దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్పై జార్ఖండ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును గురువారానికి రిజర్వ్లో ఉంచుతూ జస్టిస్ ఆర్.ఆర్.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఐదేళ్లు జైలు శిక్ష ఎదుర్కొంటున్న లాలూ తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదే కేసులో జైలు శిక్షపడ్డ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. లాలూ, మిశ్రాతో పాటు మొత్తం 43 మందికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తీర్పును రద్దు చేయాలని కోరుతూ వీరందరూ హైకోర్టును ఆశ్రయించారు.
రేపు లాలూ బెయిల్ పిటిషన్పై తీర్పు
Published Wed, Oct 30 2013 4:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement