13 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు కేంద్రంతో ఒప్పందం
- భూ సేకరణే ప్రధాన సమస్య
- ఇప్పటి వరకు రూ.351 కోట్ల ఖర్చు
- ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.588 కోట్ల కేటారుుంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులపై ఏడు నెలలుగా ఎదురు చూస్తున్న జారుుంట్ వెంచర్ ఒప్పందంపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. రైల్వే శాఖతో ఏపీ సర్కారు ఈ మేరకు ఒప్పందం కుదర్చుకుంది. రూ.13 వేల కోట్లకుపైగా నిధులతో చేపట్టాల్సిన ఈ రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో వేగంగా పట్టాలెక్కించేందుకు జారుుంట్ వెంచర్ కంపెనీ ప్రధానంగా విధులు నిర్వహించనుంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను రాబో యే ఐదేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నారుు. ఈనెల 14న రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ లేఖ రాశారు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ప్రధానంగా ఏడు ప్రాజెక్టులను జారుుంట్ వెంచర్‌గా చేపట్టేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టులకు ఇప్పటివరకు రూ.351 కోట్లు ఖర్చు చేశారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.588 కోట్లు కేంద్రం కేటారుుంచింది. ఈ రైల్వే ప్రాజెక్టుల్లో ప్రధాని మోదీ ‘ప్రగతి’కార్యక్రమంలో చేర్చిన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఉంది. అరుుతే ఈ ప్రాజెక్టులకు ప్రధానంగా భూసేకరణ సమస్య అవరోధం కావడం గమనార్హం. నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్లకు ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు. ఒప్పందం కుదర్చుకున్న ప్రాజెక్టుల్లో కొత్త రైల్వే లైన్లు నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి-నర్సాపూర్, కాకినాడ-పిఠాపురం, కడప-బెంగుళూరు, అమరావతి-మంగళగిరి కొత్త రైల్వే లైన్లు కాగా, గుంటూరు-గుంతకల్ డబుల్ లైను, గూడూరు-విజయవాడ మూడో లైను నిర్మాణం ఉన్నారుు. మంగళగిరి-అమరావతి మధ్య 40 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును జేవీ కంపెనీ కింద చేర్చారు.