Jharkhand High Court
-
జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మామిడన్న సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును జార్ఖండ్ హైకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బదిలీ చేశారు. అలాగే మరికొందరు న్యాయమూర్తులను ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశీ్మర్–లడఖ్, మద్రాస్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. మరో ముగ్గురు జ్యుడీíÙయల్ అధికారులను మద్రాస్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021 ఆగస్టు 31న తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.2021 అక్టోబర్ 12న పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అనంతరం 2023 మే 30న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రరావు తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు 1997–2000 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
హేమంత్ సోరెన్‌కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
నిందితులను యాంత్రికంగా అరెస్టు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసులో నిందితులను యాంత్రికంగా, అనవసరంగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని హైకోర్టులకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు సూచించింది. వైవాహిక వివాదానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ హైకోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ అష్పాక్ అలామ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చుతూ నిందితుడికి ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు గాందీకి ఊరట.. ‘చర్యలు వద్దు’
రాంచీ: గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసు విచారణ కోసం వ్యక్తిగతంగా రాంచీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపు ఇచి్చంది. ప్రస్తుతానికి రాహుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. పరువు నష్టం కేసులో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రాంచీ ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఇచి్చన ఉత్తర్వును సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఏప్రిల్‌లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రదీప్ మోదీ అనే వ్యక్తి రాంచీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
దియోఘర్ రోప్‌వే ప్రమాదం: 40 గంటల తర్వాత..
Deoghar Ropeway Accident: జార్ఖండ్: దియోఘర్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. గందరగోళం, సరైన రక్షణ చర్యలు లేకుండానే సహాయక చర్యలు చేపట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. మంగళవారం మధ్యాహ్నాం రెండు గంటల ప్రాంతంలో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. త్రికూట్ రోప్‌వే ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తైంది. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఎయిర్‌ఫోర్స్.. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రజల్ని కాపాడడమే లక్ష్యంగా జరిగినప్పటికీ.. ప్రాణ నష్టం జరిగినందుకు చింతిస్తున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని అని ప్రకటించారు. అయితే.. #Deoghar tragedy - one killed while rescue #DeogharRopewayAccident pic.twitter.com/j0i7RvRUyS — Amit Shukla (@amitshukla29) April 11, 2022 మంగళవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యాక మృతుల సంఖ్య మూడుకి పెరిగిందని సమాచారం. త్రికూట్ హిల్స్ ప్రమాదం నుంచి మొత్తం 43 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇందులో 12 మందికి గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించింది జార్ఖండ్ హైకోర్టు. ఏప్రిల్ 26న ఈ కేసులో వాదనలు విననుంది. అయితే అంతకు ముందు.. దర్యాప్తు నివేదికను జార్ఖండ ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక మంగళవారం ఉదయం 5 గంటల నుంచే రెస్క్యూ సిబ్బంది చర్యల్లో పాల్గొన్నారు. ఇవాళ పది మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. దేశంలోనే 766 మీటర్ల పొడవైన అతిపెద్ద రోప్‌వే టూరిజంగా పేరున్న త్రికూట్ రోప్‌వేపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. The Indian Air Force @IAF_MCC continues rescue operations of stranded people at the #DeogharRopewayAccident site Operations re-commenced early in the morning today & progressing briskly @SpokespersonMoD @drajaykumar_ias @SWComd_IA @suryacommand @salute2soldier @adgpi @mygovindia pic.twitter.com/I8DguVV2IO — PRO Jaipur MoD (@PRODefRjsthn) April 12, 2022 శ్రీరామ నవమి రోజున ఆనందంగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దేవ్‌గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో బాబా బైద్యనాథ్ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతంపై వెళ్లేందుకు రోప్ వే ఎక్కుతుంటారు. ఆదివారం ఆ రోప్ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు సాంకేతికలోపంతో ప్రమాదానికి గురయ్యాయి. కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. పలువురు గాయపడగా.. 12 క్యాబిన్లలో 50 మంది 19 గంటలకుపైగా చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఈ ప్రమాదం జరగ్గా.. సుమారు 40 గంటలపాటు కేబుల్ కార్లలో చిక్కుకున్న వాళ్లను రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగింది. #DeogharRopewayAccident: A woman fell during the rescue operations after her rope broke. She was immediately rushed to the hospital for treatment where she was declared brought dead pic.twitter.com/WHtN6orOkM — Zee News English (@ZeeNewsEnglish) April 12, 2022 గాల్లోనే ప్రాణాలు గాల్లోనే.. ఇదిలా ఉండగా.. రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రతికూల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా సహాయక చర్యలు మొదలుకాగా.. రెస్క్యూ ఆపరేషన్ సాగదీతగా కొనసాగడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. రాకేష్ నందన్ అనే మధ్యవయస్కుడు సేఫ్టీ బెల్ట్ తెగిపోయి లోయలో పడిపోవడంతో మరణించాడు. మరో మహిళ తాడు తెగి పడిపోవడంతో మరణించింది. రోప్ వే కార్లు అత్యంత ఎత్తులో ఉండడం, పైగా పొగమంచు కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. డ్రోన్ల సాయంతో ఆహారం, నీటిని సరఫరా చేశారు అధికారులు. అయినప్పటికీ విమర్శలు చల్లారడం లేదు. -
IND vs NZ: రెండో టి20ని వాయిదా వేయండి.. హైకోర్టులో పిల్ దాఖలు
India vs New Zealand 2021 2nd T20I: PIL Filed in Jharkhand HC for Postponement of 2nd T20: టీమిండియా, కివీస్‌ల మధ్య రెండో టి20 నవంబర్ 19న రాంచీ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ దీరజ్ కుమార్ అనే లాయర్ జార్ఖండ్ హైకోర్టులో గురువారం పిల్ దాఖలు చేశారు. స్టేడియంలో వంద శాతం ప్రేక్షకులను ఎలా అనుమతి ఇస్తారంటూ ఆయన తన వాజ్యంలో పేర్కొన్నారు. కరోనా నిబంధనల కారణంగా ప్రజలు ఎక్కువగా గూమిగూడే మాల్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ క్లాంపెక్స్ వంటి ప్రదేశాల్లో 50శాతం మందిని మాత్రమే అనుమతించాలని రాష్ట్రంలో్ నిబంధన ఉంది. ఇప్పుడు క్రికుట్ మ్యాచ్ పేరుతో 100 శాతం సీటింగ్‌కు అనుమతించడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని లేదంటే మ్యాచ్‌ను వాయిదా వేయాలని కోర్టును కోరారు. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు అయితే రాంచీ వేదికగా జరగనున్న టి20 మ్యాచ్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మాత్రం మ్యాచ్ జరగనున్న స్టేడియానికి అన్ని సీట్లకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వడం వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్ రవీంద్ర.. సచిన్, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం? -
దాణా కేసులో లాలూకు బెయిల్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు(73) జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్ నంబర్ మార్చొద్దని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్ సిన్హా వ్యతిరేకించారు. అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్ దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
2008 ఎస్సై ఉద్యోగాలు: జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు
రాంచీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆదేశించింది. అలా చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రతిభ ఆధారంగా కొలువులు కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు 2008లో ఎస్సై నియామకాలపై దాఖలైన కేసులో రాంచీ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జార్ఖండ్‌లో 2008లో ఎస్సై ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయగా తుది ఫలితాల అనంతరం 382 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే తమకు మెరిట్ ఉన్నప్పటికీ తుది జాబితాలో పేర్లు లేవని 43 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. విచారణ చేసిన ఆ కమిటీ తుది ఫలితాల్లో తప్పిదాలను గుర్తించి 43 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించింది. ఈక్రమంలో కమిటీ నిర్ణయం ద్వారా ఉద్యోగం దక్కని మిగతావారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు తొలుత ప్రకటించిన 382 మందికే ఉద్యోగాలు ఇవ్వాలని, కమిటీ సూచించిన ఆ 43 మంది పేర్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరలా ఆ 43 మంది హైకోర్టు తలుపు తట్టగా.. జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ మేరకు ఎస్సై నియమాలకు సంబంధించి 43 మంది మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేసింది. మెరిట్ ఉన్నప్పటికీ పోస్టు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం కిందకు వస్తుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నియామకాల్లో పొరపాట్లకు పాలక సంస్థలదే బాధ్యత అని వ్యాఖ్యానించింది. -
మాజీ ముఖ్యమంత్రికి మళ్లీ నిరాశ
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు. దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి. -
ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త!
న్యూఢిల్లీ/రాంచీ: మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త పేరును చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ఉగ్రవాదుల జాబితా నుంచి అతడి పేరు, ఫొటోను వెబ్సైట్ నుంచి తొలగించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే సదరు వ్యాపారవేత్తపై నమోదు చేసిన అభియోగాలు మాత్రం సరైనవేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. బొగ్గు వ్యాపారం, స్టీల్ ప్లాంట్లు కలిగి ఉన్న అధునిక్ గ్రూప్ అధినేత మహేష్ అగర్వాల్ జార్ఖండ్‌లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా స్థానిక మావోయిస్టు సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ)కి అతడు నిధులు సమకూరుస్తున్నట్లు ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2016 నాటి కేసు(బిహార్, జార్ఖండ్‌లో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి నక్సల్స్ భారీ మొత్తంలో దోచుకున్నారన్న ఆరోపణలు)కు సంబంధించి ఈ ఏడాది జనవరి 10న ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది. (చదవండి: దీపావళి: చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం!) ఈ నేపథ్యంలో రాంచిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మహేష్‌కు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 17 నాటి ఈ ఆదేశాల తర్వాత ఎన్ఐఏ తన వెబ్సైట్లో మహేష్ అగర్వాల్‌ను మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా పేర్కొంటూ అతడి ఫొటోను అప్లోడ్ చేయడం చర్చకు దారితీసింది. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అగర్వాల్ తరఫు న్యాయవాది నితీశ్ రానా జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నా క్లైంట్‌ను అనవసరంగా ఇరికించారు. నిజానికి తను ఈ కేసులో కీలక సాక్షి. ఈ విషయాన్ని ఎన్ఐఏ కూడా ధ్రువీకరించింది. 2019లో ప్రత్యేక న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద మహేష్‌ను సాక్షిగా పేర్కొంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా ఆయనను నిందితుడిగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేనప్పటికి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది. అంతేకాదు ఉగ్రవాదుల జాబితాలో ఆయన పేరు, ఫొటోను ఉంచి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించింది’’అని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 21న మహేష్ అగర్వాల్ పేరును ఉగ్రజాబితా నుంచి తొలగించిన ఎన్ఐఏ, అభియోగాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు నవంబరు 3న దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్‌డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
హైకోర్టులో లాలూ బెయిల్ పిటిషన్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇప్పటికే సగం శిక్షను అనుభవించిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన అప్పీల్ చేశారు. దియోగర్ ట్రెజరీ విత్‌డ్రాయల్స్‌లో 90లక్షల రూపాయల మేర అవినీతి పాల్పడిన కేసులో లాలూకు 2017 డిసెంబర్లో సీబీఐ కోర్టు 42 నెలలు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధించింది. కాగా, దాణా కుంభకోణం కేసులో భాగంగా బిర్సాముండా సెంట్రల్ జైలులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ బెయిల్ పిటిషన్‌పై అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, సీబీఐ న్యాయవాది రాజీవ్ సిన్హా స్పందిస్తూ పిటిషన్ అందిందని చెప్పారు. -
రేపు లాలూ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును గురువారానికి రిజర్వ్‌లో ఉంచుతూ జస్టిస్ ఆర్.ఆర్.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఐదేళ్లు జైలు శిక్ష ఎదుర్కొంటున్న లాలూ తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే కేసులో జైలు శిక్షపడ్డ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. లాలూ, మిశ్రాతో పాటు మొత్తం 43 మందికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తీర్పును రద్దు చేయాలని కోరుతూ వీరందరూ హైకోర్టును ఆశ్రయించారు. -
'దాణా స్కాం తీర్పు'పై హైకోర్టును ఆశ్రయించిన లాలూ
దాణా స్కాంలో దోషీగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన గురువారం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా లాలూ న్యాయస్థానాన్ని కోరారు. దాణా స్కాంలో లాలూకు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్లు చొప్పున ఇటీవల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేగాక ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు.