రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి.
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా, మరికొందరు దోషులపై దాణా స్కాంలో శిక్ష విధించడంపై వాదనలు ఉదయం 11 గంటలకు మొదలయ్యాయి. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత శిక్షపై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. దోషులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించి ఈ తీర్పును వారికి కూడా వినిపిస్తారు. జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ ఎదుట ఈ వాదనలు కొనసాగుతున్నాయి.
లాలూ ప్రసాద్కు దాదాపు నాలుగు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశువుల దాణా స్కాంలో లాలూ ప్రసాద్, జగన్నాథ మిశ్రాలతో పాటు మరో 43 మందిని దోషులుగా ఇప్పటికే నిర్ధరించారు.