పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రాసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసును మళ్లీ రీఓపెన్ చేసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే సీబీఐ నిర్ణయం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే కన్పిస్తోందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రేల్వై ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఈకేసులో ప్రాథమిక విచారణ మొదలైంది.
అయితే 2021 మేలో ఈ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. లూలూపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని నెలల క్రితమే బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఆర్జేడీతో కలిశారు సీఎం నితీశ్ కుమార్. తన పాతమిత్రుడి చెంతకు మళ్లీ చేరారు. ఈ కారణంగానే లాలూ కేసును బీజేపీ మళ్లీ రీఓపెన్ చేయిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత
Comments
Please login to add a commentAdd a comment