నిధులు ప్లీజ్
రాష్ట్రంలో సాగుతున్న, పెండింగ్‌లో ఉన్న రైల్వే పథకాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర రైల్వే శాఖకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీరు సెల్వం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇదివరకు ప్రకటించిన రైల్వే పథకాల తీరుతెన్నులు, ప్రకటనకే పరిమితమైన వివరాలను ఆయన ఏకరువుపెడుతూ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అరుునా కేటాయింపులు పెరగాలని విన్నవించారు.
⇒ రైల్వే మంత్రికి సీఎం లేఖాస్త్రం
⇒ రైల్వే పథకాల ఏకరువు
⇒ బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: ప్రతి ఏటా కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏదో ఒక పథకాన్ని, రెండుమూడు రైళ్లను ప్రకటిస్తోంది. అయితే అవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రకటించి న పథకాలకు నిధులు మంజూరు కాలేదు.
కొత్త పథకాలకు నిధుల ఊసేలేదు. మరెన్నో రైల్వే పథకాలు ప్రకటించినా, నిధు ల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.ఈ సారైనా తమిళనాడు మీద కరుణ చూపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న ఆశాభావంతో ముందుస్తుగా రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభాకర్‌ప్రభుకు రాష్ర్టంలోని రైల్వే పథకాల తీరుతెన్నుల్ని వివరించేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. బడ్జెట్‌లో తమకు ప్రాధాన్యత కల్పించే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు, ఇక్కడ నత్తనడకన సాగుతున్న పథకాలను మంత్రి దృష్టికి శుక్రవారం లేఖాస్త్రంతో తీసుకెళ్తూ నిధులు..ప్లీజ్ అని అభ్యర్థించే పనిలో పడ్డారు.
నిధులివ్వండి: తమ అధినేత్రి, అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న ప్రభుత్వ విజన్ -2023 గురించి తన లేఖలో కేంద్ర రైల్వే మంత్రికి సురేష్‌ప్రభాకర్ ప్రభుకు సీఎం పన్నీరు సెల్వం వివరించారు. పదిహేను లక్షల కోట్లతో సాగుతున్న విజన్ కళసాకారంలో రైల్వే పాత్ర కూడా కీలకమన్నారు. తమిళనాడులో లక్షా 88 వేల 400 కోట్ల మేరకు రైల్వే పథకాలకు నిధులు అవశ్యంగా వివరిస్తూ గతంలో పీఎం నరేంద్ర మోదీకి తమ అమ్మ రాసిన లేఖను గుర్తుచేశారు. ప్రధానంగా రానున్న బడ్జెట్‌లో పది రైల్వే పథకాలకు ముందస్తుగా ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇందులో ‘చెన్నై - కన్యాకుమారి మధ్య రెండో రైల్వే మార్గం పనులు, శ్రీ పెరంబదూరు - గిండి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై - తూత్తుకుడి మధ్య గూడ్స్ రైలు మార్గం, చెన్నై-మదురై -కన్యాకుమారి మధ్య, మదురై-కోయంబత్తూరు, కోయంబత్తూ రు - చెన్నై, చెన్నై -బెంగళూరుల మధ్య హై స్పీడ్ రైలు సేవలు, చెన్నై-బెంగళూ రు మధ్య రైల్వే కారిడార్, ఆవడి - గూడువాంజేరి మధ్య రైల్వే మార్గం, ఆవడి - ఎన్నూర్ హార్బర్‌కు రైల్వే మార్గం’ ఏర్పాటు గురించి విశదీకరించారు.
రైల్వే పథకాలు
⇒ గతంలో ప్రకటించిన పథకాలను వివరి స్తూ, నిధుల్ని సంమృద్ధిగా కేటాయించాల ని విజ్ఞప్తి చేశారు. ఆ పథకాలలో కొన్ని...
⇒ మొరాపూర్ -ధర్మపురి మధ్య కొత్త రైల్వే మార్గం
⇒ చెన్నై నుంచి విల్లివాక్కం మధ్య ఐదు, ఆరో లైన్లు , విల్లివాక్కం- కాట్పాడి మధ్య కొత్త రైల్వే మార్గం
⇒ చిదంబరం నుంచి అరియలూరు మీదుగా ఆత్తూరుకు కొత్త మార్గం
⇒ తిరువనంత పురం నుంచి కన్యాకుమారి, జోలార్ పేట నుంచి కాట్పాడి - అరక్కోణం మధ్య రెండో మార్గం పనులు, బోడి నాయకనూరు కొట్టాయం వరకు పనుల పొడిగింపుల గురించి వివరించారు.
⇒ రేణిగుంట-అరక్కోణం రెండో మార్గం, అత్తి పట్టు - గుమ్మిడిపూండి మధ్య మూడు, నాలుగో లైన్లు, జోళార్ పేట నుంచి కృష్ణగిరి మీదుగా హోసూరుకు, మైలాడుతురై - తరంగం బాడి మీదుగా తిరునల్లారు - కారైకాల్‌కు, రామనాధపురం - కన్యాకుమారి మీదుగా తూత్తుకుడి - తిరుచెందురుకు, కారైక్కుడి నుంచి తూత్తుకుడికి, కారైక్కాల్ - శీర్గాలి, సేలం- అరియలూరుల మధ్య కొత్త లైన్లకు నిధుల్ని అభ్యర్థించారు. అలాగే, ఇరుగుర్ -పొండనూర్, తిరువనంత పురం - నాగర్ కోవిల్‌ల మధ్య రెండు మార్గం. తదితర పనుల్ని వివరిస్తూ ఈ బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించి, పనులు ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.