Video: రాహుల్‌ గాంధీకి తప్పిన ముప్పు.. కుంగిన స్టేజ్‌ | Watch: Stage Collapses Twice At Rahul Gandhi Bihar Poll Rally With Misa Bharti, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Video: రాహుల్‌ గాంధీకి తప్పిన ముప్పు.. కుంగిన స్టేజ్‌

Published Mon, May 27 2024 5:50 PM

Video: Stage Collapses At Rahul Gandhi Bihar Poll Rally

కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. బిహార్‌లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ నిల్చున్న వేదిక కొంతభాగం కుంగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి నేతలు సభ ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్‌, మిసా భారతితో కలిసి రాహుల్‌ గాంధీ స్టేజ్‌పైకి చేరుకున్నారు. అయితే ఆ వేదికపై అప్పటికే ఎక్కువ మంది నాయకులు ఉండటంతో  స్టేజ్‌ కొంతమేర కూలింది. దీంతో కొంత బ్యాలెన్స్‌ కోల్పోయిన రాహుల్‌.. మిసా భారతి చేతులు పట్టుకుని మళ్లీ సర్దుకున్నారు.

వెంటనే రాహుల్‌ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది కూడా స్పందించారు. కొద్దిగా కుంగిన వేదిక వద్ద ఉన్న ఆయనకు సహాయం కోసం ముందుకు వచ్చారు. స్టేజ్‌ నుంచి దిగిపోవాలని రాహుల్‌కు సూచించారు. అయితే తనకు ఏమీ కాలేదని, కంగారు పడవద్దని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. అనంతరం అదే వేదికపై రాహుల్‌ గాంధీ ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement