stage collapse
-
కుప్పకూలిన వేదిక.. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డికి గాయాలు
సాక్షి, మమహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సీ రెడ్డి, సినీనటి ప్రియాంక మోహన్‌లు విచ్చేశారు.అయితే షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. వేదిక పైకి ఎక్కువ మంది ఎక్కడంతో కుప్పకూలింది. దీంతో వేదికపైఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కాలుకు గాయమవ్వగా.. వెంటనే కార్యకర్తలు, అనుచరులు ఆమెను పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గానీ, నటి ప్రియాంకమోహన్‌కు గానీ ఎలాంటి గాయాలవ్వలేదు. వారు సురక్షితంగా ఉన్నారు.తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతికుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలుప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి… pic.twitter.com/S3vPX4c1Ag— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024Video Credits: Telugu Scribe -
Video: రాహుల్ గాంధీకి తప్పిన ముప్పు.. కుంగిన స్టేజ్
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. బిహార్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ నిల్చున్న వేదిక కొంతభాగం కుంగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి నేతలు సభ ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, మిసా భారతితో కలిసి రాహుల్ గాంధీ స్టేజ్‌పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉండటంతో స్టేజ్ కొంతమేర కూలింది. దీంతో కొంత బ్యాలెన్స్ కోల్పోయిన రాహుల్.. మిసా భారతి చేతులు పట్టుకుని మళ్లీ సర్దుకున్నారు.వెంటనే రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్ నుంచి దిగిపోవాలని రాహుల్‌కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్ గాంధీ ప్రసంగించారు.मंच टूट सकता है, हौसला नहीं!#Rahul_Gandhi_जीpic.twitter.com/CjvfvibFco— 🇮🇳 Vishal JyotiDev Agarwal 🇮🇳 (@JyotiDevSpeaks) May 27, 2024 -
ఊహించని పరిణామం.. మంత్రిని సన్మానిస్తుండగా కూలిన స్టేజ్
రాజస్థాన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కోటాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిగా నియమితులైన బీజేపీ నేతను సన్మానిస్తుండగా..స్టేజీ కుప్పకూలింది. దీంతో పలువురు బీజేపీ నాయకులు కిందపడటంతో గాయాలయ్యాయి. వివరాలు.. రాజస్థాన్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం.. కేబినెట్లోని మంత్రులకు నేడు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. సంగోత్ ఎమ్మెల్యే హీరాలాల్ నగర్‌కు సైతం మంత్రి బాధ్యతలు అప్పజెప్పింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం తొలిసారి మంత్రి తన సొంత నియోజక వర్గానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హీరాలాల్‌కు స్వాగతం పలికేందుకు జనం అధికంగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు మంత్రికి పూలమాలలు వేస్తుండగా అకస్మాత్తుగా స్టేజ్ కుప్పకూలింది. कोटा में राज्यमंत्री हीरालाल नागर के स्वागत समारोह में टूटा मंच • मंत्री नागर, सांगोद प्रधान सहित 5 लोगों को आई चोट, दो की हालत बताई जा रही गंभीर#kota #Rajasthan pic.twitter.com/LiKRMMbYsy — Avdhesh Pareek (@Zinda_Avdhesh) January 4, 2024 ఈ ఘటనలో మంత్రి సహా వైదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ప్రజల్లోనూ, స్థానికంగానూ గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామపెద్ద సహా ఐదుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. మంత్రి హీరాలాల్‌కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆయన ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అయితే స్టేజ్‌ను 15 మంది ఎక్కేందుకు వీలుగా ఏర్పాటు చేయగా.. 40 మంది ఒకేసారి నిల్చోడంతో బరువు ఎక్కువై కూలినట్లు తెలిసింది. -
రైతు ఉద్యమం : కుప్పకూలిన వేదిక
సాక్షి,చండీగఢ్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఉద్యమంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన ఒక సమావేశంలో షాకింగ్ ఘటన ఆందోళన రేపింది. హరియాణాలో జింద్‌లో ఏర్పాటు చేసిన రైతుల "మహాపంచాయతీ" భారీ సమావేశం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వేదికపైనే ఉన్న కీలక రైతు నేతలు, ఇతరులు కూడా స్టేజ్‌మీదినుంచి కిందికి పడిపోయారు. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు) భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. వేదిక కూలిపోతున్న సమయంలో రాకేశ్‌తో పాటు ఇతర రైతు నాయకులు కిందికి పడిపోవడం వీడియోలో రికార్డయింది. మరోవైపు గత రెండురోజులుగా రాజ్యసభలో నెలకొన్న గందరగోళం మధ్య రైతు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తుందని దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోష ప్రకటించారు. దీనికి కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు తాము తిరిగి వెళ్లబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజున రైతు నిరసనలో చెలరేగిన హింస నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. రైతులను నిలువరించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో బారికేడ్ల ఏర్పాటు తోపాటు ఇతర కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
-
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
పట్నా: స్టేజీ కూలిన ఘటనలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాట్నాలోని దిగాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపైకి ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు రావడంతో స్టేజీ కూలినట్టు తెలుస్తోంది. హుటాహుటిన లాలూ ప్రసాద్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం లాలూను ఇంటికి పంపించారు. కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకొవాల్సిందిగా వైద్యులు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు లాలూ తెలిపారు. -
మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది!
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్న కార్యక్రమంలో.. ఆయన ఉండగానే స్టేజి కుప్పకూలింది. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అశోక్ గెహ్లాట్ వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఒక్కసారిగా చాలామంది ఆయనను అభినందించేందుకు, ఆయన దృష్టిలో పడేందుకు స్టేజి మీదకు వెళ్లారు. అయితే అంతంత మాత్రంగానే ఉన్న ఆ స్టేజి కాస్తా.. అంతమంది వచ్చేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో గెహ్లాట్ సహా స్టేజి మీద ఉన్నవాళ్లంతా అలాగే పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. గెహ్లాట్ గతంలో రాజస్థాన్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1998 నుంచి 2003 వరకు ఒకసారి, తిరిగి ఐదేళ్ల తర్వాత 2008 నుంచి 2013 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాతి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో వసుంధర రాజె ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. -
తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ
మొరదాబాద్ (ఉత్తరప్రదేశ్) : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రైతులతో సమావేశమవడానికి వెళుతున్న వరుణ్.. మార్గమధ్యంలో మొరదాబాద్-హరిద్వార్ జాతీయ రహదారిలో తన కోసం వేచి ఉన్న మద్దతుదార్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో వరుణ్ ఉన్న వేదిక కూలిపోయింది. వేదికపై వరుణ్ తో పాటు స్థానిక ఎంపీ సర్వేశ్ కుమార్, మొరదాబాద్ మేయర్ వీనా అగర్వాల్ ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మొరదాబాద్ ఏఎస్పీ యస్విర్ సిన్హా తెలిపారు. -
డయాస్ కూలి బీజేపీ నేతలు కిందపడ్డారు
దిబ్రూగఢ్: అసోంలో బీజేపీ నిర్వహిస్తున్న ఓ సభలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన యువమోర్చా ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా దానికి సంబంధించిన డయాస్ కూలిపోయి కేంద్ర క్రీడాశాఖమంత్రితో సహా 15 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరికి మోస్తరు గాయాలుకాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అసోంలోని బీజేపీ అనుభంద శాఖ అయిన బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు సోమవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది. 25 మంది అతిథులు ఆశీన్నులయ్యేలా డయాస్‌ను ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత ఉజ్వల్ కశ్యప్, ఎంపీలు కామాఖ్య ప్రసాద్, రామేశ్వర్ తేలి హాజరయ్యారు. అయితే, ఒక్కసారిగా డయాస్ మీదకు పరిమితికి మించి రెట్టింపుగా దాదాపు 150 మంది ఎక్కారు. వీరంతా కార్యక్రమానికి వచ్చిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. దాంతో అది ఒక్కసారిగా కుప్పకూలి స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడికి వైద్యులు చేరుకొని ప్రథమ చికిత్సలు అందించారు.