![Hinduja family members get Over 4 Years jail term for exploiting staff](/styles/webp/s3/article_images/2024/06/22/hinduja.jpg.webp?itok=jMCwBIHZ)
సిబ్బందని వేధింపులకు గురి చేసిన కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు స్విస్ కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజాలకు చెరో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు, వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ జెనీవాలోని ప్రిసైడింగ్ జడ్జి తీర్పు చెప్పారు.
బ్రిటన్‌లో రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న హిందూజా కుటుంబం జెనీవాలోని తమ నివాసంలో పనిచేయించుకునేందుకు స్వదేశమైన భారత్ నుంచి పనివాళ్లను రప్పించుకుని వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వచ్చిన వీరికి హిందుజా కుటుంబం చాలా తక్కువ జీతం చెల్లించారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ప్రాసిక్యూటర్లు వాదించారు.
ఈ ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. 78, 75 ఏళ్ల వయసున్న ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా అనారోగ్య కారణాల రీత్యా విచారణ ప్రారంభమైనప్పటి గైర్హాజరయ్యారు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపినప్పటికీ ఇతర అభియోగాలపై దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment