
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న పెరోల్ విజ్ఞప్తిపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో జరిగే తన పెద్ద కొడుకు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు అనుమతివ్వాలని లాలూ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తి ఇంకా పరిశీలన దశలోనే ఉందని, గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని జార్ఖండ్ ఐజీ(జైళ్లు) హర్ష మంగ్లా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment