రాంచీ: గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసు విచారణ కోసం వ్యక్తిగతంగా రాంచీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపు ఇచి్చంది. ప్రస్తుతానికి రాహుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు.
పరువు నష్టం కేసులో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రాంచీ ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు ఇచి్చన ఉత్తర్వును సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌పై జార్ఖండ్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. 2019 ఏప్రిల్‌లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రదీప్ మోదీ అనే వ్యక్తి రాంచీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment