hinduja
-
హిందూజా కుటుంబానికి జైలు శిక్ష
సిబ్బందని వేధింపులకు గురి చేసిన కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు స్విస్ కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజాలకు చెరో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు, వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ జెనీవాలోని ప్రిసైడింగ్ జడ్జి తీర్పు చెప్పారు.బ్రిటన్‌లో రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న హిందూజా కుటుంబం జెనీవాలోని తమ నివాసంలో పనిచేయించుకునేందుకు స్వదేశమైన భారత్ నుంచి పనివాళ్లను రప్పించుకుని వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వచ్చిన వీరికి హిందుజా కుటుంబం చాలా తక్కువ జీతం చెల్లించారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ప్రాసిక్యూటర్లు వాదించారు.ఈ ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. 78, 75 ఏళ్ల వయసున్న ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా అనారోగ్య కారణాల రీత్యా విచారణ ప్రారంభమైనప్పటి గైర్హాజరయ్యారు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపినప్పటికీ ఇతర అభియోగాలపై దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్షలు విధించింది. -
మనుషుల కంటే ‘పెట్స్’పై పెట్టే ఖర్చే ఎక్కువ.. సంపన్న కుటుంబంపై విమర్శలు
బెర్న్: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. అయితే హిందూజా కుటుంబం వివాదంలో చిక్కుకుంది. హిందూజా కుటుంబానికి చెందిన స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో వారి విల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని శ్రమదోపిడికి గురిచేసినట్లు తెలుస్తోంది. వారి పాస్‌పోర్ట్‌లను తీసుకుని 15-18 గంటల పనికి కేవలం 8 డాలర్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులపై స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణా కేసునమోదైంది. సోమవారం కోర్టులో విచారణ జరిగింది.బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం.. బిలియనీర్ కుటుంబం ఇంట్లో పనిచేసే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు సమాచారం.పేరుకే ధనవంతులు.. కానీవారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించరు. పైగా వారి చేస్తున్న పనికి భారత్‌లో ఎంతైతే ఇస్తున్నారో.. అక్కడ కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. పేరుకే ధనవంతులైనప్పటికి హిందూజాలు తమ పెంపుడు కుక్క కోసం చేస్తున్న ఖర్చుకంటే ఇంట్లో పనిచేస్తే సిబ్బంది చెల్లించే వేతనం చాలా తక్కువ అని కోర్టులో ప్రాసిక్యూటర్ ఆరోపించారు.సిబ్బంది కంటే.. కుక్కలకు పెట్టే ఖర్చే ఎక్కువ‘పెంపుడు జంతువులు’అనే బడ్జెట్ పత్రాన్ని ప్రస్తావిస్తూ..ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోస్సా ఓ మహిళా సిబ్బందికి వారంలో ఏడు రోజులు 15 నుండి 18 గంటల పని దినానికి 7 (7స్విస్ ఫ్రాంక్) డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ మొత్తం ఒక సంవత్సరంలో హిందూజా కుటుంబ సభ్యులు పనిచేసే సిబ్బంది కంటే వారి పెంపుడు జంతువులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మొత్తం 8584 స్విస్ ఫ్రాంక్‌లుగా ఉంది. ఈ కేసులో హిందూజా కుటుంబానికి చెందిన ప్రకాష్ హిందూజా, అతని భార్య కమల్, కుమారుడు అజయ్, భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు వైవ్స్ బెర్టోస్సాకు కోర్టు ఖర్చులు నిమిత్తం 1 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు, సిబ్బందికి నష్టపరిహారం కోసం 3.5 మిలియన్ ఫ్రాంక్‌లు చెల్లించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.శ్రమదోపిడి వస్తున్న ఆరోపణల్ని హిందూజా కుటుంబ తరుపు న్యాయవాది తోసిపుచ్చారు. సిబ్బందిని నియమించడంలో లేదా రోజువారీ నిర్వహణలో కుటుంబం ప్రమేయం లేదని చెప్పారు.20 బిలియన్ల నికర విలువతోహిందూజా కుటుంబం 20 బిలియన్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉంది. లండన్‌లోని రియల్ ఎస్టేట్‌తో పాటు షిప్పింగ్, బ్యాంకింగ్, మీడియా, ఇతర రంగాల్లో కార్యకాలాపాలు నిర్వహిస్తూ వ్యాపార రంగంలో అగ్రగ్రామిగా కొనసాగుతోంది హిందూజా గ్రూప్. -
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గోపీచంద్ హిందూజా యూకేలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ యూకేలోని 1,000 మంది సంపన్నులు లేదా కుటుంబాలతో వారి మొత్తం నెట్‌వర్త్ ప్రకారం జాబితా రూపొందించింది. ఈ జాబితాలో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందూజాను అగ్రస్థానంలో నిలిచారు.‘ది మిర్రర్’ ప్రకారం.. హిందుజా కుటుంబం ఆరు సంవత్సరాలుగా బ్రిటన్‌లో అత్యంత సంపన్నులుగా నిలుస్తూ వస్తోంది. ర్యాంకింగ్ ఆధారంగా హిందూజా నెట్‌వర్త్ అంతకు ముందు సంవత్సరంలోని 35 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్ (సుమారు రూ. 3.7 లక్షల కోట్లు) నుంచి సుమారు 37.196 బిలియన్ పౌండ్ స్టెర్లింగ్స్‌కు (సుమారు రూ. 3.9 లక్షల కోట్లు) పెరిగింది.జీపీగా పిలిచే గోపీచంద్ హిందూజా భారత్‌లో 1940లో జన్మించారు. హిందూజా ఆటోమోటివ్ లిమిటెడ్ ఛైర్మన్ అయిన ఆయన గత సంవత్సరం తన సోదరుడు శ్రీచంద్ హిందూజా మరణించిన తరువాత తమ వ్యాపార సమూహానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్ 1959లో ముంబైలోని జై హింద్ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. దీంతోపాటు లండన్‌లోని రిచ్మండ్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ను పొందారు. గోపీచంద్ తండ్రి, పరమానంద్ హిందూజా 1914లో హిందూజా ఫ్యామిలీ కంపెనీని స్థాపించారు. -
చాలామంది హేళనగా చూశారు, ఎందుకో అర్థం కాలేదు: హీరోయిన్
'ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుంది. అలా నాకు నటించడంలోనే కిక్ కలుగుతుంది. చిత్రంలో నటిస్తున్నప్పుడు నేను హిందుజాని అనుకోను. పాత్ర స్వభావాన్ని బట్టి మారడం నాకు కిక్ ఇస్తుంది’ అని నటి హిందూజా పేర్కొంది. 'మేయాదమాన్' చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పార్కింగ్ చిత్రంలో హరీష్ కళ్యాణ్‌కు జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా హిందూజా ఓ భేటీలో పేర్కొంటూ పార్కింగ్ చిత్రంలో తాను అధ్యాపకురాలిగా నటిస్తున్నానని చెప్పింది. పార్కింగ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? తద్వారా జరిగే పరిణామాలు ఏమిటి? వంటి అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ చిత్రంలో ఉంటాయని చెప్పింది. ఇందులో కొన్ని ఛాలెంజింగ్‌తో కూడిన సన్నివేశాల్లో నటించానని చెప్పింది. తను కథానాయకగా నటించాలనే ధ్యేయంతోనే ఈ రంగంలోకి వచ్చానని, అయితే ఆరంభంలో కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశానంది. అలాగని వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని భావించి ఇప్పుడు కథానాయిక పాత్రలకే ప్రాముఖ్యతనిస్తున్నట్లు పేర్కొంది. తాను తమిళ్ అమ్మాయినని చెప్పగా ఆరంభ దశలో పలువురు హేళనగా చూశారంది. ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, ఓటీటీ ప్లాట్ ఫామ్ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని చెప్పింది. కథా పాత్రలను అర్థం చేసుకొని నటించడానికి మాతృభాష చాలా అవసరం అవుతోందని దర్శకులు భావిస్తున్నారంది. మంచి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని చెప్పుకొచ్చింది హిందూజ. చదవండి: బిగ్‌బాస్ 7 క్రేజీ ప్రోమో.. చూశారా? -
‘బోఫోర్సు’ తీర్పు సవాలుకు అనుమతి రాలేదు: సీబీఐ
న్యూఢిల్లీ: బోఫోర్స్ ముడుపుల చెల్లింపుల కేసులో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తరువాత అప్పీలు చేయడానికి తనకు అనుమతి లభించలేదని సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ లాయర్ అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. 2005, మే 31 నాటి తీర్పును సవాలు చేయడానికి సీబీఐకి అనుమతి రాలేదని సంస్థ లాయర్ గురువారం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం అప్పీలుకు నిరాకరించిన కేసును తిరిగి కొనసాగిస్తానని అగర్వాల్ చెప్పారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చాలా అసంబద్ధంగా ఉందని, దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ తీర్పును సవాలు చేయడానికి సీబీఐ ముందుకు రాకపోవడంతో అప్పీలు చేసేందుకు అగర్వాల్‌కు సుప్రీంకోర్టు 2005లోనే అనుమతిచ్చింది. -
కృష్ణపట్నం, హిందూజాలో.. తెలంగాణకు వాటా ఇవ్వం!
మరోసారి సీఈఏకు చెప్పిన ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, హిందూజాలో విద్యుత్ వాటా ఇచ్చేది లేదని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ)కు ఆంధ్రప్రదేశ్ మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ పంపకాల వివాదంపై సీఈఏ నేతృత్వంలో న్యూఢిల్లీలో మంగళవారం సమావేశం జరిగింది. సీఈఏ చైర్ పర్సన్ మేజర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ జెన్కో ఎండీ విజయానంద్, తెలంగాణ విద్యుత్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలూ వాదనలు వినిపించాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ అధికారులు వాదించారు. అయితే, ఏపీ అధికారులు దీన్ని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సీఈఏ చైర్పర్సన్ జోక్యం చేసుకుని తొలి నుంచి జరుగుతున్న పరిణామాలపై 2 రాష్ట్రాలూ పూర్తి ఆధారాలతో నివేదికలు ఇవ్వాలని కోరారు. -
‘విద్యుత్’పై తెగని పంచాయితీలు
* హిందుజా, కృష్ణపట్నం ప్రాజెక్టులపై 2 రాష్ట్రాల మధ్య జగడం * ఏపీ పీపీఏల రద్దుతో మొదలైన వివాదాలు * రెండు ప్రాజెక్టులూ తమవే అంటోన్న ఏపీ * తమకూ వాటా ఉందని తెలంగాణ వాదన * ప్రాజెక్టు లాభాల్లో వాటా ఇస్తామన్న ఏపీ * విద్యుత్ వాటా ఇవ్వాలని టీ సర్కారు పట్టు * కృష్ణా బోర్డుకు చేరిన ‘శ్రీశైలం’ వివాదం * ఎటూ తేలని వివాదాలు.. కేంద్ర విద్యుత్ మండలి పరిష్కరించే అవకాశమూ లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జెన్కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలను) రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం మొదలైంది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర వివాదాల్లో ఉన్న రెండు ప్రధాన విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారం ఆరు నెలలయినా కొలిక్కి రాలేదు. కృష్ణపట్నం ప్రాజెక్టు ఎప్పుడో వాణిజ్య ఉత్పత్తికి వెళ్ళాల్సి ఉన్నా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. హిందుజా ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాలూ పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపోతోంది. హిందుజాను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంటే.. అసలా విషయమై తెలంగాణతో మాట్లాడటానికే ఏపీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఈ రెండు ప్రాజెక్టులపైనా న్యాయస్థానానికి వెళ్ళేందుకు కూడా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఇక శ్రీశైలం విద్యుత్ వివాదం సరేసరి. ప్రాజెక్టు నీటిని సాగునీటి అవసరాలకే వాడుకోవాలనేది ఏపీ వాదన. విద్యుత్ ఉత్పత్తి కూడా సాగు నీటి కోసమే అనేది తెలంగాణ వాదన. అంతిమంగా ఈ వివాదం కృష్ణా బోర్డు వరకూ వెళ్ళింది. హిందుజా దారికొచ్చినట్టేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా హిందుజా ప్రాజెక్టును రెండు దశాబ్దాల క్రితం ప్రతిపాదించారు. అనేక సాంకేతిక, భూ సమస్యలను అధిగమించి ఎట్టకేలకు 2012లో ఇది పూర్తయింది. మొత్తం 1,040 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పిన విద్యుత్ ప్రాజెక్టు విభజన నాటికే ఉత్పత్తికి సిద్ధమైంది. ఇందులో ఉభయ రాష్ట్రాలకు వాటా కల్పిస్తూ విభజన సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం భాగస్వామ్యం కల్పించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా జరిగింది. అయితే విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి దీన్ని ఆమోదించలేదు. దీన్ని ఏపీ సర్కారు సాంకేతికాంశంగా చూపుతోంది. పీపీఏ కానప్పుడు ఆ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వాలన్న వాదన సహేతుకం కాదని వాదిస్తోంది. దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. వివాదం ముదురుతున్న దశలోనే ఏపీ జెన్కో ఇటీవల హిందుజాతో చర్చలు జరిపింది. డిసెంబర్ 5వ తేదీలోగా హిందుజా పీపీఏ కుదుర్చుకునేందుకు అంగీకారం తెలిపింది. ఇది గుర్తించిన తెలంగాణ జెన్కో హిందుజాను చర్చలకు పిలవడం, ఆ సంస్థ ఇందుకు సుముఖంగా లేకపోవడంతో వివాదం ముదిరింది. పీపీఏ జరిగితే హిందుజాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ జెన్కో హెచ్చరించింది. కృష్ణపట్నం పరిస్థితీ అంతే..! ఉమ్మడి రాష్ట్రంలో గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు వివాదం కూడా అపరిష్కృతంగానే ఉంది. ఇందులో 54 శాతం వాటా ఉందని తెలంగాణ అంటోంది. పీపీఏ జరగలేదు కాబట్టి ఆ హక్కు లేదని ఆంధ్రప్రదేశ్ చెప్తోంది. పెట్టుబడులున్నాయి కాబట్టి లాభాల్లో వాటా ఇస్తామంటోంది. ఇటీవల పాలకమండలి సమావేశంలో దీన్ని తెలంగాణ జెన్కో అధికారులు చర్చకు పెట్టారు. ఏపీ జెన్కో దీన్ని ఎజెండాలో లేదంటూ తోసిపుచ్చింది. వాస్తవానికి కృష్ణపట్నం ఆరు నెలల కిందటే వాణిజ్య విద్యుత్ ఉత్పత్తికి వెళ్ళాలి. రేపో మాపో సీఓడీ జరగాల్సి ఉండగా మళ్లీ సాంకేతిక లోపం రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్న ఏపీ, ఆరు నెలలుగా తానే వాడుకోవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘కేంద్రం’ పరిష్కరించే వీలూ లేదు! విభజన సందర్భంగా ముందస్తు ఆలోచన లేకపోవడమే సమస్యకు కారణంగా కనిపిస్తోంది. విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించని ఈ ప్రాజెక్టులపై స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఉంటే, రెండు రాష్ట్రాలు పరస్పర వాదులాటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఇందులో న్యాయపరమైన సమస్యలూ ఉన్నాయి. కేంద్ర విద్యుత్ మండలి దీన్ని పరిష్కరించే అవకాశం కూడా లేదు. ఏదైనా ప్రాజెక్టు ఒక రాష్ట్రం కాకుండా ఎక్కువ రాష్ట్రాలకు చెందితేనే సీఈఆర్సీ జోక్యం చేసుకోవాలి. రెండు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్వే అని ఆ రాష్ట్రం చెప్పుకుంటున్నప్పుడు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దీన్ని పరిష్కరించే అవకాశం కనిపించడం లేదు.