కృష్ణపట్నం, హిందూజాలో.. తెలంగాణకు వాటా ఇవ్వం! | we do not want to give power share to hinduja | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం, హిందూజాలో.. తెలంగాణకు వాటా ఇవ్వం!

Published Wed, Mar 4 2015 1:22 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

we do not want to give power share to hinduja

మరోసారి సీఈఏకు చెప్పిన ఏపీ


 సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం, హిందూజాలో విద్యుత్ వాటా ఇచ్చేది లేదని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ)కు ఆంధ్రప్రదేశ్ మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ పంపకాల వివాదంపై సీఈఏ నేతృత్వంలో న్యూఢిల్లీలో మంగళవారం సమావేశం జరిగింది. సీఈఏ చైర్ పర్సన్ మేజర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్, తెలంగాణ విద్యుత్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలూ వాదనలు వినిపించాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణకు వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ  అధికారులు వాదించారు. అయితే, ఏపీ అధికారులు దీన్ని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సీఈఏ చైర్‌పర్సన్ జోక్యం చేసుకుని తొలి నుంచి జరుగుతున్న పరిణామాలపై 2 రాష్ట్రాలూ పూర్తి ఆధారాలతో నివేదికలు ఇవ్వాలని కోరారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement