RJD chief
-
దాణ స్కాం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు
బిహార్: జార్ఖండ్‌లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది. మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసిననట్లు నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు. ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ యాదవ్‌తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. -
దాణా కేసులో లాలూకు బెయిల్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు(73) జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్ నంబర్ మార్చొద్దని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్ సిన్హా వ్యతిరేకించారు. అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్ దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
మొక్కుబడి సమీక్షలు సరికాదు..!
ఒంగోలు: ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్–1 పరీక్షల్లో పదో తరగతి ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్న పలు పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై పాఠశాల విద్యగుంటూరు ఆర్జేడీ కె.శ్రీనివాసరెడ్డి ఆగ్రహించారు. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో హెచ్ఎంలు, ఎంఈవోలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడుసుమల్లి పాఠశాలలో 20 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుంటే 10 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం, అదే వైఆర్ పాఠశాలలో 43 మంది ఉంటే ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం దారుణంగా ఉందంటూ సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ల పనితీరుపై మండిపడ్డారు. అత్యంత ప్రాధాన్యత గల మీటింగ్‌కు ముందస్తు అనుమతి తీసుకోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంజాయిషీ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఉప విద్యాశాఖ అధికారులు కూడా తనిఖీలు సరిగా చేయడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత పాఠశాలలకు వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేనిపక్షంలో తాత్కాలికంగా అక్కడకు సిబ్బందిని పంపే అవకాశాన్ని కూడా పరిశీలించాలని డీఈవోను ఆదేశించారు. ప్రస్తుతం దారుణమైన ఫలితాలను చవిచూసిన పాఠశాలలు సమ్మేటివ్–2 అంటే ప్రీ పబ్లిక్ పరీక్షల నాటికి పూర్తిస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. 80 నుంచి 90 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో పదిమంది ఉపాధ్యాయులు ఉండి కూడా విద్యార్థులను తీర్చిదిద్దడంలో విఫలమవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుందన్నారు. రాబోయే రెండు నెలలు ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తప్పనిసరైతే తప్ప మెడికల్ లీవులు మంజూరు చేయరాదన్నారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా మంజూరు కోరితే వారిని మెడికల్ బోర్డుకు రిఫర్ చేయాలని డీఈఓకు స్పష్టం చేశారు. అంతేగాకుండా పదో తరగతి పరీక్షల సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సహకరిస్తున్నారంటూ తమకు అనేక ఫోన్లు వస్తున్నాయని, దీనిద్వారా ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా ప్రభుత్వ ఉపాధ్యాయులే సహకారం అందిస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలోను ప్రైవేటు పాఠశాలలకు సహకారమందిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్ల నియామకం సమయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని కాంక్షించేవారినే నియమించాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో లెసన్ ప్లానింగ్ లేకపోవడం, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలో పాఠశాలలను విజిట్ చేయకపోవడం వంటివి సరికాదన్నారు. తల్లిదండ్రులు వలసవెళ్లే హాస్టళ్ల నిర్వహణలో ఏమాత్రం లోపం వ్యక్తమైనా అందుకు మండల విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భయాందోళన చెందిన హెచ్ఎంలు, ఎంఈవోలు... సమీక్షలో ఒకవైపు ఆర్జేడీ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సమావేశ మందిరంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా విద్యుత్ బోర్డు తగలబడింది. మెయిన్ ఆపివేసినా బోర్డు తగలబడిపోతూనే ఉండటంతో కొంతమంది ఆ సమీపంలో కూర్చుని ఉన్న హెచ్ఎంలు, ఎంఈఓలు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే, ఒక హెచ్ఎం మాత్రం చాకచక్యంగా స్పందించి ప్లాస్టిక్ కుర్చీతో బోర్డు వద్ద మంటలు ఏర్పడిన ప్రదేశంలో పలుమార్లు తాకించడంతో మంటలు ఆరిపోయాయి. వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ హాజరై మార్కుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి తేవద్దని సూచించారు. ప్రతి హెచ్ఎం ఒంగోలు బుల్లా వ్యవహరించి సరికొత్త ఆలోచనలతో పాఠశాలను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారి : డీఈఓ సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారన్నారు. సమ్మేటివ్–1, 2 పరీక్షలలో పదో తరగతిలో 91–100 శాతం మార్కులు సాధించినవారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామన్నారు. వీరిని ప్రకాశం ఆణిముత్యాల పేరుతో పేర్కొన్నారు. 71–90 మధ్య ఉన్న ప్రకాశం వజ్రాలు, 35–70 మధ్య ఉన్నవారిని ప్రకాశం బంగారాలుగాను, 0–34 మధ్య ఉన్న విద్యార్థులను ప్రకాశం ఆశాజ్యోతులుగాను పేర్కొన్నామన్నారు. ఈ క్రమంలో ఆశాజ్యోతులు అందరినీ పాస్ అయ్యేలా తర్ఫీదునివ్వాలన్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 11,965 మంది బడిబయట పిల్లలు ఉన్నారని, వారందరినీ బడిలో చేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా 18 మండలాల్లో 2,347 మంది విద్యార్థులకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ సర్వశిక్షా అభియాన్‌కు సంబంధించిన అనేక కార్యక్రమాలపై సమీక్షించారు. రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్ అకాడమీ వారు కరాటే పోటీలు నిర్వహించేందుకు వస్తారని, వారికి తప్పకుండా తరగతులు నిర్వహించాలని సూచించారు. -
‘లాలూకు బెయిల్ కష్టమే’
సాక్షి,పాట్నా: పశుగ్రాస కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ దోషిగా తేలిన క్రమంలో ఆయనకు జనవరి 3న శిక్ష ఖరారు కానుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాలూకు బెయిల్ లభించడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వరుసగా నేరాలకు పాల్పడే వారికి బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయని, అందులో రెండవ సారి దోషిగా తేలిన వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉంటాయని పాట్నాహైకోర్టు సీనియర్ న్యాయవాది వైవి గిరి పేర్కొన్నారు. మరోవైపు లాలూపై జార్ఖండ్‌లో ఐదు కేసులు, బీహార్‌లో ఒక కేసు నమోదైందని, జార్ఖండ్‌లో ఐదు కేసులకు గాను రెండు కేసుల్లో ఆయన దోషిగా తేలారని, మిగిలిన కేసులు వివిధ విచారణ దశల్లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది. దుంకా ట్రెజరీ నుంచి రూ 3.9 కోట్లు, చైబస ట్రెజరీ నుంచి రూ 36 కోట్లు, దొరాండ ట్రెజరీ నుంచి రూ 184 కోట్లు, భాగల్పూర్ ట్రెజరీ నుంచి రూ 45 కోట్ల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది.లాలూపై కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు తక్షణం బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
లాలూ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు
ఢిల్లీ సహా 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు - రూ.వెయ్యి కోట్ల బినామీ భూ ఒప్పందాల కేసులో దాడులు - బీజేపీ చర్యలకు భయపడను: లాలూ న్యూఢిల్లీ: రూ.వెయ్యి కోట్ల బినామీ భూ ఒప్పందాల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ మంగళవారం దాడులు చేసింది. ఢిల్లీతోపాటు దాని సమీపం లోని మొత్తం 22 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించింది. ఐటీ శాఖకు చెందిన సుమారు వంద మంది అధికారులు, పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఉదయమే ఢిల్లీ, గురుగ్రామ్, రేవరీ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఢిల్లీలోని విలాసవంతమైన ప్రాంతాలైన న్యూ ఫ్రెండ్స్ కాలనీ, సైనిక్ ఫామ్స్, బిజ్వాసన్, దక్షిణ ఢిల్లీలోని పలు ఫామ్ హౌస్‌ల్లో తనిఖీలు జరిగాయి. బినామీ లావాదేవీల చట్టం కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఐటీ అధికారులు వెల్లడించారు. తనిఖీల సందర్భంగా పలు కీలక పత్రాలను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను సీజ్ చేశామన్నారు. లాలూ, ఆయన కుటుంబానికి సంబంధం ఉన్న భూ ఒప్పందంలో భాగస్వామ్యం ఉందని భావించిన వ్యక్తులు, వ్యాపారస్తుల ఆస్తులపై తనిఖీలు చేశామని, ఈ బినామీ ఒప్పందాల్లో సుమారు రూ. వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయని, ఆ మేరకు పన్ను ఎగవేత జరిగిందని వివరించారు. ఇందులోని కొన్ని ఆస్తులు లాలూ కుటుంబానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలతో సంబంధం ఉన్న ఆర్జేడీ ఎంపీ పీసీ గుప్తా కుమారుడు, పలువురు వ్యాపారు ల ఆస్తులపైనా దాడులు చేసి నిర్వహించినట్టు తెలిపారు. ఢిల్లీలో భూ ఒప్పందాలకు సంబంధించి లాలూ, ఆయన కుమార్తె, ఎంపీ మిసా భారతి, కుమారులు, బిహార్ మంత్రులు తేజస్వీ, తేజ్ ప్రతాప్‌లకు సంబంధం ఉందని, ఈ కుంభకోణం విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే అని ఆరోపణలు వచ్చాయి. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రొ కో పద్ధతిలో ఈ లావాదేవీలు జరిగాయని సమాచారం. లాలూ కుటుంబ సభ్యులు స్థాపించిన సంస్థలకు చిరునామాగా లాలూ అధికారిక నివాసం చిరునామా ఉండటం.. ఈ కంపెనీల్లో ఉద్యోగులు కానీ, వ్యాపార కార్యకలాపాలు కానీ, టర్నోవర్ కానీ లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నన్నెవరూ భయపెట్టలేరు: లాలూ ఐటీ దాడులపై లాలూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘నా గొంతు నొక్కే ధైర్యం బీజేపీకి లేదు. ఒక్క లాలూను మాట్లాడకుండా చేయాలని అనుకుంటే.. కోట్లాది మంది లాలూ లు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు. ఉత్తుత్తి బెదిరింపులకు నేను భయ పడను’’ అని ట్విట్టర్లో లాలూ వరుస ట్వీట్లు చేశారు. మహా కూటమిని నిర్వీర్వం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. లెక్క చెప్పాల్సిన రోజు వచ్చింది న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఇళ్లపై ఐటీ, సీబీఐ దాడులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. ప్రతి దానికీ లెక్క చెప్పాల్సిన రోజు వచ్చిందని, అవినీతికి పాల్పడినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాలపై అధికార పార్టీ ప్రతీకారం కోసమే సీబీఐ, ఐటీ దాడులకు దిగుతోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. పన్ను ఎగవేతలు లేదా నేరం జరిగినట్టు కచ్చితమైన సమాచారం, ఆధారాలు ఉంటే తప్ప ఆదాయపు పన్ను శాఖ గానీ, సీబీఐ గానీ చర్యలకు దిగవని స్పష్టం చేశారు. ‘ఉన్నత హోదాల్లో ఉన్నవారు డొల్ల కంపెనీల ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవడం చిన్న విషయం కాదు’అని జైట్లీ వ్యాఖ్యానించారు. -
లాలు ఆస్తులపై ఐటీ దాడులు
-
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
-
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
పట్నా: స్టేజీ కూలిన ఘటనలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాట్నాలోని దిగాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపైకి ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు రావడంతో స్టేజీ కూలినట్టు తెలుస్తోంది. హుటాహుటిన లాలూ ప్రసాద్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం లాలూను ఇంటికి పంపించారు. కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకొవాల్సిందిగా వైద్యులు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు లాలూ తెలిపారు. -
‘ట్విట్టర్ కింగ్’ మోదీ ఆ విషయం మాట్లాడరు
పట్నా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో 105 మంది ప్రాణాలు కోల్పోయారని, ట్విట్టర్ కింగ్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడరని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ విమర్శించారు. కనీసం వారికి సంతాపమైన ప్రకటించాలని మోదీకి సూచించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ సమస్యతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మోదీ ఈ విషయాన్ని ట్వీట్ చేయరు. మోదీ తప్పు వల్ల ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడరని అర్థం చేసుకోవచ్చు. మృతులకు ఆయన కనీసం సంతాపం ప్రకటించాలి అని లాలు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలపై లాలూ స్పందించారు. సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. -
మూత్రానికి బదులు డెట్టాల్ వాడుతున్నాం: లాలు
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డెట్టాల్లాగే మూత్రం కూడా మంచి యాంటీసెప్టిక్ అని ఆయన అన్నారు. పట్నాలో జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. చేతులను డెట్టాల్‌తో కడుక్కోవడమేనన్నారు. చిన్నతనంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మూత్రంతో కడిగేవాళ్లమని, అది యాంటీసెప్టిక్‌గా పనిచేసేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రజలు డెట్టాల్ వాడుతున్నారని, కొందరు దాన్ని చేతులు కడుక్కోడానికి కూడా వాడుతున్నారని ఆయన అన్నారు. మనం సాధించిన అభివృద్ధి ఇదేనని చెప్పారు. కొసమెరుపు: తన పెద్ద కొడుకు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు బదులుగా లాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
హైకోర్టులో అప్పీలు చేస్తాం: లాలూ కొడుకు
పశువుల దాణా స్కాం కేసులో తమ తండ్రి లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించడాన్ని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ పెద్దకుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రజాకోర్టులోకి కూడా తీసుకెళ్తామన్నారు. లాలూప్రసాద్‌ను దాణా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన తర్వాత ఆయనను రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో లాలూకు బెయిల్ కోసం కూడా తాము దరఖాస్తు చేస్తామని తేజస్వి తెలిపారు. పశువుల దాణా స్కాం కేసులో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, జగన్నాథ మిశ్రా సహా మొత్తం 45 మంది నిందితులనూ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ప్రవస్ కుమార్ సింగ్ తీర్పు వెలువరించారు. వీరికి శిక్షను అక్టోబర్ 3న వెలువరిస్తారు.తొలుత హైకోర్టులోను, తర్వాత సుప్రీంకోర్టులో కూడా.. తమకు న్యాయం జరగబోదన్న అనుమానాలను లాలూ వ్యక్తం చేశారని, చివరకు ఆయన అనుమానించినట్లే జరిగిందని ఆర్జేడీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ అన్నారు. -
'గడ్డి' కరిచారు
మూగ జీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం ఏళ్లు గడిచినా తరిమి తరిమి వెంటాడింది. చివరకు ఊచలు లెక్కించే వరకూ తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో లాలూ సహా 45 మందిని రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. వీరికి న్యాయస్థానం శిక్షను అక్టోబర్ 3వ తేదీన ఖరారు చేయనుంది. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేరచరిత ప్రజా ప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోనున్నారు. రెండు లేదా అంతకంటె ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడం ఖాయం. అంతే కాకుండా అనర్హత వేటు కూడా పడనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లాలూ అనర్హుడిగా మారే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే రాజకీయాల్లో లాలూ ప్రస్థానం ముగిసినట్లే. బ్ తక్ సమోసామే ఆలూ రహేగా... తబ్ తక్ బీహార్‌మే లాలూ రహేగా అని గర్వంగా ప్రకటించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తిన్న నేరానికి.... చివరకు నేరం నిరూపితమై... కటకటాల వెనక్కి వెళ్లారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన్ని పోలీసులు రాంచీలోని బిస్రాముండా సెంటర్ జైలుకు తరలించారు. 1996లో వెలుగు చూసిన దాణా కుంభకోణం 1996, మార్చి 11న పశుదాణా కుంభకోణంపై సీబీఐ విచారణకు పాట్నా హైకోర్టు ఆదేశం 1997లో సీబీఐ విచారణ ప్రారంభం 1997లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న లాలూ 1998, ఆగస్టులో లాలూపై ఆదాయానికి మించి ఆస్తులకేసు నమోదు 2000, ఏప్రిల్ : లాలూ, రబ్రీదేవిలపై ఛార్జిషీటు దాఖలు కోర్టులో లొంగిపోయిన రబ్రీ, లాలూ రబ్రీకి బెయిల్, లాలూకు నో బెయిల్ 2000, మే 5న లాలూకు బెయిల్ మంజూరు చేసిన పాట్నా హైకోర్టు లాలూ, రబ్రీలపై అభియోగాల నమోదు