swiss court
-
హిందూజ గ్రూప్ ఫ్యామిలీకి జైలు శిక్ష.. అంతా ఉత్తదే!
హిందూజా కుటుంబానికి ఎటువంటి జైలు శిక్ష పడలేదని వారికి సంబంధించిన అధికార ప్రతినిధి తెలిపారు. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజా, కుమారుడు అజయ్, కోడలు నమ్రత తమ జెనీవా నివాసంలో పనిచేసే భారతీయ వలసదారు సిబ్బందిని వేధించారంటూ స్విస్ కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు వారికి జైలు శిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే హిందూజా కుటుంబంలోని నలుగురు సభ్యులను జైల్లో పెట్టలేదని, వారిపై మానవ అక్రమ రవాణా అభియోగాలను కోర్టు కొట్టివేసినట్లు హిందూజా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ‘స్విస్ పౌరులైన హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కమల్, ప్రకాశ్ హిందూజా, నమ్రత, అజయ్ హిందూజాలకు ఎలాంటి జైలుశిక్ష, నిర్బంధం విధించలేదు’ అని పేర్కొన్నారు.మిగిలిన అభియోగాల్లో దిగువ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో తాము అపీల్ చేసినట్లు హిందూజా ప్రతినిధి తెలిపారు. "స్విస్ చట్టాల ప్రకారం.. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చేంత వరకు నిర్దోషిత్వ భావన చాలా ముఖ్యమైనది కాబట్టి దిగువ కోర్టు తీర్పు పనిచేయదు" అని వివరించారు. తమకు అర్థం కాని స్టేట్ మెంట్లపై సంతకాలు చేయించారని బాధిత సిబ్బంది కోర్టులో ప్రకటించారని, హిందుజా కుటుంబం తమను గౌరవంగా, హుందాగా, కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని వారంతా సాక్ష్యం చెప్పారని వివరించారు. స్విస్ న్యాయ ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని పేర్కొన్నారు. -
హిందూజా కుటుంబానికి జైలు శిక్ష
సిబ్బందని వేధింపులకు గురి చేసిన కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు స్విస్ కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజాలకు చెరో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు, వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ జెనీవాలోని ప్రిసైడింగ్ జడ్జి తీర్పు చెప్పారు.బ్రిటన్లో రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న హిందూజా కుటుంబం జెనీవాలోని తమ నివాసంలో పనిచేయించుకునేందుకు స్వదేశమైన భారత్ నుంచి పనివాళ్లను రప్పించుకుని వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వచ్చిన వీరికి హిందుజా కుటుంబం చాలా తక్కువ జీతం చెల్లించారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ప్రాసిక్యూటర్లు వాదించారు.ఈ ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. 78, 75 ఏళ్ల వయసున్న ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా అనారోగ్య కారణాల రీత్యా విచారణ ప్రారంభమైనప్పటి గైర్హాజరయ్యారు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపినప్పటికీ ఇతర అభియోగాలపై దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్షలు విధించింది. -
ఒక లైక్ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!
మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అందులో వచ్చే అప్డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్ ఏముందో చూసుకుని మరీ లైక్ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్ చేస్తే చాలు లైక్, లవ్ లాంటి బటన్లు యాక్టివేట్ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లండ్లో ఇలాగే లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి ఆ మొత్తంలో జరిమానా విధించారు. విషయం ఏమిటంటే.. ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్ కొట్టినందుకు జడ్జిగారికి అతడి మీద కోపం వచ్చింది. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థిచినట్లు అయిందని జడ్జి చెప్పారు. ఆ చర్చలలో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్ దావాలు వేశారు. కెస్లర్ గురించి కామెంట్లు చేసిన కొంతమందిని కూడా కోర్టు దోషులుగా నిర్ణయించింది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల మీద పరువునష్టం దావాలు బాగానే పడుతున్నాయి. ఇంతకుముందు ఒక ఫ్యాషన్ డిజైనర్ మీద ఇలాగే సోషల్ మీడియాలో అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు గాయన కోర్ట్నీ లవ్కు ఏకంగా 3.50 లక్షల డాలర్ల జరిమానా పడింది. అలాగే ట్విట్టర్లో అవమానకరమైన కామెంట్లు చేసినందుకు బ్రిటిష్ పత్రికలోని కాలమిస్టుకు 30వేల డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటివరకు ఇలా కామెంట్లు చేసినందుకు జరిమానాలు పడ్డాయి గానీ, ఒక కామెంటును లైక్ చేసినందుకు జరిమానా పడటం మాత్రం ఇదే తొలిసారి అని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇక మీద ఫేస్బుక్లో ఏమైనా లైక్ చేయాలన్నా కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండక తప్పదని అంటున్నారు. -
కూతుళ్లకు ఈత వద్దన్నాడని.. 3 లక్షల ఫైన్!
స్కూల్లో చదువుతున్న తన కూతుళ్లను ఈత నేర్చుకోడానికి అంగీకరించలేదని స్విట్జర్లాండ్లో ఓ తండ్రికి అక్కడి కోర్టు రూ. 3 లక్షల జరిమానా విధించింది. స్కూల్లో నిర్వహించే వివిధ క్యాంపులు, ఇతర కార్యక్రమాలకు కూడా అతడు వాళ్లను పంపేవాడు కాదని, అవి తమ మత విశ్వాసాలకు వ్యతిరేకం అంటూ చెప్పేవాడని తెలిసింది. స్కూలు నియమాలతో పాటు అధికారులు ఇంతకుముందు విధించిన ఉత్తర్వులను కూడా ఉల్లంఘించినందుకు అతడికి జరిమానా విధిస్తున్నట్లు అక్కడి జిల్లా కోర్టు తెలిపింది. జరిమానాతో పాటు ఆ తండ్రికి నాలుగు నెలల జైలుశిక్ష కూడా విధించాలని ప్రాసిక్యూషన్ వర్గాలు కోరాయి. 1990 నుంచి స్విట్జర్లాండ్లోనే ఉంటున్న ఈ బోస్నియా వాసి.. ఇక్కడి చట్టాలకు అనుగుణంగా ఉండటం లేదని వాదించారు. అయితే ఈ కుటుంబానికి కొన్నేళ్లుగా స్థానిక అధికారులతో వివాదాలు జరుగుతున్నాయి. బురఖా ధరించనిస్తే తప్ప తమ పిల్లలను స్కూలుకు పంపబోమని చెప్పినందుకు గత సంవత్సరం ఓ కోర్టు వీళ్లకు జైలుశిక్ష విధించింది. అయితే, అక్కడి సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టేసింది. మతస్వేచ్ఛ ఉండాలి కాబట్టి పెద్ద అమ్మాయికి బురఖా అనుమతించాలని చెప్పింది.