సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబం ధించిన సమస్యలపై వ్యక్తి గతంగా చొరవ చూపి, వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయా లని సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఆలస్యమవుతున్న విష యాన్ని సోమవారం ఆయన ఓ లేఖ ద్వారా సీఎం దృష్టికి తెచ్చారు. రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటా యింపులో తెలంగాణకు కేంద్రం న్యాయం చేయ డం లేదని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించడం సరికాద న్నారు.
ముందు మన రాష్ట్రానికి ఇప్పటికే కేటా యించిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను చెల్లించి, భూ కేటాయింపులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. 2014–15 బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.2,420 కోట్లకు పెరిగిందన్నారు.
లేఖలో పేర్కొన్న కొన్ని ముఖ్య ప్రాజెక్టులివే..
♦మనోహరాబాద్–కొత్తపల్లి నూతన రైలు మార్గం (151 కి.మీ.): రూ.100 కోట్ల రాష్ట్ర వాటా పెండింగులో ఉంది, ఇంకా 342 హెక్టార్ల భూమిని రైల్వేకు అప్పగించవలసి ఉంది.
♦అక్కన్నపేట–మెదక్ కొత్త రైలు మార్గం (17.20 కి.మీ.): 2021–22 సంబంధించి రూ.31 కోట్ల దామాషా నిధులు చెల్లించాలి. ఇంకా 1.02 హెక్టార్ల భూమిని అప్పగించాల్సి ఉంది.
♦ఎంఎంటీఎస్–ఫేజ్ 3 ప్రాజెక్టు: నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు అమలులో జరిగిన జాప్యంతో వ్యయం రూ.1,150 కోట్లకు పెరిగింది. దీని ప్రకారం రాష్ట్రం తన వాటాగా రూ.760 కోట్లు జమ చేయాల్సి ఉండగా, కేవలం రూ.129 కోట్లు మాత్రమే జమ చేసింది.
♦ఎంఎంటీఎస్ ఫేజ్–2 యాదాద్రి వరకు (33 కి.మీ.) పొడిగింపు: ఇందులో మూడింట రెండు వంతుల వ్యయాన్ని రాష్ట్రం పంచుకోవాలి. అయితే, ఇంకా నిధులు జమ చేయనందున ప్రాజెక్టు మొదలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment