మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది! | Ashok Gehlot stage collapses in a public event in rajasthan | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది!

Published Mon, Oct 17 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది!

మాజీ సీఎం వేదిక.. కుప్పకూలింది!

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్న కార్యక్రమంలో.. ఆయన ఉండగానే స్టేజి కుప్పకూలింది. రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అశోక్ గెహ్లాట్ వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఒక్కసారిగా చాలామంది ఆయనను అభినందించేందుకు, ఆయన దృష్టిలో పడేందుకు స్టేజి మీదకు వెళ్లారు. అయితే అంతంత మాత్రంగానే ఉన్న ఆ స్టేజి కాస్తా.. అంతమంది వచ్చేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

దాంతో గెహ్లాట్ సహా స్టేజి మీద ఉన్నవాళ్లంతా అలాగే పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. గెహ్లాట్ గతంలో రాజస్థాన్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1998  నుంచి 2003 వరకు ఒకసారి, తిరిగి ఐదేళ్ల తర్వాత 2008 నుంచి 2013 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాతి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆ రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో వసుంధర రాజె ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement