుల్లో తన పెళ్లికాని కుమార్తెలను అప్పుగా చూపించడంతో మరో వివాదం రాజుకుంది. ► 2012లోనే కర్ణాటక హైకోర్టులో విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భక్తవత్సల.. గృహహింస ప్రతి ఇంట్లోనూ ఉంటుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ► గతేడాది ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై తన బ్లాగ్‌లో చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అత్యున్నత ధర్మాసనం మాజీ జడ్జి జస్టిస్ మార్కాండేయ కట్జూను ఆదేశించింది. ► 2015లో హార్దిక్ పటేల్ అరెస్ట్ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా 58 మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన నోటీసును అప్పటి సభ చైర్మన్ హమీద్ అన్సారీకి పంపారు. ► సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ సదాశివం, న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీలు తమ వద్ద శిక్షణ పొందుతున్న న్యాయ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు వచ్చాయి. -
శశికళకు మరో షాక్
-
శాంసంగ్ అధినేతకు ఐదేళ్ల జైలు శిక్ష
-
శాంసంగ్ అధినేతకు ఐదేళ్ల జైలు శిక్ష
ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ గ్రూప్ అధినేత లీ జే-యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు దక్షిణ కొరియా కోర్టు ఈ శిక్ష విధించినట్టు స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి శాంసంగ్ అధినేత లీ జే యాంగ్ లంచాలు ఇచ్చారనే ఆరోపణలతో ఆయన ఈ కేసులో చిక్కుకున్నారు. స్థానిక న్యూస్ ఏజెన్సీ యోన్‌హ్యాప్ ప్రకారం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ లీ, అభిశంసనకు గురైన ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గెయిన్ హెయికు లంచం ఇచ్చారని కోర్టు చెప్పినట్టు తెలిసింది. శాంసంగ్ సీ అండ్ టీ, కెయిల్ ఇండస్ట్రీస్ వివాస్పద విలీనానిని సంబంధించి 2015లో ప్రభుత్వ ఆమోదం కోసం ఈ లంచం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విలీనాన్ని శాంసంగ్ ఎల్ అండ్‌టీ షేర్‌హోల్డర్ ఇలియట్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ డీల్‌తో కంపెనీని తక్కువ విలువ కడుతున్నారని, కెయిల్ ఇండస్ట్రీస్ విలువను పెంచుతున్నారని పేర్కొంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయిన లీకు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. ఒక్క అవినీతి కేసులో మాత్రమే కాక, అపహరణ, పొరపాటు కేసులో కూడా ఆయనకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. శామ్సంగ్ 230 బిలియన్ డాలర్ల కంపెనీ. దక్షిణ కొరియా ఆర్థికంలో 17 శాతం శామ్‌సంగ్‌దే. -
మాల్యా కేసు నిరవధిక వాయిదా
న్యూడిల్లీ: దేశంలో వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటెప్ట్ ఆఫ్ కోర్టు కేసులో మ్యాలాను కోర్టుముందు ప్రవేశపెట్టకపోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూసిన కోర్టు శిక్షను ఖరారు చేయడానికి శుక్రవారం నిరాకరించింది. విచారణ పూర్తయినా, మాల్యాను ప్రభుత్వం కోర్టుకు తెచ్చేంతవరకు విచారణ చేపట్టలేమని, జైలు శిక్ష విధించలేమని జస్టిస్ ఆదర్శ్ కె గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం కేసును నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో కోర్టు ధిక్కారం కేసులో మాల్యాకు మరోసారి ఊరట లభించింది. ఉద్దేశ పూర్వక వేల కోట్ల రుణాల ఎగవేత దారుడు మాల్యా కోర్టుకు హాజరుకాకుండా అతని శిక్షను ఖరారు చేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాల్యాని తిరిగి తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పారు.ఈ కేసు లండన్ కోర్టులో విచారణ జరుగుతోందని వివరించారు. డిసెంబర్ నాటికి మాల్యాను ఇండియాకు రప్పించే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ప్రభుత్వ చర్యలను మానిటర్ చేసే ఆసక్తి తమకు లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. మ్యాలాను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తరువాత మాత్రమే తీర్పును వెలువరించగలమని మరోసారి ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. -
మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్‌కు ఎదురుదెబ్బ
-
సంచలనం: సీజేఐకు ఐదేళ్ల శిక్ష విధించిన కర్ణన్
కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది. సీజేఐతో పాటు మరో ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్-1989, 2015ల కింద వీరికి శిక్షను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కుల వివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జరిమానాను వారం రోజుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చెల్లించాలని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తికి(అంటే కర్ణన్‌కు) చెల్లించాల్సిన రూ.14 కోట్ల పరిహారం ఇంకా అందలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆ డబ్బును జడ్జిల వేతనాల్లో నుంచి తీసుకుని అకౌంట్లో వేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగింది: తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు. -
ఉపహార్ కేసు: రియల్టర్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపహార్ థియేటర్ ట్రాజెడీ కేసులో ప్రధాన దోషి రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోపాల్ అన్సాల్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏడాది జైలు శిక్ష, రూ. 30 కోట్ల జరిమానాపై అన్సల్ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టి వేసింది. జైలుకి వెళితే తన ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బపడుతుందన్న గోపాల్ అన్సల్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మార్చి 20వ తేదీలోపు కోర్టుముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. గతనెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గోపాల్ అన్సల్ కోర్టుముందు లొంగిపోవాల్సి ఉంది. రియల్టర్ల తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ వాదిస్తుండగా, ఉపహార్ విషాద భాదితుల అసోసియేషన్ తరపున సీనియర్ న్యాయవాది కె టీఎస్ తులసీ తన వాదనలను వినిపించారు. తమ రిప్యూ పిటీషన్ పై సుప్రీం తీర్పుకు సమీక్ష ఉండదని వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని జె ఎస్ ఖేహర్ ధర్మాసనం విచారణకు జాబితా బెంచ్ లభ్యతపై శుక్రవారం నిర్ధారించనున్నామని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీకి హామీ ఇచ్చారు. అయితే 1997లో జరిగిన ఉపహార్ సినిమా అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 59 మంది మృతి చెందిన నాటి ఘటనలో థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ సోదరులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరిలో గోపాల్ అన్సల్ (69) సుప్రీంకోర్టు ఏడాది జైలుశిక్ష, రూ. 30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు సుశీల్ అన్సల్ వయసు ఆధారిత సమస్యల కారణంగా మినహాయింపునిచ్చింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని గోపాల్‌నున ఆదేశించిన సంగతి తెలిసిందే. 2015లో దోషులిద్దరికీ సుప్రీంకోర్టు రెండేండ్ల జైలుశిక్ష (ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఉన్నందుకు), చెరొకరికి రూ.30 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 డిసెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు వారి శిక్షను ఏడాదికి తగ్గించింది. ఈ నేపథ్యంలో మృతుల బంధువుల అసోసియేషన్ దీనిపై న్యాయపోరాటానికి దిగింది. తమకున్యాయం చేయాల్సింది కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. -
'పాత నోట్లుంటే జైలు'పై కేంద్రం కొత్త మాట
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం మరో కుప్పిగంతు వేసింది. 'శుక్రవారం(డిసెంబర్ 30) తర్వాత పాత నోట్లు కలిగి ఉన్నవారికి కనీసం రూ.10వేల జరిమానా విధిస్తాం. జైలు శిక్షలు ఉండవు'అని ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాతనోట్ల డిపాజిట్‌కు మార్చి 31 వరకూ గడువు పొడిగించిన దరిమిలా నేటి ప్రకటన(డిసెంబర్ 30 తర్వాత జరిమానాలు) అసంబద్ధంగా ఉండటం గమనార్హం. బుధవారం నాటి కేబినేట్ భేటీలో.. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై బుధవారం నాటి కేబినెట్ భేటీలో స్పష్టత రాకపోవడంతో ఇవ్వాళ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: పాత నోట్లుంటే జైలే!) ఆ ఆర్డినెన్స్ ప్రకారం రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. -
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్‌పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్‌పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది. -
అతడుగా రేప్ చేసి.. ఆమెగా జైలుకు!
తాను పురుషుడిగా ఉన్నప్పుడు టీనేజ్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ట్రాన్స్ జెండరైన ఓ మహిళను బ్రిటన్ కోర్టు దోషిగా తేల్చింది. డేవిడ్ అనే వ్యక్తి 2004 వేసవిలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిపాడు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే మూడేళ్ల కిందట అతను టాన్స్జెండర్గా మారాడు. తన పేరు డెవినా ఆర్టన్గా మార్చుకున్నాడు. ఆర్టాన్ను గత జనవరిలో పోర్ట్‌మౌత్ క్రౌన్ కోర్టు దోషిగా తేల్చింది. ఆమెకు శిక్ష విధించిన అనంతరం పురుషుల జైలుకు తరలించనున్నారు. కోర్టు విచారణ వివరాల ప్రకారం.. ఆర్టాన్ 2004లో వేసవిలో బాధితురాలిని కలిశాడు. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఆమె, ఆమె మరో ఇద్దరు స్నేహితులు పోర్ట్స్ మౌత్‌లోని ఓ గ్యారేజ్‌లో ఆర్టాన్ తో కలసి మద్యాన్ని సేవించారు. అక్కడే సోఫాపై రాత్రి పడుకున్నారు. ఈ సమయంలో ఆర్టాన్ బాధితురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. దీనిని ఆపడానికి ఆమె ఎంతగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. కొంచెం దూరంలోనే ఆమె స్నేహితులు నిద్రపోతున్నా మద్యం మత్తులో ఉండటంతో మేల్కొనలేదు. ఆర్టాన్ జీవితం అస్తవ్యస్తంగా సాగిందని, అతను ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయంలో పెరిగాడని, తన సాయం కోసం వచ్చిన టీనేజ్ అమ్మాయిని రేప్ చేసినట్టు అతను అంగీకరించాడని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్ గా మారిన ఆర్టాన్ గత ఏడాది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో న్యాయమూర్తి ఆమెకు కస్టడీకి విధించారు. ఆమెకు జైలు శిక్ష వేసిన అనంతరం హంప్‌షైర్ లోని వించెస్టర్ పురుషుల జైలుకు పంపనున్నారు. లింగమార్పిడి చేయించుకున్నప్పటికీ భౌతికంగా శరీరంలో మార్పుల కోసం ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదని ఆర్టాన్ న్యాయమూర్తికి తెలిపింది. పురుషుడిగా ఉన్నప్పుడు ఓ బిడ్డకు తండ్రి అయిన ఆర్టాన్.. పిల్లలు అసభ్య ఫొటోలు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై కూడా దోషిగా తేలింది. -
విడి సిగరెట్లు అమ్మితే జైలుకే
లక్నో: విడి సిగరెట్లు అమ్మితే జైలు పాలుకాక తప్పదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. విడిగా ఉండే సిగరెట్లు అమ్మే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలా చేయడాన్ని తీవ్రమైన నేరం చేసినట్లుగా పరిగణిస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ చేసిన మధ్యంతర ఆర్డినెన్స్‌పై గవర్నర్ రామ్ నాయక్ ఆమోదముద్ర కూడా వేశారు. ఈ చట్టం ప్రకారం ఏ వ్యక్తయినా విడిగా సిగరెట్లు అమ్మినట్లు సంబంధిత అధికారులు గుర్తిస్తే వారికి వెయ్యి రూపాయల జరిమానాతోపాటు ఒక ఏడాది జైలు శిక్ష అమలు చేస్తారు. ఒకసారి ఈ శిక్షకు గురైన వ్యక్తి మరోసారి అదే నేరానికి పాల్పడి చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.3 వేల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒక వేళ ఇలా విడిగా సిగరెట్లు తయారు చేసేవాళ్లను గుర్తిస్తే మాత్రం వారికి పది వేల జరిమానాతోపాటు ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. -
జైలులో నాలుగు రోజులు అదనంగా గడపనున్న సంజయ్ దత్
సాక్షి, ముంబై: అక్రమ ఆయుధాలు కల్గి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. తనకు మంజూరైన సెలవు గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడిపినందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న పుణేలోని యేర్వాడ జైలు పరిపాలన విభాగం, స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి, వారి మధ్య సమన్వయం లోపం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని షిండే అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సంస్థాపరమైన దర్యాప్తుకు ఆదేశిస్తామని మంత్రి చెప్పారు. సంజయ్‌దత్‌కు మంజూరైన సెలవు జనవరి 8వ తేదీతో ముగిసిందని, ఆ రోజు సూర్యాస్తమయానికి ముందే ఆయన జైలులో సరెండర్ కావాల్సి ఉందని అన్నారు. అయితే తనకు మరో 14 రోజులు సెలవు మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న దరఖాస్తుపై జైలు అధికారులు స్పందించలేదన్నారు. దీంతో 8వ తేదీన జైలు వరకూ వచ్చిన సంజయ్ దత్‌ను సిబ్బంది వెనక్కి పంపించారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు జనవరి పదో తేదీన జైలు అధికారులు ప్రకటించారు. దీంతో దత్ వెంటనే జైలుకు బయలుదేరారు. కాగా ఆయన అక్రమంగా రెండు రోజులు జైలు బయట గడపడంతో నిబంధనల ప్రకారం ఆయన శిక్షా కాలంలో నాలుగు రోజులు అదనంగా జైలులో ఉండాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జైలు అధికారులు, స్థానిక పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రామ్ షిండే చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో జైలు మాన్యువల్‌లో మార్పులు చే స్తామని ఆయన చెప్పారు.