సాక్షి,పాట్నా: పశుగ్రాస కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ దోషిగా తేలిన క్రమంలో ఆయనకు జనవరి 3న శిక్ష ఖరారు కానుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాలూకు బెయిల్ లభించడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వరుసగా నేరాలకు పాల్పడే వారికి బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయని, అందులో రెండవ సారి దోషిగా తేలిన వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉంటాయని పాట్నాహైకోర్టు సీనియర్ న్యాయవాది వైవి గిరి పేర్కొన్నారు.
మరోవైపు లాలూపై జార్ఖండ్‌లో ఐదు కేసులు, బీహార్‌లో ఒక కేసు నమోదైందని, జార్ఖండ్‌లో ఐదు కేసులకు గాను రెండు కేసుల్లో ఆయన దోషిగా తేలారని, మిగిలిన కేసులు వివిధ విచారణ దశల్లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది. దుంకా ట్రెజరీ నుంచి రూ 3.9 కోట్లు, చైబస ట్రెజరీ నుంచి రూ 36 కోట్లు, దొరాండ ట్రెజరీ నుంచి రూ 184 కోట్లు, భాగల్పూర్ ట్రెజరీ నుంచి రూ 45 కోట్ల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది.లాలూపై కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు తక్షణం బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment