బెర్న్: బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. అయితే హిందూజా కుటుంబం వివాదంలో చిక్కుకుంది. హిందూజా కుటుంబానికి చెందిన స్విట్జర్లాండ్ జెనీవా నగరంలో వారి విల్లాలో పనిచేస్తున్న సిబ్బందిని శ్రమదోపిడికి గురిచేసినట్లు తెలుస్తోంది. వారి పాస్‌పోర్ట్‌లను తీసుకుని 15-18 గంటల పనికి కేవలం 8 డాలర్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హిందూజా కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులపై స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణా కేసునమోదైంది. సోమవారం కోర్టులో విచారణ జరిగింది.బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం.. బిలియనీర్ కుటుంబం ఇంట్లో పనిచేసే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు సమాచారం.
పేరుకే ధనవంతులు.. కానీ
వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించరు. పైగా వారి చేస్తున్న పనికి భారత్‌లో ఎంతైతే ఇస్తున్నారో.. అక్కడ కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. పేరుకే ధనవంతులైనప్పటికి హిందూజాలు తమ పెంపుడు కుక్క కోసం చేస్తున్న ఖర్చుకంటే ఇంట్లో పనిచేస్తే సిబ్బంది చెల్లించే వేతనం చాలా తక్కువ అని కోర్టులో ప్రాసిక్యూటర్ ఆరోపించారు.
సిబ్బంది కంటే.. కుక్కలకు పెట్టే ఖర్చే ఎక్కువ
‘పెంపుడు జంతువులు’అనే బడ్జెట్ పత్రాన్ని ప్రస్తావిస్తూ..ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోస్సా ఓ మహిళా సిబ్బందికి వారంలో ఏడు రోజులు 15 నుండి 18 గంటల పని దినానికి 7 (7స్విస్ ఫ్రాంక్) డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ మొత్తం ఒక సంవత్సరంలో హిందూజా కుటుంబ సభ్యులు పనిచేసే సిబ్బంది కంటే వారి పెంపుడు జంతువులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మొత్తం 8584 స్విస్ ఫ్రాంక్‌లుగా ఉంది.
ఈ కేసులో హిందూజా కుటుంబానికి చెందిన ప్రకాష్ హిందూజా, అతని భార్య కమల్, కుమారుడు అజయ్, భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు వైవ్స్ బెర్టోస్సాకు కోర్టు ఖర్చులు నిమిత్తం 1 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు, సిబ్బందికి నష్టపరిహారం కోసం 3.5 మిలియన్ ఫ్రాంక్‌లు చెల్లించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
శ్రమదోపిడి వస్తున్న ఆరోపణల్ని హిందూజా కుటుంబ తరుపు న్యాయవాది తోసిపుచ్చారు. సిబ్బందిని నియమించడంలో లేదా రోజువారీ నిర్వహణలో కుటుంబం ప్రమేయం లేదని చెప్పారు.
20 బిలియన్ల నికర విలువతో
హిందూజా కుటుంబం 20 బిలియన్ల నికర విలువతో భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉంది. లండన్‌లోని రియల్ ఎస్టేట్‌తో పాటు షిప్పింగ్, బ్యాంకింగ్, మీడియా, ఇతర రంగాల్లో కార్యకాలాపాలు నిర్వహిస్తూ వ్యాపార రంగంలో అగ్రగ్రామిగా కొనసాగుతోంది హిందూజా గ్రూప్.
Comments
Please login to add a commentAdd a comment