
ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాక్ ధర ఇటీవల భారీగా పతనం కావడంతో ప్రమోటర్లు వాటాలు పెంచుకునేందుకు ఇది అనుకూల తరుణమని ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) ఛైర్మన్ అశోక్ హిందుజా అన్నారు. హిందుజా గ్రూప్ పెట్టుబడుల సంస్థ ‘ఐఐహెచ్‌ఎల్’ ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో 16 శాతం వాటాతో ప్రమోటింగ్ సంస్థగా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్‌బీఐ ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలపడం గమనార్హం.
బ్యాంక్ ఖాతాల్లో రూ.2,100 కోట్ల విలువ మేర వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇటీవలే వెలుగు చూడడం, అనంతరం సంస్థ నికర విలువ (నెట్‌వర్త్) తగ్గిపోవడం తెలిసిందే. అయినప్పటికీ ప్రమోటర్ల నుంచి బ్యాంక్ నిధుల సాయం కోరలేదని అశోక్ హిందుజా తెలిపారు. అవసరమైతే బ్యాంక్‌కు నిధులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ 15 శాతానికి పైన సౌకర్యంగానే ఉందన్నారు. ఈ ధరలో తాను మాత్రమే కాదని, ఏ వాటాదారుడు అయినా వాటా పెంచుకోవాలనే అనుకుంటారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్
బ్యాంక్ ఖాతాల్లో వ్యత్యాసంపై వాస్తవాలను తేల్చేందుకు ఆడిటింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, మార్చి నెలాఖరుకు అది రానున్నది. పీడబ్ల్యూసీ ఆడిటింగ్ నివేదికతో ఖాతాల్లో వ్యత్యాసానికి ఎవరు బాధ్యులన్నది తేలుతుందని అశోక్ హిందుజా అన్నారు. సీఎఫ్‌వో పదవి నుంచి గోదింద్‌జైన్ తప్పుకోవడం వెనుక కారణాలపై మీడియా ప్రశ్నించగా, వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment