‘ట్విట్టర్‌ కింగ్‌’ మోదీ ఆ విషయం మాట్లాడరు | Around 105 died, but ‘Twitter king’ Modi didn’t mention it: Lalu on demonetisation | Sakshi
Sakshi News home page

‘ట్విట్టర్‌ కింగ్‌’ మోదీ ఆ విషయం మాట్లాడరు

Published Thu, Dec 22 2016 7:55 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

‘ట్విట్టర్‌ కింగ్‌’ మోదీ ఆ విషయం మాట్లాడరు - Sakshi

‘ట్విట్టర్‌ కింగ్‌’ మోదీ ఆ విషయం మాట్లాడరు

పట్నా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశంలో 105 మంది ప్రాణాలు కోల్పోయారని, ట్విట్టర్‌ కింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడరని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ విమర్శించారు. కనీసం వారికి సంతాపమైన ప్రకటించాలని మోదీకి సూచించారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ సమస్యతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మోదీ ఈ విషయాన్ని ట్వీట్‌ చేయరు. మోదీ తప్పు వల్ల ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఆయన మాట్లాడరని అర్థం చేసుకోవచ్చు. మృతులకు ఆయన కనీసం సంతాపం ప్రకటించాలి అని లాలు ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన అవినీతి ఆరోపణలపై లాలూ స్పందించారు. సుప్రీం కోర్టు జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోదీపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement