
లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష వేసిన జడ్జీ శివపాల్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సీబీఐ కోర్జు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న శివపాల్ ఉత్తరప్రదేశ్‌లోని జలాలున్‌లో నివాసం ఉంటున్నారు.
కాగా బుధవారం రాత్రి ఆయన ఇంట్లోకి దొంగలు చొరబడి 60,000 రూపాయలు, రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. శివపాల్ సోదరుడు సురేంద్ర సింగ్ గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగగొట్టి ఉన్నాయి.
దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ్‌పాల్ సింగ్ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకి శిక్ష విధించిన సంగతి తెలిసిందే.