fodder scam
-
ఆర్జేడీ పాలనలో జంగిల్‌రాజ్
భాగల్పూర్: బిహార్‌లో విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తోపాటు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ఆటవిక రాజ్యం నడిచిందని, పశువుల దాణాను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లోని భాగల్పూర్లో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి’19వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లకుపైగా సొమ్ము జమచేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభావేదికవద్దకు చేరుకున్నారు. సభలో దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పేర్లు నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు. జంగిల్‌రాజ్‌వాలా మన విశ్వాసాలను కించపరుస్తున్నారని, సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అతిపెద్ద ఐక్యతా వేడుక అయిన మహాకుంభమేళాను సైతం దూషిస్తుండడం దారుణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సైతం జంగిల్‌రాజ్‌వాలా వ్యతిరేకించారని విమర్శించారు. అలాంటి వారిని బిహార్ ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే జరిగింది తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాతే అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు. శరవేగంగా వ్యవసాయ రంగ వృద్ధి తమ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలతో దేశంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. పీఎం–కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటిదాకా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.5 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రభుత్వ కృషితో అన్నదాతల గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, వారికి నూతన శక్తి లభించిందని పేర్కొ న్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో కోట్లాది మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారని, వారికి మార్కెట్ సదుపాయం మరింతగా అందుబాటులోకి వస్తోందని, తద్వారా ఆదాయం పెరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. మన అన్నదాతలను చూసి ప్రభుత్వం గరి్వస్తోందని వ్యాఖ్యానించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మఖానా సూపర్ ఫుడ్ మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దాంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో సాగవుతున్న మఖానాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పాను. తాను మఖానాను విరివిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటుంటానని అన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించామని గుర్తుచేశారు. భాగల్పూర్ సభలో మఖానాలతో రూపొందించిన దండను అభిమానులు మోదీకి బహూకరించారు. -
దాణా కుంభకోణం: 89 మందిని దోషులుగా తేల్చిన సీబీఐ కోర్టు
పాట్నా: దాణా కుంభకోణం కేసులో మొత్తం 89 మంది దోషులుగా తేలగా వారిలో 52 మందికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో 35 మందిని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ శ్రీవాస్తవ్ నిర్దోషులుగా ప్రకటించారు. బీహార్‌లో విభజన జరగక ముందు డోరండా ట్రెజరీ నుంచి 1990 మరియు 1995 మధ్య రూ.36.59 కోట్ల అవినీతికి సంబంధించిన ఈ కేసులో మిగిలిన 36 మందిపై విచారణ సెప్టెంబర్ 1న జరుగుతుందని నిందితుల తరపు న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపారు. 1990ల్లో డోరండా, డియోఘర్, దుమ్కా, చైబాసా వంటి ట్రెజరీల నుండి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఈ స్కాం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయట ఉన్నారు. ఇది కూడా చదవండి: కమ్యూనిస్టుల కంచుకోటనే కూల్చేశా.. మీరెంత? -
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది. -
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court).. సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణా కుంభకోణానికి(fodder scam) సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇవాళ జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. 73 ఏళ్ల లాలూ.. దుమ్కా, దియోగర్, చాయ్‌బస ట్రెజరీల కేసులకు సంబంధించి.. 14 జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దొరండా ట్రెజరీ కేసు తీర్పు వెలువడేంత వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు.ఆపై అరోగ్య సమస్యలతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆరో కేసు బంకా ట్రెజరీకి సంబంధించింది ఇంకా విచారణ దశలోనే ఉంది. చదవండి: ఆర్జేడీ చీఫ్‌గా చిన్నకొడుకు తేజస్వి యాదవ్? లాలూ తీవ్ర వ్యాఖ్యలు -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్!
పేదల బియ్యం పక్కదారి పట్టాయి.. వేలాది క్వింటాళ్లు అక్రమర్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ దందాకు పరిగి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ దండుకోగా.. ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు తమ దందాకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పేదలు తినే బియ్యాన్ని సేకరించి.. కోళ్ల దాణా తయారీలో వాడుతున్నారు. వందలాది టన్నుల రేషన్ బియ్యాన్ని నూకల పేరుతో కోళ్ల దాణా తయారీ కోసం నిల్వ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఈ విషయం బట్టబయలైంది. పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గేట్ సమీపంలో ఉన్న నాగార్జున ఫీడ్ ఫ్యాక్టరీ ఈ దందాకు వేదికైంది. రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాలో కలిపి సొమ్ము చేసుకుంటున్న ముఠా వ్యవహారం గుట్టురట్టయ్యింది. సాక్షి, పరిగి: పేదల కడుపునింపే వందలాది క్వింటాళ్ల రేషన్ బియ్యం కోళ్ల దాణాగా మారుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది గుట్టుగా ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రూప్‌ఖాన్‌పేట్ సమీపంలోని నాగార్జున ఫీడ్స్ (కోళ్ల దాణా తయారు చేసే ఫ్యాక్టరీ)పై దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2వేల పైచిలుకు బస్తాల (100 టన్నులకు పైగా) రేషన్ బియ్యం గుర్తించి సీజ్ చేశారు. కోళ్ల దాణాలో నూకలు మాత్రమే కలపాల్సి ఉండటంతో రికార్డుల్లో మాత్రం నూకల పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు చూపించారు. రైస్ మిల్లులు కేంద్రంగా సరఫరా... ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని.. కోళ్ల దాణాకు ఎవరు సరఫరా చేశారు..? ఇందులో సూత్రధారులు ఎవరు... ఎవరి పేరున కొనుగోలు చేశారు..? అనే విషయాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులు, రిజిస్టర్లు, బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. దోమ మండల పరిధిలోని పోలెపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రైస్ మిల్లు మరియు పరిగికి చెందిన ఓ ట్రేడర్ ద్వారా రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణా ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్లు గుర్తించారు. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు కొనుగోలు చేసింది, రేషన్ బియ్యమే అయినా.. నూకల పేరుతో బిల్లులు ఇవ్వటం గమనార్హం. దందాలో పలువురి పాత్ర.... ఈ దందాలో పలువురి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. నిఘావర్గాలపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడం వెనక కొందరు రేషన్ డీలర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. మరో వైపు రైస్ మిల్లుల నిర్వాహకులు చిన్న స్థాయిలో బియ్యం దందా చేసే వారి నుంచి రేషన్ బియ్యం సేకరించి.. డంపులుగా మార్చి.. ఇలా దాణా ఫ్యాక్టరీలకు.. ఇతర చోట్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా పలు శాఖల అధికారుల సహకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. దాడుల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఫేక్ ఫయాజ్ అహ్మద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నోముల మురళి సంఘట స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పచ్ నర్సింహ్మ, బీజేపీ నాయకులు పెంటయ్యగుప్త, హరికృష్ణ, సీపీఎం నాయకులు వెంకటయ్య, సీపీఐ నాయకులు పీర్ మహ్మద్ వెంకటేశ్ తదితరులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేస్తాం రికార్డుల్లో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. నాగార్జున ఫీడ్ కంపెనీ యజమాని రాజేందర్‌రెడ్డి, ట్రేడర్ కిరణ్, భాగ్యలక్ష్మి రైస్‌మిల్ ఓనర్ నారాయణపై కేసులు నమోదు చేస్తాం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేసి గోదాంకు తరలిస్తున్నాం. – నోముల మురళి, విజిలెన్స్ అడిషనల్ ఏఎస్పీ -
పశుగ్రాస స్కాంలో లాలూకు ఊరట
రాంచీ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దియోగఢ్ ట్రెజరీకి సంబంధించిన పశుగ్రాస కుంభకోణంలో జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం లాలూ అప్పీళ్లను కోర్టు పలుమార్లు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో జూన్ 13న ఆర్జేడీ చీఫ్ లాలూ జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సైతం లాలూ ప్రసాద్ బెయిల్ వినతిని తిరస్కరించింది. లాలూ బెయిల్‌పై స్పందించాలని కోర్టు సీబీఐని కోరగా, లాలూకు బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ తీవ్రంగా ఆక్షేపించింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దియోగఢ్ ట్రెజరీ పశుగ్రాస కేసులో లాలూకు బెయిల్ లభించినా ఇదే స్కామ్‌కు సంబంధించి మరో కేసులో విచారణ న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉండటంతో లాలూ జైలులోనే గడపాల్సిన పరిస్ధితి నెలకొంది. -
నామ్‌కే వాస్తే లాలూ!
ఈ ఎన్నికల్లో ‘నామ్‌కే వాస్తే’ అభ్యర్థుల బెడద అసలు అభ్యర్థులకు తప్పడం లేదు. ఊరూ పేరూ లేకున్నా పాపులర్ రాజకీయ వేత్తల పేర్లున్న సాధారణ పౌరులను అసలు సిసలు అభ్యర్థులపై పోటీకి నిలబెట్టి ఓట్లు చీల్చే ప్రక్రియతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. మే 6న పోలింగ్ జరిగే సారణ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు కూడా ఉండడంతో అక్కడి ఓటర్లు తికమకపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నిజానికి అభ్యర్థుల జాబితాలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం దాణా స్కాంలో జైల్లో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు అయిన అసలు సిసలు లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఈ లాలూ కేవలం ఓ సాదాసీదా నామ్‌కే వాస్తే లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే. అయితే 2014లో రబ్రీదేవి మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ మామూలు లాలూ ప్రసాద్ యాదవ్‌కి 9,956 ఓట్లు వచ్చాయి. ఇతని మాదిరిగానే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరి పేరున్న మరో వ్యక్తి కూడా 2014లో రబ్రీ దేవిపై పోటీ చేశారు. అతనికి కూడా 14,688 ఓట్లు రావడం విశేషం. అయితే ఇలా ఒకే పేరున్న అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్లనే రబ్రీదేవి ఆ ఎన్నికల్లో 40,948 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఈ నామ్‌కే వాస్తే లాలూ యాదవ్ తనకు ఏ స్థిర చరాస్తులూ లేవని నామినేషన్ పత్రాల్లో నమోదు చేశారు. అలాగే ఇతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నప్పటికీ వారి వివరాలేవీ ఇందులో పొందుపరచలేదు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 25,000 రూపాయలను చెల్లించి నామినేషన్ పత్రాలను పొందిన లాలూ కాని లాలూ ప్రసాద్ భవిష్యత్తులో తమ ఓటర్లను తికమకపెట్టే పరిస్థితి ఉందని ఆర్జేడీ ఆందోళన పడుతోంది. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
లాలూను శిక్షించిన జడ్జీ ఇంట్లో దొంగతనం
లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష వేసిన జడ్జీ శివపాల్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సీబీఐ కోర్జు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న శివపాల్ ఉత్తరప్రదేశ్‌లోని జలాలున్లో నివాసం ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి ఆయన ఇంట్లోకి దొంగలు చొరబడి 60,000 రూపాయలు, రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. శివపాల్ సోదరుడు సురేంద్ర సింగ్ గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగగొట్టి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ్‌పాల్ సింగ్ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
లాలూకు మూడు రోజుల పెరోల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు. అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఎస్పీ నా బాస్ అనుకుంటున్నారా : లాలూ
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎయిమ్స్ నుంచి రాంచీకి తరలించే క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ పోలీసు లాలూను వెనక్కి వెళ్లమని చెప్పటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎస్పీ చెప్పాడని నన్ను వెనక్కి నెడుతున్నారు.. ఎస్పీ ఏమైనా నా బాస్ అనుకుంటున్నారా అంటూ’ లాలూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇప్పటికే లాలూను రాంచీకి తరలించడంపై ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. తేజస్వీ యాదవ్ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ వైద్యులది తొందరపాటు నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇక్కడి నుంచి తరలించడం పెద్ద కుట్ర : లాలూ ఇప్పటికే ఎయిమ్స్ వైద్యుల తీరును తప్పుబడుతూ.. తనకు హాని జరిగితే మీదే బాధ్యత అంటూ లాలూ లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను సోమవారం ఎయిమ్స్ నుంచి తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు. తనను రాంచీకి తరలించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నా ఆరోగ్యం క్షీణించటానికే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు లేనిచోటుకి తరలిస్తున్నారని.. దీనిని ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. చదవండి : తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన -
తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదటపడక ముందే, ఆయన ఇష్టం లేకున్నా న్యూఢిల్లీ ఎయిమ్స్ నుంచి జార్ఖండ్ ఆస్పత్రికి ఎందుకు తరలించాలని నిర్ణయించుకున్నారని తేజస్వీ ప్రశ్నించారు. పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎయిమ్స్ నుంచి లాలూను ఎందుకు డిశ్ఛార్జ్ చేయాలనుకున్నారో సంబంధిత అధికారులు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ హాస్పిటల్‌తో పోల్చితే ఎయిమ్స్ బెస్ట్ హాస్పిటల్ అని తన తండ్రి లాలూను అక్కడే ఉంచి చికిత్స అందించాలని తేజస్వీ కోరారు. ఎయిమ్స్‌కు లాలూ లేఖ తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, ఎయిమ్స్‌లోనే చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. రాంచీ హాస్పిటల్‌కు నన్ను ఇప్పుడే షిఫ్ట్ చేయవద్దు. రాంచీలో పూర్తి సౌకర్యాలు లేవు. నాకు ఎదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ లాలూ ప్రసాద్ యాదవ్ లేఖ రాశారు. కాగా, లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాలూకు మద్దతుగా ఎయిమ్స్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. -
మా నాన్నకు ప్రాణహాని ఉంది!
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ను దాణా కుంభకోణం వెంటాడుతోంది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయనను దోషిగా తేల్చిన రాంచీ కోర్టు.. శనివారం లాలూకు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. దాణా స్కాంలో లాలూకు వరుసగా జైలుశిక్షలు పడుతున్న నేపథ్యంలో ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. ‘మా నాన్నకు ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పుందని భయం కలుగుతోంది’ అని ఆయన శనివారం విలేకరులతో పేర్కొన్నారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర చేసినట్టు కనిపిస్తోందని తెలిపారు. ‘బీజేపీ, (బిహార్) సీఎం నితీశ్‌కుమార్ లాలూను చూసి భయపడుతున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావొద్దని కోరుకుంటున్నారు. లాలూ జైలు నుంచి వస్తే.. రెండోసారి ప్రధానమంత్రి కావాలన్న నరేంద్రమోదీ కల నెరవేరదన్న విషయం వారికి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు’ అని తేజస్వి పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ కొట్టిపారేశారు. జైలులో లాలూను ఎవరు కలువలేరు. అలాంటప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. -
మూడో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992–93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ ప్రసాద్..ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు. బిహార్ మాజీ మంత్రి విద్యాసాగర్ నిషద్, బిహార్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ జగదీశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యేలు ధ్రువ్ భగత్, ఆర్కే రాణా, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు దోషుల జాబితాలో ఉన్నారు. తీర్పు వెలువడిన అనంతరం లాలూ కొడుకు, బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ‘సీబీఐ కోర్టు తీర్పుకు మేం కట్టుబడి ఉంటాం. అయితే ఈ తీర్పే అంతిమం కాదు. హైకోర్టులో అప్పీల్ చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని అన్నారు. బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, బీజేపీ కలసి కుట్రపన్ని తన తండ్రిని ఈ కేసుల్లో ఇరికించాయని తేజస్వీ ఆరోపించారు. అన్ని శిక్షలూ ఏకకాలంలోనే అమలు దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం ఐదు కేసులుండగా వాటిలో లాలూకు ఇప్పటికే మూడు కేసుల్లో శిక్ష ఖరారైంది. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. తొలికేసులో తీర్పు 2013లోనే వెలువడగా అప్పట్లో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. రెండో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 6న వచ్చింది. ఈ కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానాను సీబీఐ కోర్టు విధించింది. తొలి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నరేళ్లు, మూడో కేసులోనూ ఐదేళ్లు కలిపి మొత్తం లాలూకు పదమూడున్నరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి కాబట్టి ఆయన ఐదేళ్లు మాత్రమే జైలులో ఉంటే చాలు. మరో రెండు కేసుల్లోనూ లాలూ ఇంకా నిందితుడిగా ఉన్నారు. వాటిలోనూ దోషిగా తేలి శిక్ష పడితే..అన్ని కేసుల్లోకెళ్లా అత్యధిక శిక్షాకాలం ఏది ఉంటుందో అంతకాలం మాత్రం ఆయన జైలులో ఉండాల్సి ఉంటుంది. -
'జడ్జీగారు ప్లీజ్.. నన్ను ఆ జైలులో పెట్టొద్దు'
సాక్షి, రాంచీ : 'సర్, దయచేసి ఒకసారి ఓపెన్ జైలు నియమనిబంధనలు చూడండి.. 60 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లకు పైగా శిక్ష పడినవారు, మావోయిస్టులకు మాత్రమే ఓపెన్ జైలు. పైగా శిక్ష పడిన వ్యక్తి ఇష్టం లేకుండా మీరు ఆ జైలులో పెట్టడం సరికాదు' అంటూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయమూర్తి శివపాల్ సింగ్‌ను విజ్ఞప్తి చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఓపెన్ జైలులో లాలూ శిక్షను పూర్తి చేయాలని తీర్పు సమయంలో న్యాయమూర్తి చెప్పారు. దీని ప్రకారం ఆయన హజరీబాగ్‌లోని ఓపెన్ జైలుకు వెళ్లాలి. అక్కడ ఓ వంద కాటేజీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అందులో ఉండొచ్చు. పైగా ఏదైనా పనిచేసుకుంటూ, ఏదేని ఓ కళకు సంబంధించిన శిక్షణను కూడా పొందొచ్చు. 2013లో ఈ జైలును ప్రారంభించారు. మావోయిస్టులు, నేర విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, లొంగిపోయినవారు తదితరులను ఆ జైలులో పెడుతుంటారు. లాలూను కూడా అదే జైలులో ఉండాలని న్యాయమూర్తి చెప్పగానే ఆయన నిరాకరించారు. అది మావోయిస్టుల కోసం ఉన్న జైలు అన్నారు. తన ఇబ్బందులు తనకు ఉంటాయని తెలిపారు. అయితే, గతంలో బిర్సా ముండా జైలుకు వెళ్లినప్పుడు లాలూ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించినట్లు స్పష్టమైంది. -
'అతడిపై మాకు అస్సలు అనుమానం రాలేదు'
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ముందుగానే దొంగ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మదన్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు సుమిత్ అనే ఓ వ్యక్తితో తమపై కేసు పెట్టించుకొని ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సరిగ్గా లాలూకు శిక్షపడి ఆ జైలుకు తరలించే ముందే వారు జైలుకు వెళ్లి ఆయనకు సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, మదన్ యాదవ్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడం, దానిపై చర్చ జరుగుతుండటంతో అతడు జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడు నివాసం ఉంటున్న ప్రాంతం వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే మదన్ యాదవ్ ఓ ధనవంతుడు. అతడికి రూ.10వేల దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇక లక్ష్మణ్ యాదవ్ అనే వ్యక్తి లాలూకు ఒకప్పుడు వంటమనిషిగా పనిచేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసుల దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టగా ఆ ఇద్దరు లాలూకు సన్నిహితులని, ఆయనకు సపర్యలు చేసేందుకు వారికి వారే దొంగ కేసులు పెట్టించుకొని జైలుకెళ్లారని గుర్తించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ 'సుమిత్ వచ్చి కేసు పెట్టినప్పుడు మాకు ఎలాంటి అనుమానం రాలేదు. పైగా వారు స్వయంగా కోర్టు మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. అనంతరం వారిని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు పంపించాం. అయితే, వారు లాలూ కోసమే ఫేక్ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లారని తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు. -
లాలూకు మూడున్నరేళ్ల జైలు
-
గడ్డిమేతకు మూడున్నరేళ్ల జైలు
రాంచీ: 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్యాదవ్కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ శనివారం తీర్పునిచ్చారు. లాలూ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. లాలూతోపాటుగా మరో 15 మంది దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగియగా.. నాలుగు గంటలకు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ తీర్పు చెప్పారు. ‘ఇటువంటి దోషులకు ఓపెన్ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఆవులను పెంచిన అనుభవం ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 23నే వీరిని కోర్టు దోషులుగా గుర్తించినప్పటికీ మూడ్రోజులుగా శిక్షల ఖరారు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. మరో 15 మందికీ శిక్షలు ఖరారు మోసం, నేరపూరిత కుట్ర, తప్పుడు పత్రాల వినియోగంతో నిధుల విడుదలతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద లాలూకు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించారని సీబీఐ న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ శిక్షను వచ్చే వారం జార్ఖండ్ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా తెలిపారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. కుంభకోణం జరిగిన సమయంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్న జగదీశ్ శర్మకు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, ఆర్జేడీ నేత ఆర్కే రాణాకు ఆర్నెల్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, ఫూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్‌లకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారు. మాజీ ప్రభుత్వాధికారి కృష్ణ కుమార్‌కు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, మాజీ అధికారి సుబీర్ భట్టాచార్యకు మూడున్నరేళ్ల జైలు రూ. 10 లక్షల జరిమానా, సప్లయర్ మోహన్ ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించారు. మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇవే శిక్షలు పడ్డాయి. చట్టం ముందు అందరూ ఒకటే! లాలూ శిక్షపై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్‌లు స్పందించాయి. చట్టం ముందు అందరూ సమానులేనని బీజేపీ నేత షానవాజ్ వ్యాఖ్యానించారు. ‘కోర్టు తన పని తాను చేసింది. దేశ సంపదను దోచుకునే వారికి ఇదో కీలకమైన గుణపాఠం. ఎట్టకేలకు బిహార్ ప్రజలకు న్యాయం జరిగింది’ అని షానవాజ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. రాజకీయ నేతలు ఇకపై తప్పు చేసేందుకు భయపడాల్సిందేనని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు. లాలూ అరెస్టయినంత మాత్రాన ఆర్జేడీతో సంబంధాలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని వెల్లడించింది. కాగా, బీజేపీ, నితీశ్ కుమార్ కుట్రపన్ని మరీ లాలూను జైలుకు పంపారని ఆర్జేడీ ఆరోపించింది. బెయిల్ కోసం హైకోర్టుకెళ్తామని లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. జైలుకు రెండోసారి దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవించటం ఇది రెండోసారి. 21 ఏళ్ల క్రితం దేవగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల నిధులను అక్రమంగా తీసుకున్నారనే కేసుపై లాలూ జైలుకెళ్తుండగా.. దంకా ట్రెజరీ నుంచి రూ.3.97 కోట్లు, చైబాసా ట్రెజరీ నుంచి రూ.36 కోట్లు, దోరండా ట్రెజరీ నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారనే 3 కేసుల్లోనూ లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. 1996లో పట్నా హైకోర్టు దాణా స్కామ్‌పై విచారణకు ఆదేశించగా.. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో 1997, అక్టోబర్ 27న 38 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. కాలక్రమేణా 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
'సంక్రాంతి తర్వాత వాళ్ల సంగతి చెప్తా'
సాక్షి, పట్నా : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నారేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత ఆయన చిన్నకుమారుడు తేజస్వీయాదవ్ స్పందించారు. తాను ప్రజాక్షేత్రంలోకి వెళతానని, తన తండ్రి ఇచ్చిన సందేశాన్ని వారికి వినిపిస్తానని అన్నారు. సమాజంలో పేద ప్రజలకోసం తన తండ్రిలాగే పోరాటం చేస్తానని మీడియా ప్రతినిధులకు చెప్పారు. తండ్రి లాలూకు శిక్ష పడిన అనంతరం తన పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం అయిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆయన నిప్పులు చెరిగారు. తన తండ్రిపై మోదీ సర్కార్ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో చేతులు కలిపి కుట్ర చేసిందని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేద్దామనే తలంపుతో తమ కుటుంబాన్ని అక్రమ కేసుల చట్రంలో ఇరికించిందని అన్నారు. 'లాలూ పేద ప్రజల రక్షకుడు. కొంతమంది నాయకులకోసమే సీబీఐ మా నాన్నపై చార్జీషీటు వేసిందని ప్రజలందరికీ తెలుసు. అయినా ఏ ఒక్కరూ మా సంకల్పాన్ని సవాల్ చేయలేరు. ఏం చేసినా మేం ఎవరిముందూ మోకరిల్లం. మకర సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కుట్రలు చేసిన వారి సంగతి చెప్తాం. న్యాయవవస్థ తన పని తాను చేసింది. మేం హైకోర్టుకు వెళ్లి బెయిల్ పిటిషన్ వేస్తాం' అని ఆయన చెప్పారు. -
'హార్మోనియం వాయించుకో.. వెచ్చగా ఉంటుంది'
సాక్షి, న్యూఢిల్లీ : ఒక కేసులో దోషిగా తేలి శిక్ష ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ముఖంలో సహజంగా భయం ఉంటుంది. న్యాయమూర్తి ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారోనని దిగులు ఉంటుంది. కానీ, దాణా కుంభకోణం కేసులో అరెస్టు అయ్యి దోషిగా తేలిన బీహార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముఖంలో మాత్రం ఆ ఛాయలు కనిపించలేదు. పైగా కోర్టులో న్యాయమూర్తి శివపాల్ సింగ్‌కు ఆయనకు చాలా సరదా సంభాషణ సాగింది. అది మాములుగా కాదు.. కడుపుచెక్కలయ్యేలా నవ్వుకునేంత జోకులతో.. ఇంతకీ లాలూ, న్యాయమూర్తి ఏం మాట్లాడుకున్నారంటే.. లాలూ : జైలులో బాగా చల్లగా ఉంది జస్టీస్ శివపాల్ సింగ్ : నీకు చలిగా ఉంటే హార్మోనియం, తబలా వాయించుకో వేడిగా ఉంటుంది లాలూ : జైలులో ట్రాన్స్‌జెండర్స్ తోటి ఖైదీలను పెళ్లి చేసుకోండంటూ వేధిస్తున్నారు. జస్టీస్ శివపాల్ సింగ్ : ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా ! అంతా చక్కబడుతుంది. లాలూ : దయచేసి చాలా శాంతమైన మనసుతో నాకు శిక్షను ఖరారు చేయండి జస్టీస్ శివపాల్ సింగ్ : మీ మంచికోరుకునే వారు కూడా నాకు ఫోన్లు చేశారు. మీరేం బాధపడవద్దు.. మీకు శిక్ష విధించేటప్పుడు చట్టాన్ని మాత్రమే అనుసరిస్తాను. అలాగే, లాలూకు శిక్ష విధించే సమయంలో ఓపెన్ జైలులో ఉంచితేనే మంచిదని న్యాయమూర్తి శివపాల్ సింగ్ అన్నారు. ఎందుకంటే గోవుల పెంపకం ఎలాగో తెలుస్తుందంటూ చమత్కరించారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు మొత్తం 15మందికి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమాన విధించారు. -
దాణా కుంభకోణంలో తుది తీర్పు వెల్లడి
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తుది తీర్పు వెల్లడించింది. రాంచీ సీబీఐ కోర్టు... బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్లు జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు దోషులకు మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది. అయితే అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు లాలూకు జైలు శిక్షపై ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. చట్టం తన పని తాను చేసిందని, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
లాలూపై తీర్పు నేటికి వాయిదా!
రాంచీ: దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు పలువురు తనకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ గురువారం వెల్లడించారు. తాను చట్టప్రకారమే తీర్పు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాలూ, శివపాల్‌ల మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. తాను ఉంటున్న బిర్సాముండా జైలులో చలి అధికంగా ఉందని లాలూ జడ్జీకి ఫిర్యాదు చేయగా.. న్యాయమూర్తి స్పందిస్తూ ‘అయితే తబలా వాయించండి’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అనంతరం లాలూ కోర్టులో సరిగ్గా ప్రవర్తించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ‘నేను కూడా న్యాయవాదినే’ అని లాలూ ప్రతిస్పందించారు. -
సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా
రాంచి : దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలో దోషిగా తేలిన 15 మందికి రేపే శిక్ష ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావా కుంభకోణం రెండో కేసులో వీరందరిని గతేడాది డిసెంబర్ 23న దోషులుగా తేలుస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణించడంతో అతడి కేసు తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విషయంలో కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, తేజస్వి యాదవ్, మనోజ్ ఝాలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ముగ్గురు ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన మనోజ్ ఝా ఈ కేసు తీర్పు గురించి తాము ఒక్క మాట మాట్లాడకపోయినా కోర్టు తమకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు. దోషిగా తేలిన అనంతరం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచిలోని బిర్సా ముంద్రా సెంట్రల్ జైలులో ఉన్నారు. దావా కుంభకోణం తొలి కేసులో కూడా లాలూ దోషిగా తేలారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రెండో కేసు విచారణలోనూ లాలూ దోషే అని తేలింది. మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేశారు. లాలూతో పాటు 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
జైల్లో లాలూ స్టైల్ ఇదీ...
సాక్షి, రాంచీ: పశుగ్రాసం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని హాత్వార్ జైలులో ఉంచారు. ఈ జైలులో లాలూ తన రొటీన్ లైఫ్‌కు ఏ మాత్రం భంగం కలుగనిరీతిలో వ్యవహరిస్తున్నారు. జైలులోని అప్పర్ డివిజన్ సెల్లో లాలూ లీజర్ టైమ్ గడుపుతున్నారు. ఇదే జైలులో ఉన్న సహచర రాజకీయ నేతలతో పలుమార్లు తేనీరు సేవిస్తూ మంతనాలు జరుపుతూ లాలూ హుషారుగా కనిపిస్తున్నారు. ఉదయాన్నే వార్తాపత్రికలు చదవడం, ఆయా వార్తలపై రాజకీయ సహచరులతో విపులంగా చర్చించడంతో లాలూ రోజు మొదలవుతుంది. వారి చర్చలు ప్రధానంగా బీహార్, జార్ఖండ్ రాజకీయాల చుట్టూ తిరుగుతాయని జైలు వర్గాలు తెలిపాయి. లాలూ సెల్‌కు దగ్గరలోనే అప్పర్ డివిజన్ సెల్ మెస్ ఉండటంతో రోజంతా లాలూ బృందానికి టీలు, స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. లాలూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయంలో సెల్‌లోని ఇతర ఖైదీలు టీవీ చూస్తుంటారు. సెల్లో లాలూతో పాటు మాజీ ఎంపీ ఆర్కే రాణా, నేతలు జగదీష్ శర్మ, స్వర్ణ లక్రా, రాజా పీటర్, కమల్ కిషోర్ భగత్లున్నారు. ఇక లాలూకు ఇష్టమైన స్వీట్ కార్న్, వేయించిన బఠాణీలు, బాస్మతి రైస్ తదితర వంటకాలను జైలు మెస్‌లో అందుబాటులో ఉంచారు. లాలూ నివాసం నుంచి సంకట్ మోచన్ ఆలయ ప్రసాదం పంపారు. -
తొలిరాత్రి.. ఎలా గడిచిందంటే..?!
సాక్షి, రాంచీ : గడ్డి కుంభకోణంలో దోషిగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముండ జైలులో ఖైదీగా ఉన్నారు. లాలూ యాదవ్‌కు జైలులో ఖైదీనెంబర్ 3351, వీఐపీ గదిని కేటాయించారు. లాలూకి రాత్రి రోటీ, పాలక్ కర్రీని అందించినట్లు జైలు అధికారులు తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం లాలూకు టీ, బిస్కెట్లు అందించినట్లు వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆదివారం నాడు లాలూని కలిసిందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. వీఐపీ గది.. రాజభోగాలు బిర్సా ముండల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూప్రసాద్ యాదవ్‌కు జైలు అధికారులు వీఐపీ జైలు గదిని కేటాయించారు. ఈ గదిలో ఆటాచ్ బాత్రూమ్తో పాటు, కేబుల్ కనెక్షన్ ఉన్న టీవీ సెట్, అవసరమైన మందులు, దోమతెర, దిండు, కుర్తా - ఫైజామా జత బట్టలు, చలిని తట్టుకునేందుకు అనువైన బ్లాంకెట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. జైల్లో ఆయనే స్వంతంగా ఆహారాన్ని వండుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. నిద్రలేని రాత్రి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో జైలు లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి జైలు పక్షిలా మారారు. జైలులో లాలూకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినా.. రాత్రంతా జైలులో నిద్రపోలేదని అధికారులు చెబుతున్నారు. అటూఇటూ తిరుగుతూ, దీర్ఘంగా ఆలోచిస్తూ.. రాత్రిని గడిపారని చెబుతున్నారు. ఉదయాన్నే జైలు గదిని బయటకు వచ్చిన లాలూ.. కూరగాయలు తోటను పరిశీలించి.. అక్కడే మార్నింగ్ వాక్ చేశారని జైలు అధికారులు చెబుతున్నారు. హైకోర్టులో సవాలు చేస్తా: సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తానని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. భారతీయ జనతాపార్టీ తనపై రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నా చివరి శ్వాస వరకూ సామాజిక సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నీచ రాజకీయాలకు దిగుతోందని లాలూ యాదవ్ ఆరోపించారు. బెయిల్ కష్టమే ఇదిలా ఉండగా.. లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో మూడు కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు బెయిల్ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. -
‘లాలూకు బెయిల్ కష్టమే’
సాక్షి,పాట్నా: పశుగ్రాస కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ దోషిగా తేలిన క్రమంలో ఆయనకు జనవరి 3న శిక్ష ఖరారు కానుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాలూకు బెయిల్ లభించడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వరుసగా నేరాలకు పాల్పడే వారికి బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయని, అందులో రెండవ సారి దోషిగా తేలిన వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉంటాయని పాట్నాహైకోర్టు సీనియర్ న్యాయవాది వైవి గిరి పేర్కొన్నారు. మరోవైపు లాలూపై జార్ఖండ్‌లో ఐదు కేసులు, బీహార్‌లో ఒక కేసు నమోదైందని, జార్ఖండ్‌లో ఐదు కేసులకు గాను రెండు కేసుల్లో ఆయన దోషిగా తేలారని, మిగిలిన కేసులు వివిధ విచారణ దశల్లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది. దుంకా ట్రెజరీ నుంచి రూ 3.9 కోట్లు, చైబస ట్రెజరీ నుంచి రూ 36 కోట్లు, దొరాండ ట్రెజరీ నుంచి రూ 184 కోట్లు, భాగల్పూర్ ట్రెజరీ నుంచి రూ 45 కోట్ల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది.లాలూపై కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు తక్షణం బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
బాధలేదు.. ఇప్పుడు నా కొడుకున్నాడు : లాలూ
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో శనివారం తన భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాస్త మనోనిబ్బరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2013లో ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చే సమయంలో తాను జైలుకు వెళితే తన పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అని బాధపడ్డారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయనకు ఆ బాధ అస్సలు లేదు. 'పార్టీ గురించి నేనిప్పుడు బాధపడాల్సిందేమి లేదు.. అక్కడ తేజస్వీ ఉన్నాడు. అయినా మాకు అన్యాయం జరగదు. బీజేపీ కుట్రలను న్యాయం విడిచిపెట్టదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆయన ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు. రాంచీలోని సీబీఐ కోర్టుకు మరికొద్ది గంటల్లో వెళ్లనుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే ఆర్జేడీని సమర్ధంగా నడిపిస్తారని లాలూ విశ్వసిస్తున్నారు. కాగా, బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991-1994 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ
రాంచీ: దాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సాక్ష్యులను ఆయన ప్రవేశపెట్టారు. గత మంగళవారం కూడా లాలూ ఇదే కోర్టుకు హాజరై మరో కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఐదు కేసులుండగా ఒక కేసుకు సంబంధించి దోషిగా తేలటంతో సీబీఐ న్యాయస్థానం గత మే నెలలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. -
లాలూ కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ బిహార్ ప్రభుత్వంలో మంత్రులే అయినా.. వాళ్లు వివిధ వివాదాల్లో చిక్కుకొని గత నెల రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, పాతికేళ్ల నాటి పశుదాణా కుంభకోణం కేసుల్లో కుట్రపూరిత ఆరోపణలపై విచారణను కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం లాలూ ప్రసాద్‌కు శరాఘాతమే. బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు 1990 నుంచి 1997 మధ్య వెయ్యి కోట్ల రూపాయల పశుదాణా కుంభకోణం జరిగింది. ఇందులో అధికారులతో పాటు నాటి ముఖ్యమంత్రి లాలూకు ప్రమేయం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో పలువురు అధికారులకు శిక్ష పడినా లాలూకు శిక్ష పడలేదు. 2014లో జార్ఖండ్ హైకోర్టు ఆయనపై దాఖలైన కుట్రపూరిత ఆరోపణలను కూడా కొట్టేసింది. ఇప్పుడు ఆ ఆరోపణలపై విచారణ చేపట్టి 9 నెలల్లోగా పూర్తిచేయాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాలూ ప్రసాద్, నేరస్థుడైన రాజకీయ నాయకుడు మహమ్మద్ షాబుద్దీన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల టేపును కొత్తగా ప్రారంభమైన న్యూస్ చానల్ ‘రిపబ్లిక్ టీవీ’ ప్రసారం చేసింది. షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేస్తుంటే వాటిని శిరసావహిస్తానని లాలూ చెప్పడం ఆ సంభాషణల సారాంశం. బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న లాలూ కుమారులు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, అంటే 2004 నుంచి 2009 మధ్య అనుమానాస్పద భూ ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్నాలో ఈ అన్నాదమ్ములకు ఓ పెట్రోలుబంకు ఉన్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకపోవడం వారిపై వచ్చిన మరో వివాదం. లాలూ, ఆయన కుమారులకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేయడంలో పట్నా జంతు ప్రదర్శనశాల సరైన బిడ్డింగ్ ప్రక్రియను పాటించలేదన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేయడం మరోటి. లాలూ, ఆయన కుమారులపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ విచారణయోగ్యమైనవి అనడంలో సందేహం లేదు. ఒకే సమయంలో ఇవన్ని కూడా వెలుగులోకి రావడం, బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడం వెనకనున్న రాజకీయం ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అటు ఢిల్లీలో లాలూ కుటుంబాన్ని ఎండగడుతుండగా, బీజేపీ మరో సీనియర్ నాయకుడు సుశీల్ మోడీ బిహార్‌లో ఎండగడుతున్నారు. నితీష్–లూలూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విడగొట్టడమే ఇక్కడ బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. లాలూకు చెందిన ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుంటే ప్రభుత్వానికి అవసరమైన మద్దతును తామిస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే నితీష్ కుమార్‌కు స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 243 సీట్లలో జేడీయుకు 79 సీట్లు, ఆర్జేడీకి 80 సీట్లు ఉండగా, బీజేపీకి 53 సీట్లున్నాయి. ఈ లెక్కన ఆర్జేడీని బయటకు పంపించినా బీజేపీ మద్దతుతో నితీష్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. అదే జరిగితే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా కేంద్రంలో ఎదగాలనుకున్న నితీష్ కల కూడా కలగానే మిగిలిపోతుంది. కాదని, లాలూ పార్టీతోనే కొనసాగితే, లాలూ తనయులు దోషులుగా తేలితే తన ప్రభుత్వం పరువు పోతుంది. ఈ మీమాంసలో ప్రస్తుతం నితీష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. -
‘దాణా’పై లాలూకు చుక్కెదురు
► దాణా స్కామ్‌లో నాలుగు కేసులను ► వేర్వేరుగా విచారించాలి: సుప్రీంకోర్టు ► తొమ్మిది నెలల్లో విచారణ ముగించాలని ఆదేశం న్యూఢిల్లీ: దాణా కుంభకోణానికి సంబం ధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఈ స్కామ్‌కు సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ వేర్వేరుగా విచా రణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. లాలూపై నేరపూరిత కుట్ర అభియో గాలను కొట్టేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టింది. లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితవరాయ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పశువులకు దాణా కొనుగోలు చేసే నెపంతో రూ.900 కోట్లను పశుసం వర్థక శాఖ నుంచి అక్రమంగా విత్‌డ్రా చేశారు. దీనిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.స్కామ్‌లో లాలూతో పాటు బిహార్ మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా, బిహార్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సజ్జల్ చక్రవర్తి తదితరులు నిందితులుగా ఉన్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి ఒక కేసులో లాలూ దోషిగా నిర్ధారణ కావడంతో మిగతా కేసుల్లో ఆయనపై విచారణను నిలుపుదల చేస్తూ 2014లో జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. కేసు విచారణలో ఒకేవిధంగా స్పందించాలని, ఒకే కేసులో ఒకే వ్యక్తికి సంబంధించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం తగదని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ తీరునూ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడాన్ని ప్రశ్నించింది. అత్యంత కీలకమైన ఈ కేసుపై సీబీఐ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ఈ కేసును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీం ఆదేశాలను బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ స్వాగతిం చారు. ఈ తీర్పుతో రాజకీయాల్లో లాలూ శకం ముగిసినట్టే అని అన్నారు. మిగిలిన మూడు కేసుల్లోనూ లాలూకు శిక్ష పడటం ఖాయమని, దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా మరిన్ని సంవత్సరాలు వేటుపడే అవకాశం ఉందన్నారు. -
లాలూ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ
-
లాలూ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: పశువుల దాణా కుంభకోణం కేసుల్లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ వేసిన కేసుల్లో తాజా విచారణను సైతం ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. లాలూపై అభియోగాలను జార్ఖండ్ హైకోర్టు కిట్టివేయడాన్ని సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. సోమవారం సుప్రీంకోర్టు పనివేళలు ప్రారంభమైన కొద్ది సేపటికే జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ పీసీ ఘోష్‌లతో కూడిన ధర్మానం తీర్పు వెల్లడించింది. ఈ కేసును ’అత్యంత ప్రాధాన్యమైనది’గా భావించాలని సీబీఐ చీఫ్‌కు సూచించిన న్యాయస్థానం.. ఆరు నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటి విచారణను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. మొత్తం నాలుగు కేసులను నమోదుచేసింది. వీటిల్లో ఒక కేసుకు సంబంధించి 2013లోసీబీఐ కోర్టు లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించి, ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. నాటి తీరపును సవాలు చేస్తూ లాలూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జార్ఖండ్ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఐపీసీ సెక్షన్ 120, 120B, 409, 420, 471, 477, 477A, 13(2)ల కింద సీబీఐ లాలూపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ విచారణకు నేడు కోర్టు అంగీకారం తెలిపింది. -
సీబీఐ మాజీ అధిపతి జోగిందర్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ జోగిందర్‌సింగ్(77) శుక్రవారం కన్నుమూశారు. కీలకమైన బోఫోర్స్, దాణా కుంభకోణాల కేసుల విచారణను ఆయన పర్యవేక్షించారు. మాజీ ఎంపీ మనీశ్ తివారి జోగిందర్ మృతి చెందారన్న విషయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు. సుదీర్ఘ అనారోగ్యంతో జోగిందర్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో 1961 బ్యాచ్‌కు చెందిన, కర్నాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన జోగిందర్ సీబీఐ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. పదవీ విరమణ తరువాత ఆయన 25కు పైగా పుస్తకాలు రచించారు. ఓ సందర్భంలో ‘ది హిందూ’ కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ...పలువురు ప్రముఖుల ప్రమేయమున్న దాణా కుంభకోణం విచారణ జరుగుతున్నపుడు తనను బుట్టలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన లాలూ ప్రసాద్
రాంచీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసుకు సంబంధంచి ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూ సహా 38మందికి జూన్ 2న న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో లాలూ దోషిగా రుజువుకావడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. కాగా లాలూ ఆదివారం సాయంత్రమే పట్నా నుంచి రాంచీ చేరుకున్నారు. -
'మాజీ సీఎంను రక్షించేందుకు సీఎం ప్రయత్నం'
పట్నా: బిహార్ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు మాయమైన ఘటనపై పట్నాలోని పాత సచివాలయం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 1990ల్లో బిహార్ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్ ఉన్నప్పుడు దాణా కుంభకోణం వెలుగు చూసింది. పశువుల దాణా కుంభకోణంలో 1000 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కారణంగా లాలూ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. బిహార్ లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌ను రక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఫైళ్లు మాయంకావడంలో నితీష్‌కు సంబంధం ఉందని బీజేపీ నాయకుడు నితిన్ నవీన్ ఆరోపించారు. -
గడ్డి స్కాంతో 44 కోట్ల ఆస్తులు, 18 ఫ్లాట్లు!
ఒక వ్యక్తికి 18 ఫ్లాట్లు ఉన్నాయంటే నమ్ముతారా? కానీ ఉన్నాయి. అంతే కాదు.. అతడి మొత్తం ఆస్తి దాదాపు 44 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఎప్పుడో 1996లో బీహార్‌లో జరిగిన గడ్డిస్కాంలో సంపాదించినవే. వీటిని ఇప్పుడు ఆ రాష్ట్ర ఆదాయపన్ను శాఖ వేలం వేయబోతోంది. త్రిపురారి మోహన్ ప్రసాద్ అనే వ్యక్తి అప్పట్లో బీహార్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు గడ్డి సరఫరా చేసేవారు. ఆయనకు మొత్తం 18 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012 నుంచి మోహన్ ప్రసాద్ జైల్లో ఉన్నారు. అతడి ఫ్లాట్లన్నీ దానాపూర్ ప్రాంతంలోని ఒకే అపార్టుమెంట్లో ఉన్నాయి. అవి ఒక్కోటీ రూ. 37 నుంచి 47 లక్షల వరకు విలువ చేస్తాయి. వీటిని వేలం వేస్తున్న విషయం తెలిసి చాలామందికి ఆసక్తి కలిగిందని, గత కొన్ని రోజులుగా వీటిని వచ్చి చూస్తున్నారని ఆ అపార్టుమెంట్లో ఉండేవాళ్లు చెబుతున్నారు. వేలాన్ని ఆపడానికి మోహన్ ప్రసాద్, ఆయన బంధువులు కోర్టులో కేసులు వేసినా.. పాట్నా హైకోర్టు మాత్రం వాళ్ల పిటిషన్‌ను తిరస్కరించింది. -
జగదీశ్ శర్మకు నాలుగేళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణంలో చిక్కుకుని అనర్హతకు గురైన జేడీయూ మాజీ ఎంపీ జగదీశ్ శర్మకు ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు శుక్రవారం నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధించింది. మరో 18 మంది అధికారులు, దాణా వ్యాపారులకు కూడా జడ్జి సీతారాం ప్రసాద్ శిక్షలు వేశారు. దాణా స్కాంకు సంబంధించి 1990లలో గోడా ఖజానా నుంచి 1.16 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో కోర్టు వీరిని బుధవారం దోషులుగా తేల్చింది. -
లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు
-
లాలూప్రసాద్ యాదవ్‌కు బెయిల్ నిరాకరణ
దాణా కుంభకోణంలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. లాలూకు బెయిల్ దక్కలేదు. బెయిల్ పిటిషన్‌ను అనర్హమైనదిగా పేర్కొంటూ గురువారం న్యాయస్థానం తోసిపుచ్చింది. లాలూకు బెయిల్ రాకపోవడంతో వ్యతిరేక నినాదాలు చేసిన ఆర్జేడీ కార్యకర్తల్ని భద్రతాధికారులు కోర్టు సముదాయం నుంచి బయటకు పంపించారు. బెయిల్ కోసం లాలూ చేసిన దరఖాస్తును విచారించిన కోర్టు తీర్పును నేటికి రిజర్వ్‌లో ఉంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దాణా స్కాంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు బెయిల్ మంజూరవడంతో లాలూకు వస్తుందని భావించారు. అయితే నిరాశ ఎదురైంది. లాలూ, మిశ్రాతో పాటు మొత్తం 43 మందికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
లాలూను మండేలాతో పోల్చిన జార్ఖండ్ మంత్రి
మెదినినగర్: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాతో పోల్చారు జార్ఖండ్ రాష్ట్ర మంత్రి అన్నపూర్ణా దేవి. ప్రధాని పదవికి భవిష్యత్‌లో లాలూ గట్టి పోటీదారు అవుతారని జోస్యం చెప్పారు. వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు నెల్సన్ మండేలా 27 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని అధిష్టించారని గుర్తుచేశారు. అలాగే తమ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాని పదవికి గట్టి పోటీదారు అవుతారని ఆర్జేడీ నాయకురాలు కూడా అయిన అన్నపూర్ణా దేవి వ్యాఖ్యానించారు. ఆర్జేడీ పాలమావ్ విభాగం కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. -
రాంచీ జైల్లో లాలూ భద్రతకు ముప్పు
దాణా కుంభకోణంలో రాంచీలో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భద్రతకు ముప్పు పొంచివుందని జార్ఖండ్ పోలీసులు హెచ్చరించారు. లాలూ భద్రతపై జార్ఖండ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ రాష్ట్ర జైళ్ల శాఖను అప్రమత్తం చేశారు. లాలూ ఉన్న జైల్లోనే మావోయిస్టులు ఉండటం, అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆయనను కలిసేందుకు జైలుకు వస్తుండటంతో భద్రతాపరమైన ముప్పు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లు జైలు శిక్షపడ్డ లాలూను రాంచీలో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనను వీఐపీ ఖైదీలా పరిగణించి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక బెడ్రూమ్, దోమతెర, మంచం, టీవీ సెట్, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
'దాణా స్కాం తీర్పు'పై హైకోర్టును ఆశ్రయించిన లాలూ
దాణా స్కాంలో దోషీగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన గురువారం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా లాలూ న్యాయస్థానాన్ని కోరారు. దాణా స్కాంలో లాలూకు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్లు చొప్పున ఇటీవల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. అంతేగాక ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. -
లాలూ ఎంపీ పదవి కృష్ణార్పణం!!
సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బీహార్‌లో లాలూ ఉంటాడని బీరాలు పలికిన రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్.. ఇక ఎంపీ పదవిని వదులుకోవాల్సిందే!! ఎప్పుడో 17 ఏళ్లనాటి పశువుల దాణా స్కాంలో దోషిగా తేలిన ఆయనకు రాంచీ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఆయన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దయిపోయింది. దీన్ని బట్టి.. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుల్లో ఒకరైన లాలూ రాజకీయ భవితవ్యం మసకబారిపోయింది. లాలూతో పాటు దోషులుగా తేలిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్ర, జేడీయూ నేత జగదీశ్ శర్మలకు నాలుగేసి సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ తీర్పుచెప్పారు. ఈ స్కాంలో మొత్తం 45 మందిని దోషులుగా తేల్చగా, వారిలో 37 మందికి సంబంధించి మాత్రమే గురువారం తీర్పు వెలువరించారు. బుధవారంనాడే బాత్రూంలో కాలుజారి పడి ఆస్పత్రిలో చేరిన జగన్నాథ మిశ్రాకు 2 లక్షల రూపాయల జరిమానా పడింది. శర్మకు 5 లక్షలు వడ్డించారు. రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడైన లాలూ ప్రసాద్ (67).. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా తీర్పు వినగానే ఒక్కసారిగా హతాశుడయ్యారు. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్ చాలా గౌరవనీయుడైన వ్యక్తి అని, సమాజంలో చాలా ఉన్నతస్థానంలో ఉన్నారని అంతకుముందు లాలూ న్యాయవాది సురేందర్ సింగ్ వాదించారు. -
లాలూకు ఐదేళ్లు.. జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల శిక్ష
-
లాలూకు ఐదేళ్లు.. జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల శిక్ష
రాంచీ : దాణా స్కాంలో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌కు ఐదేళ్లు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతో ఎంపీ పదవికి ఆయన అనర్హుడయ్యారు. వీరిద్దరు సహా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగాయి. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపించారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఈ తీర్పు వెలువరించారు. లాలూ ప్రసాద్‌కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ముందుగానే అంచనా వేశారు. -
లాలూకు శిక్షపై మొదలైన వాదనలు.. మధ్యాహ్నానికి తీర్పు!
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత శిక్షపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపిస్తారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఎదుట ఈ వాదనలు కొనసాగుతున్నాయి. లాలూ ప్రసాద్‌కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశువుల దాణా స్కాంలో లాలూ ప్రసాద్, జగన్నాథ మిశ్రాలతో పాటు మరో 43 మందిని దోషులుగా ఇప్పటికే నిర్ధరించారు. -
దాణా స్కాంలో నేడు లాలూకు శిక్ష ఖరారు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి అధినేత లాలూప్రసాద్కు నేడు శిక్ష ఖరారు కానుంది. రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లాలూ సహా 34 మందికి శిక్షలను ప్రకటించనుంది. 1994-95 మధ్య కాలంలో చైల్‌బాసా ట్రెజరీనుంచి అక్రమంగా 37.70 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసినందుకు లాలూ, మరో 44 మందిని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి పికె సింగ్ దోషులుగా ప్రకటించడం తెలిసిందే. శిక్షను ప్రకటించిన తర్వాత లాలూ పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం ఉంది. కాగా, కోర్టు గురువారం శిక్షలపై అన్ని పక్షాల వాదనలను వింటుందని లాలూ తరఫు సీనియర్ న్యాయవాది చిత్రంజన్ సిన్హా చెప్పారు. ఈ ప్రక్రియ ఉదయం జరుగుతుందని, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిందితులకు శిక్షలను కోర్టు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. లాలూ తరఫున జబల్పూర్ హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది సురేందర్ సింగ్ వాదనలు వినిపించనున్నారు. కాగా మాజీ కేంద్ర మంత్రిగా లాలూ హోదాను, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్ష విధించాలని కోరుతామని లాలూ తరఫు న్యాయవాది తెలిపారు. -
లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసిన రాబ్రీదేవి!
పశుగ్రాస కుంభకోణంలో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో రాంచీ జైల్లో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన సతీమణి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం శిక్ష ఖారారు చేయనున్న సంగతి తెలిసిందే. రాంచీ జైల్లో ఉన్న లాలూని కలుసుకోవడానికి ముందు రాబ్రీదేవి.. ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యచరణను, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ స్థానంలో రాబ్రీదేవి పార్టీకి నాయకత్వం వహించాలని ఆ పార్టీ నాయకుడు రాం కృపాల్ యాదవ్ కోరారు. జైల్లో ఉన్న లాలూ సూచనల ప్రకారం పార్టీని పటిష్టం చేద్దామని మరో నేత తెలిపారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూపై గురువారం శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉంది. -
దాణా స్కాం దోషి లాలూ!
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్సింగ్ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు. 2000 సంవత్సరంలో బీహార్నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్కుమార్వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది. -
లాలూపై 'షాట్ గన్' సానుభూతి
పాట్నా: దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడంపై బీజేపీ సీనియర్ నాయకుడు శత్రుఘ్న సిన్హా సానుభూతి వ్యక్తం చేశారు. ఎగువ కోర్టు తీర్పుతో ఆయన త్వరలో జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. లాలూ స్నేహితుడిగా ఆయన జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోతున్నానని పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. క్లిష్టపరిస్థితుల నుంచి లాలూ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాలీవుడ్లో షాట్ గన్‌గా పేరుగాంచిన శత్రుఘ్న సిన్హా అనేక సందర్భాల్లో పార్టీని ఇబ్బందులకు గురిచేసే విధంగా మాట్లాడారు. తాజాగా లాలూకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి. అయితే లాలూతో ఆయనకు రాజకీయాల్లోకి రాకముందునుంచే స్నేహం ఉంది. పాట్నా యూనివర్సిటీలో శత్రుఘ్న సిన్హాకు లాలూ సీనియర్. పాట్నా లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
చట్టం తన పని చేసింది
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో లాలూతోపాటు 43 మందిని దోషులుగా నిర్ధారిస్తూ రాంచీ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆచితూచి స్పందించింది. 10 కోట్ల బీహార్ ప్రజల పక్షాన న్యాయం నిలిచిందని బీజేపీ పేర్కొంది. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని, ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని కాంగ్రెస్ పేర్కొంది. జార్ఖండ్‌లో లాలూ పార్టీ ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈకేసులో చట్టం తనపని తాను చేసుకుపోయిందని కాంగ్రెస్ చెప్పింది. భవిష్యత్తులో ఆర్జేడీతో పొత్తు విషయంలో ఇప్పుడే ఇతమిత్థంగా చెప్పలేమంది. ‘భవిష్యత్తులో బీహార్‌లో, జార్ఖండ్‌లో ఆర్జేడీతో పొత్తుపై ఇప్పుడే స్పందించడం తొందరపాటవుతుంది. పొత్తు విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. మాకెన్ స్పందనతో భవిష్యత్‌లో కాంగ్రెస్... లాలూకు చెందిన ఆర్జేడీతోగానీ లేదా ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన జేడీయూ(ఎన్డీఏ మాజీ భాగస్వామి)తోగానీ పొత్తుపెట్టుకోవచ్చన్న ఊహాగానాలు చెలరేగాయి. చరిత్రాత్మకం: రాజీవ్ ప్రతాప్ రూఢీ, బీజేపీ ‘ఈ తీర్పు చరిత్రాత్మకం. గత పదేళ్ల నుంచి యూపీఏ ప్రభుత్వంతో, ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్‌గాంధీలతో రాజీ కుదుర్చుకొని రాజకీయంగా రాజీలు పడుతూ లాలూప్రసాద్ తనను తాను రక్షించుకుంటున్నట్లు అందరూ చూస్తున్నారు. ప్రభుత్వంతో ఉంటూ చట్టం నుంచి తప్పించుకొంటున్నారు. 2జీ, కామన్వెల్త్, రైల్‌గేట్, బొగ్గు కుంభకోణాల్లోనూ ఇలాంటి తీర్పే వస్తుందా?’ బాధాకరం: దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ లాలూను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇవ్వడం బాధాకరంగా ఉంది. ఆయన పైకోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారన్న ఆశాభావం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలంగా నమ్మకమైన భాగస్వామి. విశ్వసనీయతకు సవాల్: రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు నాయకుల విశ్వసనీయతకు ఈ తీర్పు పెద్ద సవాల్లాంటిది. దీనిని బీజేపీ చాలెం జ్గా స్వీకరిస్తుంది. ప్రజలు అవినీతిరహిత రాజకీయాలను కోరుకుంటున్నారు. అత్యాశకు పోయారు: శరద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు అత్యాశకుపోయి ప్రజాధనాన్ని దోచుకున్నందుకు లాలూ తగిన మూల్యం చెల్లించుకున్నారు. అధికారాన్ని వ్యక్తిగతానికి వాడుకునే వారికి ఇదో గుణపాఠం. ముగ్గురిపై ‘అనర్హత’ వేటు! దోషులుగా నిర్ధారణ అయిన ఎంపీలు తక్షణమే పదవులకు అనర్హులవుతారన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అనర్హత వేటు ఎదుర్కోనున్న ఎంపీల సంఖ్య మూడుకు చేరింది. దాణా కేసులో దోషులుగా తేలిన లాలూ అనర్హత వేటు పడనున్న రెండో ఎంపీగా, జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మ మూడో ఎంపీగా రికార్డులకెక్కే అవకాశముంది. త్రిపుర ఎంబీబీఎస్ సీట్ల కోటాకు సంబంధించిన అవినీతి కేసులో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్ ను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు వారాల కిందట దోషిగా నిర్ధారించడం తెలిసిందే. -
'గడ్డి' కరిచారు
మూగ జీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం ఏళ్లు గడిచినా తరిమి తరిమి వెంటాడింది. చివరకు ఊచలు లెక్కించే వరకూ తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో లాలూ సహా 45 మందిని రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. వీరికి న్యాయస్థానం శిక్షను అక్టోబర్ 3వ తేదీన ఖరారు చేయనుంది. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేరచరిత ప్రజా ప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోనున్నారు. రెండు లేదా అంతకంటె ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడం ఖాయం. అంతే కాకుండా అనర్హత వేటు కూడా పడనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లాలూ అనర్హుడిగా మారే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే రాజకీయాల్లో లాలూ ప్రస్థానం ముగిసినట్లే. బ్ తక్ సమోసామే ఆలూ రహేగా... తబ్ తక్ బీహార్‌మే లాలూ రహేగా అని గర్వంగా ప్రకటించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్న నేరానికి.... చివరకు నేరం నిరూపితమై... కటకటాల వెనక్కి వెళ్లారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ని పోలీసులు రాంచీలోని బిస్రాముండా సెంటర్ జైలుకు తరలించారు. 1996లో వెలుగు చూసిన దాణా కుంభకోణం 1996, మార్చి 11న పశుదాణా కుంభకోణంపై సీబీఐ విచారణకు పాట్నా హైకోర్టు ఆదేశం 1997లో సీబీఐ విచారణ ప్రారంభం 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న లాలూ 1998, ఆగస్టులో లాలూపై ఆదాయానికి మించి ఆస్తులకేసు నమోదు 2000, ఏప్రిల్ : లాలూ, రబ్రీదేవిలపై ఛార్జిషీటు దాఖలు కోర్టులో లొంగిపోయిన రబ్రీ, లాలూ రబ్రీకి బెయిల్, లాలూకు నో బెయిల్ 2000, మే 5న లాలూకు బెయిల్ మంజూరు చేసిన పాట్నా హైకోర్టు లాలూ, రబ్రీలపై అభియోగాల నమోదు -
దాణా కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు
-
లాలూకు సుప్రీంకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో గడ్డి స్కాం విచారణను వేరే కోర్టుకు మార్చాలన్న ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణను వీలైనంత త్వరగా ముగించాలని దిగువ కోర్టును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ప్రాసిక్యూషన్ తన వాదనలను ముగించడానికి ఐదు రోజుల గడువు, తమ తరఫు వాదనలు వినిపించేందుకు నిందితులకు మరో పదిరోజుల గడువు ఇచ్చింది. రాంచీ హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ ఏం చెప్పాయన్న విషయంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా తన తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసు విచారణ ఎప్పుడో 2011లో మొదలైతే, ఇప్పుడు.. ఈ దశలో విచారణను వేరే కోర్టుకు మార్చాలని అడగడం ఏంటని లాలుప్రసాద్ను కూడా సుప్రీం నిలదీసింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన పీకే షాహి బీహార్ మం్రతి అని, ఆయన బంధువు ఒకరితో విచారణ కోర్టు న్యాయమూర్తికి వివాహం అయ్యిందని లాలు ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.