Railway projects
-
ఒడిశా ప్రయోజనాలకే పట్టం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం మరోసారి బట్టబయలైంది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్, విభజన చట్టం హామీ కూడా అయిన విశాఖపట్నం రైల్వే జోన్‌ను అనుకున్న విధంగా సాధించలేక చేతులెత్తేసింది. ఒడిశా ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పట్టం కట్టింది. అత్యధిక రాబడినిచ్చే కొత్తవలస–కిరండోల్ లైన్ (కేకే లైన్) లేకుండానే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేస్తూ కేంద్ర రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయతో సహా కేకే లైన్‌ను ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్లో చేర్చింది. ఆ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దాంతో కొత్తగా ఏర్పడే విశాఖపట్నం రైల్వే డివిజన్ రాబడికి భారీగా గండి పడనుంది. జోన్ అభివృద్ధికి పురిట్లోనే గండి కొట్టినట్లయింది. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర రైల్వే శాఖ ఆమోదించింది. ఆమేరకు 2024 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రైల్వే జోన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్ స్వరూపంపై రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది.విశాఖపట్నం, రాయగడ డివిజన్ల ఏర్పాటు2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్వర్వుల్లో వాల్తేర్ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్టుగా రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే కేకే లైన్‌తోపాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చింది. రాయగడ రైల్వే డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తరకోస్తా రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఉన్న చోట రైల్వే డివిజన్ కేంద్రం లేకపోవడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలను భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఉత్తర కోస్తా జోన్లో చేరిస్తే ఆ రెండు జిల్లాలకు రైల్వే ప్రాజెక్టుల్లో తగిన న్యాయం జరగదని, కేకే లైన్‌ను కోల్పోతే విశాఖ జోన్ ఆర్థిక స్వయం సమృద్ధి సాధ్యం కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేకై లైన్తోసహా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని.. విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేశారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా వాల్తేర్ రైల్వే డివిజన్‌ను కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి తేవాలని కోరింది. వివిధ ప్రజా సంఘాలు, రైల్వే యూనియన్లు కూడా అదే డిమాండ్ చేశాయి. మరోవైపు రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఒడిశా వాసులు పట్టుబట్టారు. కేకే లైన్ లేకుండా విశాఖ డివిజన్ ఏర్పాటు2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కేకే లైన్ విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోనే ఉంచాలన్న ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్‌ను పూర్తిగా బేఖాతరు చేసింది. దాంతో ఒడిశా ఒత్తిడికి తలొగ్గుతూ కేంద్ర రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ స్థానంలో విశాఖపట్నం, రాయగడ కేంద్రాలుగా రెండు వేర్వేరు రైల్వే డివిజన్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్‌ను చేర్చింది. కానీ అత్యధిక రాబడి నిచ్చే కొత్తవలస–కిరండోల్ సెక్షన్‌తోపాటు పలాస–ఇచ్ఛాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చింది. దాంతో విశాఖపట్నం డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది.దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వరూపం ఖరారైంది. అటు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను విభజించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేనున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. దాంతో దక్షిణ కోస్తా రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్ల స్వరూపం ఇలా ఉండనుంది.ఇక విశాఖపట్నం, రాయగడ డివిజన్లు ఇలా » విశాఖపట్నం డివిజన్: పలాస– విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపాడ జంక్షన్– పర్లాఖిముడి, బొబ్బిలి జంక్షన్ – సాలూరు, సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్, వదలపూడి– దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం సెక్షన్లు.» రాయగడ డివిజన్: కొత్తవలస– కిరండోల్, బచ్చెలి / కిరండోల్, కూనేరు– తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్– కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గుణుపూర్ సెక్షన్లు.పలు డివిజన్ల పరిధిలో స్వల్ప మార్పులు » గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూర్ – వాడి సెక్షన్‌ను సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెస్తారు. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వేలకు మధ్య ఆ సెక్షన్ ఇంటర్ ఛేంజ్ పాయింట్‌గా ఉంది. దాంతో పరిపాలన పరమైన సౌలభ్యం కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తెచ్చారు.» గుంటూరు డివిజన్ పరిధిలోని విష్ణుపురం నుంచి పగడిపిల్లి, విష్ణుపురం నుంచి జన్పాహడ్ సెక్షన్లను సికింద్రాబాద్ డివిజన్‌లోకి తెస్తారు. తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి చేరుస్తారు. సింగరేణి నుంచి బొగ్గు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.» దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొండపల్లి నుంచి మోతుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్ పరిధిలోకి తెస్తారు. తద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో చేరుస్తారు. నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్, రాయనపాడు వర్క్ షాపులకు ఇబ్బంది లేకుండా జోనల్ పరిధిని సర్దుబాటు చేశారు. -
బైపాస్‌లో వెళ్లిన బడ్జెట్ రైలు
సాక్షి, అమరావతి: ఈసారి కూడా కేంద్ర రైల్వే బడ్జెట్.. రాష్ట్రంలోని దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రెడ్ సిగ్నలే చూపించింది. బడ్జెట్ రైలు రాష్ట్రాన్ని బైపాస్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన కొత్త రైల్వే ప్రాజెక్టులు అక్షరాలా శూన్యం. ఒక్కటంటే ఒక్క డిమాండ్‌ను కూడా రైల్వే శాఖ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి ఎన్డీయేకు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నప్పటికీ, రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల గురించి వివరించారు. 2025–26 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆయన చాలా తెలివిగా 2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పడం విస్మయ పరిచింది. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రసుత్త బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపలేదనే విషయాన్ని మరుగున పరిచేందుకు యత్నించారన్నది సుస్పష్టం. రైల్వే బడ్జెట్‌పై ఆ శాఖ పింక్ బుక్‌ను విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్త ప్రాజెక్టులు లేవు ప్రస్తుతానికి అయితే పాత ప్రాజెక్టుల పాటనే కొత్తగా పాడారని రైల్వే కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా వెల్లడించనే లేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే మంత్రి పునరుద్ఘాటించారు. ఇక విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను రూ.1,132.43 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఆ నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా రెండేళ్ల క్రితమే ప్రారంభమై కొనసాగుతున్నాయి. అవేమీ కొత్త ప్రాజెక్టులు కానే కావు. ఇప్పటికే 130 కి.మీ.మేర కవచ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, మరో 1,700 కి.మీ.మేర ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.దీన్నిబట్టి కవచ్ ప్రాజెక్టు పరిధిని కొత్తగా ఏమీ విస్తరించే ఆలోచన లేదని తేల్చి చెప్పినట్లే. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లుగా రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. అందుకే ఈ రైల్వే బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించ లేదని కూడా కుండబద్దలు కొట్టారు. ఏపీ మీదుగా ఇప్పటికే ఎనిమిది వందే భారత్ రైళ్లు నిర్వహిస్తున్నామని చెబుతూ త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామన్నారు. కొత్త డిమాండ్లు పూర్తిగా బేఖాతరు దీర్ఘకాలికంగా ఉన్న ప్రాజెక్టులకే నిధుల కేటాయింపునకు చేతులు రాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విజయవాడ–ఖరగ్‌పూర్, విజయవాడ–నాగ్‌పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు.. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు, విజయవాడ–గూడూరు మద్య నాలుగో లైన్ నిర్మాణం, కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీఎం చంద్రబాబు ఏం సాధించినట్లు?» కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25 బడ్జెట్లో రైల్వేలో రాష్ట్రానికి కేవలం రూ.9,138 కోట్లు కేటాయించారు. దాంతో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే ఆ నిధులు సరిపోయాయి. పోనీ.. 2025–26 బడ్జెట్లో అయినా భారీగా నిధులు సాధిస్తారేమోనని ఆశించిన వారికి అడియాశే మిగిలింది. గత బడ్జెట్ కంటే కేవలం రూ.279 కోట్లే అధికంగా రాబట్టగలిగారు. పెరిగిన వ్యయంతో పోలిస్తే, ఆ నిధులు కూడా ప్రాజెక్టులను నత్తనడకన కొనసాగించేందుకే సరిపోతాయి. » కాకినాడ – పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగ్గరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించనే లేదు. » అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్లు గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించినా, నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వ లేదు. » అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ) రైల్వేలైన్‌పై కూడా కేంద్రం ముఖం చాటేసింది. » కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి పట్టించుకోలేదు. -
ఈసారీ..భారీగానే..
సాక్షి, హైదరాబాద్: పరిమిత ప్రాజెక్టులు.. మొత్తం కేటాయింపుల్లో వాటికే సింహభాగం నిధులు.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తున్న విధానం. ఈ ప్రయోగం ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది.దీనివల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో మూడు కీలక ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే దిశగా రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. త్వరలో ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానుండటంతో తెలంగాణలో రైలు సేవలు బాగా మెరుగుపడబోతున్నాయి. బల్లార్షా–కాజీపేట–విజయవాడఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే కీలక మార్గం ఇది. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పిలుస్తారు. ఈ మార్గంలో నిత్యం 460 వరకు రైళ్లు పరుగు పెడుతుంటాయి. ప్రస్తుతం దాని ట్రాఫిక్ సాంద్రత ఏకంగా 160 శాతంగా ఉంది. ఈ మార్గంలో కనీసం మరో 250 ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్లను నడపాల్సి ఉన్నా, సాంద్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కావటం లేదు. దీంతో మూడో లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కాజీపేట– విజయవాడ మధ్య మూడో లైన్ 2012–13లో మంజూరు కాగా, కాజీపేట–బల్లార్షా లైన్ 2015–16లో మంజూరైంది. కానీ పనులు వెంటనే మొదలు కాలేదు. గత మూడేళ్లుగా వీటికి భారీగా నిధులు కేటాయిస్తుండటంతో ఇప్పుడు పనులు కొలిక్కి వచ్చాయి. ఈ మార్గంలో వంతెనల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతా పనులు వేగం పుంజుకున్నాయి. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. కాజీపేట–బల్లార్షా మధ్య 202 కి.మీ. నిర్మాణాన్ని రూ.2,063 కోట్ల అంచనాతో ప్రారంభించారు. రాఘవాపురం–కొలనూరు, కొలనూరు–పోత్కపల్లి, విరూరు–మాణిక్‌ఘర్, బిజిగిర్ షరీఫ్– ఉప్పల్, విరూరు–మాకుడి, పోత్కపల్లి–బిజిగిర్ షరీఫ్, మాకుడి–సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇప్పటికే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈసారి కొంత సవరించే అవకాశం ఉంది. భారీగా నిధులు ఇవ్వటంతో హసన్‌పర్తి రోడ్డు–ఉప్పల్, ఆసిఫాబాద్–రేచినిరోడ్, హసన్‌పర్తి–కాజీపేట పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 173.27 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. 28 కి.మీ. పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బల్లార్షా– మాణిక్‌ఘర్, రేచిని రోడ్–బెల్లంపల్లి– మందమర్రి, ఆసిఫాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య పూర్తి కావాల్సి ఉంది. కాజీపేట–విజయవాడ మూడో లైను ఈ లైన్ పూర్తి నిడివి 220 కి.మీ. గత బడ్జెట్లో దీనికి రూ.310 కోట్లు కేటాయించగా, తర్వాత కొన్ని నెలలకే ఆ మొత్తాన్ని రూ.500కు పెంచారు. దీంతో ఒక్కసారిగా పనుల్లో వేగం పెరిగింది. 104 కి.మీ. నిడివిలో మూడో లైన్ పనులు పూర్తి చేయటంతోపాటు, అన్ని వంతెనలను సిద్ధం చేశారు. మిగతా పనులు మూడొంతులు పూర్తి కాగా, తుదిదశ పనులు మాత్రమే మిగిలాయి. విజయవాడ–కొండపల్లి, కొండపల్లి–చెరువు మాధవరం, చెరువు మాధవరం–గంగినేని–ఎర్రుపాలెం, నెక్కొండ–చింతలపల్లి, చింతలపల్లి–వరంగల్ మధ్య ఇప్పటికే మూడో లైన్ వినియోగంలోకి రాగా, పందిళ్లపల్లి–బోనకల్, ఎర్రుపాలెం–మధిర, విజయవాడ–బెజవాడ క్యాబిన్ మధ్య గత ఏడాది కాలంలో పూర్తయ్యాయి. బోనకల్–మధిర, నెక్కొండ–పందిళ్లపల్లి మధ్య పనులు జరగాల్సి ఉంది. మరో ఏడాదిలో పనులు దాదాపు పూర్తి కానున్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి సిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే 151 కి.మీ. కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లుగా వేగంగా జరుగుతున్నాయి. గత బడ్జెట్లో దీనికి రూ.350 కోట్లు కేటాయించారు. ఇప్పటికే సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ఫార్మేషన్, కటింగ్, లింకింగ్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెయిల్స్ పరవనున్నారు. ఈ సెక్షన్లో దాదాపు 60 వరకు మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. నాలుగు ఆర్ఓబీల నిర్మాణం పూర్తి కావచ్చింది. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో సిరిసిల్ల వరకు రైలు నడిపేందుకు వీలు కలగనుంది. మరికొన్ని మార్గాల్లో..» సిరిసిల్ల–కరీంనగర్ మధ్య 40 కి.మీ. మార్గానికి భూ పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవటంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అక్కడ పనులు జరగటం లేదు. భూ పరిహారం రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూమిని రైల్వేకు అప్పగించి ఉంటే ఈపాటికి చాలా పని జరిగి ఉండేది. ఏడాదిన్నరలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. » నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని రెండు వరుసలకు విస్తరించే ప్రాజెక్టుకు గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించారు. 248 కి.మీ. ఈ మార్గంలో కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పూర్తయింది. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. మిగతా చోట్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. » 2023–24లో బడ్జెట్లో మంజూరు చేసిన ముద్ఖేడ్–డోన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సవరించి మధ్యలో రూ.550 కోట్లు మంజూరు చేశారు. » 2023–24లో మంజూరు చేసిన భద్రాచలం–డోర్నకల్, మోటమర్రి–విష్ణుపురం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు మొదలయ్యాయి. గత బడ్జెట్లో వీటికి రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. » గత బడ్జెట్లో మంజూరు చేసిన పాండురంగాపురం–మల్కాజిగిరి కొత్త లైన్, ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. -
సకాలంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి
సాక్షి, అమరావతి: మూడేళ్ల క్రితం రూ.55 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. వాటిలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, కొత్త లైన్ల కోసం సర్వే మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం–నంబూరు మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణం కోసం రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వేశాఖకు సమర్పించామని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రతిపాదనల కోసం రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు శుక్రవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం.. జీఎం మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లలో 33 రైల్వేస్టేషన్లలో 88 కొత్త లిఫ్టులు, 19 రైల్వేస్టేషన్లలో 218 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక 101 మానవరహిత లెవల్ క్రాసింగ్లను తొలగించామన్నారు. 257 లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు, ఆర్ఓబీల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. అమృత్ భారత్ పథకం కింద రాష్ట్రంలో 56 రైల్వేస్టేషన్లను రూ.2,593 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, అదనపు స్టాపేజీలు, ఆర్ఓబీలు–ఆర్యూబీల నిర్మాణం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం ఎంపీలు చేసిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌కుమార్ జైన్ చెప్పారు. విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్లతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, సీఎం రమేశ్, జీఎం హరీశ్ బాలయోగి, పుట్టా మహేశ్‌కుమార్, కేశినేని శివనాథ్, తెన్నేటి కృష్ణప్రసాద్ తదితర ఎంపీలు పాల్గొన్నారు. -
రూ.6,456 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రూ.6,456 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టబోయే మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఒడిశా, జార్ఖండ్, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లోని మరో 300 కి.మీ.ల రైలుమార్గం నిర్మిస్తూ ఆ మార్గంలో కొత్తగా 14 రైల్వేస్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ‘ఈ మార్గాల్లో రాకపోకలు పెరగడం వల్ల ఈ 4 రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. ప్రజారవాణాతోపాటు ఇక్కడి ఎరువులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి తరలింపు సులభం కానుంది. దీంతో 10 కోట్ల లీటర్ల చమురు దిగుమతి భారం, 240 కోట్ల కేజీల కర్భన ఉద్గారాల విడుదల తగ్గడంతోపాటు 9.7 కోట్ల చెట్లునాటినంత ప్రయోజనం దక్కనుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల సాయం పలు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఎనిమిదేళ్లలో 15వేల మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం సాధించేందుకు ఆ రాష్ట్రాలకు రూ.4,136 కోట్ల ఈక్విటీ సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గరిష్టంగా ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్ల మేర రుణసాయం అందించనున్నారు. మరోవైపు వ్యవసాయ మౌలికవసతుల నిధి పథకం(ఏఐఎఫ్)లో స్వల్ప మా ర్పులు చేస్తూ రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్‌పీఓ)లకూ వర్తింపజేయాలన్న నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. దీంతో పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, నేతపనివాళ్లు, గ్రామీణ కళాకారులు, హస్తకళాకారులు వంటి వారికీ ఈ పథకం ద్వారా రుణసదుపాయం కలి్పంచేందుకు అవకాశం లభిస్తుంది. రూ. 1 లక్ష కోట్ల మూల నిధితో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే. ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక రంగంలో విధానాల రూపకల్పనకు విస్తృత సంప్రదింపులు జరపాల్సిందిగా ప్రధాని మోదీ మంత్రులను, అధికారులను కోరారు. బుధవారం మొత్తం మంత్రిమండలిలో మోదీ ఐదు గంటల సుదీర్ఘ సమీక్ష జరిపారు. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా, సమర్థమంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గత పదేళ్లలో ప్రజలకు ఎంతో మేలు చేశామని, అదే వేగంతో వచ్చే ఐదేళ్లు కూడా పనిచేద్దామని మోదీ సూచించారు. -
తెలంగాణకు రైల్వే కేటాయింపులు రూ.5,336 కోట్లు
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తాజా కేంద్రబడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,336 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. 2009–14 మ«ధ్య కాలంలో ఉమ్మడిరాష్ట్ర వార్షిక సగటు కేటాయింపులు రూ.886 కోట్లు మాత్రమేనని.. ప్రస్తుత సంవత్సరం కేటాయింపులు దాదాపు ఆరురెట్లు ఎక్కువని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని రైల్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) పనుల మొత్తం అంచనావ్యయం రూ.32,946 కోట్లుగా ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వేట్రాక్ పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా పూర్తయిందని చెప్పారు. 2009–2014 మధ్య కాలంలో రాష్ట్రంలో సంవత్సరానికి సగటున కేవలం 17 కి.మీ.మేర మాత్రమే కొత్త ట్రాక్ వేయగా, గత పదేళ్లలో సగటున సంవత్సరానికి 65 కి.మీ. చొప్పున నూతన ట్రాక్ వేసినట్టు వెల్లడించారు. పదేళ్లలో 437 ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని తెలిపారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్‌స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా రైల్వేట్రాక్ ఏర్పాటు చేసే ప్రాజెక్టు పరిశీలనలో ఉందని, సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న తెలంగాణలోని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా ఏర్పాటు చేసే కవచ్‌కు సంబంధించి 4.0 వెర్షన్‌కు ఆమోదం లభించిందని, దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ప్రణాళిక సిద్ధమవుతుందని తెలిపారు. చర్లపల్లి టెర్మినల్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. – వర్చువల్ పద్ధతిలో సికింద్రాబాద్ నుంచి దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ, నగర ప్రజారవాణాకు కీలకమైన ఎంఎంటీఎస్ రెండోదశకు సంబంధించి మిగిలిన పనులను రైల్వేశాఖ సొంత నిధులతో పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని, దీనికి రాష్ట్ర నిధుల కోసం ఎదురుచూడమని తేల్చిచెప్పారు. బీబీనగర్–గుంటూరు డబ్లింగ్ పనులు మొదలయ్యాయని, జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హైలెవల్ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
Union Budget 2024: ఎన్నికల ముంగిట.. ఎన్నో ఆశలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో రైల్వే ప్రాజెక్టులకు భారీగానే కేటాయింపులు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. గత మూడు బడ్జెట్లలో లైన్లు, రైళ్ల పరంగా నిరాశే కలిగినా, కేటాయింపులు కొంత మెరుగ్గానే ఉన్నాయి. కానీ, తెలంగాణలో రైల్వేపరంగా ఉన్న డిమాండ్లతో పోలిస్తే, ఇవి సరిపోవు. దీంతో ప్రతీ బడ్జెట్ ఇంకా మెరుగ్గా ఉంటుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ ముందు ఎంపీలతో భేటీ అయ్యి వారి నుంచి అధికారులు ప్రతిపాదనలు స్వీకరిస్తారు. కానీ ఈసారి అలాంటి భేటీ దక్షిణమధ్య రైల్వే నిర్వహించలేదు. తను కూడా ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపలేదని తెలిసింది. ఆయా రైల్వే లైన్లు ఇలా.... ఆర్మూరు–ఆదిలాబాద్ : ఈ లైన్ కీలకం. దీనికోసం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాపూరావు, బండి సంజయ్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. ►15 ఏళ్ల క్రితం పటాన్చెరు–ఆదిలాబాద్ లైన్ మంజూరైంది. ఆర్మూరు– నిర్మల్ మీదుగా సాగాల్సిన దీని నిడివి. 317 కి.మీ. ఇందుకు రూ.3771 కోట్లు ఖర్చవుతుదని అంచనా వేశారు. కానీ, ఆ తర్వాత దానిని కేంద్రం పక్కనపెట్టింది. ►పెద్దపల్లి–నిజామాబాద్ లైన్ పూర్తయిన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన పట్టాలెక్కింది. కరీంనగర్–నిజామాబాద్ లైన్లో ఉన్న ఆర్మూరు స్టేషన్ నుంచి కొత్త లైన్ మొదలై ముద్ఖేడ్–నాగ్‌పూర్ లైన్లో ఉన్న ఆదిలాబాద్ స్టేషన్‌తో అనుసంధానమవుతుంది. దీని నిడివి 300 కి.మీ., రూ. 2800 కోట్ల అంచనాతో 2017లో ఈ లైన్ మంజూరైంది. సర్వే పూర్తయ్యాక పనులు పట్టాలెక్కిలేదు. దీనికి నిధులు కేటాయించాలన్న ఒత్తిడి పెరిగింది. వికారాబాద్–కృష్ణా: తెలంగాణ సీఎం మొదలు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టిగా డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు వికారాబాద్–కృష్ణా లైను. గత బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే కూడా మంజూరైనా పనులు మొదలు కాలేదు. ►వికారాబాద్–పరిగి–కొడంగల్–దౌలతాబాద్–మక్తల్–నారాయణపేట్–కృష్ణా మీదుగా 122 కి.మీ.మేర కొనసాగే ఈ ప్రాజెక్టుకు రూ.2196 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రైల్వే కనెక్టివిటీ లేని కొత్త ప్రాంతాలకు ఆ రవాణా వసతి కల్పిస్తుంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సీఎం భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ రెండు తెలంగాణకు కీలక ప్రాజెక్టులు కావటంతో వీటి కేటాయింపులపై ఆశలు పెరుగుతున్నాయి. రాష్ట్రానికొచ్చేసరికి.... మనోహరాబాద్–కొత్తపల్లి లైన్‌కు, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి భారీగానే కేటాయింపులుంటాయని, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు కూడా ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. భద్రాచలం–కొవ్వూరు, రామగుండం–మణుగూరు ప్రాజెక్టు విషయంలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఎంఎంటీఎస్ రెండోదశ, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉంది. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం రూ.13786.19 కోట్లు కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా రూ.4418 కోట్లు. 2022–23లో కేటాయించిన మొత్తం రూ.8349.75 కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.3048 కోట్లు. -
15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 కొత్త రైల్వే ప్రాజెక్టులను నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. 2,647 కి.మీ. నిడివితో నిర్మించే ఆ ప్రాజెక్టులకు రూ.50,848 కోట్లు వ్యయం కాను న్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. వీటితోపాటు రూ.32,695 కోట్లు వ్యయమయ్యే 2,588 కి.మీ. 11 డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులకు కూడా ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైనట్టు వెల్లడించింది. రీజినల్ రింగ్ రైల్, ఆదిలాబాద్–పటాన్చెరు, ఘ ట్కేసర్ – యాదాద్రి, తాండూరు–జహీరాబాద్, మ ణుగూరు – రామగుండం, ఉందానగర్ – జగ్గయ్య పేట, కరీంనగర్ – హసన్‌పర్తి, డోర్నకల్ – మిర్యా లగూడ, భూపాలపల్లి–కాజీపేట, పాండురంగాపు రం–మల్కన్‌గిరి, కొత్తగూడెం–కిరండోల్, బోధన్ – లాతూరు రోడ్ ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వేలు మంజూరైనట్టు వెల్లడించింది. కీలకం.. రీజినల్ రింగ్ రైల్ నగరానికి 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వెలుపల దాదాపు 338 కి.మీ. నిడివితో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. రూ.12,408 కోట్ల వ్యయంతో దాదాపు 564 కి.మీ. నిడివితో ఈ ప్రాజెక్టు ఉంటుందని రైల్వే ప్రకటించింది. వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి–భువనగిరి, రామన్నపేట, చిట్యాల, షాద్‌నగర్, షాబాద్ తదితర పట్టణాలను అనుసంధానిస్తూ ఇది రూపొందనుంది. అక్కన్న పేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల మీదుగా కొత్త లైన్లు నిర్మించనుండటం విశేషం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కలగటంతోపాటు సరుకు రవాణా రైళ్లకు కూడా అడ్డంకులు లేని సాఫీ ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుందని రైల్వే చెబుతోంది. ఇక 317 కి.మీ. నిడివితో రూ.5,706 కోట్లతో నిర్మితమయ్యే పటాన్చెరు (నాగులపల్లి) – ఆదిలా బాద్ ప్రాజెక్టు కూడా ఇందులో కీలకం కానుంది. ఇచ్చోడ, నేరేడుగొండ, ధానూరు, నిర్మల్, బాల్కొండ, ఆర్మూరు, బోధన్, రుద్రూరు, బాన్స్వాడ, నిజాంసాగర్, సంగారెడ్డి, పటాన్చెరు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చినట్టు అవు తుంది. దీంతోపాటు హైదరాబాద్–ఢిల్లీ ప్రధాన లైన్‌తో వీటికి అనుసంధానం కూడా కలుగుతుంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, ధాన్యం తరలింపునకు ప్రధాన రవాణా సాధనం అందుబాటులోకి వచ్చినట్టు కూడా అవుతుందని రైల్వే తెలిపింది. -
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్ట్ లు
-
రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య మూడో లైన్ కాగా భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్ పనులు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. -
కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ, వందేభారత్‌పై కేంద్రమంత్రి కీలక హామీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ పనులను మొదలు పెడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉత్తమ్ పార్లమెంట్లో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. డోర్నకల్ – నేలకొండపల్లి – కోదాడ – హుజూర్ నగర్ – నేరేడుచర్ల – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. దీంతో పాటే మోతమర్రి–జగ్గయ్యపేట–మేళ్లచెర్వు–మఠంపల్లి–జాన్ పహాడ్–విష్ణు పురం–మిర్యాలగూడ రైల్వే లైన్లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని, ఈ రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయాలని కోరారు. వందేభారత్‌ను నల్లగొండలో ఆపుతామని హామీ మోతుమర్రి–మిర్యాలగూడ మధ్య ప్యాసెంజర్ రైళ్లను నడుపుతామని, డబ్లింగ్ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. విశాఖ– తిరుపతి వందేభారత్‌తో పాటు వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నల్లగొండలో ఆపేలా చర్య లు తీసుకుంటామని, మిర్యాలగూడలో ఆపే విషయంపై పరిశీలన చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు. -
సీతమ్మా.. దయ ఏదమ్మా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అరకొర కేటాయింపులతో కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ప్రధానంగా పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు దండిగా నిధులు వస్తాయనే ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమే పార్లమెంటులో ప్రవేశపెట్టినా.. రైల్వే కేటాయింపులపై శుక్రవారం రాత్రికి కానీ స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ఈ బడ్జెట్లో మోక్షం లభించలేదు. కొన్నింటిని అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. కీలకమైన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైను నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో కనీసం నాలుగైదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తారని ఆశ పడ్డారు. 22 ఏళ్ల క్రితం రూ.645 కోట్లతో మొదలైన ఈ రైల్వే లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,892 కోట్లకు పెరిగింది. దీనికి తగినట్టుగా కేటాయింపులు లేవని కోనసీమ వాసులు పెదవి విరుస్తున్నారు. కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని, 57 కిలోమీటర్ల రైల్వే లైను కోసం గౌతమి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలపై నిర్మాణంలో ఉన్న మూడు వంతెనల పనులు వేగం అందుకుంటాయని అందరూ ఆశించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కేటాయించిన రూ.100 కోట్లు ఏ మూలకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేస్తే వైనతేయపై బోడసకుర్రు – పాశర్లపూడి మధ్య మందకొడిగా జరుగుతున్న తొమ్మిది పిల్లర్ల పనులు ఊపందుకునేవని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న 528 ఎకరాల భూసేకరణకు కూడా ఈ కేటాయింపులు సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న కాకినాడ – పిఠాపురం మెయిన్ లైన్ ఊసే బడ్జెట్లో లేకుండా పోయింది. ఈ రైల్వే లైను కోసం నాలుగు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనికరించ లేదు. కాకినాడ మెయిన్ లైన్ నిర్మాణానికి రూ.40 కోట్లతో 22 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ లభించింది. కాకినాడ పోర్టు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు భారీ ఆదాయం వస్తున్నా మెయిన్ లైన్ నిర్మాణం అంశాన్ని బడ్జెట్లో ప్రస్తావించకుండా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని పలువురు అంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు రాములోరి సన్నిధికి వెళ్లేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైనుకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. 151 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ ప్రాజెక్టును 2012–13లో రూ.1,445 కోట్లతో ఆమోదించారు. అనంతరం అంచనాలు రూ.2,154.83 కోట్లకు చేరాయి. దీనికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఈ ప్రాంత వాసులు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రైళ్లకు హాల్టులు సహా పలు ప్రాజెక్టులపై ఈ బడ్జెట్లో ఎటువంటి స్పష్టతా కనిపించలేదు. -
పాత ప్రాజెక్టులకే పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు, సర్వేలను సైతం ప్రస్తావించలేదు. కేవలం పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతోనే సరిపెట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 8,349.75లతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు రూ. 4,418 కోట్లు లభించాయి. ఈ మొత్తం గతేడాది కేటాయింపు (రూ. 3,048 కోట్లు)ల కంటే 45 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకే వచ్చే ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం రూ. 8,406 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపు (రూ. 7,032)ల కంటే 20 శాతం ఎక్కువ. గతం కన్నా రూ. 5,437 కోట్లు ఎక్కువ.. ఈసారి దక్షిణమధ్య రైల్వే జోన్‌కు గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 5,437 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జోన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక, మహారాష్ట్రలో రైల్వే లైన్ల ఏర్పాటుకు కూడా ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతోపాటు జోన్ పరిధిలో మరో 105 స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నాం. నగరానికి అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేసేలా ఏకంగా రూ. 600 కోట్లు కేటాయింపు ఆ ప్రాజెక్టుకు పెద్ద మలుపు కానుంది. – అరుణ్‌కుమార్‌జైన్, జీఎం దక్షిణ మధ్య రైల్వే -
ఆశల పట్టాలపై రైల్వే ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24కు గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్లో అంతర్భాగంగానే రైల్వే బడ్జెట్‌ను కూడా ఆమె సమర్పిస్తారు. దీంతో ఈసారైనా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యం లభిస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. రైల్వే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర రైల్వేశాఖకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపింది. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న నాలుగు ప్రధాన ప్రాజెక్టులతోపాటు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్, ఆర్వోబీల నిర్మాణాన్ని ఆమోదించాలని కోరింది. ప్రధానంగా భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర పునర్విభజన చట్టం హామీలను గుర్తుచేస్తూ విశాఖపట్నం రైల్వేజోన్ ఆచరణలోకి వచ్చేలా చూడాలని కోరింది. ఆ చట్టం ప్రకారం కొత్తగా రెండులైన్లకు పచ్చజెండా ఊపాలని ప్రతిపాదించింది. ఈ నాలుగు.. ఇంకెన్నేళ్లు? రాష్ట్రంలో 4 ప్రధాన ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అహేతుక రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో భూసేకరణ వ్యయాన్ని భరిస్తామని, ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపట్టాలని ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులు.. ► కడప–బెంగళూరు రైల్వేలైన్‌ను రూ.3,038 కోట్ల అంచనా వ్యయంతో 268 కిలోమీటర్ల మేర నిర్మించాలని 2008–09 బడ్జెట్లో ఆమోదించారు. నాలుగుదశల ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు మొదటిదశ కింద కడప–పెండ్లమర్రి లైన్లో కేవలం రూ.350 కోట్ల పనులు చేశారు. 1,531 ఎకరాలను భూమిని సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ► నడికుడి–శ్రీకాకుళహస్తి రైల్వేలైన్ పనులు 20 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని అందించడంతోపాటు ఆ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేందుకు ఈ ప్రాజెక్టును 2009లో ఆమోదించారు. రూ.2,400 కోట్లతో ఆమోదించిన ఈ ప్రాజెక్టు వ్యయం సవరించిన అంచనాల మేరకు రూ.4,500 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు 1,300 కోట్ల మేర పనులు చేశారు. భూసేకరణ ప్రక్రియను తాము త్వరగా పూర్తిచేస్తామని, మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే భరించి త్వరలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► రాయదుర్గం–తుముకూరు ప్రాజెక్టును రూ.3,404 కోట్లతో ఆమోదించారు. ఇప్పటివరకు రూ.520 కోట్ల పనులే చేశారు. మిగిలిన నిధులను కూడా కేంద్రమే కేటాయించి ప్రాజెక్టును పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► కీలకమైన కొవ్వూరు–నరసాపురం లైన్ వ్యయాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం రూ.2,125 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు వరకు రూ.300 కోట్ల పనులు మాత్రమే కేంద్ర రైల్వేశాఖ పూర్తిచేసింది. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని, అందుకు భూసేకరణను దాదాపు పూర్తిచేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రెండు కొత్త లైన్లకు ప్రతిపాదన రాష్టపునర్విభజన చట్టం ప్రకారం రెండు రైల్వేలైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వేలైన్‌కు రూ.709 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు. ఆ రైల్వేలైన్‌కు ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కొండపల్లి–కొత్తగూడెం మధ్య కొత్త రైల్వేలైన్ వేయాలని ప్రతిపాదించింది. అందుకోసం సర్వే నిర్వహించి డీపీఆర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. 28 ఆర్వోబీలు నిర్మించాలి రాష్ట్రంలో లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందుకోసం 54 ఆర్వోబీల నిర్మాణాన్ని గతంలోనే ప్రతిపాదించింది. వాటిలో 26 ఆర్వోబీలను రైల్వేశాఖ ఇప్పటికే ఆమోదించింది. మిగిలిన 28 ఆర్వోబీలను కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. డోన్‌లో లోకోషెడ్ ఏర్పాటుచేయాలి కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటనెన్స్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకోసం 100 ఎకరాలు కేటాయిస్తామని తెలిపింది. తద్వారా రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కొత్త రైళ్లు కావాలి రాష్ట్రానికి కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగాఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేయాల్సి ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలు ఎక్కించాలి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ ఏడాది అయినా ఆచరణరూపం దాలుస్తుందా అని రాష్ట్ర ప్రజలు ఆశగా, ఆసక్తిగా చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి డీపీఆర్‌ను రూపొందించింది కూడా. 900 ఎకరాల రైల్వే భూములను గుర్తించి అందులో 150 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో వివిధ హోదాల్లో 170 మంది గెజిటెడ్ అధికారులు, 1,200 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒత్తిడితో జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించింది. అన్నీ ఉన్నా సరే.. విశాఖపట్నం రైల్వే జోన్ ఇంకా ఆపరేషన్లోకి రాలేదు. వాల్తేర్ డివిజన్‌ను కొనసాగిస్తూ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్లో అయినా రైల్వే జోన్ ఆపరేషన్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీమ, ఉత్తరాంధ్ర మధ్య ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ రాయలసీమను ఉత్తరాంధ్రతో అనుసంధానిస్తూ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు ఈ ప్రత్యేక కారిడార్‌తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల కార్గో రవాణా ఊపందుకుంటుందని తెలిపింది. తద్వారా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో రాయలసీమకు నేరుగా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. -
లాలూ ఫ్యామిలీకి షాక్.. ఆ కేసు మళ్లీ తిరగదోడుతున్న సీబీఐ
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రాసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసును మళ్లీ రీఓపెన్ చేసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. అయితే సీబీఐ నిర్ణయం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే కన్పిస్తోందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రేల్వై ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఈకేసులో ప్రాథమిక విచారణ మొదలైంది. అయితే 2021 మేలో ఈ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. లూలూపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని నెలల క్రితమే బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఆర్జేడీతో కలిశారు సీఎం నితీశ్ కుమార్. తన పాతమిత్రుడి చెంతకు మళ్లీ చేరారు. ఈ కారణంగానే లాలూ కేసును బీజేపీ మళ్లీ రీఓపెన్ చేయిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత -
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రిని కలిశాం
-
‘ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వమని కోరాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపిన విజయసాయి రెడ్డి.. అరకు రైలుకు విస్టాడోమ్ కోచ్‌ల సంఖ్య పెంచమని కోరినట్లు పేర్కొన్నారు. రైల్వేమంత్రిని కలిసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. ‘ఏపీకి రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం.రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయమన్నాం. ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం. వాల్తేర్ డివిజన్‌ను కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరాం. సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశాం’ అని తెలిపారు. తమ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల నుంచి సంతకాలు సేకరించిన విషయాన్ని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేక సమితితో కలిసి ఎంపీల సంతకాల జాబితాను ప్రధానికి ఇస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. -
రైల్వే ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఎన్నో ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న కొత్త లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ ప్రాజెక్టులకు 2022–23 కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ బడ్జెట్లో కేంద్రం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కేటాయించిన రూ.5,812 కోట్ల కంటే ఇది 21 శాతం ఎక్కువ. ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటించకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబించాయి. 2022–23 బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ► నడికుడి – శ్రీకాళహస్తి కొత్త లైన్‌కు రూ.1,501 కోట్లు కేటాయించింది. 309 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ. 2,289 కోట్లతో 2011–12లో చేపట్టారు. తగినన్ని నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు 46 కి.మీ. పనులే పూర్తయ్యాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► కోటిపల్లి–నరసాపూర్ కొత్త లైన్‌కు కేంద్రం రూ.358 కోట్లు కేటాయించింది. 57 కి.మీ. ఈ లైన్‌ను రూ.2,120 కోట్లతో 2000–01లో ప్రారంభించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు వేగంగా సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు తాజా బడ్జెట్లో ఎక్కువ నిధులిచ్చింది. ► కడప – బెంగళూరు కొత్త లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రాయలసీమను కర్ణాటకతో మరింతగా అనుసంధానిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.2,706 కోట్లతో చేపట్టే 255 కి.మీ. కొత్త లైన్‌కు 2008–09లో ఆమోదం లభించింది. ఏపీ పరిధిలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే మొదటి దశలో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కి.మీ. నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.289 కోట్లు కేటాయింపుతో మిగిలిన పనులు జోరందుకోనున్నాయి. ► 221 కిలోమీటర్ల విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నరసాపూర్–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.1,681 కోట్లు కేటాయించడం విశేషం. 2011–12లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు తగినన్ని నిధుల్లేక నత్తనడకన సాగింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నాలతో గత రెండు బడ్జెట్లలో ఎక్కువ నిధులిచ్చారు. దీంతో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 144 కి.మీ. పనులు పూర్తి చేశారు. ఇప్పుడు భారీగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ► విజయవాడ– గూడూరు మూడో లైన్‌కు తాజా బడ్జెట్లో కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. 288 కి.మీ. మేర నిర్మించే మూడో లైన్లో ఇప్పటికి 55 కి.మీ. మేరే పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో ఈసారి ఎక్కువ నిధులు కేటాయించారు. ► రాష్ట్రం నుంచి దేశ రాజధానికి వెళ్లే కీలకమైన విజయవాడ– కాజీపేట మార్గంలో మూడో లైన్‌కు రూ.592 కోట్లు కేటాయించారు. రూ.1,953 కోట్లతో 220 కి.మీ. నిర్మించే ఈ లైన్లో నిధులు లేక ఇప్పటివరకు 17.5 కి.మీ. పనులే పూర్తి చేశారు. తాజా కేటాయింపులతో పనులు వేగం పుంజుకోనున్నాయి. ► రూ.3,631 కోట్లతో 401 కి.మీ. గుంటూరు – గుంతకల్ డబ్లింగ్‌ను 2016–17లో ఆమోదించారు. అరకొర నిధులతో ఇప్పటి వరకు 92 కి.మీ. పనులే చేశారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.803 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయి. ► గుత్తి–ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు కేటాయించారు. రూ.714 కోట్లతో 91 కి.మీ. ఈ ప్రాజెక్టును 2015–16లో ఆమోదించారు. ఇప్పటివరకు 57 కి.మీ. పనులు పూర్తయ్యాయి. ► దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో బైపాస్ లైన్ల కోసం రూ.407.47 కోట్లు కేటాయించారు. వాటిలో విజయవాడ, రేణిగుంట, గుత్తి, తెలంగాణలో కాజీపేట, వాడి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ► చిత్తూరు జిల్లా పాకాల – అనంతపురం జిల్లా ధర్మవరం మార్గం విద్యుదీకరణకు రూ.131 కోట్లు, కర్నూలు జిల్లా నంద్యాల – వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మార్గంలో విద్యుద్దీకరణకు రూ.51 కోట్లు కేటాయించారు. ► కర్నూలులో మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు కేటాయించారు. ► తిరుపతి రైల్వే స్టేషన్లో దక్షిణ ముఖద్వారం పనులకు రూ.3 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రత్యేక జోన్ లేకపోవడంతో ఏపీకి తీవ్ర నష్టం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లేకపోవడంతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మరోసారి సుస్పష్టమైంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పూర్తిగా ఒడిశాకే ప్రాధాన్యమిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందనడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో మొత్తం 12 కొత్త లైన్ల పనులకు నిధులు కేటాయిస్తే వాటిలో ఏపీ పరిధిలోని నౌపడ–గుణుపూర్– తెరుబలి లైన్ ఒక్కటే ఉంది. అది కూడా 20 శాతమే ఏపీలో ఉంటుంది. 80 శాతం ఒడిశాలోనే ఉంటుంది. ఆ లైన్‌కు కూడా కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఇక ఈ జోన్ పరిధిలో 28 డబ్లింగ్ పనులకు నిధులివ్వగా, ఏపీ పరిధిలోనివి నాలుగే ఉన్నాయి. వాటిలో కూడా అత్యధిక భాగం ఒడిశాకు ప్రయోజనం కలిగించేవే. ఒడిశాలోని టిట్లాఘర్ – ఏపీలోని విజయనగరం మూడోలైన్‌కు రూ.961 కోట్లు కేటాయించారు. కొత్తవలస–ఒడిశాలోని కోరాపుట్ డబ్లింగ్ పనులకు రూ.348.94 కోట్లు ఇచ్చారు. ఒడిశాలోని ఖుర్దారోడ్, ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు కలిపి రూ.4.18 కోట్లు కేటాయించారు. ఒడిశాలోని భద్రక్ –ఏపీ లోని విజయనగరం మూడోలైన్ మిగులు పనులకు రూ.కోటి మాత్రమే కేటాయించారు. ప్రత్యేక జోన్ ప్రకటించి ఉంటే ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులు వచ్చి ఉండేవని నిపుణులు చెబుతున్నారు. -
రైల్వే ప్రాజెక్టులకు సహకరించండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబం ధించిన సమస్యలపై వ్యక్తి గతంగా చొరవ చూపి, వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయా లని సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఆలస్యమవుతున్న విష యాన్ని సోమవారం ఆయన ఓ లేఖ ద్వారా సీఎం దృష్టికి తెచ్చారు. రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటా యింపులో తెలంగాణకు కేంద్రం న్యాయం చేయ డం లేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం సరికాద న్నారు. ముందు మన రాష్ట్రానికి ఇప్పటికే కేటా యించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను చెల్లించి, భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. 2014–15 బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.2,420 కోట్లకు పెరిగిందన్నారు. లేఖలో పేర్కొన్న కొన్ని ముఖ్య ప్రాజెక్టులివే.. ♦మనోహరాబాద్–కొత్తపల్లి నూతన రైలు మార్గం (151 కి.మీ.): రూ.100 కోట్ల రాష్ట్ర వాటా పెండింగులో ఉంది, ఇంకా 342 హెక్టార్ల భూమిని రైల్వేకు అప్పగించవలసి ఉంది. ♦అక్కన్నపేట–మెదక్ కొత్త రైలు మార్గం (17.20 కి.మీ.): 2021–22 సంబంధించి రూ.31 కోట్ల దామాషా నిధులు చెల్లించాలి. ఇంకా 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాల్సి ఉంది. ♦ఎంఎంటీఎస్–ఫేజ్ 3 ప్రాజెక్టు: నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అమలులో జరిగిన జాప్యంతో వ్యయం రూ.1,150 కోట్లకు పెరిగింది. దీని ప్రకారం రాష్ట్రం తన వాటాగా రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉండగా, కేవలం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసింది. ♦ఎంఎంటీఎస్ ఫేజ్–2 యాదాద్రి వరకు (33 కి.మీ.) పొడిగింపు: ఇందులో మూడింట రెండు వంతుల వ్యయాన్ని రాష్ట్రం పంచుకోవాలి. అయితే, ఇంకా నిధులు జమ చేయనందున ప్రాజెక్టు మొదలు కాలేదు. -
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఇతర సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై బుధవారం ఆయన సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టులకు భూసేకరణ పనులను నిర్దేశిత గడువు ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగతా వ్యయాన్ని రైల్వే శాఖ భరించి ఆయా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కోరారు. కడప–బెంగళూరు రైల్వే లైను ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రతి నెల ప్రగతి సమీక్షలో సమీక్షిస్తున్నందున ఆ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. సకాలంలో నిధులు వెచ్చించాలి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో భరించాల్సిన నిధులను సకాలంలో వెచ్చించి ఆయా రైల్వే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు.. భూసేకరణ, పెండింగ్ అంశాలను వివరించారు. అంతకుముందు విజయవాడ–ఖాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, గుంటూరు–గుంతకల్లు, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, నిడదవోలు–భీమవరం, భీమవరం–విజయవాడ రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణ పనులు, పలు ఆర్ఓబీల నిర్మాణం తదితర ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. -
‘వ్యాగన్’కు మ్యుటేషన్ బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటివరకు భూమి అందలేదు. రైల్వే పేరిట భూమిని మ్యుటేషన్ చేసి ఇస్తేనే మేం పని ప్రారంభింస్తాం. అప్పటివరకు మాకు భూమి అందనట్టే లెక్క’–దక్షిణ మధ్య రైల్వే ‘కోర్టు పరిధిలో ఉన్న కేసు కొలిక్కి రావటంతో జనవరిలోనే రైల్వేకు భూమిని అప్పగించాం. దాన్ని రైల్వే పేరిట మ్యుటేషన్ కోసం తహసీల్దారుకు ఇచ్చిన లేఖను రైల్వేకు అప్పగించాం. కానీ, రైల్వే యంత్రాంగమే పని ప్రారంభించటం లేదు’ –తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 13 ఏళ్లుగా ఓ రైల్వే ప్రాజెక్టు కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. అయితే ఆ ప్రాజెక్టుకు కేటాయించిన భూమి విషయమై వేసిన కేసు కోర్టులో నలిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత భూమి మ్యుటేషన్ అంశం అడ్డంకిగా మారింది. ఇదీ సంగతి... మమతాబెనర్జీ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాజీపేటకు వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేటకు సమీపంలోని మడికొండ సీతారామస్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. తర్వాత ఈ భూమి కేటాయింపుపై కోర్టులో కేసు నమోదైంది. ఇంతలో ఆ ప్రాజెక్టు రద్దవడంతో దానిస్థానంలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపును 2016లో రైల్వే శాఖ మంజూరు చేసింది. రూ.383.05 కోట్ల అంచనాతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు తొలుత రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించినా, భూవివాదం కారణంగా ఆ నిధులు విడుదల కాలేదు. ఎట్టకేలకు కోర్టు కేసు కొలిక్కి రావటంతో గత జనవరిలో 150 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రైల్వేకు అప్పగించారు. అయితే, ఆ భూమిని రైల్వే పిరియాడికల్ వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు పేరుతో మ్యుటేషన్ చేయాలని, అలా భూమి తమ పేరుతో మారితేనే పనులు చేపట్టేందుకు తమ విధానాలు అంగీకరిస్తాయని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. దీంతోపాటు మరో 11 ఎకరాల భూమి కూడా కావాలని కోరగా, రెవెన్యూ అధికారులు పదెకరాలను కేటాయించారు. అయితే, మొత్తం భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వటంతోనే అప్పగింత ప్రక్రియ పూర్తయినట్టు రెవెన్యూ అధికారులు చెబుతుండగా, మ్యుటేషన్ జరగకపోవటం, ధరణి పోర్టల్ రైల్వే పేరు నమోదు కాకపోవటంతో పనులు ప్రారంభించలేమని రైల్వే అధికారులు మిన్నకుండిపోయారు. 1,500 కుటుంబాలకు ఉపాధి 1980లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కృషితో కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. సరిగ్గా పనులు మొదలుపెట్టే తరుణంలో ఇందిరాగాంధీ హత్య, సిక్కుల ఊచకోత వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చడానికిగాను ఆ రాష్ట్రంలోని కపుర్తలాకు ఈ కోచ్‌ఫ్యాక్టరీని బదలాయించారు. తర్వాత రాష్ట్రవిభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏర్పడ్డ కమిటీ అది సాధ్యం కాదని తేల్చింది. ఈ క్రమంలో వర్క్‌షాపు మంజూరైంది. నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్‌హాలింగ్ చేయటం దీని పని. ఇందులో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా మరో వేయి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా ఉంది. -
రైల్వేకు కేటాయింపుల్లో భారీగా తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ప్రభావం రైల్వేపై పడింది. గతేడాది కేంద్ర బడ్జెట్లో రైల్వేకు భారీగానే కేటాయింపులు జరిపిన కేంద్రం.. ఈసారి కొంత కోత పెట్టినట్టు కనిపిస్తోంది. రైల్వేకు సంబంధించిన కేటాయింపులను బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెబ్సైట్లో ఉంచారు. గతేడాది కంటే దాదాపు రూ.2 వేల కోట్ల మేర కేటాయింపుల్లో కోత పడ్డట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల వారీగా పరిశీలించినా.. కేటాయింపులు కొన్నింటికే పరిమితమయ్యాయి. కోవిడ్ వల్ల ఎదురైన ఆర్థిక ఆటంకాలతో కేటాయింపులు కుంచించుకుపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం పనులను వేగంగా నిర్వహించి రెండు, మూడు ప్రాజెక్టులు అందుబా టులోకి తేవాలని నిర్ణయించినా, వాటికి తగ్గ నిధులు మాత్రం దక్కలేదు. దేశవ్యాప్తంగా 56 ప్రాజెక్టులను ప్రాధాన్యమైనవిగా నిర్ధారించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు ప్రారంభించేలా చూడనున్నట్టు రైల్వే తాజాగా ప్రకటించింది. అందులో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్, భద్రాచలం రోడ్–సత్తుపల్లి కొత్తలైన్లకు చోటు దక్కింది. కానీ ఈ రెండు ప్రాజెక్టులకు కూడా గత బడ్జెట్ కంటే నిధులు తక్కువే కేటాయించటం గమనార్హం. గత బడ్జెట్లో కొత్త లైన్లకు రూ.2,856 కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం రూ.205 కోట్లే దక్కాయి. డబ్లింగ్ పనులకు గతంతో పోలిస్తే రూ.3,836 కోట్లకు గాను కేవలం రూ.868 కోట్లే దక్కాయి. ఆ ఊసే లేదు.. రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య సమన్వయం కొరవడి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగని నేపథ్యంలో.. కొత్త బడ్జెట్లో దాని ఊసే లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే శాఖ తన వాటాకు మించి నిధులు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిపడింది. ఆ నిధులు వస్తే పనులు జరుపుతామని ఇప్పటికే పలుమార్లు రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు నిధులు రాకపోవటంతో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టును విస్మరించినట్టు కనిపిస్తోంది. ఇక కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు విషయంలోనూ అదే జరిగింది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఇలా.. పని తాజా బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) గత బడ్జెట్ (అంకెలు రూ.కోట్లలో) కొత్త లైన్లకు 205 2,856 డబ్లింగ్ పనులకు 868.10 3,836 ట్రాఫిక్ వసతులకు 72.65 154 ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణం 562.86 584 ట్రాకుల పునరుద్ధరణ 862 900 ప్రయాణికుల వసతుల మెరుగుకు 199.49 672 ప్రధాన ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా.. మునీరాబాద్–మహబూబ్‌నగర్ 149 240 మనోహరాబాద్–కొత్తపల్లి 325 235 భద్రాచలం రోడ్–సత్తుపల్లి 267 520 అక్కన్నపేట– మెదక్ 83.63 - డబ్లింగ్ పనులు కాజీపేట–విజయవాడ 300 404 కాజీపేట–బల్లార్షా 475 483 సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ 100 185 విజయవాడ–కాజీపేట బైపాస్ 286 - మంచిర్యాల–పెద్దంపేట ట్రిప్లింగ్ 4.50 - చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ 50 5 అంతా గందరగోళం.. రైల్వేకు సంబంధించి బడ్జెట్ పింక్ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టాక వివరాలు అందిస్తారు. బుధవారం రాత్రి 8 వరకు కూడా ఆ సమాచారం అందకపోయేసరికి, గురువారమే వివరాలు వస్తాయని మీడియాకు వెల్లడించి అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి 9 సమయంలో బడ్జెట్ వివరాలను ఢిల్లీ నుంచి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో వాటిని క్రోడీకరించే సమయం లేదని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరాలను గురువారమే వెల్లడించగలమని తేల్చి చెప్పారు. -
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాల్సిందిగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు సహా ఎంపీలు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు సమర్పించారు. భద్రాచలం–సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్ పనులు, భద్రాద్రి కొత్తగూడెం–పాండురంగాపురం–సారపాక లైనును భద్రాచలం వరకు పొడిగించాలని, మునిరాబాద్–మహబూబ్‌నగర్ (246 కి.మీ) లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు, పలు రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపట్టాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఇక విద్యుద్దీకరణకు నిధులు మంజూరైన గద్వాల్–రాయ్‌చూర్, లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్ పనుల్లో వేగం పెంచాలని కోరారు. పఠాన్‌చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ రైల్వే లైన్ పనులను ముఖ్య ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని, ఖమ్మం రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్, మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఖమ్మం స్టేషన్లో కేరళ, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. తాండూర్‌లో రైళ్లకు హాల్ట్ ఇవ్వండి.. తాండూర్‌లోబెంగళూరు–నాందేడ్, హుబ్లీ–సికింద్రాబాద్, బీదర్–యశ్వంత్‌పూర్, పద్మావతి, గరీబ్‌రథ్, హుస్సేన్‌సాగర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ ఇవ్వాల్సిందిగా లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ రంజిత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. నారాయణ్‌పేట జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాల్సిందిగా లోక్‌సభలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. -
సహకరిస్తాం.. పనులు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలోని వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను రైల్వే జీఎంతో చర్చించారు. - ఎంఎంటీఎస్ ఫేజ్–2లో భాగంగా చేపట్టిన తెల్లాపూర్–రామచంద్రాపురం లైన్‌ను వెంటనే ప్రారంభించాలని జీఎంను ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉందని, అవి రాగానే ప్రారంభిస్తామని జీఎం చెప్పారు. - తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మార్గంలోని రైల్వే అండర్ పాస్ ఇరుగ్గా మారిందని, దీనిని విస్తరించాలని ఎంపీ కోరారు. ఇందుకోసం రాష్ట్రం తరఫున నిధులు విడుదల చేయించేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఎంపీ తెలిపారు. నిధులు విడుదల చేస్తే, పనులు మొదలుపెట్టేందుకు అభ్యంతరం లేదని జీఎం సమాధానమిచ్చారు. - కొల్లూరు సర్వీసు రోడ్డు వద్ద ఉన్న రైల్వేట్రాక్‌పై ఆర్వోబీ నిర్మించాలని కోరారు. ఈ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. హెచ్ఎండీఏ– రైల్వే అధికారులకు ఈ విషయంలో సమన్వయం కొరవడిన కారణంగా ఈ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని కోరగా డీపీఆర్ సిద్ధమై నిధులు విడుదలైతే వెంటనే మొదలుపెడతామని జీఎం హామీనిచ్చారు. - ఈదుల నాగులపల్లి వద్ద రైల్వే టెర్మినల్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. దీనికోసం అక్కడ 300 ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే అక్కడ 150 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉంది. ఇక మిగిలిన 150 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జీఎంకు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎండీఏ– రైల్వే అధికారులు చీఫ్ సెక్రటరీ జోషీతో కలసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశానని ఎంపీ తెలిపారు. -
అంచనాలు పురోగతి.. పనులు అధోగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే పనుల అంచనాలు ఏటికేడాది పెరుగుతున్నాయి తప్ప.. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైల్వే పనుల జాప్యానికి ప్రధానంగా భూసేకరణ, అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తే కారణమని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. ఈ కారణంగానే పనులు ముందుకు నడవక ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణ కాంట్రాక్టు కంపెనీల నుంచి కమీషన్ల కోసం డిమాండ్ చేసి నానాహంగామా సృష్టించిన విషయాలను వారు ఉదహరిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టు భూ సేకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ సేకరణ సకాలంలో పూర్తి చేయడం లేదని రైల్వే శాఖ చెబుతోంది. ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో నిధులు మంజూరు చేస్తున్నాయి. కాస్ట్ షేరింగ్ విధానంలో అటు రైల్వే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అరకొరగా నిధులు కేటాయిస్తుండటంతో ప్రాజెక్టుల పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు 8 ఉన్నాయి. వీటి అంచనా వ్యయం నాలుగేళ్ల క్రితం మొత్తం రూ. 13,200 కోట్లు. ఇప్పుడు అదనంగా మరో రూ. 2 వేల కోట్ల వరకు పెరిగినట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే, ఏపీ ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ (జేవీ) ఏర్పాటు చేసినా.. అది కాగితాలకే పరిమితమైంది. జేవీ కాకుండా రాష్ట్రంలో రైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను గతేడాది ఆగస్టులో ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 30న ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రైల్వే వాటా 41%, ఏపీ సర్కారు వాటా 51 % ఉంటుంది. కొలిక్కిరాని నడికుడి–శ్రీకాళహస్తి భూసేకరణ రాష్ట్రానికి వెన్నెముకలాంటి నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రూ.1,314 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 2,200 కోట్లు దాటిందని రైల్వే శాఖ చెబుతోంది. విజయవాడ–భీమవరం–నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు 2013లో రూ.1,009.08 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు రూ.1,300 కోట్లను దాటుతోంది. కడప–బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1000.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పుడు రూ.1,300 కోట్లు దాటింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.3,246 కోట్లు అంచనా కాగా, రూ.3,780 కోట్లకు చేరింది. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్–రాయగిరి (యాదాద్రి) మార్గంలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంటీఎస్) రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. జంట నగరాల పరిధిలో ఇప్పటికే ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధి పనుల్లో భాగంగా ఘట్కేసర్–రాయగిరి మార్గంలో సైతం ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ధనం కింద రూ.150 కోట్ల నిధులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్)కు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ కింద ఘట్కేసర్–రాయగిరి మార్గంలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.75 కోట్లు, జంట నగరాల్లో నిర్మిస్తున్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల కోసం మరో రూ.50 కోట్లు, ఎంఎంటీఎస్ ప్రాజెక్టుల భవిష్యత్తు అవసరాలకు రూ.25 కోట్లను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు కేటాయిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంఎస్ఆర్టీఎస్) ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.350 కోట్లను విడుదల చేయాలని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కోరడంతో, ప్రస్తుతానికి రూ.150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మెట్రో అనుసంధానంపై పరిశీలన హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేసి ప్రయాణికులకు చివరి మైలు వరకు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెట్రో రైలు స్టేషన్లను, ఎంఎంటీఎస్ స్టేషన్లు, బస్ స్టాపులతో అనుసంధానం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. ఈ బాధ్యతలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన నిధులను హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రానికి ‘రైల్వే’ నిధులు రూ.1,850 కోట్లు?
సాక్షి, హైదరాబాద్: తాజా కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రూ.1,850 కోట్లు దక్కాయి. గత బడ్జెట్లో రూ.1,729 కోట్లు మంజూరు చేయగా ఈసారి రూ.121 కోట్లు ఎక్కువే దక్కినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఈ నెల 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా రైల్వేకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. దేశవ్యాప్తంగా రైల్వేకు కేటాయించిన ప్రధాన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. జోన్ల వారీగా కేటాయించిన నిధుల వివరాలు ‘పింక్‌బుక్’గా పేర్కొనే ప్రత్యేక పుస్తకంలో ఉంటాయి. ఆ రోజు దానిని వెల్లడించలేదు. సోమవారం దానిని పార్లమెంటుకు సమర్పించనున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్ల కేటాయింపులు లేక చాలా కాలంగా తెలంగాణ బాగా వెనకబడింది. గత ఏడాది తెలంగాణ వాటాగా రూ.1,729 కోట్లు మంజూరు చేయడంతో ప్రాజెక్టుల పురోగతి కొంత వేగం పుంజుకుంది. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 90 శాతం ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజా బడ్జెట్లో గతం కంటే రూ.121 కోట్లు పెంచటం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశమే. -
ఆగని జైట్లీ ఎక్స్‌ప్రెస్
కాజీపేట రూరల్: ఓరుగల్లులో అరుణ్ జైట్లీ ఎక్స్‌ప్రెస్ ఆగకుండానే పోయింది. పార్లమెంట్లో గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పాతజిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది. బడ్జెట్లో రైల్వేపరంగా రావాల్సిన ప్రాజెక్ట్‌లు, నిధులు, కొత్త రైళ్ల మంజూరు, పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జిల్లా ఎంపీలు రాణించలేకపోయారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. కలగానే కాజీపేట డివిజన్.. అరుణ్ జైట్లీ బడ్జెట్లో కాజీపేట రైల్వేడివిజన్ కేంద్రం మంజూరు ప్రస్తావన కలగానే మిగిలిపోయింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ రైల్వేజోన్ ఇస్తే కాజీపేట రైల్వేను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలనే ఉంది. అటు విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన రాలేదు.. ఇటు కాజీపేట డివిజన్ ఊసే లేకుండాపోయింది. ఫిట్‌లైన్ నిర్మాణానికి నిధులు నిల్.. కాజీపేటలో పిట్‌లైన్ పనులు నిధుల కొరతతో అర్థంతరంగా ఆగిపోయాయి. ఈ బడ్జెట్లో దీనికి నిధులు మంజూరు కాలేదు. అలాగే వ్యాగన్ పీఓహెచ్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు ఈసారి బడ్జెట్లో వస్తుందని ఆశించినప్పటికీ పెరంబుదూర్‌కు కోచ్‌ల తయారీ పరిశ్రమను మంజూరు చేయడంతో ఈ ప్రాంత ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. కొత్త రైళ్ల ప్రస్తావన రాలేదు. నాన్‌స్టాప్ రైళ్లకు హాల్టింగ్ లేదు. ఏ–1 స్టేషన్‌గా కాజీపేట జంక్షన్.. కాజీపేట జంక్షన్‌ను ఏ–1 స్టేషన్‌గా బబ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న కాజీపేట జంక్షన్‌ను మరింత అభివృద్ధి చేసి ఏ–1 స్టేషన్‌గా దక్షిణమధ్య రైల్వేలో నిలపనున్నారు. కాజీపేట–విజయవాడ థర్డ్‌లైన్‌కు రూ.100 కోట్లు.. కాజీపేట–విజయవాడ వరకు నిర్మాణం జరిగే నూతన మూడో రైల్వేలైన్ నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు, కాజీపేట–బల్లార్షా మూడో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.160 కోట్ల నిదులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదర్శ రైల్వేస్టేషన్లుగా రఘునాథపల్లి, కేసముద్రం.. కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోగల రఘునాథపల్లి, కేసముద్రం రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా బడ్జెట్లో జైట్లీ ప్రకటించారు. త్వరలో ఈ రెండు రైల్వేస్టేషన్లు ఆదర్శ రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. కాజీపేట, డోర్నకల్ స్టేషన్లకు పుట్ఓవర్ బ్రిడ్జిలు మంజూరు కాజీపేట, డోర్నకల్ రైల్వేస్టేషన్లలో పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఈ స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. భద్రాచలం నుంచి సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు, కొత్తపెల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌కు రూ.350 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. కాజీపేట డివిజన్, వ్యాగన్‌షెడ్, కోచ్ ఫ్యాక్టరీ ఆశలపై నీళ్లు కొత్త రైళ్లు లేవు, నాన్‌స్టాప్ రైళ్లకు హాల్టింగ్ లేదు ఏ–1 స్టేషన్‌గా కాజీపేట జంక్షన్ కాజీపేట, డోర్నకల్‌కు ఫుట్ఓవర్ బ్రిడ్జిలు మోడల్ రైల్వేస్టేషన్లుగా రఘునాథపల్లి, కేసముద్రం భద్రాచలం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.300 కోట్లు కేటాయింపు కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్‌కు రూ.100 కోట్లు కాజీపేట–బల్లార్షకు రూ.160 కోట్లు మంజూరు -
రైల్వే ప్రాజెక్టులకు జీఎస్టీ షాక్
కీలక రైల్వే ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పనులు - ట్రాక్ మరమ్మతులు, బ్రిడ్జి నిర్వహణకూ బ్రేక్ - పది రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లు - ముందు ప్రాజెక్టులకు పాత పన్నే ఉండాలని డిమాండ్ - రూ.5,600 కోట్ల విలువైన పనులకు ఆటంకం సాక్షి, హైదరాబాద్: దక్షిణ, మధ్య రైల్వేలో ఈ ఏడాది చేపట్టిన ప్రాజెక్టులన్నీ దాదాపు నిలిచిపోయాయి. రోజువారీగా చేపట్టవలసిన ట్రాక్‌లు, బ్రిడ్జీల నిర్వహణ సహా అత్యవసర పనులకు బ్రేకులు పడ్డాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుకు ముందు ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టులన్నింటికీ పాత పన్ను విధానమే అమలు చేయాలని, పాత ప్రాజెక్టులకు జీఎస్టీ ప్రకారం 18 శాతం పన్ను చెల్లించబోమని కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సైతం బిల్లులు తీసుకోకుండా పనులు నిలిపివేయడంతో దక్షిణ, మధ్య రైల్వేలో 90 శాతానికి పైగా పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అక్కన్నపేట–మెదక్, మనోహరాబాద్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, కాజీపేట్–విజయవాడ వంటి కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్ అండర్ బ్రిడ్జీల వంటి సుమారు రూ.5,600 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. ఇండియన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దక్షిణ, మధ్య రైల్వే పరిధిలోని 6 డివిజన్లలో ప్రాజెక్టులు చేపట్టిన 1,500 మంది కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఎంఎంటీఎస్–2 కు బ్రేక్.. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశను వచ్చే డిసెంబర్ నాటికి పట్టాలెక్కించాలని అనుకున్నప్పటికీ కాంట్రాక్టర్ల ఆందోళనతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రధాన పనులు జరుగుతున్నప్పటికీ వివిధ మార్గాల్లో అంతర్గతంగా పూర్తి చేయవలసిన ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం ఆగిపోయింది. వీటితో పాటు కాజీపేట్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ తదితర ప్రాంతాల్లోనూ ఆర్‌యూబీలు, ఆర్ఓబీలకు బ్రేకులు పడ్డాయి. ఇక నడికుడి–శ్రీకాళహస్తి, గుల్బర్గా–బీదర్ మూడో లైన్, కాజీపేట్–బల్లార్ష, కాజీపేట్–విజయవాడ, మనోహరాబాద్–నిజామాబాద్ వంటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. రోజువారీ రైళ్ల రాకపోకల దృష్ట్యా చేపట్టవలసిన అత్యవసర ట్రాక్, బ్రిడ్జీల మరమ్మతు పనులపైనా ఈ ఆందోళనల ప్రభావం పడింది. ఈ పనులు చేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇచ్చేందుకు పలువురు కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో పరిమితంగా ఉన్న రైల్వే సిబ్బందే ట్రాక్ నిర్వహణ పనులను చేపడుతున్నారు. ఇటీవల పలు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడం.. భారీ వర్షాలు ట్రాక్‌లను ముంచెత్తుతున్న పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేయడం ఇబ్బందికరంగా మారిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. జీఎస్టీతో గందరగోళం.. జూలై 1 నుం చి అమల్లోకి వచ్చిన జీఎస్టీ రైల్వేలో గందరగోళం సృష్టించింది. జీఎస్టీ ప్రకారం అన్ని రైల్వే ప్రాజెక్టులపై 18 శాతం పన్ను విధించారు. పాత పన్ను విధానం ప్రకారం రైల్వేలో చేపట్టే పనులకు అన్ని ప్రాజెక్టులపై 5 శాతం వ్యాట్ అమలయ్యేది. దీనికి మరో 2 శాతం వరకు బిల్డింగ్ సెస్, ఇన్‌కమ్‌ట్యాక్స్ సెస్ ఉండేది. జీఎస్టీతో ఇది ఏకంగా 18 శాతానికి పెరిగింది. పైగా జూన్ 30 నాటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలను జీఎస్టీ పరిధిలోకి తేవడంతో సమస్య మొదలైంది. అప్పటి వరకు పూర్తి చేసిన పనులకు నిధులు చెల్లించేందుకు రైల్వే సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేశారు. ఆ బిల్లులు తీసుకుంటే 18 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. దీన్ని కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిష్కరించే వరకు పనులు చేపట్టబోం.. జీఎస్టీ అమలు కంటే ముందు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రాజెక్టులకు 18 శాతం, 12 శాతం చొప్పున పన్నులు విధిస్తామంటే ఎలా. దానివల్ల మేము భారీగా నష్టపోవలసి వస్తుంది. పాత ప్రాజెక్టులను జీఎస్టీ పరిధిలోకి తేవద్దనేదే మా ప్రధాన డిమాండ్. ఈ సమస్యను పరిష్కరించే వరకు పనులు చేపట్టబోం. – అఫ్సర్ రియాజ్, ఇండియన్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు -
ఉమ్మడిగా రైల్వే ప్రాజెక్టులు
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు - రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అభినందనీయం - వీడియో లింకు ద్వారా పలు అభివృద్ధి పనులు ప్రారంభం - జగిత్యాల–మోర్తాడ్ సర్వీసుకు పచ్చజెండా ఊపిన మంత్రి సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తోందని, ఇప్పటి వరకు చేపట్టిన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఢిల్లీలోని రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను, నాంపల్లి రైల్వేస్టేషన్లో నిర్మించిన ఆర్వోబీని, ఈ రెండు స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని, సికింద్రాబాద్ స్టేషన్లో ఎంఎంటీఎస్ బుకింగ్ కేంద్రాలను, ఎల్ఈడీ లైట్లను కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీ కవిత, రైల్వే ఉన్నతాధికారులతో కలసి ప్రారంభించారు. కరీంనగర్– లింగంపేట్– జగిత్యాల సెక్షన్లో నడుస్తున్న డెమూ ప్యాసింజర్ ను మోర్తాడ్ వరకు పొడిగింపునకు పచ్చా జెండా ఊపారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా (ఉమ్మడి సంస్థగా) ఏర్పడి ప్రాజెక్టులను పూర్తి చేస్తా యన్నారు. కొన్ని ప్రాజెక్టుల వ్యయాన్ని పంచు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, సహకా రాన్ని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 790 కోట్ల రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నా యన్నారు. ప్రస్తుతం 104 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదు పాయం ఉందని, 2017 చివరికి మొత్తం 200 స్టేషన్లలో ఈ సేవలను విస్తరించనున్నామ న్నారు. పూర్తి భద్రతతో కూడిన, మెరుగైన రైల్వే సేవలను అందజేయడమే తమ లక్ష్యమన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు అనుమతి: దత్తాత్రేయ ప్రధాని, రైల్వే మంత్రి పెద్దపల్లి–నిజామాబాద్ లైనుకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తుం డడం సంతోషకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2017 చివరిలోగా ఈ రైల్వే లైను పూర్తవుతుందని ఆకాంక్షించారు. మౌలాలీ– సనత్ నగర్ మధ్య రక్షణ శాఖ భూముల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు అనుమతి లభించిందని చెప్పారు. ఇటు భువనగిరి, యాదాద్రి వరకు, అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్– కాజీపేట్ మార్గంలో మూడో లైన్ నిర్మించాలని, కాజీపేట్‌లో ని వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం సంతోషిం చదగిన విషయమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. 2017 చివరి కల్లా పెద్దపల్లి–నిజామా బాద్ మధ్య రైల్వే సేవలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డెమూ రైలును మోర్తాడ్ వరకు పొడిగించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలి పారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభో త్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మహ్మద్ అలీఖాన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వశిష్ట జోహ్రీ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ప్రాజెక్టుల భాగస్వామ్యానికి రాష్ట్రాలు ఓకే
న్యూఢిల్లీ: కొత్త లైన్ల ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధిలో రాష్ట్రాలు పాలు పంచుకోవాలని రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు అంగీకరించాయి. దాదాపు రూ.62,379 కోట్ల ఖర్చుతో కూడుకున్న 43 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకోవాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారని, ఇందుకుగాను 16 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25 నుంచి 66 శాతం వరకు రాష్ట్రాలు భరించనున్నాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల ఏర్పాటు, లైన్ల డబ్లింగ్ పనులు వంటి వాటిపై రైల్వే శాఖ దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, కేరళ, ఒడిశా రాష్ట్రాలు జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని చెప్పారు. -
13 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రంతో ఒప్పందం
- భూ సేకరణే ప్రధాన సమస్య - ఇప్పటి వరకు రూ.351 కోట్ల ఖర్చు - ఈ ఏడాది బడ్జెట్లో రూ.588 కోట్ల కేటారుుంపు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులపై ఏడు నెలలుగా ఎదురు చూస్తున్న జారుుంట్ వెంచర్ ఒప్పందంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. రైల్వే శాఖతో ఏపీ సర్కారు ఈ మేరకు ఒప్పందం కుదర్చుకుంది. రూ.13 వేల కోట్లకుపైగా నిధులతో చేపట్టాల్సిన ఈ రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా పట్టాలెక్కించేందుకు జారుుంట్ వెంచర్ కంపెనీ ప్రధానంగా విధులు నిర్వహించనుంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను రాబో యే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నారుు. ఈనెల 14న రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ లేఖ రాశారు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ప్రధానంగా ఏడు ప్రాజెక్టులను జారుుంట్ వెంచర్‌గా చేపట్టేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.351 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.588 కోట్లు కేంద్రం కేటారుుంచింది. ఈ రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధాని మోదీ ‘ప్రగతి’కార్యక్రమంలో చేర్చిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది. అరుుతే ఈ ప్రాజెక్టులకు ప్రధానంగా భూసేకరణ సమస్య అవరోధం కావడం గమనార్హం. నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్లకు ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు. ఒప్పందం కుదర్చుకున్న ప్రాజెక్టుల్లో కొత్త రైల్వే లైన్లు నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్, కాకినాడ-పిఠాపురం, కడప-బెంగుళూరు, అమరావతి-మంగళగిరి కొత్త రైల్వే లైన్లు కాగా, గుంటూరు-గుంతకల్ డబుల్ లైను, గూడూరు-విజయవాడ మూడో లైను నిర్మాణం ఉన్నారుు. మంగళగిరి-అమరావతి మధ్య 40 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును జేవీ కంపెనీ కింద చేర్చారు. -
పాత కేటాయింపులు రద్దు
♦ ఏళ్లుగా నిధుల కోసం ఎదురుచూస్తున్నవి అటకెక్కినట్టే ♦ కొత్తగా మంజూరు చేసే వాటికే నిధులు ♦ రైల్వే ప్రాజెక్టులపై సురేశ్‌ప్రభు స్పష్టమైన వైఖరి ♦ రాష్ట్రానికి అశనిపాతం ♦ పాతవి అమలు చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరం ♦ వాటిని రద్దు చేసి కొత్తవాటి కోసం అధ్యయనం చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గతం గతః. రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు పంథా ఇది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు ఉండాలని గట్టిగా చెబుతున్న ఆయన ఎప్పుడో మంజూరు చేసి పనులు చేపట్టకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను రద్దు చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పుడిది తెలంగాణకు అశనిపాతంగామారబోతోంది. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కొత్త రైలు మార్గాలు మంజూరైనా.. కనీసం సర్వే కూడా పూర్తి కానివి నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఏదో ఒక బడ్జెట్లో నిధులు రాకపోతాయా, అవి పూర్తికాకపోతాయా అని ప్రజలూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక అవి రావని సురేశ్‌ప్రభు తేల్చేస్తున్నారు. రాష్ట్రంలో నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఉన్నఫళంగా రూ.30 వేల కోట్లు అవసరం. అన్ని నిధులు ఇచ్చే స్థితిలో కేంద్రం లేదు. అందుకే పాతవాటిని రద్దు చేసి, మరోసారి కొత్తగా అధ్యయనం చేసి అవసరమైన వాటిని మాత్రమే మంజూరు చేయాలని సురేశ్‌ప్రభు నిర్ణయించారు. దీన్ని ఆయన గత బడ్జెట్లోనే దాదాపు తేల్చి చెప్పారు. గతంలో అత్తెసరు నిధులిచ్చిన వాటికి ఆయన గత సంవత్సరం బడ్జెట్లో పైసా కేటాయించలేదు. ఈసారి కూడా వాటిని ఆయన పూర్తిగా వదిలేయబోతున్నారు. వీటికి మాత్రమే... సీఎం కేసీఆర్ గట్టిగా డిమాండ్ చేస్తున్న మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం, మణుగూరు-రామగుండం, భద్రాచలం-సత్తుపల్లి, మాచర్ల-నల్లగొండ లాంటి కొన్ని కీలక లైన్లకే రైల్వే మంత్రి నిధులిచ్చే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి మార్గం విషయంలో సురేశ్‌ప్రభు గత బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లు ఇచ్చారు. దీనిపై కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా ఈసారి దీనికి కొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక అత్యంత కీలకమైన బల్లార్షా-విజయవాడ మూడో లైన్ పనులకూ నిధులు ఇవ్వనున్నట్టు సమాచారం. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్, మంచిర్యాల-పెద్దంపేట ట్రిప్లింగ్, రాఘవాపురం-మందమర్రి ట్రిప్లింగ్, కాచిగూడ-మహబూబ్‌నగర్ డబ్లింగ్, అక్కంపేట-మెదక్ లైన్లకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే... రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ మాత్రమే నిధులు కేటాయించాలనే పద్ధతికి స్వస్తి చెప్పిన సురేశ్ ప్రభు ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేరాలని చెబుతున్నారు. సగం ఖర్చును రాష్ట్రాలు భరించేందుకు ముందుకొస్తే వాటికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాలతో సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతకం చేసింది. రాష్ట్రం 50 శాతం ఖర్చు భరించే ప్రాజెక్టులకు రైల్వే పచ్చజెండా ఊపుతుంది. రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు, దాన్ని యాదాద్రి వరకు విస్తరించే పనులపై ఆసక్తి చూపుతోంది. వీటికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. -
ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?
► రైల్వేలో జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటు ►ఏపీతో ఇటీవల కుదుర్చుకున్న రైల్వేశాఖ ► రూ.9 వేల కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో రైల్వే ప్రాజెక్టులు హైదరాబాద్: రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడం, అవసరమైన నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీలను (జేవీలు) ఏర్పాటు చేసేందుకు కేంద్రం తాజాగా అనుమతిచ్చింది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు రైల్వే శాఖకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైల్వేశాఖ జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుపై ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 వేల కోట్లతో పలు రైల్వే ప్రాజెక్టులు 50 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టులకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా నిధులు విదుల్చుతోండటంతో సుదీర్ఘకాలంగా ఇవి పట్టాలెక్కడం లేదు. వాటా ప్రాజెక్టులన్నీ పడకేశాయి. అరకొరగా కేటాయిస్తున్న నిధులతో ఈ ప్రాజెక్టులు ఎన్నటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుతోనైనా పడకేసిన రైల్వే ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. జాయింట్ వెంచర్ కంపెనీలేం చేస్తాయి? రైల్వే మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ సమస్యలు, నిధులు సమకూర్చడం వంటివి ఎప్పటికప్పుడు జేవీలు పర్యవేక్షిస్తాయి. ఎంపిక చేసిన ప్రతినిధులతో కలిసి ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టును బట్టి రూ.100 కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవాలి. రైల్వేశాఖ ముందుగా ప్రతి రాష్ట్రానికి ఇచ్చేది రూ.50 కోట్ల వరకు ఉంటుంది. రైల్వేశాఖ ప్రాజెక్టుకు, నిధుల సమీకరణకు ఆమోదముద్ర వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీలు, ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలి. ► కడప-బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1,000.23 కోట్లతో అంచనా వేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.189.95 కోట్లు కేటాయించాయి. ► నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,314 కోట్లు. ఇప్పటివరకు రూ.6 కోట్లే కేటాయించారు. గుంటూరు, నెల్లూరు జిల్లాలో భూసేకరణ కోసం రాష్ట్రం రూ.289 కోట్ల నిధులు విడుదల చేసింది. ► కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1,050 కోట్లు. రాష్ట్రం రూ.2.69 కోట్లు, కేంద్రం రూ.5 కోట్లు కేటాయించింది. ► కాకినాడ-పిఠాపురం లైన్ రూ.123.68 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు పైసా మంజూరు చేయలేదు. ► తుమ్కూరు-రాయదుర్గం రైల్వేలైన్‌కు 970.34 కోట్లు అంచనా వ్యయమైతే, ఇప్పటివరకు రూ.200 కోట్లు కేటాయింపులు జరిగాయి. ► విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం, భీమవరం/నర్సాపురం-నిడదవోలు లైన్‌కు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.1009.08 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.141 కోట్లు కేటాయించారు. ► గుంటూరు-తెనాలి-రేపల్లె డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు రూ.133.46 కోట్లు అంచనా వ్యయం. ఇప్పటివరకు రూ.35 కోట్లు కేటాయించారు. ► భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్‌కు రూ.923.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇంతవరకు సర్వే దశ దాటలేదు. దేవరపల్లి-పెనుకొండ 48 కి.మీ. లైన్ రూ.400 కోట్ల అంచనా వ్యయం కాగా, ఏపీ తన వాటా నిధులపై నోరు మెదపడం లేదు. ► గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌కు రూ.2,033 కోట్లు అంచనా వ్యయమైతే కాగితాలకే పరిమితమైంది. -
రైల్వేలతో రాష్ట్రం ఎంఓయూ
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌లు త్వరితగతిన పూర్తి చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. గురువారం రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిత్తల్ సమక్షంలో ఎంఓయూపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మ, రైల్వే నుంచి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వేద్ ప్రకాశ్ సంతకాలు చేశారు. వివిధ రాష్ట్రాలలో రైల్వే లైన్ల డిమాండ్ నానాటికీ పెరుగుతోందని, నిధుల కొరత వల్ల వాటిని నిర్మించడానికి రాష్ట్రాలతో రైల్వేల భాగస్వామ్యం అవసరమని రైల్వే బోర్డు చైర్మన్ మిత్తల్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో కొద్ది నెలల్లో ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్ కంపెనీకి ఈ ఎంఓయూ పునాదిరాయి వంటిదన్నారు. ఈ ఎంఓయూ కింద ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) వల్ల నిధుల సమీకరణతో పాటుగా త్వరితగతిన అనుమతులు లభిస్తాయని, అందువల్ల కీలక మౌలికవసతులు కల్పించే ప్రాజెక్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. చైర్మన్ నియామకం రాష్ట్రం చేతిలో జాయింట్ వెంచర్ కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ భాగస్వాములు కాగా, ఈ కంపెనీకి చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ కంపెనీ అవసరమైన ప్రాజెక్ట్‌లను గుర్తించి, వాటికి కావాల్సిన ఆర్థిక వనరులను సేకరిస్తుంది. నిధుల లభ్యత ఖరారైన తర్వాత ప్రాజెక్ట్‌లకు స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ఎస్పీవీలో పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు భాగస్వాములు కావచ్చు. ఎంఓయూ ప్రకారం ప్రాజెక్ట్‌ల అమలుకు అయ్యే వ్యయంలో 51% రాష్ట్ర ప్రభుత్వం, 49% రైల్వే శాఖ భరించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్‌లను పూర్తిచేయడంలో ఎస్పీవీ పూర్తి బాధ్యత వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీల్ శర్మ చెప్పారు. ఈ ఎంఓయూ కింద చేపట్టే ప్రాజెక్ట్‌లను ఇంకా గుర్తించాల్సి ఉందని, జాయింట్ వెంచర్ కంపెనీ ప్రధాన కార్యాలయం రాష్ట్రంలోనే ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. -
రైల్వేకు 1100 ఎకరాలు
సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాక్షి, బెంగళూరు: అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం బెంగళూరులోని విధానసౌధలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూముల సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ఇదే సందర్భంలో గదగ్-వాడి రైల్వే ప్రాజెక్టుకు గాను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు(కేఐఏడీబీ) ద్వారా ఆరు నెలల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి విలేకరులతో మాట్లాడారు. గదగ్-వాడి మధ్య 255 కిలోమీటర్ల మేర రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 2,500 ఎకరాల భూమి అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కోసం ఆరు నెలల్లో 1100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న మరో 15 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అన్నారు. ఈ 15 ప్రాజెక్టుల్లో తుమకూరు-రాయదుర్గ, బీదర్-గుల్బర్గా, బాగల్కోటె-కుడచి, బెంగళూరు-హాసన రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారని వెల్లడించారు. తక్కువ పరిమాణంలో రైతుల నుంచి భూమి సేకరించాల్సిన పరిస్థితుల్లో నేరుగా డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి
దక్షిణమధ్య రైల్వేలో విజయవాడ తరువాత అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న జిల్లా నెల్లూరే. ఏడాదికి రూ.1500 కోట్లు పైన రాబడి తెచ్చిపెడుతున్న నెల్లూరు జిల్లాపై కేంద్రం కరుణించలేదు. రాష్ట్ర విభజన తరువాత కోస్టల్ కారిడార్‌గా నెల్లూరు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టులు ప్రకటించకపోవడమే కాకుండా.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కూడా విడుదల చేయకపోవడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ల ఏర్పాటుకు నిధులు విడుదల చేయకపోవడంతో జిల్లాకు వచ్చే వివిధ పరిశ్రమల ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల ఊసేలేదు కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రైల్వే అభివృద్ధిపై గత యూపీఏ ప్రభుత్వం వైఖరినే అనుసరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత యూపీఏ ప్రభుత్వం హయాంలో 2010-11 బడ్జెట్లో రూ.1310 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే.. 2012 బడ్జెట్లో కేవలం రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో రూ.110 కోట్లు కేటాయించినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. ఇంకా రూ.1200 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఈ లైను పూర్తయితే మెట్టప్రాంతాలైన రాపూరు, వింజమూరు, ఆత్మకూరు, కనిగిరి తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. శ్రీకాళహస్తి- నడికుడి రైల్వే లైను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇటీవల ఉదయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు కూడా. అయితే బడ్జెట్లో నామమాత్రంగా నిధులు విడుదల చేశారు. ఇకపోతే గూడూరు డివిజన్ దుగ్గరాజుపట్నంలో మరో ఓడరేవును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓడరేవు ఏర్పాటు చేస్తే జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓడరేవు నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం గూడూరు నుంచి దుగ్గరాజుపట్నంకు రైలు మార్గాన్ని వేయాలని ప్రతిపాదించింది. అందుకు రూ.278 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు కూడా. అందులో భాగంగా 2013లో రూ. కోటి మంజూరు చేశారు. ఆ తరువాత రైల్వే లైను ఏర్పాటుకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. కృష్ణపట్నం- ఓబులాపురం రైల్వే లైనుకు గ్రహణం ఆసియాలో కృష్ణపట్నం ఓడరేవు ప్రసిద్ధి చెందినది. ఓడరేవు నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర వస్తువులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయి. అందుకు కృష్ణపట్నం నుంచి ఓబులాపురం వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు రూ.930 కోట్లు అంచాన వేశారు. రైల్వే లైను ఏర్పాటుకు 2011లో రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రైల్వే లైను పూర్తి చేశారు. మిగిలిన రైల్వే లైను ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని అధికారులు నివేదికలు పంపారు. అదే విధంగా ఓబులాపురం వరకు రైలుమార్గానికి భూసేకరణ అడ్డంకిగా మారింది. ప్రస్తుత బడ్జెట్లో ఈ లైను ఏర్పాటు ఊసెత్తలేదు. ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అదే విధంగా బిట్రగుంటలో 1600 ఎకరాల్లో రైల్వే ఇంజన్లు మరమ్మతు కర్మాగారం ఏర్పాటు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టుల ఊసే లేకపోవడంతో జిల్లా వాసులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొత్త రైళ్లకు రెడ్ సిగ్నల్ కొత్త ప్రాజెక్టుల మాటెత్తకపోయినా.. కనీసం కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఉంటాయని జిల్లా ప్రజలు ఎదురు చూశారు. అదేవిధంగా ప్రధాన రైళ్లు నెల్లూరు, బిట్రగుంట, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ కల్పిస్తారని ఆశపడ్డారు. ఆ ఆశలపైనా కేంద్ర మంత్రి నీళ్లు చల్లారు. దీంతో నెల్లూరు నుంచి సికింద్రాబాద్ ఇంటర్సిటీ, నెల్లూరు- చెన్నై- విజయవాడ ‘మెమో’ రైళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, కోరమండల్, గరీబ్థ్,్ర పినాకిని, నవజీవన్ రైళ్లను ఆపే పరిస్థితి లేదు. మొత్తంగా కేంద్ర రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజలకు నిరాశను మిగిల్చింది. చార్జీల నుంచి మినహాయింపు బీజేపీ ప్రభుత్వం ప్రజలపై రైల్వే చార్జీల భారం మోపలేదు. తొలుత 200 కిలోమీటర్లు పైబడి చార్జీలు పెంచనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ బడ్జెట్లో అలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రప్రభుత్వం ఎక్కువగా ప్రయాణికులు సౌకర్యాలకు పెద్దపీఠ వేసింది. మహిళల భద్రతకు 182 హెల్ప్‌లైన్, రిజర్వేషన్ సౌకర్యం నాలుగు నెలలకు పొడిగింపు, ఏ,బీ గ్రేడు స్టేషన్లకు వైఫై సౌకర్యం, ప్రయాణికుల ఫిర్యాదుల కోసం మొబైల్ అప్, ైరె ళ్లు రాకపోకలు తెలిపేందుకు ఎస్ఎమ్ఎస్, మహిళల భోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర సౌకర్యాలను కల్పించింది. అదే విధంగా జిల్లాలోని రైల్యే స్టేషన్లకు వై ఫై సౌకర్యం మాత్రం ఏర్పాటు కానుంది. -
రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు:వైఎస్ జగన్
-
రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు:వైఎస్ జగన్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్లను కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేసినట్లు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బృందం సోమవారం సురేష్ ప్రభుతో సమావేశమయ్యింది. ఈ భేటీలో వైఎస్ జగన్ తో పాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక, పొంగులేటి శ్రీనివాస్, వరప్రసాద్ లు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీకి కొత్త రైల్వే జోన్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయిన విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించామన్నారు. వాటికి వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపినట్లు జగన్ తెలిపారు. తమ వినతులకు ఆయన సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. -
నిధులు ప్లీజ్
రాష్ట్రంలో సాగుతున్న, పెండింగ్‌లో ఉన్న రైల్వే పథకాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇదివరకు ప్రకటించిన రైల్వే పథకాల తీరుతెన్నులు, ప్రకటనకే పరిమితమైన వివరాలను ఆయన ఏకరువుపెడుతూ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అరుునా కేటాయింపులు పెరగాలని విన్నవించారు. ⇒ రైల్వే మంత్రికి సీఎం లేఖాస్త్రం ⇒ రైల్వే పథకాల ఏకరువు ⇒ బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి సాక్షి, చెన్నై: ప్రతి ఏటా కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఏదో ఒక పథకాన్ని, రెండుమూడు రైళ్లను ప్రకటిస్తోంది. అయితే అవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రకటించి న పథకాలకు నిధులు మంజూరు కాలేదు. కొత్త పథకాలకు నిధుల ఊసేలేదు. మరెన్నో రైల్వే పథకాలు ప్రకటించినా, నిధు ల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.ఈ సారైనా తమిళనాడు మీద కరుణ చూపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న ఆశాభావంతో ముందుస్తుగా రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభాకర్ప్రభుకు రాష్ర్టంలోని రైల్వే పథకాల తీరుతెన్నుల్ని వివరించేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. బడ్జెట్లో తమకు ప్రాధాన్యత కల్పించే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు, ఇక్కడ నత్తనడకన సాగుతున్న పథకాలను మంత్రి దృష్టికి శుక్రవారం లేఖాస్త్రంతో తీసుకెళ్తూ నిధులు..ప్లీజ్ అని అభ్యర్థించే పనిలో పడ్డారు. నిధులివ్వండి: తమ అధినేత్రి, అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న ప్రభుత్వ విజన్ -2023 గురించి తన లేఖలో కేంద్ర రైల్వే మంత్రికి సురేష్‌ప్రభాకర్ ప్రభుకు సీఎం పన్నీరు సెల్వం వివరించారు. పదిహేను లక్షల కోట్లతో సాగుతున్న విజన్ కళసాకారంలో రైల్వే పాత్ర కూడా కీలకమన్నారు. తమిళనాడులో లక్షా 88 వేల 400 కోట్ల మేరకు రైల్వే పథకాలకు నిధులు అవశ్యంగా వివరిస్తూ గతంలో పీఎం నరేంద్ర మోదీకి తమ అమ్మ రాసిన లేఖను గుర్తుచేశారు. ప్రధానంగా రానున్న బడ్జెట్లో పది రైల్వే పథకాలకు ముందస్తుగా ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ‘చెన్నై - కన్యాకుమారి మధ్య రెండో రైల్వే మార్గం పనులు, శ్రీ పెరంబదూరు - గిండి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై - తూత్తుకుడి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై-మదురై -కన్యాకుమారి మధ్య, మదురై-కోయంబత్తూరు, కోయంబత్తూ రు - చెన్నై, చెన్నై -బెంగళూరుల మధ్య హై స్పీడ్ రైలు సేవలు, చెన్నై-బెంగళూ రు మధ్య రైల్వే కారిడార్, ఆవడి - గూడువాంజేరి మధ్య రైల్వే మార్గం, ఆవడి - ఎన్నూర్ హార్బర్‌కు రైల్వే మార్గం’ ఏర్పాటు గురించి విశదీకరించారు. రైల్వే పథకాలు ⇒ గతంలో ప్రకటించిన పథకాలను వివరి స్తూ, నిధుల్ని సంమృద్ధిగా కేటాయించాల ని విజ్ఞప్తి చేశారు. ఆ పథకాలలో కొన్ని... ⇒ మొరాపూర్ -ధర్మపురి మధ్య కొత్త రైల్వే మార్గం ⇒ చెన్నై నుంచి విల్లివాక్కం మధ్య ఐదు, ఆరో లైన్లు , విల్లివాక్కం- కాట్పాడి మధ్య కొత్త రైల్వే మార్గం ⇒ చిదంబరం నుంచి అరియలూరు మీదుగా ఆత్తూరుకు కొత్త మార్గం ⇒ తిరువనంత పురం నుంచి కన్యాకుమారి, జోలార్ పేట నుంచి కాట్పాడి - అరక్కోణం మధ్య రెండో మార్గం పనులు, బోడి నాయకనూరు కొట్టాయం వరకు పనుల పొడిగింపుల గురించి వివరించారు. ⇒ రేణిగుంట-అరక్కోణం రెండో మార్గం, అత్తి పట్టు - గుమ్మిడిపూండి మధ్య మూడు, నాలుగో లైన్లు, జోళార్ పేట నుంచి కృష్ణగిరి మీదుగా హోసూరుకు, మైలాడుతురై - తరంగం బాడి మీదుగా తిరునల్లారు - కారైకాల్‌కు, రామనాధపురం - కన్యాకుమారి మీదుగా తూత్తుకుడి - తిరుచెందురుకు, కారైక్కుడి నుంచి తూత్తుకుడికి, కారైక్కాల్ - శీర్గాలి, సేలం- అరియలూరుల మధ్య కొత్త లైన్లకు నిధుల్ని అభ్యర్థించారు. అలాగే, ఇరుగుర్ -పొండనూర్, తిరువనంత పురం - నాగర్ కోవిల్ల మధ్య రెండు మార్గం. తదితర పనుల్ని వివరిస్తూ ఈ బడ్జెట్లో నిధుల్ని కేటాయించి, పనులు ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే!
* పనులు జరగాలంటే నిధులు ఖర్చు చేయాల్సిందే * కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతోనే ప్రాజెక్టుల పూర్తి * సీఎం కేసీఆర్‌కు రైల్వే మంత్రి ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించాల్సిందే! కొత్త రైళ్లో, కొత్త లైన్లో కావాలంటే ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు ఖర్చుచేయాల్సిందే!! హైదరాబాద్ పర్యటన లో భాగంగా రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు పరోక్షంగా ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారానే ప్రాజెక్టుల పూర్తి సాధ్యమని తేటతెల్లం చేశారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సురేశ్‌ప్రభు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యమని చెప్పుకొచ్చారు. ‘‘పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చటం రైల్వేకు అతిపెద్ద సవాల్. దాన్ని అధిగమించేందుకే సంస్కరణలు చేపట్టబోతున్నాం. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కట్టుబడి ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం. రైల్వే బడ్జెట్ తో ప్రమేయం లేకుండా నిరంతరాయంగా ప్రాజెక్టుల కేటాయింపు ఉంటుంది. సామాన్యులపై భారం వేస్తూ చార్జీలు పెంచుతారా అని అంతా అడుగుతున్నారు. రైల్వేపై భారం అంటేనే సామాన్యులపై భారం. ఎందుకంటే ైరె ళ్లను వాడుకునేదే వారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన సురేశ్‌ప్రభు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం రైల్వే బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలను ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించటం అసాధ్యమని సురేశ్‌ప్రభు మాటలు స్పష్టం చేస్తున్నా యి. ఒకవేళ ఎస్పీవీ విధానం అమలైతే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ఎస్పీవీ పరిశీలించి ముఖ్యమైనవాటిని రైల్వే బోర్డుకు పంపుతుంది. రైల్వేబోర్డు వాటిని పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారిస్తుంది. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు ను భరించాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టులపై వచ్చే లాభాన్ని అవసరమైతే అదే రాష్ర్టంలో కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తారు. రైల్వేను ప్రైవేటీకరించం: సురేశ్‌ప్రభు రైల్వేల పగ్గాలు శాశ్వతంగా ప్రభుత్వం వద్దే ఉంటాయని...దీన్ని ప్రైవేటీకరించబోమని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశారు. అయితే రైల్వేల అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంస్థలోకి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆహ్వానిస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ‘భారతీయ రైల్వేల సిగ్నల్ ఇంజనీరింగ్ సంస్థ’(ఇరిసెట్)లో ‘భారతీయ రైల్వేల్లో పీపీపీ, ఎఫ్‌డీఐలు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలిసి సురేశ్‌ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల కోసం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉన్నా రైల్వేల ప్రస్తుత మౌలిక స్థితిగతులకు ఈ డిమాండ్లను తీర్చే సామర్థ్యం లేదన్నారు. బలహీనంగా ఉన్న రైల్వేల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని సంస్థ ఆధునీకరణ కోసం సాధ్యమైన అన్ని మార్గాల్లో ఆర్థిక వనరులను సృష్టించాల్సిన అవసరముందన్నారు. అందువల్ల పీపీపీ, ఎఫ్‌డీఐల అంశంపై రైల్వే ఉద్యోగులు అపోహలు పెట్టుకోరాదని సూచించారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా ఇస్రో, డీఆర్డీఓ వంటి సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రక్షణలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రక్షణ కల్పించడంతోపాటు రైళ్లను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరముందన్నారు. సదస్సులో దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ, సీటీఆర్ఏఎం అధ్యక్షులు దేవిప్రసాద్ పాండే తదితరులు మాట్లాడారు. -
గ్రీన్‌సిగ్నల్ వచ్చేనా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలు, స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు. ఇరువురు ఎంపీలు తమ తమ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఒక్కో ప్రతిపాదనను ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలని కోరారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే ప్రతిపాదనతోపాటు పలు అంశాలపట్ల రైల్వే అధికారులు ఇచ్చిన సమాధానంతో ఎంపీలు విభేదిం చారు. జిల్లాకు సంబంధించి రైల్వే పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టు పనుల కోసం ఏళ్ల తిరబడి రైల్వే అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో జరిగే సమావేశాలన్నీ చాయ్, బిస్కెట్లకే పరిమితమవుతున్నాయే తప్ప ఫలితం లేకుండా పోయిందని వినోద్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఒక్క రైల్వే ప్రాజెక్టు కోసం మీ చుట్టు ఏళ్ల తరబడి తిరగాలా? ఇప్పటికే ఎన్నోసార్లు సమావేశాలు జరిగినా అవి చాయ్, బిస్కెట్లకు పరిమితమవుతున్నాయే తప్ప ఫలితం రావడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ సైతం పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న రైల్వే సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ మొత్తం 22 ప్రతిపాదనలు అధికారుల ముందుంచగా కొన్నింటిపట్ల సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన అంశాలను సైతం వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులకు పంపుతానని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలిద్దరు ప్రతిపాదించిన అంశాలివే.. వినోద్‌కుమార్ ప్రతిపాదనలు కొత్తపల్లి నుంచి మనోహరాబాద్ వరకు బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నిర్మాణం వెంటనే చేపట్టాలి. ఏపీ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ లేదా కొమురం భీమ్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి. కరీంనగర్ -తిరుపతి రైలును కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ గా మార్చాలి. కరీంనగర్-రాయపట్నం రోడ్డులోని రైల్వేస్టేషన్ సమీపంలో క్రాసింగ్ నెంబరు 18లో రైల్వేఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. ఉప్పల్ రైల్వేస్టేషన్, బిజిగిరిషరీఫ్ వద్ద రైల్వేఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి. జమ్మికుంట స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను నిలుపడానికి చర్యలు తీసుకోవాలి. ఉప్పల్ రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిలుపాలి. కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి గ్రానైట్ రవాణాకు అదనపు ర్యాక్‌లను ఏర్పాటు చేయాలి. కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఎరువులను నిల్వ చేసేందుకు వెయ్యి మెట్రిక్‌టన్నుల సామర్థ్యమున్న గోదాము నిర్మించాలి. తీగలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని హన్మాన్నగర్లో రైల్వేగేటు మంజూరీ చేయాలి. కొత్తపల్లి, గంగాధర రైల్వేస్టేషన్లకు అప్రోచ్ రోడ్లను నిర్మించాలి. కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడిపించాలి. రైల్వేస్టేషన్లో పారిశుధ్య కార్మికులను నియమించాలి. కరీంనగర్ బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రిజర్వేషన్ కౌంటర్లో హెల్ప్‌డెస్క్ కోసం ఉద్యోగిని నియమించాలి. తిరుపతి రైలును నెల్లూరు స్టేషన్లో నిలుపడానికి చర్యలు తీసుకోవాలి. జగిత్యాల నుంచి సిర్పూర్ వరకు నడిచే పుష్పుల్లో టాయిలెట్ల సౌకర్యం కల్పించాలి. సనత్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి సరుకుల ఎగుమతి, రవాణాతో ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో మేడ్చల్ స్టేషన్ నుంచి రవాణాను అనుమతించాలి. తద్వారా జంటనగరాలకు, అవుటర్ రింగ్‌రోడ్డుకు అనుకూలంగా ఉంటుంది. బాల్క సుమన్ ప్రతిపాదనలు రామగుండం నుంచి మణుగూర్ వరకు వయా మంథని, ఏటూరునాగారం, కమలాపూర్, భూపాలపల్లి మీదుగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలి. రామగుండంలో స్వర్ణజయంతి, నవజీవన్, కొనుగు, తమిళనాడు, దర్భాంగా, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు కొత్తగా ఇంటర్సిటీ రైలును ఏర్పాటు చేయాలి. మానిక్‌ఘడ్ నుంచి సికింద్రాబాద్ వరకు మరో కొత్త రైలును ప్రవేశపెట్టాలి. సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు నడపాలి. రామగిరి, భాగ్యనగర్, నాగ్‌పూర్, సింగరేణి, తెలంగాణ ప్యాసింజర్ రైళ్లకు అదనపు బోగీలను అమర్చాలి. మహారాష్ట్ర గోండియా-సికింద్రాబాద్ వరకు ప్రయాణికుల రైలును నడిపించాలి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల తదితర రైల్వేస్టేషన్లను జీఎం ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలి. -
వరల్డ్ క్లాస్ ఆశ..
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి వినతి మౌలాలీ, వట్టినాగులపల్లిల్లో భారీ టెర్మినళ్లు మల్కాజిగిరి, సనత్‌నగర్ స్టేషన్ ల విస్తరణ నగర ఎంపీల ప్రతిపాదనలు సిటీబ్యూరో: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నడుమ ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై భారాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నగర ఎంపీలు ముక్తక ంఠంతో కోరారు. రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రయాణికుల సదుపాయాల వంటి అంశాలపై చర్చించేందుకు బుధవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పార్లమెంటు సభ్యుల సమావేశంలో నగర ఎంపీలు రైల్వే శాఖకు వివిధ ప్రతిపాదనలు అందజేశారు. సికింద్రాబాద్‌పై భారాన్ని తగ్గించేందుకు మౌలాలీ, వ ట్టినాగులపల్లి స్టేషన్లను భారీ టెర్మినళ్లుగా అభివృద్ధి చేయడంతో పాటు, మల్కాజిగిరి, సనత్‌నగర్ స్టేషన్లను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. పెరుగుతున్న నగర జనాభా, విస్తరిస్తున్న కాలనీలు, ప్రాంతాలకు అనుగుణంగా రైల్వే సదుపాయాలను పెంచాలని ఎంపీలు కోరారు. వివిధ అంశాలపై ఎంపీల నుంచి తమకు అందిన ప్రతిపాదనలను పరిశీలించి వచ్చే బడ్జెట్లో సాధ్యమైంత వరకు అమలయ్యేందుకు ప్రయత్నించనున్నట్లు జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. వరల్డ్ క్లాస్‌గా అభివృద్ధి నిత్యం 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, మరో వంద ప్యాసింజర్లు, వంద ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేవు. స్టేషన్‌కు రావాల్సిన రైళ్లు నగర శివార్లలో గంటల తరబడి నిలిచిపోతున్నాయి. రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో లేకపోవడంతో రద్దీ వేళల్లో మౌలాలీ, ఘట్కేసర్, చర్లపల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రైళ్లు నిలిచిపోవాల్సి వస్తోంది. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు... తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ కారణంగా అనేక రైళ్లు సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేకపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఏటా కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా స్టేషన్ విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 2005లోనే వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీని వల్ల స్టేషన్లోకి వచ్చే రైళ్లకు... ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లకు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. కానీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. బుధవారం పార్లమెంట్ సభ్యుల సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరోసారి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధితో పాటు... రెండు ప్రధాన మార్గాల్లో రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు మౌలాలీ, వట్టినాగులపల్లిలో రెండు భారీ టెర్మినళ్లను నిర్మించాలని కోరారు. దీని వల్ల ముంబయి మీదుగా వచ్చే వాటికి నాగులపల్లిలో... కాజీపేట్ నుంచి వచ్చే వాటికి మౌలాలీలో హాల్టింగ్ లభిస్తుంది. సనత్‌నగర్, మల్కాజిగిరి స్టేషన్లను అభివృద్ధి చేయడం వల్ల నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు ప్రత్యామ్నాయం లభిస్తుందన్నారు. ఎఎంటీఎస్ను విస్తరించాలని.. ఎంఎంటీఎస్ రెండో దశను తెల్లాపూర్ నుంచి పటాన్చెరు వరకు, అక్కడి నుంచి సంగారెడ్డి వరకు విస్తరించాలని ఎంపీలు కోరారు. ఈ పనులను వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు సదుపాయం కల్పించాలని సూచించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డితో పాటు, తెలంగాణలోని పలువురు ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. సంయుక్త కార్యాచరణ మౌలాలీ, వట్టినాగులపల్లిల్లో తలపెట్టిన భారీ టెర్మినళ్లకు వచ్చే బడ్జెట్లో నిధులను కేటాయించేలా చూస్తా. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి... దశల వారీగా రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తున్నాం. ఈ నెలాఖ రున ఢిల్లీలో రైల్వేమంత్రితో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదిస్తాం. నగరంలో కొత్తగా రైల్వే డిగ్రీ కళాశాల, రైల్వే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న రైల్వే కేంద్రీయ ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా కల్పించాలి. - బండారు దత్తాత్రేయ పరిహారం చెల్లించాకే లైన్లు ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణతో మల్కాజిగిరి ప్రాంతంలో సుమారు 10 వేల మంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. గత 30 ఏళ్లుగా వారు అక్కడే ఉంటున్నారు. వారికి పునరావాసం కల్పించే వరకు ఇప్పుడు ఉన్న చోటు నుంచి తొలగించవ ద్దు. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ అభివృద్ధికి చాలా స్థలం అందుబాటులో ఉంది. దీనివల్ల కాచిగూడపైఒత్తిడి తగ్గుతుంది. ఈ ప్రాంత ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. సనత్‌నగర్ స్టేషన్‌ను విస్తరించాలి. మేడ్చెల్ రైల్వేస్టేషన్‌ను గూడ్స్ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలి. దీని వల్ల సరుకు రవాణా సులభమవుతుంది. అవుటర్ రింగు రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడ్చెల్ గూడ్స్ జంక్షన్‌కు చేరుకోగలుగుతాయి. - మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ -
గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో!
రైల్వే ప్రాజెక్టులపై నేడు ఎంపీల సమావేశం నగరంలో రైల్వే ప్రాజెక్టులపై తొలగని ప్రతిష్టంభన ప్రతిపాదనకే పరిమితమైన విమానాశ్రయానికి రైలు మార్గం చర్చల్లోనే భారీ టర్మినళ్లు ఆర్ఓబీలు, ఆర్యూబీలపై కొరవడిన పురోగతి రైల్‌నిలయంలో నేడు ఎంపీల సమావేశం సిటీబ్యూరో : నగరంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగానే ఉంది. కొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమిత మైతే మరికొన్ని చ ర్చల దశను కూడా దాటడం లేదు. మరోవైపు ప్రారంభించిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దృష్ట్యా పార్లమెంట్ సభ్యుల నుంచి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు దక్షిణమధ్య రైల్వే బుధవారం ఎంపీల సమావేశానికి శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులు, ప్రతిపాదనలు, పనుల పురోగతితో పాటు, కొత్తగా చేపట్టవలసిన వాటిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గతేడాది ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, నగర శివార్లలో నిర్మించాలని ప్రతిపాదించిన భారీ టర్మినళ్లపైన ఈ సమావేశం గుణాత్మకమైన పురోగతిని సాధించగలిగితే ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది. విమానాశ్రయానికి రైలు మార్గం... ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. పటాన్చెరు-తెల్లాపూర్, మేడ్చల్-బోయిన్పల్లి మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్ ప్రయాణికులు అతి తక్కువ టిక్కెట్ చార్జీలతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొనేందుకు ప్రతిపాదించిన రైలు మార్గంపైన మాత్రం ఏడాది కాలంగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఉందానగర్ నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్లు కొత్తగా లైన్లు వేయవలసి ఉంది. కానీ జీఎమ్మార్ అందుకు నిరాకరిస్తోంది. విమానాశ్రయం లోపలి వరకు కాకుండా 3 కిలోమీటర్ల వరకే అనుమతినిస్తామని చెప్పడంతో ప్రతిష్టంభన చోటుచేసుకుంది. దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం నాటి ఎంపీల సమావేశంలోనైనా ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విమానాశ్రయానికి రైలు మార్గానికి అడుగులు పడితే మంచిది. భారీ టర్మినళ్లు... ఉత్తర, దక్షిణభారత దేశానికి మధ్య ప్రధాన కేంద్రబిందువుగా ఉన్న హైదరాబాద్‌కు రైళ్ల తాకిడి బాగా ఉంది. ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి లక్షలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రైళ్ల ఒత్తిడి దృష్ట్యా 2005లోనే సికింద్రాబాద్‌లో వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. పలు మార్లు బడ్జెట్లలో కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైళ్ల ఒత్తిడిని తగ్గించేందుకు మౌలాలి, వట్టినాగులపల్లిలో రెండు భారీ ప్రయాణికుల టర్మినళ్లను కట్టించాలనే ప్రతిపాదనలకు రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించినప్పటికీ భూముల కేటాయింపుపై ఎలాంటి చర్యల్లేవు. ఆర్ఓబీ, ఆర్‌యూబీలు... నగరంలోని తుకారాంగేట్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ, ఉప్పుగూడ, కందికల్‌గేట్, ఆలుగడ్డబావి తదితర ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతుండగా, మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మరోవైపు ఆరు నెలల క్రితమే ఆలుగడ్డ బావి వద్ద పనులు పూర్తయినప్పటికీ దానికి అనుబంధంగా రోడ్లు వేయకపోవడం వల్ల ప్రజలకు అందుబాటులోకి రాలేదు. -
రైల్వే పథకాలకు మంగళం
రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో, అమలుకు నోచుకోకుండా ఉన్న రైల్వే పథకాలకు మంగళం పాడేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రూ.19,500 కోట్ల విలువగల పథకాల్ని కేంద్ర రైల్వే శాఖ రద్దు చేసిన సమాచారంతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న కాలంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సాక్షి, చెన్నై: ఏటా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే వస్తోంది. కొత్త రైల్వే పథకాలను ప్రకటిస్తున్నారే గానీ అందుకు తగ్గ నిధుల్ని మాత్రం రాల్చడం లేదు. దీంతో దక్షిణ తమిళనాడులో అనేక రైల్వే పథకాలు అమలుకు నోచుకోకుండా మూలనపడి ఉన్నాయి. 1990 నుంచి 2009 మధ్య కాలంలో ప్రకటిం చిన అనేక పథకాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2002-2007 మధ్య కాలంలో రాష్ట్రానికి కాస్త ఊరటనిచ్చే పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇందుకు కారణం రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రులుగా పదవులు చేపట్టడమే. తొలుత పీఎంకే ఎంపీ ఏకే మూర్తి కొన్నాళ్లు సహాయ మంత్రిగా, మరో ఎంపీ ఏవి వేలు మరికొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలో కొత్త పథకాలను తీసుకొచ్చారు. తమకు పట్టున్న ఈరోడ్, సేలం, కృష్ణగిరి, ధర్మపురి పరిసరాల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే విధంగా రైల్వే పథకాలకు చర్యలు చేపట్టారు. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని పథకాలకు నిధుల్ని సమకూర్చారు. కొత్త రైల్వే సేవలకు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొన్ని అమల్లోకి వచ్చినా, చాలా వరకు కదల్లేదు. ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ప్రకటించి అమలుకు నోచుకోకుండా ఉన్న పథకాలకు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడి ఉన్న మరికొన్ని ప్రాజెక్టులకు మంగళం పాడే విధంగా కేంద్ర రైల్వే యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు తగ్గ వివరాల్ని పార్లమెంట్ సమావేశాలు దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసిన రైల్వే శాఖ ఆర్థిక నివేదికలో పొందుపరచి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 14 రైళ్లతో పాటుగా రూ.19,500 కోట్లు విలువగల 160 పథకాలకు మంగళం పాడే విధంగా ఆ నివేదిక ఉన్నట్టుగా ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలతో పీఎంకే అధినేత రాందాసు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం: తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తమిళనాడుకు అనేక రైల్వే ప్రాజెక్టులు వచ్చాయంటూ తన ప్రకటనలో సోమవారం రాందాసు వివరించారు. కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత తమ వాళ్లకే దక్కుతుందన్నారు. అయితే, తమిళనాడు అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర రైల్వే శాఖ వ్యవహరిస్తున్నట్టుందని ధ్వజమెత్తారు. కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే మంత్రి తన బడ్జెట్ ద్వారా తమిళనాడు మీద చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ శాఖలో తమిళనాడుకు చెందిన మంత్రులెవ్వరూ లేని దృష్ట్యా, అన్యాయం తలబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 2002-09 మధ్య కాలంలో తమ ఎంపీలు మంత్రులుగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పథకాలు సైతం రద్దు చేయడానికి కేంద్రం నిర్ణయించినట్టుగా తన దృష్టికి వచ్చిందని మండి పడ్డారు. దక్షిణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలుపుతూ సత్యమంగళం మీదుగా బెంగళూరుకు 260 కి.మీ మేరకు రూ.13 వేల కోట్లతో చేపట్టదలచిన రైల్వే పథకాన్ని పర్యావరణ అనుమతి సాకుతో రద్దు చేసినట్లుగా సమాచారం వచ్చిందన్నారు. అలాగే, మరెన్నో పథకాలను స్థల సేకరణ పేరిట, వంతెనల నిర్మాణాల్ని అడ్డుకునే విధంగా లెవల్ క్రాసింగ్లను మూసివేస్తూ, కొన్ని ట్రాక్‌ల విస్తరణ, మరికొన్ని చోట్ల స్టేషన్ల అభివృద్ధి, డబుల్ ట్రాక్ పనులను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని వివరించారు. కేంద్ర రైల్వే శాఖ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమిళనాడుకు అన్యాయం తలబెట్టితే సహించబోమని హెచ్చరించారు. -
రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్!
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ఏపీకి ప్రత్యేక జోన్ లేనట్టే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన తాయిలాలు ఒక్కొక్కటిగా ఎండమావిలా తేలిపోతున్నాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చే క్రమంలో వాటిని పైపూతగా చెప్పారే తప్ప.. హామీలేవీ ఆచరణలో అమలయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నాటి యూపీఏ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిం చింది. ఒక్క ఏపీకే వరాలు కురిపిస్తే తెలంగాణను విస్మరించినట్టవుతుందనే ఉద్దేశంతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీనిచ్చింది. అయితే ఇవి వాస్తవ రూపం దాల్చే పరిస్థితులు లేనట్టేనని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రైల్వే జోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. తాజాగా రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించింది. దక్షిణ మధ్య రైల్వేను విభ జించి ఏపీ పరిధిలో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ కమిటీ వ్యతిరేకంగా స్పందించినట్టు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు పూర్తి కానందున కాజీపేటలో మరో ఫ్యాక్టరీ అవసరమే లేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. పైగా ఇటీవలే కర్ణాటకకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనందున దక్షిణాదిలో మరోటి ఇవ్వటం సబబుకా దని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. సంయుక్తంగా కాకుం డా ఏడుగురు సభ్యులు విడివిడిగా అభిప్రాయాలను బోర్డు ముం దుంచారు. అంతా దాదాపు ఒకే మాటపై ఉన్నట్టు సమాచారం. గడువుకు మిగిలింది పక్షం రోజులే..: రైల్వేజోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం కమిటీకి ఆరు మాసాల గడువు విధించింది. అపాయింటెడ్ డే (జూన్ 2 ) నుంచి ఆరు మాసాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చింది. దాని ప్రకారం డిసెంబర్ 2తో గడువు ముగుస్తుంది. అంటే మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. నివేదిక అందిన తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా స్పందిస్తారా అన్నది అనుమానంగా మారింది. కొత్త మంత్రి.. కొత్త ప్రాధాన్యాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రకటించిన రెండు వరాలకు సంబంధించి గత రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనతో పలుమార్లు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రాంత నేతలు కలిశారు. హామీలను అమలు చేయాలని కోరారు. కమిటీ నివేదిక రాగానే దాన్ని పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు రైల్వే శాఖకు కొత్త మంత్రి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన సురేశ్‌ప్రభుకు రైల్వేశాఖ అప్పగించారు. ఆయనకు ఈ విషయం పూర్తిగా కొత్త. ఇప్పటివరకు ఆయనతో రాష్ట్ర నేతలెవరూ భేటీ కాలేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండోరోజే ఆయన జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానితో కలిసి విదేశాలకు వెళ్లి సోమవారమే ఢిల్లీకి వచ్చారు. ఇప్పటివరకు ఈ విషయంపై అవగాహన లేని ఆయనపై ఆ కమిటీ నివేదిక ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా.. రైల్వేను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఇటీవలే మరో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. దేశం మొత్తానికి సంబంధించిన విషయాన్ని పర్యవేక్షించే ఆ కమిటీపైనే మోదీ దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జోన్, కోచ్ ఫ్యాక్టరీలకు ఆయన ఎంతవరకు ప్రాధాన్యమిస్తారో చూడాలి. తెలుగు వారు లేని కమిటీ... యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందులో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు దేవేందర్ సింగ్, అలోక్‌కుమార్, విజయ్‌కుమార్‌లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు చెందిన విభాగాధిపతి స్థాయి అధికారులు జీసీ రే, ఎస్పీ సమంత రే, అదే కేడర్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నరోత్తమ్ సింగ్ ఊకే, ఎస్కే గుప్త ఉన్నారు. వీరిలో తెలుగువారు ఒక్కరూ లేరు. అంతా ఒరిస్సా, బెంగాల్, ఉత్తర భారతీయులే! విశ్వసనీయ సమాచారం మేరకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ప్రత్యేక రైల్వే జోన్‌పై: సాధారణంగా రైల్వేజోన్‌కు రాష్ట్రాల భౌగోళిక పరిధులతో సంబంధం ఉండదు. ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని జోన్లు ఇలాగే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే రైల్వే జోన్‌ను విడదీయటం సరికాదు. - కొత్త జోన్ పరిధిలో కొత్తగా అధికారుల వ్యవస్థ, భవనాలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనివల్ల రైల్వేపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. నష్టాల్లో ఉన్న రైల్వేకు ఇది శ్రేయస్కరం కాదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై: - కాజీపేటకు నాలుగేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ పనులు ఇప్పటివరకూ మొదలు కాలేదు. ముందుగా దాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే సరిపోతుంది. - కర్ణాటకలో కోలార్ జిల్లాకు కొత్తగా మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇదే సమయంలో దక్షిణాదికి మరో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు తప్పుడు సంకేతాలు పంపుతుంది. పర్యటనలేవీ లేకుండానే.. సాధారణంగా ఇలాంటి కీలక విషయాల్లో కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, సంబంధీకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కమిటీ కేవలం ఒకేఒక్కసారి రెండు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ కావటం మినహా అంతకుమించి చేసిన కసరత్తేమీ లేదు. -
స్వీటు ఆశిస్తే.. నోటిపై జెల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఢిల్లీలో పాలకులు మారినా, జిల్లాలో ప్రజా ప్రతినిధులు మారినా..కథ మారలేదు. ఈ గడ్డ అభివృద్ధికి దోహదపడే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మళ్లీ నిరాశ తప్పలేదు. మంగళవారం సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కూడా పాతపంథాలోనే జిల్లావాసుల ఆశలకు పూచికపుల్ల విలువనివ్వలేదు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే ప్రతి నేతా రైల్వే ప్రాజెక్టులను సాధిస్తామని ఎన్నికల్లో..‘బొగ్గు ఇంజన్ కూత’లా బిగ్గరగా వాగ్దానం చేస్తుంటారు. తీరా ఎన్నికయ్యాక.. తమ హయాంలో ప్రవేశపెట్టే ఏ రైల్వేబడ్జెట్లోనూ జిల్లావాసుల కలలు సాకారమయ్యేందుకు కించిత్తు కృషి చేయకుండానే పదవీకాలం ముగించేస్తున్నారు. యూపీఏ-2 సర్కారు పోయి, ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలుగా ఆ కూటమిలో భాగస్వామియైన తెలుగుదేశం వారే ఎన్నికయ్యారు. అయినా రైల్వే బడ్జెట్ షరామామూలుగానే జిల్లావాసుల ఆశలను.. తాయిలం కోసం ఎదురు చూసిన పిల్లల నోటిపై గుద్దినట్టు.. చిత్తు చేసింది. పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించ లేకపోయిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల అనంతరం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని వారు మండిపడుతున్నారు. వారూ వీరూ.. ఒకటే తీరు సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తామన్న ముగ్గురు ఎంపీలు తోట నరసింహం, మురళీమోహన్, పండుల రవీంద్రబాబు ఏమీ సాధించలేక చేతులెత్తేశారు. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపడంతోనే వారి వైఫల్యం తేటతెల్లమైంది. తొలి ప్రాధాన్యం పిఠాపురం-కాకినాడ మెయిన్ రైల్వేలైన్ అని కాకినాడ ఎంపీ తోట ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెప్పారు. ఇదివరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎంఎం పళ్లంరాజు ఒకసారి మెయిన్ లైన్ వద్దని, మరోసారి అవసరమని పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశారే తప్ప ప్రాజెక్టు సాధించలేకపోయారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ సాధనే తన లక్ష్యమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. ఇదివరకు ఇదే ప్రాజెక్టు కోసం గంభీరోపన్యాసాలు చేసిన అప్పటి ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే రకంగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇప్పుడు రవీంద్రబాబు కూడా నిధుల సాధనలో విఫలమయ్యారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్న జిల్లా పట్ల ఈసారి రైల్వేబడ్జెట్‌లో కూడా వివక్షనే చూపడంపై జిల్లావాసులు, మేధావి వర్గ ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు. గత దశాబ్దంగా యూపీఎ- 1, 2 సర్కార్ల హయాంలో ఏటా రైల్వే బడ్జెట్లలో మొండిచేయే ఎదురైంది. గత ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఎన్డీఏ సర్కారైనా జిల్లాకు సముచిత ప్రాతినిధ్యం ఇస్తుందని ఆశిస్తే..‘దొందూ దొందే’ అన్నట్టు యూపీఏలాగే జిల్లాకు జెల్ల కొట్టింది. అన్ని డిమాండ్లపైనా చిన్నచూపే.. జిల్లా కేంద్రం కాకినాడను మెయిన్‌లైన్‌కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల సాకారం కావాలంటే కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్ల అంచనాతో కూడిన ఈ ప్రాజెక్టు ఈసారి కూడా పట్టాలెక్కలేదు. ఆ దిశగా లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ ఎంపీ తోట చేసిన ప్రయత్నం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి కృషితో 2000లో పునాదిరాయి పడిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కి ఈసారి కదలిక ఉంటుందని కోనసీమ వాసులు ఆశించగా ఈ బడ్జెట్లోనూ వెక్కిరింతే మిగిలింది. 55 కిలోమీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1100 కోట్లకు చేరింది. భూ సేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్మాణవ్యయంలో 25 శాతం ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఈ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపిన కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేను సైతం ఈ బడ్జెట్లో గాలికొదిలేశారు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పుదుచ్చేరి వరకు సర్కార్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు డిమాండ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. చెన్నై నుంచి విశాఖకు వారానికి ఒకసారి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన రైలు జిల్లా మీదుగా వెళ్లడం మినహా సదానందగౌడ బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. -
బడ్జెట్ రైలు పెండింగ్ ఫైలు!
కాజీపేటకు డివిజన్ హోదాపై చిగురిస్తున్న ఆశలు * వ్యాగన్ నిధుల కేటాయింపు.. కోచ్ ఫ్యాక్టరీ పైనా.. * దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న జిల్లావాసులు * సీఎం కేసీఆర్ దృష్టిసారించడంతో రేకెత్తిన ఆశలు * జిల్లా నుంచి ఐదుగురు ఎంపీల ప్రాతినిధ్యం * ఈ సారి సముచిత స్థానందక్కే అవకాశం సాక్షి, హన్మకొండ : కాజీపేటకు డివిజన్ హోదా... వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు... కోచ్ ఫ్యాక్టరీ మంజూరు... ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు ఇవి. గతం సంగతి ఎలా ఉన్నా... నూతన రాష్ట్రం తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కాజీపేట జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన కసరత్తు ప్రారంభించారు. రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన కాజీపేట అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నారుు. ఈ క్రమంలో ఈసారి రైల్వే బడ్జెట్ జిల్లాకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారుు. అంతేకాదు... జిల్లా నుంచి రికార్డ్ స్థాయిలో ఐదుగురు ఎంపీలు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్రావుతోపాటు లోక్‌సభ సభ్యులు, కడియం శ్రీహరి, సీతారాంనాయక్ ఉన్నారు. పార్టీలకతీతంగా వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే బడ్జెట్లో నిధుల కేటారుంపులతోపాటు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తాయని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాజీపేట డివిజన్ కల నెరవేరేనా... కాజీపేటకు డివిజన్ హోదా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ తర్వాత రైల్వే పరంగా కాజీపేట కీలక కేంద్రం. ఈ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జూన్‌లో ప్రధాని నరేంద్రమోడీకి సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో సమావేశమయ్యారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. దాదాపుగా తెలంగాణలో రైల్వే పరంగా పాలన అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పెద్దపల్లి-నిజామాబాద్, భద్రాచలంరోడ్డు-కొవ్వూరు రైల్వే లేన్ల నిర్మాణంతోపాటు ప్రతిపాదన దశలో ఉన్న కరీంనగర్-సిద్ధిపేట-మనోహరాబాద్, మణుగూరు-రామగుండం వంటి కీలక ప్రాజెక్టుల పనులు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కాజీపేట కేంద్రంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డివిజన్ హోదా దక్కిన పక్షంలో రాష్ట్రంలో రైల్వే పరంగా అభివృద్ధి కాజీపేట కేంద్రంగా కొత్త పుంతలు తొక్కనుంది. వ్యాగన్‌కు నిధులు మంజూరయ్యేనా... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్ నెలకొల్పేందుకు నాలుగేళ్ల క్రితమే రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. గత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా... చివరకు నిరాశే మిగిలింది. అయితే కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రాజెక్టులు ప్రోత్సహించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో కాజీపేటలో వ్యాగన్ వర్క్‌షాప్‌నకు ఈ సారి నిధులు మంజూరవుతాయని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతకుముందు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు మూడేళ్లకుపైగా సమయం పట్టింది. ప్రస్తుతం అన్ని వివాదాలు దాటి కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి గత బడ్జెట్‌కు ముందుగా రైల్వేశాఖకు అప్పగించింది. ఈ మేరకు రైల్వేశాఖ తన వంతుగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కోచ్ ఫ్యాక్టరీకి బీజం పడేనా... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని రైల్వేశాఖను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీని రైల్వేశాఖ అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అధికారంలో ఉన్నప్పుడు కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. కానీ... రాజకీయ కారణాలతో ఈ ఫ్యాక్టరీ పంజాబ్‌లోని కపుర్తలాకు తరలిపోరుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ రైల్‌కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పితే ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. కోచ్ ఫ్యాక్టరీ వంటి మదర్ ఇండస్ట్రీ నెలకొనడం వల్ల ప్రైవేట్ రంగంలో అనుబంధ పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశముంది. తద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. -
తెలంగాణకు ‘మోడీ రైలు’ వచ్చేనా?
* రేపే రైల్వే బడ్జెట్.. ఎన్నో ఆశలతో ఎదురుచూపు * ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రాజెక్టులు పెండింగ్ సాక్షి, హైదరాబాద్: రైల్వే రవాణా సౌకర్యం విషయంలో బాగా వెనుకబడిన తెలంగాణకు.. ఈ సారి బడ్జెట్లోనైనా తగిన ప్రాధాన్యం లభిస్తుందా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతుందా? ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రైల్వే రవాణా సదుపాయం సమకూరుతుందా? కొత్త ప్రాజెక్టులు మంజూరవుతాయా? కనీసం అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులకైనా మోక్షం లభిస్తుందా?... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. రైల్వే రవాణా వసతిలో బాగా వెనుకబడిన తెలంగాణ.. మోడీ ప్రభుత్వం కేటాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావం కోసం సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. మరోవైపు రైల్వేబడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో... తెలంగాణ ప్రాంతానికి, దక్షిణ మధ్య రైల్వేకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా కోరారు. అయితే పక్షం రోజుల క్రితమే రైల్వేమంత్రి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించి రైల్వే బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో చాలావాటిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీవ్రంగా ఒత్తిడి చేసిన పెద్దపల్లి-సిద్ధిపేట-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా కల్పించటం లాంటి కీలక ప్రతిపాదనల విషయంలో రైల్వేమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నారనేది బడ్జెట్లో తేలనుంది. ఆదాయం ఇస్తున్నా నిధులు అంతంతే.. కొంతకాలంగా రైల్వేకు దక్షిణ మధ్య రైల్వే భారీగా ఆదాయం సాధించిపెడుతోంది. కానీ ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు మాత్రం దక్కడం లేదు. గత 13 ఏళ్ల కాలంలో ఇక్కడ కేవలం 550 కిలోమీటర్ల మేర మాత్రమే డబ్లింగ్ పనులు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొత్త రైళ్ల ఊసే పట్టదు.. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-చెన్నై, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-వాస్కోడిగామా (గోవా), హైదరాబాద్-నాందేడ్, హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్-షిర్డీ లాంటి ముఖ్యమైన మార్గాల్లో కొత్త రైళ్లు కావాలని గత బడ్జెట్ సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోనేలేదు. ఇచ్చేదే కొంత.. అందులోనూ కోత.. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధులు రూ. 4,164 కోట్లు. ఇందులో ప్రణాళిక పద్దు కింద అభివృద్ధి పనులకు కేటాయించింది రూ. 2,175 కోట్లే. అంతకుముందు బడ్జెట్ కంటే ఇవి కేవలం రూ. 315 కోట్లు మాత్రమే ఎక్కువ. అయితే.. ఇందులోనూ నిధులు లేవంటూ దాదాపు రూ. వేయికోట్లకుపైగా కోత పెట్టారు. అంతమేర కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు.. * కాజీపేటలో వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టు ఐదేళ్ల కింద ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాదాపు ఏడాదిన్నర కింద రైల్వేకు అప్పగించింది. అయినా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. * కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైన్ పనులకు 2012 బడ్జెట్లో చోటు దక్కింది. రూ. 1,054 కోట్లతో జరగాల్సిన 200 కిలోమీటర్ల పని పెండింగ్‌లో ఉంది. * పెద్దపల్లి-నిజామాబాద్: 20 ఏళ్ల కింద మంజూరైన ప్రాజెక్టులో రూ. 925 కోట్ల వ్యయంతో 178 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణం చేపట్టగా.. ఇంకా 30 కి.మీ పని మిగిలే ఉంది. * గుల్బర్గా-బీదర్: 107 కిలోమీటర్ల మార్గంలో కొంతే పూర్తయింది. నిధులు లేక 50 కిలోమీటర్ల పని నిలిచిపోయింది. * మునీరాబాద్-మహబూబ్‌నగర్: 247 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులను భరిస్తోంది. అయినా పనులు మాత్రం పూర్తికావటం లేదు. * మహబూబ్‌నగర్-గుత్తి, సికింద్రాబాద్-ముద్ఖేడ్-ఆదిలాబాద్, మంచిర్యాల-మందమర్రి డబ్లింగ్ పనులదీ అదే గతి. * గత బడ్జెట్లో సికింద్రాబాద్‌లో రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారుల శిక్షణ కేంద్రం (సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫైనాన్స్ ఆఫీసర్స్), కాజీపేటలో ఉద్యోగుల సామర్థ్యం పెంపు శిక్షణ కేంద్రాలను మంజూరు చేశారు. కానీ పనుల ఊసేలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌ను పట్టించుకోరేం? రోజుకు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ప్రతి బడ్జెట్లో దీనిని ప్రస్తావిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదు. ఉగ్రవాదుల నుంచి ప్రమాదమున్న నేపథ్యంలోనూ ఇక్కడ కనీస భద్రతా చర్యలు లేవు. సీసీ కెమెరాలకూ కొరతే. చివరకు ప్రయాణికులకు సరిపడా మూత్రశాలలు, మంచినీటి వసతి కూడా సరిగా లేదు. పది ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే ఉండటంతో అవి సరిపోక నగర శివారులో ఒక్కో రైలును అరగంట నుంచి గంటపాటు నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. -
రైల్వే బడ్జెట్‌పై ఆశలు ఆవిరి!
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రయోజనాలు అంతంతే * ఈసారి భారీ ప్రతిపాదనలు వద్దంటూ రైల్వే బోర్డు సంకేతాలు * గత బడ్జెట్ నిధుల్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ. 1200 కోట్ల మేర కోత * కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బకాయిలు *కొత్త బడ్జెట్లో వరాలు తగ్గించి వాటిని చెల్లించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనతో కొత్తగా ప్రగతి ప్రయాణం మొదలుపెట్టిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై విషయంలో భారీ ఆశలే పెట్టుకున్నాయి. ఇందుకు ప్రతిపాదనలనూ సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్త రాష్ట్రాల్లో నవ నిర్మాణం జరగాల్సిన తరుణంలో రైల్వే శాఖ కూడా వరాలు కురిపిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వచ్చే నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో కేటాయించే నిధులు పాత బకాయిలకే సరిపోయేలా కనిపిస్తోంది. గత రైల్వే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1200 కోట్ల మేర విడుదల కాలేదు. కానీ ఆయా అభివృద్ధి పనులను ఆపేసే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రారంభించిన అధికారులు సంబంధిత చెల్లింపులను మాత్రం నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో ఇచ్చే నిధులను పాత బకాయిల చెల్లింపునకే మళ్లించే అవకాశముంది. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్‌కు సంబంధించి భారీ ప్రతిపాదనలు పంపొద్దని పేర్కొంది. నిధుల్లో భారీ కోతే అసలు సమస్య గత ఏడాది భారీ వర్షాలు, తుపాన్లతో దేశవ్యాప్తంగా సరుకు రవాణా బాగా మందగించింది. మరోవైపు మార్కెట్ డీలా పడటంతో సిమెంటు రవాణా కూడా భారీగా తగ్గింది. సరుకు రవాణానే ఊపిరిగా నెట్టుకొస్తున్న రైల్వేకు ఇది అశనిపాతంగా మారింది. దీంతో నాటి యూపీఏ ప్రభుత్వం 2013-14 బడ్జెట్ కేటాయింపుల్లో 25 శాతంమేర కత్తెరేసింది. దక్షిణ మధ్య రైల్వేకు ఆ బడ్జెట్లో రూ.12,597 కోట్లను ప్రకటించగా.. ఇందులో ముఖ్యమైన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.4,083 కోట్లు కేటాయించింది. వీటితోనే కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, వంతెనల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి, రైళ్లలో కొత్త వసతుల కల్పన, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ నిధుల్లోనే కోత పెట్టారు. దీంతో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన పనులకు రూ. 155 కోట్లు, రైలే ్వ స్టేషన్ల ఆధునికీకరణ, ప్రధాన స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు తదితర పనులకు రూ. 275 కోట్లు, కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 165 కోట్లు, డబ్లింగ్ పనులకు 110 కోట్లు, లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటు, వంతెనల నిర్మాణానికి రూ. 83 కోట్లు, సిగ్నలింగ్ ఆధునికీకరణకు రూ. 50 కోట్లు... ఇలా వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇప్పటికే అనేక విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర అధికారులను కలిసి పలు ప్రతిపాదనలు వారి ముందు పెడుతున్నారు. వీటిల్లో రైల్వే బోర్డు ప్రత్యేకంగా పరిగణించేవి తప్ప మిగతావి బుట్ట దాఖలయ్యే పరిస్థితి నెలకొంది. -
సేవకు సై
బెంగళూరుకు రైల్వే పథకాలు రెడీ దశల వారీగా అమలు చేస్తాం ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాం ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై నివేదిక రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరానికి అవసరమైన రైల్వే పథకాల జాబితాను సిద్ధం చేశామని రైల్వే శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడ తెలిపారు. అధికారులతో చర్చించి ఈ పథకాలను దశలవారీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో బెంగళూరు ఉత్తర నియోజక వర్గం కార్యకర్తలు శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో సన్మానాన్ని స్వకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అవసరమైన సర్క్యూట్ రైలు సహా వివిధ పథకాలను చేపట్టడానికి చర్యలు చేపడతానని భరోసా ఇచ్చారు. ఐదేళ్లలో తాము సాధించబోయే ప్రగతిని నివేదిక రూపంలో ప్రజలకు అందజేస్తామని చెప్పారు. రైల్వే మంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శనంలో ముందుకు సాగుతానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన ప్రేమానురాగాలను కాపాడుకుంటానని, చెడ్డ పేరు రాకుండా మసలుకుంటానని తెలిపారు. తనను అభినందించడానికి పూలహారాలు, తల పాగాలు తీసుకు రావద్దని కార్యకర్తలను కోరారు. కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విధాన సౌధ సమీపంలోని విశ్వేశ్వరయ్య టవర్స్‌లో తన కార్యాలయం ఉందని, కార్యకర్తలు అక్కడికి వచ్చి తన ద్వారా జరిగే పనులను చేయించుకోవచ్చని ఆయన సూచించారు. సర్కారు పతనం తథ్యం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం కావచ్చని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్ జోస్యం చెప్పారు. అభినందన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని, కనుక కార్యకర్తలు మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, హోం శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసు శాఖలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసు అధికారుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
రెడ్ సిగ్నల్..
సాక్షి, నల్లగొండ: అనుకున్నదే జరిగింది. మధ్యంతర రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. ఏళ్లుగా వస్తున్న వివక్షే పునరావృతమైంది. బియ్యం, పలుగురాళ్లు, సిమెంటు తదితర ఎగుమతుల ద్వారా ఏడాదికి రూ.170 కోట్లకు పైగా ఆదాయం జిల్లా నుంచి రైల్వేశాఖకు వెళ్తున్నా.. నిధులు విదిల్చడంలో మాత్రం మొండిచేయే ఎదురైంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే చిన్నచూపు చూశారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త మార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణల ఊసేలేదు. ఈ మధ్యంతర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవివిరుస్తున్నారు. అటకెక్కిన ప్రతిపాదనలు... జిల్లా పరిధిలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సారీ చేదు అనుభవమే ఎదురైంది. విద్యుదీకరణతో కూడిన డబుల్ లైన్‌ను బీబీనగర్ నుంచి నడికుడ వరకు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయినా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నల్లగొండ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు 100 కిలోమీటర్ల మేర రైలుమార్గం వేయాలన్న ప్రతిపాదన ఏళ్లనాటిది. దీన్ని పూర్తి చేయడానికి రూ. 600 కోట్లు అవసరం అవుతాయని అంచనాలు సిద్ధం చేసినా అడుగు ముందుకు పడలేదు. వరంగల్ జిల్లా ఖాజీపేట నుంచి సూర్యాపేట మీదుగా నల్లగొండకు కొత్తరైలు మార్గం ఏర్పాటు విషయమై 2006లో పార్లమెం టులో చర్చ జరిగింది. సర్వే చేపట్టేందుకు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఆమోదించారు. దీనిపై ఈ సారి బడ్జెట్లోనూ నిరాశే ఎదురైంది. యాదగిరిగుట్టకు రైలు మార్గం కోసం ప్రయాణికులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. నిత్యం రాజధాని, భువనగిరి నుంచేగాక పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రాయచూర్ నుంచి గద్వాల, నాగర్‌కర్నూల్, దేవరకొండ, నాగార్జునసాగర్ మీదుగా జిల్లా కేంద్రానికి రైలు మార్గం ఏర్పాటు కలగా మిగిలిపోయింది. తీరని కష్టాలు... నల్లగొండ మీదుగా రైలులో వెళ్లాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం 12 రైళ్లు 24సార్లు రాకపోకలు సాగిస్తున్నా.... ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. కొన్ని సమయాల్లో కాలు పెట్టడానికీ స్థలం దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పుట్బోర్డ్ ప్రయాణంతో ప్రయాణికులు బెంబేలె త్తున్నారు. గుంటూరు, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు... జిల్లాకేంద్రానికి రాక ముందే కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి జిల్లామీదుగా మిర్యాలగూడ వరకు వెళ్లే ప్యాసింజర్ రైలును ఇటీవల నడికుడ వరకు పొడిగించారు. దీంతో రైలు తిరిగి జిల్లా కేంద్రానికి వచ్చేలోగా అప్పటికే ప్రయాణికులతో బోగీలు నిండుకుంటున్నాయి. జిల్లాకు తీరని అన్యాయం : నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రాష్ట్రంలో రైలుమార్గం నిడివి అతితక్కువ ఉన్న జిల్లాపై శీతకన్ను ప్రదర్శించారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఊసేలేదు. బీబీనగర్ నుంచి నడికుడి వరకు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్‌కు సర్వే చేస్తామని ప్రకటించినా నిధులు ఎందుకు కేటాయించలేదు. జాతీయ రహదారి వెంట విజయవాడకు లైన్ వేయాల్సి ఉన్నా ఆ దిశగా ఆలోచించలేదు. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా నిధుల కేటాయింపుల్లో విఫలమయ్యారు. సామాన్యుల సమస్యలు పట్టని సర్కార్ : నజీరుద్దీన్, బడ్జెట్లో నిరుపేద, సామాన్య ప్రజలు, వృద్ధులు, వికలాంగుల సమస్యలు ప్రస్తావనకే రాలేదు. అరకొరగా జిల్లాకు వస్తున్న రైళ్లలో నిల్చోవడానికీ స్థలం ఉండడం లేదు. గతంలో మంజూరు చేసిన ప్రాజెక్టులు, కొత్తమార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులకు నిధుల కేటాయింపులో తీవ్రంగా విఫలమయ్యారు. మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించాలన్న అంశం చర్చకే రాలేదు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తులు పంపినా మంత్రులు వాటిని పెడచెవిన పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా జిల్లా రైల్వే ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేవు. -
త్వరలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు పూర్తి
చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : రైల్వే శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన పథకాలను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు. జిల్లాలోని హొసదుర్గ రోడ్డు - చిక్కజాజూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండవ లైన్ నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ... 29 కిలోమీటర్ల పొడవున రెండవ రైల్వే లైన్ నిర్మాణాలకు రూ. 203 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు లైన్లు ఉండడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైల్వే నూతన మార్గాలకు రూ. 900 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వే మార్గాన్ని ఉపయోగించుకోవడంలో చాలా మంది వెనుకబడి ఉన్నారన్నారు. అతి తక్కువ వ్యయంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు రైల్వే మార్గం చాలా అనువైనదని తెలిపారు. రైల్వే మార్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని 50 శాతం నిధులను కేటాయించాల్సిన అవరసం ఎంతైనా ఉందన్నారు. భూస్వాధీన ప్రక్రియలో రూ. 612 కోట్లను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 50 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అన్నారు. రాష్ట్రంలోని చిక్జాజూర్- కడూరు, బెంగళూరు- మైసూరు, మద్దూరు- శ్రీరంగపట్నం, హరిహర- కొట్టూరు రైల్వే లైన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య,మంత్రి ఆంజనేయ, చిత్రదుర్గం ఎంపీ జనార్థన స్వామి, ఎమ్మెల్యేలు గోవిందప్ప, రఘుమూర్తి, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు బోరమ్మ పాల్గొన్నారు. -
త్వరలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు పూర్తి
చిత్రదుర్గం, న్యూస్‌లైన్ : రైల్వే శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన పథకాలను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే చెప్పారు. జిల్లాలోని హొసదుర్గ రోడ్డు - చిక్కజాజూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండవ లైన్ నిర్మాణ పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ... 29 కిలోమీటర్ల పొడవున రెండవ రైల్వే లైన్ నిర్మాణాలకు రూ. 203 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు లైన్లు ఉండడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైల్వే నూతన మార్గాలకు రూ. 900 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో రైల్వే మార్గాన్ని ఉపయోగించుకోవడంలో చాలా మంది వెనుకబడి ఉన్నారన్నారు. అతి తక్కువ వ్యయంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు రైల్వే మార్గం చాలా అనువైనదని తెలిపారు. రైల్వే మార్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని 50 శాతం నిధులను కేటాయించాల్సిన అవరసం ఎంతైనా ఉందన్నారు. భూస్వాధీన ప్రక్రియలో రూ. 612 కోట్లను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 50 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అన్నారు. రాష్ట్రంలోని చిక్జాజూర్- కడూరు, బెంగళూరు- మైసూరు, మద్దూరు- శ్రీరంగపట్నం, హరిహర- కొట్టూరు రైల్వే లైన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య,మంత్రి ఆంజనేయ, చిత్రదుర్గం ఎంపీ జనార్థన స్వామి, ఎమ్మెల్యేలు గోవిందప్ప, రఘుమూర్తి, తాలూకా పంచాయతీ అధ్యక్షురాలు బోరమ్మ పాల్గొన్నారు.