సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ పనులను మొదలు పెడతామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం ఉత్తమ్ పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.
డోర్నకల్ – నేలకొండపల్లి – కోదాడ – హుజూర్ నగర్ – నేరేడుచర్ల – మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు. దీంతో పాటే మోతమర్రి–జగ్గయ్యపేట–మేళ్లచెర్వు–మఠంపల్లి–జాన్ పహాడ్–విష్ణు పురం–మిర్యాలగూడ రైల్వే లైన్‌లో ప్యాసింజర్ రైళ్లను నడపాలని, ఈ రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయాలని కోరారు.
వందేభారత్‌ను నల్లగొండలో ఆపుతామని హామీ
మోతుమర్రి–మిర్యాలగూడ మధ్య ప్యాసెంజర్ రైళ్లను నడుపుతామని, డబ్లింగ్ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. విశాఖ– తిరుపతి వందేభారత్‌తో పాటు వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నల్లగొండలో ఆపేలా చర్య లు తీసుకుంటామని, మిర్యాలగూడలో ఆపే విషయంపై పరిశీలన చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment