కలకత్తా: మహిళా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కలకత్తా ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు షాక్ తగిలింది. ఆయనపై అవినీతి ఆరోపణల కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం(ఆగస్టు23) సిట్‌ను ఆదేశించింది.
ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందించాలని సిట్‌కు హైకోర్టు సూచించింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనాథ శవాల దందా, వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకొనేవారని ఆరోపణలు వచ్చాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సందీప్ ఘోష్‌ను ఇప్పటికే సీబీఐ విచారిస్తోంది. ఈ విచారణ సమయంలో ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో నలుగురికి సీబీఐ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment