'దాణా స్కాం తీర్పు'పై హైకోర్టును ఆశ్రయించిన లాలూ
దాణా స్కాంలో దోషీగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన గురువారం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా లాలూ న్యాయస్థానాన్ని కోరారు.
దాణా స్కాంలో లాలూకు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్లు చొప్పున ఇటీవల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేగాక ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు.