మూత్రానికి బదులు డెట్టాల్ వాడుతున్నాం: లాలు
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డెట్టాల్‌లాగే మూత్రం కూడా మంచి యాంటీసెప్టిక్ అని ఆయన అన్నారు. పట్నాలో జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. చేతులను డెట్టాల్‌తో కడుక్కోవడమేనన్నారు.
చిన్నతనంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మూత్రంతో కడిగేవాళ్లమని, అది యాంటీసెప్టిక్‌గా పనిచేసేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రజలు డెట్టాల్ వాడుతున్నారని, కొందరు దాన్ని చేతులు కడుక్కోడానికి కూడా వాడుతున్నారని ఆయన అన్నారు. మనం సాధించిన అభివృద్ధి ఇదేనని చెప్పారు.
కొసమెరుపు: తన పెద్ద కొడుకు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు బదులుగా లాలు ఈ సమావేశానికి హాజరయ్యారు.