సాక్షి, హైదరాబాద్: తాజా కేంద్ర బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రూ.1,850 కోట్లు దక్కాయి. గత బడ్జెట్‌లో రూ.1,729 కోట్లు మంజూరు చేయగా ఈసారి రూ.121 కోట్లు ఎక్కువే దక్కినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఈ నెల 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా రైల్వేకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. దేశవ్యాప్తంగా రైల్వేకు కేటాయించిన ప్రధాన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. జోన్ల వారీగా కేటాయించిన నిధుల వివరాలు ‘పింక్‌బుక్’గా పేర్కొనే ప్రత్యేక పుస్తకంలో ఉంటాయి.
ఆ రోజు దానిని వెల్లడించలేదు. సోమవారం దానిని పార్లమెంటుకు సమర్పించనున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్ల కేటాయింపులు లేక చాలా కాలంగా తెలంగాణ బాగా వెనకబడింది. గత ఏడాది తెలంగాణ వాటాగా రూ.1,729 కోట్లు మంజూరు చేయడంతో ప్రాజెక్టుల పురోగతి కొంత వేగం పుంజుకుంది. కేటాయించిన నిధుల్లో ఇప్పటికే 90 శాతం ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో గతం కంటే రూ.121 కోట్లు పెంచటం రాష్ట్రానికి కొంత ఊరటనిచ్చే అంశమే.
రాష్ట్రానికి ‘రైల్వే’ నిధులు రూ.1,850 కోట్లు?
Published Mon, Feb 5 2018 1:25 AM | Last Updated on Mon, Feb 5 2018 1:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment