seven-year prison
-
నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులో నిందితులను యాంత్రికంగా, అనవసరంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని హైకోర్టులకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించింది. వైవాహిక వివాదానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అష్పాక్ అలామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. -
లైంగికదాడి కేసులో యువకుడికి ఏడేళ్ల జైలు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:యువతికి మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడి పెళ్లికి నిరాకరించిన ప్రియుడికి ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమనంబేడు గ్రామానికి చెందిన ధనపాలన్ కుమార్తె జీవా. అదే ప్రాంతానికి చెందిన పీజీ విద్యార్థి నాగదాస్ల మధ్య ప్రేమ వ్యవహరం నడిచింది. 14.09.2002లో అనారోగ్యంతో ఉన్న జీవాకు, నాగ్దాస్ మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. దీంతో గర్భం దాల్చిన జీవా, పెళ్లి చేసుకోవాలని నాగదాస్ను కోరింది. ఇందుకు నాగదాస్ తిరస్కరించడంతో బాధితురాలు పొన్నేరి మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పూందమల్లి మహిళా కోర్టు విచారించిస్తున్న సమయంలో జీవా మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన పూందమల్లి కోర్టు జీవాపై లైంగికదాడి జరిపిన కేసులో నాగదాసుకు సంబంధం లేదని తీర్పును ఇస్తూ నిం దితులను విడుదల చేసింది. అయితే పూందమల్లి కోర్టు ఇచ్చిన తీర్పులో పలు విషయాలను న్యాయమూర్తి విస్మరించారని వివరిస్తూ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ప్రత్యేకంగా విచారించిన హైకోర్టు, సంబంధిత కేసును పూర్తిగా విచారించడంతో పాటు జీవా కుమారుడుకి డీఎన్ఎ పరీక్షలు చేయించాలని ఆదేశిస్తు తిరువళ్లూరు మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కొడుక్కి డీఎన్ఏ పరీక్షలు చేయించడంతో పాటు, కేసును ప్రత్యేకంగా స్వీకరించి న్యాయమూర్తి మురుగన్ విచారణ చేపట్టారు. డీఎన్ఏలో పరీక్షలో బాలుడి తండ్రి నాగదాస్ అని తేలింది. దీంతో పాటు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు లభించడంతో నిం దితుడు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.30 వేల అపరాధం, జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును వెలువరించింది. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. -
వరకట్నం కేసులో తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: అదనపు కట్నం తేవాలని వేధిం పులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిన తల్లీకొడుకులకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు బుధవారం ఉద యం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా ఒదికాడు గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు కుప్పుస్వామి(30). ఇతను రేల్వే పనులు నిర్వహించే కాంట్రాక్టర్ వద్ద తాత్కాలిక ఉద్యోగిగా పనులుచేస్తున్నాడు. ఇతను రైల్వేలో పర్మినెంట్ ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించి తిరువ ళ్లూరు జిల్లా పొన్నేరి తాలుకా చిన్నకనంబేడు గ్రామానికి చెందిన రైతు రామలింగం కుమార్తె కోటీశ్వరిని అక్టోబర్ 2008లో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో రామలింగం కట్నంగా రూ.5 లక్షల నగదు, 40 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వివాహం జరిగిన కొంత కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే మరికొంత నగదును కట్నంగా ఇప్పించాలని కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మ తరచూ కోటేశ్వరిని వేధించేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కట్నం తేవడానికి నిరాకరించిన కోటీశ్వరీ 2009లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పెనాలూరు పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తి కావడంతో తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మురుగన్ బుధవారం ఉదయం తీర్పును వెలువరించారు. కోటీశ్వరీని కట్నం కోసం తరచూ వేధించిన భర్త కుప్పుస్వామి, అతని తల్లి కమలమ్మకు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని ఆయన ఆదేశించారు. వారిని పుళల్ జైలుకు తరలించారు.