న్యూఢిల్లీ: గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులో నిందితులను యాంత్రికంగా, అనవసరంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని హైకోర్టులకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించింది.
వైవాహిక వివాదానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అష్పాక్ అలామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment