స్టేజీ కూలి లాలూకు గాయాలు.. | Lalu Prasad suffered minor injuries after he fell down following a stage collapse | Sakshi
Sakshi News home page

స్టేజీ కూలి లాలూకు గాయాలు..

Published Sat, Mar 25 2017 2:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

స్టేజీ కూలి లాలూకు గాయాలు..

స్టేజీ కూలి లాలూకు గాయాలు..

పట్నా:
స్టేజీ కూలిన ఘటనలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాట్నాలోని దిగాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపైకి ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు రావడంతో స్టేజీ కూలినట్టు తెలుస్తోంది. హుటాహుటిన లాలూ ప్రసాద్ను ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్య పరీక్షల అనంతరం లాలూను ఇంటికి పంపించారు. కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకొవాల్సిందిగా వైద్యులు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు లాలూ తెలిపారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement